(ఎప్పుడే నేనే ఏదో సోది రాయడం కాకుండా తెలుగులో సైన్సు రాయాలనుకునే ఔత్సాహికుల రచలనని ఈ బ్లాగ్లో పోస్ట్ చెయ్యాలనే కార్యక్రమంలో మొదటి మెట్టుగా ‘సర్ ఐజాక్ న్యూటన్’ జీవితం మీద ఓ వ్యాసం… శ్రీ.చ.)
సర్ ఐజాక్ న్యూటన్ (డిసెంబరు 25, 1642 - మార్చి 20, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. "ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది" అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవిస్తుంది.
సర్ ఐజాక్ న్యూటన్ ఊల్స్ తోర్ప్, లింకన్ షైర్, ఇంగ్లాండ్ లో డిసెంబర్ 25, 1642 సంవత్సరమున జన్మించాడు. ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ , న్యూటన్ 85 సంవత్సరాల వయస్సు వరకు జీవించి, మార్చి 20, 1727 న కెన్సింగ్టన్ పట్టణము నందు మరణించారు.
న్యూటన్ జన్మించిన సమయంలో అతను నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా బరువు తక్కువగాను, బలహీనంగాను ఉండేవాడు. చూసినవాళ్లంతా అసలీ శిశువు బ్రతుకుతాడా అనుకున్నారు. న్యూటన్ తండ్రి న్యూటన్ జననానికి మూడు నెలల ముందు మరణించారు. న్యూటన్ తన తల్లి సంరక్షణ క్రింద 3 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. తరువాత న్యూటన్ కేవలం 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె బార్ స్మిత్ అనే ఆయన్ను రెండవ వివాహం చేసుకున్నారు. అందువలన న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లితండ్రుల ప్రేమ కోల్పోయి తన అమ్మమ్మ-తాతల వద్ద పెరగటం జరిగింది. న్యూటన్ తన బలహీనమైన ఆరోగ్యం వలన ఆటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించ లేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. న్యూటన్ 10 సంవత్సరముల వయస్సు లో ఉన్నప్పుడు తన సవతి తండ్రి కూడా మరణించాడు, అతని తల్లి ఊల్స్ తోర్ప్ కు తిరిగి వచ్చారు. ఆమె వ్యవసాయం మరియు పశువుల పై ఆసక్తి తీసుకోవడం ప్రారంభించారు.
12 ఏళ్ల వయస్సులో న్యూటన్ గ్రాన్థమ్ లోని గ్రామర్ స్కూలుకు పంపబఢ్డారు. అక్కడ అతని స్నేహితులలో చాలా మంది అమ్మాయిలు ఉండేవారు. న్యూటన్ గ్రామర్ స్కూల్ లో ఉన్నప్పుడు తన మేధోశక్తితో అందరిని ఆకట్టుకున్నారు. న్యూటన్ ఎల్లప్పుడూ భౌతిక, గణిత శాస్త్రాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే పరిష్కరించటానికి ఇష్టపడేవారు. లైబ్రరీ లో చాలా సమయం అతను పుస్తక పఠనంలో గడిపేవారు.
న్యూటన్ ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి వద్ద విద్యార్థిగా ఉన్నప్పుడు అతని తల్లి గ్రామంలో సహాయం కోసం కబురు చేశారు. న్యూటన్ 17 వ సంవత్సరములో ఉన్నప్పుడు ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జి నుండి ఊల్స్ తోర్ప్ తిరిగి రావడం జరిగినది. పల్లెలో నివసిస్తున్నప్పుడు, న్యూటన్ గొర్రెల మందలు మేస్తుండగా కాపలా కాసేవారు. ఈ పనిని న్యూటన్ చాలా అసహ్యించుకునేవారు.అనేక సార్లు న్యూటన్ గణిత శాస్త్ర సమస్యలలో మునిగిపోవడంతో ఒకటి లేదా రెండు గొర్రెలు ఎల్లప్పుడూ తప్పించుకొనేవి. తన అజాగ్రత్త వలన తీవ్రంగా మందలింపబడేవాడు. గణితంలో న్యూటన్ పట్ల ఎంతో ఆసక్తి చూసిన ఒక ఉపాధ్యాయుడు, న్యూటన్ ను ఉన్నత విద్యను అభ్యసించడానికి విశ్వవిద్యాలయానికి పంపండని న్యూటన్ తల్లి కి గట్టిగా చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు న్యూటన్ యొక్క విద్యకు అయ్యే ఖర్చును భరించటానికి అంగీకరించారు. న్యూటన్ తిరిగి జూన్ 1661 లో మరోసారి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరి భౌతిక, గణిత శాస్త్రాల అధ్యయనం ప్రారంభించారు.
