భూమి తరువాత ఎక్కడ?
(చిత్రం - ఎడమనుండి కుడివైపుకి: మెర్యురీ, వీనస్, భూమి, మార్స్)
అది 2050 సంవత్సరం.
ప్రపంచ జనాభా తొమ్మిది బిలియన్లు చేరుకుంటోంది. అందులో ఐదు బిలియన్లకి పైగా ఆసియాలోనే ఉన్నారు. అందులో 1.8 బిలియన్ల జనం మన దేశంలోనే.
జనాభా పెరిగినప్పుడు భూమి వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది. నీరు, శక్తి/ఇంధనం, ఆహారం... వీటి కోసం పోటీ పెరుగుతుంది. కాని భూవనరులలో కెల్లా ముఖ్యమైన, మౌలికమైన వనరు అసలు భూమే ననుకోవాలి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక 2050 కి కఫ్జా చెయ్యడానికి నేల దొరక్క భూకఫ్జా దారులు ఎగబడి ఒకరి భూములు ఒకరు కఫ్జా చేసుకుంటూ పొట్టపోసుకోవాలి!
ప్రపంచ జనాభా పెరుగుతున్న జోరు చూస్తుంటే, ఇక భూమి మీద మనిషికి చోటు సరిపోని రోజు ఎప్పుడో ఒక్కప్పుడు రాక మానదు. భూమి తరువాత ఎక్కడ అన్న ప్రశ్న మనిషిని ఎంతకాలంగానో వేధిస్తోంది. చందమామ మీద మనిషి వేసిన అడుగు, భూమి కాని భూముల మీద మనిషి నివాసాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో మొదటి అడుగు. భూమి కాకపోతే ఎక్కడ అన్నప్పుడు మొదట చంద్రుడే గుర్తుకు వస్తాడు. కాని చంద్రుడు ఇతర గ్రహాలకి పయనంలో మజిలీగా మాత్రమే పరిగణించారు గాని, భారీ ఎత్తున మానవ సమాజాల నివాసానికి యోగ్యమైన భూమికగా ఎప్పుడూ అనుకోలేదు.
ఇక ఇతర గ్రహాల మీద మానవ నివాసం వీలవుతుందా అని ఆలోచిస్తే, పొరుగు గ్రహాలైన వీనస్, మెర్క్యురీలని ఒక పక్క, మార్స్ గ్రహాన్ని మరో పక్క మొట్టమొదట పరిగణించాల్సి ఉంటుంది.
సూర్యుడు దిశలో ఇంకా లోపలికి పోతే, మానవ నివాసానికి అవకాశాలు సన్నగిల్లుతాయి. మొదటి గ్రహమైన మెర్క్యురీ సూర్యుడికి మరీ దగ్గర కావడంతో, నివాసం దుర్భరంగా ఉంటుంది. మెర్క్యురీ ఉపరితలం మీద పగటి ఉష్ణోగ్రత 427 డిగ్రీల సెంటిగ్రేడు. సీసాన్ని కరిగించగల ఉష్ణోగ్రత అన్నమాట. అయితే మెర్క్యురీ ధృవప్రాంతాలు మరింత చల్లగా ఉంటాయి. ధృవాల వద్ద ఉండే ఉల్కాబిలాల (craters) లో శాశ్వత హిమం పుష్కలంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మెర్క్యురీ నేలలో హీలియమ్-3 సమృద్ధిగా ఉండొచ్చని కూడా అంచనాలు ఉన్నాయి. ఈ హీలియమ్-3 కేంద్రక సంయోగానికి పనికొస్తుంది కనుక ముందు ముందు ఆర్థిక ప్రగతికి కావలసిన ఓ ముఖ్యమైన పదార్థంగా పరిణమిస్తుందన్న అవగాహన ఇప్పటికే ఉంది. ఇది కూడా మెర్క్యురీ మీద మనిషి కన్నేసి ఉంచడానికి ఒక కారణం. ఏదేమైనా మెర్క్యురీ ఇవ్వగల వనరుల ఆకర్షణ తప్ప, నివాసయోగ్యత దృష్ట్యా మనిషి ఎప్పుడూ దాన్ని పెద్దగా లక్ష్యపెట్టలేదు.
