
ప్రతీ క్రిమికి దాన్ని మాత్రమే అనితరంగా నాశనం చేసే మందులు ఉండాలని వాదిస్తూ, ‘magic bullet’ అన్న భావనకి ప్రాచుర్యం పెంచాడు ఎహర్లిక్. ఈ రకమైన మందుల అన్వేషణలో పడ్డాడు ఎహర్లిక్. 1907 లో ‘ట్రిపాన్ రెడ్’ (Trypan red) అనే ఒక అద్దకానికి (dye) ఆఫ్రికన్ నిద్రా వ్యాధి (African sleeping sickness) అనే ఓ వ్యాధిని అరికట్టే గుణం వుందని కనుక్కున్నాడు. అలాగే ఆర్సెనిక్ సంయోగాల (arsenic compounds) తో పని చేస్తూ ఒక ప్రత్యేక సంయోగం (దానికి 606 అని పేరు పెట్టాడు)...

ఈ బ్లాగ్ లో ఈ మధ్యన ప్రచురించబడ్డ ఓ వ్యాసానికి,
http://scienceintelugu.blogspot.in/2012/10/blog-post_24.html?showComment=1351391583818
ఈ కింది కామెంట్ వచ్చింది.
Dr. Srinivas, do you want to make this "Science" blog like another other "Religious Science" blog? For that, there are tens of such blogs in the Telugu blogsphere, you dont need one more. Please stop this nonsense here.
అందుకు నా సమాధానం, వివరణ…
Dear Anonymous,
Your...

1860 లలో ఫ్రాన్స్ కి చెందిన పట్టుపరిశ్రమ కొన్ని ఇబ్బందులకి గురయ్యింది. ఏదో తెలీని రోగం వల్ల పెద్ద సంఖ్యలో పట్టుపురుగులు చచ్చిపోయేవి. అంతకు ముందే సూక్ష్మదర్శిని వినియోగం గురించి, దాని లాభాల గురించి తెలిసిన పాశ్చర్, ఆ పరికరాన్ని ఉపయోగించి రోగానికి కారకమైన సూక్ష్మక్రిములని కనుక్కున్నాడు. రోగం సోకిన పురుగులని, అవి తినే మల్బరీ ఆకులని ఏరివేయించి, వాటిని నాశనం చేయించాడు. రోగం సోకిన పురుగుల సంపర్కం లేకపోవడం వల్ల మిగతా పురుగులు ఆరోగ్యంగా మిగిలాయి....

వైరస్ కథ
వైరస్ లు రోగాన్ని కలుగజేసి, ప్రాణాన్ని కూడా హరించగల అతి సూక్ష్మమైన జీవరాశులు.
జీవప్రపంచానికి, అజీవప్రపంచానికి మధ్య సరిహద్దు మీద ఉండే అతి సూక్ష్మమైన వస్తువులు వైరస్ లు. అసలు అంత సూక్ష్మమైన జీవరాశులు ఉంటాయని ఎవరూ ఊహించలేకపోయారు. అందుకే వైరస్ ల గురించి సరైన అవగాహన కలగడానికి ఇరవయ్యవ శతబ్దం వరకు ఆగాల్సి వచ్చింది.
పూర్వచరిత్ర
పదిహేడవ శతాబ్దానికి ముందు మనిషికి తెలిసిన అత్యంత సూక్ష్మమైన జీవరాశులు పురుగులు. అంత కన్నా చిన్న ప్రాణులు...