న్యూటన్ పేద విధ్యార్ధి అవటం వలన సహ విద్యార్థులు (ధనవంతులు) న్యూటన్ ను నిందించి ఆటపట్టించేవారు. కానీ అతి తక్కువ కాలంలోనే, న్యూటన్ అద్భుతమైన భౌతిక, గణిత శాస్త్ర సామర్ధ్యంతో తన తోటి విద్యార్ధుల గౌరవం పోందారు. తదుపరి కాలంలో న్యూటన్ విశ్వవిద్యాలయం లో మిగిలిన స్నేహితుల మరియు ఉపాధ్యాయుల ప్రశంసలను అందుకున్నారు. న్యూటన్ ట్రినిటీ కాలేజ్ నుంచి మెట్రిక్యులేషన్ పోందారు, కానీ స్కాలర్షిప్ పోందటంలో విఫలమయ్యారు. ఇలా జరగడం, తద్వారా ఖర్చులు పెరగడంతో న్యూటన్ చాలా కలవరపడ్డారు.
స్కాలర్షిప్ లేకుండా ఉన్నత విద్యను కొనసాగించడం సాధ్యపడదని ఆయన గ్రహించారు. న్యూటన్ ఎంతో ప్రయత్నించినా, మార్కులు తక్కువ వచ్చిన కారణంగా స్కాలర్షిప్ మీద ఆశలు వదులుకున్నారు. అయినప్పటికి యూనివర్సిటీ బోర్డు సభ్యులు ఆయనకు నాలుగు సంవత్సరముల వరకు స్కాలర్షిప్ ఇచ్చారు. న్యూటన్ ఆనందానికి అవధులు లేవు. ఈ వచ్చిన అవకాశాన్నివీలైనంత సద్వినియోగం చేసుకోవాలని న్యూటన్ నిశ్చయించుకున్నారు. అతని పూర్తి సమయం లెక్కలు మరియు భౌతిక శాస్త్రం అభ్యాసానికే వినియోగించారు. ఆయన ఎంతలా నిమగ్నమయ్యారంటే ఒక్కొక్కసారి తిండి నిద్ర కూడా మరిచేవారు. న్యూటన్ యూనివర్సిటీలో గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి మరియు త్రికోణమితి లను ఎంచుకున్నారు. లైబ్రరీ లో న్యూటన్ తరచుగా మేధావులైన కెప్లర్ మరియు ఇతరులు రాసిన / తయారుచేసిన గొప్ప ప్రయోగాలపై అధ్యయనం చేసేవారు.