మెర్క్యురీ కాకపోతే సూర్యుడికి మరి కాస్త దూరంలో ఉన్న వీనస్ యొక్క మానవ నివాస యోగ్యత పరిశీలిద్దాం. వీనస్ కి, భూమికి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. అందుకే దాన్ని "సోహోదరీ గ్రహం" (sister planet) అన్నారు. మరో గ్రహానికి మకాం మార్చబోతున్నప్పుడు మనం గమనించాల్సిన మొట్టమొదటి లక్షణం ఆ గ్రహం మీది గురుత్వం. భూమి గురుత్వం కన్నా గురుత్వం మరీ తక్కువ ఉన్న చోట్ల మనిషి యొక్క కండరాల వ్యవస్థ మీద, అస్తిక వ్యవస్థ మీద (muskuloskeletal system) చెడు పరిణామాలు కనిపిస్తాయి. కండరాలు పలుచబడతాయి. అది జరగకుండా ఉండేందుకే వ్యోమగాములు అంతరిక్ష యానంలో ఉన్నప్పుడు క్రమబద్ధంగా వ్యాయామం చేస్తుంటారు. ఇది కాకుండా ఎముకల్లో decalcification (కాల్షియం తరిగిపోవడం) అనే ప్రక్రియ వల్ల ఎముకలు కూడా బలహీనం అవుతాయి. కాని వీనస్ మీద ఈ బాదరబందీ ఉండదు. ఎందుకంటే వీనస్ ఉపరితలం మీద గురుత్వం భూమి గురుత్వంలో 0.9 వంతు మాత్రమే. అంటే భూమికి, వీనస్ కి మధ్య షటిల్ సర్వీస్ నడిపే శాల్తీల ఎముకలకి, కండలకి ప్రమాదం లేదన్నమాట!
కాని వీనస్ తో ఒక పెద్ద చిక్కు అక్కడి భయంకరమైన వాతావరణం. పగటి ఉష్ణోగ్రత సగటున 500 డిగ్రీల సెంటిగ్రేడు దాటుతుంది. ఇంతకన్నా ముఖ్యంగా అక్కడి వాతావరణ పీడనం భూమి మీద విలువకి తొంభై రెట్లు ఉంటుంది. అంటే కిలోమీటర్ లోతు నీళ్లలో ఎంత పీడనం ఉంటుందో అంత అన్నమాట! వీనస్ అన్వేషణ మీద వెనెరా 5, 6, 7, 8 మొదలైన ప్రోబ్ లు బయలుదేరాయి. వీటిలో వెనెరా 5, 6 లు వీనస్ వాతావరణంలో 18 km ఎత్తులోనే అప్పడంలా చితికిపోయాయి. వెనెరా 7, 8 లు నేల మీద వాలినా, గంటలోనే చివరి శ్వాస వదిలాయి! ఈ కారణాలకి తోడు అక్కడి వాతావరణంలో ఆక్సిజన్ సున్నా, కార్బన్డయాక్సయిడ్ మిన్న! అక్కడి మబ్బులు వర్షించేది నీరు కాదు, సల్ఫ్యురిక్ ఆమ్ల ధారలని. ఈ ఇబ్బందుల దృష్ట్యా వీనస్ మీద కూడా మనిషి డేరాలు వేసే అవకాశం తక్కువే నని అర్థమవుతుంది.
(సశేషం...)
Nice one, as usual. But I think the figure indicates Mercury, Mars, Earth and Venus - in the order
Why is that Malak? It looks correct to me ...
Yes, it is correct.
I think you are mislead by the 'red' color of the second planet (from the left). It is indeed Venus,
(See this link to see the Venus in its true color: http://en.wikipedia.org/wiki/Venus)
and the last one on the right is Mars). Venus is nearly as big as the Earth.
Both Mars and Mercury are much smaller.