రచన – రసజ్ఞ
వైదిక ఆచారం ప్రకారం మనిషి పుట్టుక, జీవనంలోని వేరు వేరు దశలు, చావు అన్నీ దేవుడి చేత నుదుటిపై లిఖింపబడి ఉంటాయి అంటారు కానీ వాస్తవానికి ఒక మనిషికి సంబంధించినది ఏదయినా సరే మొత్తం సమాచారమంతా జన్యు చిప్ (Gene chip) రూపంలో నిక్షిప్తం అయ్యి ఉంటుంది. పిల్లల రంగు,ఎత్తు, ఆరోగ్యం అన్నీ కూడా తల్లిదండ్రుల నుండి, తాతముత్తాతల నుండి పిల్లలకు సంక్రమించే జన్యువుల మీదనే ఆధారపడి ఉంటాయి. పిల్లల పుట్టుకకు సంబంధించిన ఈ వీడియోచూడండి. ఇక్కడ సందర్భం...
అధ్యాయం 23
చిట్టచివరికి నీటి సవ్వడి
ఏవో పిచ్చి ఆలోచనలతో మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఎప్పుడూ నిబ్బరంగా ఉండే ఈ వేటగాడు ఉన్నట్లుండి ఎక్కడికి మాయమైపోయాడు? ఓ వెర్రి ఆలోచన మదిలో మెదిలింది.
అంతలో చీకట్లో అడుగుల చప్పుడు వినిపించింది. హన్స్ సమీపిస్తున్నాడు. మేం వున్న రాతిపంజరపు గోడల మీద ఏవో మినుకు మినుకు కాంతులు ముందు కనిపించాయి. తరువాత సొరంగపు ద్వారం వద్ద కాస్త కాంతి కనిపించింది. హన్స్ ప్రత్యక్షమయ్యాడు.
మామయ్య వద్ద కెళ్లి ఆయన భుజం మీద చెయ్యేసి సున్నితంగా ఆయన్ని తట్టి లేపాడు.
మామయ్య లేచి, “ఏవయ్యింది?” అని అడిగాడు.
“వాటెన్”...

ఈ కృషిలో [సిరీపీడ్ ల మీద గ్రంథ రచన] నేను ఎనిమిదేళ్లు గడిపినా అందులో అనారోగ్యం వల్ల రెండేళ్లు పోయాయి. ఆ విషయం నేను నా డైరీలో రాసుకున్నాను. ఆ కారణం చేత 1848 లో నేను హైడ్రోపతిక్ చికిత్స కోసం మాల్వర్న్ లో కొంత కాలం గడిపాను. ఆ చికిత్స నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అక్కణ్నుంచి ఇంటికి తిరిగి రాగానే మళ్లీ పని మొదలెట్టాను. ఆ రోజుల్లో నా ఆరోగ్యం ఎంత దీనంగా ఉండేదంటే 1848 లో నవంబర్ 13 నాడు నా తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిపించడానికి...

రచన - రసజ్ఞ
లియోపోల్డ్ అగస్ట్ వైస్మన్ (Leopold August Weissmann) అనే శాస్త్రవేత్త - జీవులలో శారీరక కణముల(సొమాటిక్ సెల్స్, somatic cells)లో శారీరక జీవ పదార్థము (సొమాటోప్లాసం, somatoplasm), ప్రత్యుత్పత్తి కణముల(జెర్మ్ సెల్స్, germ cells)లో బీజ పదార్థము (జెర్మ్ ప్లాసం, germ plasm) ఉంటాయనీ, శారీరక కణములలో వచ్చిన మార్పులు తరువాత తరానికి శారీరక జీవ పదార్థము నశించుట వలన రావనీ, బీజ పదార్థము నశించకుండా సంయోగ బీజాలకు పంచబడుతుంది కనుక వీనిలో వచ్చిన...

రసజ్ఞ గారు (http://navarasabharitham.blogspot.in/) తెలుగు బ్లాగ్ ప్రపంచంలో సుపరిచితులు. ‘జన్యు శాస్త్రం’ మీద ధారావాహికంగా కొన్ని వ్యాసాలు రాయడానికి ఆమె ముందుక్కొచ్చారు. దీం తరువాత మరి కొన్ని అంశాల మీద కూడా రాస్తానని హామీ ఇచ్చారు! ఇలాగే మరి కొందరు శాస్త్ర విజ్ఞానం గురించి రాయడానికి ముందుకొస్తే బావుంటుంది.
జన్యు శాస్త్రం మీద ధారావాహికలో ఇది మొదటి పోస్ట్…
---
జన్యు శాస్త్రం 1
రచయిత్రి - రసజ్ఞ
జీవుల ప్రాథమిక లక్షణాలు - పెరుగుదల, పోషణ...
రాత్రి ఎనిమిది అయ్యింది. ఎక్కడా ఒక్క బొట్టు నీరు కూడా లేదు. ఇక బాధ భరించలేకున్నాను. మామయ్య మాత్రం ఏమీ పట్టనట్టు నడుచుకుంటూ పోతున్నాడు. ఆయనకసలు ఆగే ఉద్దేశం ఉన్నట్టు లేదు. ఎక్కడైనా సెలయేటి గలగలలు వినిపిస్తాయేమోనని ఆశ. కాని భరించరాని నిశ్శబ్దం తప్ప చెవికి మరొకటి తెలియడం లేదు.
ఇక ఒంట్లో సత్తువ అంతా హరించుకుపోయింది. మామయ్యని ఇబ్బంది పెట్టకూడదని అంతవరకు ఎలాగోలా ఓర్చుకున్నాను. ఇక అయిపోయింది. ఇవే ఆఖరు ఘడియలు.
“మామయ్యా! ఇక నా వల్ల కాదు. కొంచెం ఆగు!”
గట్టిగా అరిచి కుప్పకూలిపోయాను.
ఆ కేకకి మామయ్య వెనక్కు నడిచి వచ్చాడు. చేతులు కట్టుకుని...