న్యూటన్ 1969లో ట్రినిటీ కాలేజిలో ఉండే సమయంలో తన ఆలోచనలను పుస్తకాలలో రాసుకున్నారు. ఆ పుస్తకాలు న్యూటన్ ఆలోచనా ధోరణిని బహిర్గతం చేస్తూ ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనవిగా పరిగణింపబడతాయి. న్యూటన్ 1665 లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో అనేక ప్రాంతాల్లో ప్లేగు మహమ్మారినబడి వేల మంది మరణించారు. ఆ అంటువ్యాధుల వలన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం రెండు సంవత్సరాల పాటు మూసివేయబడినది. అప్పుడు న్యూటన్ ఊల్స్ తోర్ప్ కు తిరిగి వచ్చి భౌతిక మరియు గణిత శాస్త్ర అధ్యయనంలో రెండు సంవత్సరాల కాలం గడిపారు. ఈ కాలంలో, ఆయన fluxions యొక్క ఆలోచన మరియు కాంతి మరియు రంగు యొక్క పునాదులు వేశారు. అదే సంవత్సరంలో న్యూటన్ ప్రిన్సిపియా అని ఒక సంకలనం తయారు చేశారు. అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా, 1687 లో ప్రచురించబడినది. న్యూటన్ 1667 లో కేంబ్రిడ్జి తిరిగి తన పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించారు. న్యూటన్ 1669 లో కేంబ్రిడ్జి నుండి మాష్టర్స్ డిగ్రీ పొందారు, మరియు అదే సంవత్సరంలో గణిత శాస్త్ర ప్రొఫెసరు గా నియమించబడ్డారు.
ప్రొఫెసర్ న్యూటన్ విశ్లేషణాత్మక జ్యామితి, బీజగణితం, మరియు క్యాల్కులస్ రంగాలమీద తన దృష్టి సారించారు. బైనామినల్ సిద్ధాంతం, అనంతం సిరీస్ విస్తరణ కోసం కొత్త పద్ధతులు, fluxions యొక్క ప్రత్యక్ష మరియు విలోమ పద్ధతులు – ఇవీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రధాన ఆవిష్కరణలు. న్యూటన్ 1665 నుండి 1666 వరకు కాంతి అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించారు. కాంతి యొక్క ఖచ్చితమైన కూర్పు తెలుసుకోవడానికి అనేక ప్రయోగాలను నిర్వహించారు. ఆయన కాంతి యొక్క అనేక ఇతర లక్షణాలను అధ్యయనం చేశారు.
రాయల్ సొసైటీ అధ్యక్షుడు "రాబర్ట్ హు్క్" 1703 లో మరణించాడు. అప్పుడు ప్రొఫెసర్ న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూటన్ అద్భుతమైన రచయిత, అతను అనేక శాస్త్రీయ మరియు అశాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు. దురదృష్టవశాత్తు న్యూటన్ దైవీ శాస్త్రం (theology) మీది రచనలు ప్రచురించబడలేదు.
ప్రొఫెసర్ న్యూటన్ సన్నగా, పొడవుగా ఉండేవారు. న్యూటన్ తన దుస్తులు మరియు కేశాలంకరణపై ఆసక్తి చూపేవారు కాదు. ఎక్కువ సమయం అతను తన సొంత ఆలోచనలలో మునిగిపోయేవారు. ఎప్పుడూ గదిలో ఒక మూలలో లెక్కలు చేసుకునేవారు. తీవ్రమైన చర్చలలో కూడా ఒక్కోక్కసారి సొంత ఆలోచనలలో ఉండేవారు. న్యూటన్ క్రీడలు, వ్యాయామం పై ఎటువంటి ఆసక్తి చూపించేవారు కాదు. అనేక సందర్భాలలో అతను ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది లేదా పందొమ్మిది గంటలు అధ్యయనంలో గడిపేవారు. ప్రొఫెసర్ న్యూటన్ బ్యాచిలర్ గా ఉండి భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్ర సేవలకే అంకితం చేశారు. న్యూటన్ నిజాయితి మరియు ముక్కుసూటి మనిషి. న్యూటన్ మార్చి 20, 1727 న 84 సంవత్సరాల వయసులో మరణించాడు. అతనని వెస్ట్ మినిస్టర్ అబ్బే లో ఖననం చేశారు.
అనువాదం – స్వాతి మరియు శ్రీవత్సవ చీమకుర్తి
మూలం - http://biography-of.com/sir-isaac-newton
న్యూటను గారి ద్రవ్యరాసి గుర్త్వాకర్శన సిద్దాంతం బ్లాక్ హోల్ విశయములో సరిపోలదు మరి మీ అభిప్రాయము?