Radii of the four planets:
Mercury: 2439 km (http://en.wikipedia.org/wiki/Mercury_(planet))
Venus: 6052 km (http://en.wikipedia.org/wiki/Venus)
Earth: 6371 km (http://en.wikipedia.org/wiki/Earth)
Mars: 3396 km (http://en.wikipedia.org/wiki/Mars)
Ahhhh .. okay! I was indeed misled by the red color oops!
I have a doubt. If Mercury is near to Sun than Venus, How can temperature on Venus be higher than Mercury?
Excellent question.
Temperature at a given spot on a planet depends on many factors:
- the planet's distance from the sun
- presence of atmosphere on the planet
- the elevation of that spot (mountain, plan etc)
- latitude + tilt
- night and day
- soil type (the ability of the soil to retain heat - its thermal inertia)
- minor factors like wind, humidity etc
The temperature given for mercury (427 C) is highest day temperature when the planet is at its perihelion.
At aphelion, at a point right under the sun, it is 277 C. Night temperatures average out to -163 C. Such extreme
temperatures exists since the planet hardly has an atmosphere. Presence of atmosphere has a buffering
effect and avoids such fluctuations.
Venus, though it is farther away from the sun, has a very dense atmosphere filled with CO2. We know that
CO2 is a greenhouse gas. That's what pushes the temperature there up to 460 C (the number given above in the article
- 500 C - is slightly on the higher side. I must've made a mistake).
That makes Venus slightly hotter than Mercury.
Sources:
en.wikipedia.org/wiki/Venus
en.wikipedia.org/wiki/Mercury
తెలుగులో సైన్సు బ్లాగు పెట్టాం అని గొప్పగా చెప్పుకోవడం కాదు, అందులో జరిగే డిస్కషన్స్ కూడా తెలుగులో ఉంటే బాగుంటుంది. కనీసం మీరిచ్చే సమాధానాలైనా. ఆ మాత్రం ఇంగ్లీషులో ఇచ్చేదానికి, మీ బ్లాగుకు రావడం దేనికి? గూగుల్లో సెర్చ్ చేసుకొని, మేమే చదువుకోలేమా?
మాటలో మితిమీరిన పదును ఒంటికి మంచిది కాదు. మాటలో మంచి, మర్యాద, మార్దవం, అనునయింపు మానవ సంబంధాలని పోషిస్తాయి. రాష్ట్ర ప్రస్తుత దుస్థికి అవి లేకపోవడం ఒక కారణం కావచ్చు.
తెలుగులో సమాధానం రాయమన్న మీ వ్యాఖ్యలోనే రెండు అనవసరమైన ఇంగ్లీషు పదాలు - ’డిస్కషన్స్’, ’సెర్చ్’ - దొర్లాయి!!! అదేం?
సామాన్యంగా ఇంగ్లీషులో ప్రశ్నకి ఇంగ్లీషులో సమాధానం చెప్తున్నాను. ప్రశ్న తెలుగులో ఉంటే సమాధానం కూడా తెలుగులోనే ఉంటోంది. సమాధానం ముఖ్యంగా ప్రశ్న అడిగిన వాళ్లని ఉద్దేశించబడి ఇవ్వబడుతోంది.
ఇప్పట్నుంచి ఒక ఒప్పందానికి వద్దాం. వీలైనంత వరకు సంవాదం తెలుగులోనే జరుపుదాం. నా వరకు నేను చర్చలకి తెలుగులోనే స్పందిస్తాను.
క్షమించాలి. మొదట తెలుగులోనే వ్రాయడం మొదలుపెట్టాను. కాని నిన్న ఎందుకనో అక్షరమాల పనిచేయలేదు.
అందుకనే ఆంగ్లంలో వ్రాయాల్సి వచ్చింది.
Srinivas gaaru,
You are doing a great job of promoting science in telugu. Though I'm in USA, I prefer reading telugu blogs in telugu. Keep up the good work and don't bother about idiots pointing fingers at your abilities.
-Sam.
Dear Sam
Thank you. Will certainly follow your advice :-)