‘కటపయ’ పద్ధతి ఉపయోగించి 31 దశాంశ స్థానల వరకు పై విలువని పద్య రూపంలో ప్రాచీన భారత గణితవేత్త ఆర్యభట్టు వ్యక్తం చెయ్యడం గురించి లోగడ ఓ పోస్ట్ లో చెప్పుకున్నాం.
http://scienceintelugu.blogspot.in/2009/09/31.html
అలాంటి పద్ధతినే ఉపయోగించి ఆ గణితవేత్త sin(x) యొక్క విలువలని పద్య రూపంలో ఓ పట్టికగా ఇచ్చాడు. ఆ విశేషాలు ఈ వ్యాసంలో…
అక్షరాలతో పెద్ద పెద్ద సంఖ్యలని వ్యక్తం చేసే పద్ధతి-
ఆర్యభట్టు కనిపెట్టిన పద్ధతిలో ‘క’ నుండి ‘మ’ వరకు...

లండన్లో ఉండే రోజుల్లో ఎన్నో వైజ్ఞానిక సదస్సుల సమావేశాలకి హాజరు అవుతూ ఉండేవాణ్ణి. భౌగోళిక సదస్సుకి సెక్రటరీగా కూడా పని చేశాను. కాని అనారోగ్య కారణాల వల్ల తరచు ఈ సమావేశాలకి హాజరు కావడం వీలపడలేదు. కనుక నేను, నా భార్య లండన్ వదిలి పల్లె ప్రాంతాలకి తరలిపోయాం. మళ్లీ ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చింతించలేదు.
సర్రీ తదితర ప్రాంతాల్లో ఇంటి కోసం చాలా గాలించాం. కాని ప్రయోజనం లేకపోయింది. చాలా గాలించిన తరువాత చివరికి ఒక ఇల్లు కనిపించింది....

అధ్యాయం 22
ఒక్క బొట్టయినా లేదు
ఈ సారి మా అవరోహణ రెండవ సొరంగంలో మొదలయ్యింది. ఎప్పట్లాగే హన్స్ మా ముందు నడిచాడు.
ఓ నూరు గజాలు నడిచామో లేదో ప్రొఫెసర్ తన చేతులోని లాంతరుని గోడల దగ్గరగా పట్టుకుని చూసి, “అబ్బ! ఇవి ఆదిమ శిలలు. అంటే ఇదే సరైన మార్గం. పదండి ముందుకు” అని అరిచాడు.
ప్రాథమిక దశలలో భూమి నెమ్మదిగా చల్లబడసాగింది. అలా కుంచించుకుపోతున్న భూమి పైపొరలో పగుళ్ళు, బీటలు, చీలికలు, అగాధాలు ఏర్పడ్డాయి. మేం నడుస్తున్న బాట అలాంటి ఓ చీలికే. అయితే...

అలాగే ఒకసారి లార్డ్ స్టాన్ హోప్ (Lord Stanhope)(చరిత్రకారుడు) ఇంట్లో మకాలే (Macaulay)ని కలుసుకున్నాను. ఆయన మాటలు వినే సదవకాశం దొరికింది. చూడగానే చాలా నచ్చారు. ఆయన పెద్దగా మాట్లాడలేదు. అయినా అలాంటి వాళ్లు ఎక్కువగా మాట్లాడరు కూడా. ఇతరులు మాట్లాడిస్తే మాట్లాడేవారు అంతే.
మకాలే జ్ఞాపకశక్తి ఎంత కచ్చితంగా, ఎంత సంపూర్ణంగా ఉంటుందో ఋజువు చెయ్యడానికి లార్డ్ స్టాన్ హోప్ ఒక వృత్తాంతం చెప్పారు. లార్డ్ స్టాన్ హోప్ ఇంట్లో ఎంతో మంది చారిత్రకులు సమావేశం...
postlink