న్యూటను గారి ద్రవ్యరాసి గుర్త్వాకర్శన సిద్దాంతం బ్లాక్ హోల్ విశయములో సరిపోలదు మరి మీ అభిప్రాయము?
నేను కూదా పై అభిప్రాయాన్ని నమ్ముతున్నాను.
Good information about Newton
చాలా బాగుంది ఒక మంచి విషయ పరిజ్ఞానం అందిచే బండగరంగా మీ బ్లాగ్ ఉంది
“బండగరం” అంటే అర్థం ఏమిటి, ఏ ప్రాంత మాండలికంలోని పదం ... కాస్త వివరించగలరా ప్లీజ్?
ఇలా అచ్చు తప్పు పడిందో లేదో అలా పరుగెత్తుకొచ్చి సూక్తులు చెప్పే పెద్ద మనుషుల లిస్ట్ లో మీరు కూడా చేరారన్న మాట!"భాoడాగారం".
Just fun. :)
అలాగే అందిచే గురించి కూడా చెప్పాలంటారా సార్? :)
బండ అనగా రాయి.
గరం అనగా వేడి.
బండగరం అనగా రాయి పై వేడి.
రాయి పై వేడి చుర్రుమననినట్లు వీరి టపాలు మీటరు కలిగి చుర్రుమనుచుండును.
కావున బండగరము.
జిలేబి
Anonymous గారు,
నిజంగా తెలియకనే అర్థం అడిగాను. తెలుగు భాషలో అన్ని పదాలూ నాకు తెలుసునని నేనేనాడూ చెప్పుకోను కాబట్టే ఈ “బండగరం” కూడా ఏదో ఒక ప్రాంతపు వాడుక పదం అయ్యుంటుందనుకుని అడిగాను. నిఘంటువులో కూడా వెతికాను కానీ దొరకలేదు.. నేనెంత స్పీడుగా వచ్చి సోకాల్డ్ “సూక్తులు” వల్లించానని మీరంటున్నారో అంతే స్పీడుగా మీరు కూడా వచ్చారుగా నన్ను తప్పు పట్టడానికి.
అయితే “బండగరం” అర్థం అదా? మీరు బాగానే, తేలికగానే గ్రహించారే. మరొక మిత్రులు కూడా మెయిల్ ద్వారా వివరించారు. మీ ఇద్దరికీ థాంక్స్. నాకే వెలగలేదు .... అంటే పాత “మాయాబజారు” సినిమాలో అల్లు, వంగర చెప్పిన “అతడికి ఆ చురుకేదీ, అతడికి ఆ సులువేదీ” మాటలు నాకూ అన్వయిస్తాయి అన్నమాట.
భాండాగారం అనే పదాన్ని “బండగరం” అని వ్రాయడాన్ని మీరన్న ”అచ్చుతప్పు” అనడం చిన్నమాట; ముద్రారాక్షసం అనడం నయం.
మరొకసారి మీకు థాంక్స్.
// “ అలాగే అందిచే గురించి కూడా చెప్పాలంటారా సార్? :)” //
———————-
మరీ అంత ఇదిగా కనిపిస్తున్నానా మీకు Anonymous గారూ 😁? “అందిచే” అచ్చుతప్పు అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది .... నాలాంటి వాడికి కూడా 🙂.
తప్పుల్ని కనిబెట్టటానికే చదువుతూంటారాండి మీరు :)
ఇక్కడ తప్పుల్ని మీరే కనిబెట్టారుగా! 🙂.
సరే, నా గురించి అలా అనుకోవడం మీకు ఆనందమైతే .... అలాగే అనుకోండి, ఇబ్బందేమీ లేదు. 👍
అప్పుతచ్చు లలో కూడా అద్భుతమైన పదాల ఆవిష్కరణ జరుగుతుందని అర్థమవుతుంది.
నాకు బండగరం పదం విపరీతంగా నచ్చింది.
జుజుబి పైకూలకు బండగరాలు అన్న నూతన పర్యాయపదం సూటవుతుంది.