శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

అకశేరుక లోకపు జీనియస్ – ఆక్టోపస్ (2)

Posted by V Srinivasa Chakravarthy Tuesday, September 21, 2010



ఆక్టోపస్ లు ప్రదర్శించే మరో ప్రత్యేక సామర్థ్యం తోటి ఆక్టోపస్ లు చేసే చర్యలు చూసి నేర్చుకునే సామర్థ్యం. కొత్త సినిమా కదాని ఎగేసుకెళ్లి ఆహుతై తిరిగొచ్చిన సోదరుణ్ణి చూసి మనం నేర్చుకుంటాం. ప్రతి ఒక్కటి స్వానుభవంతో నేర్చుకోనక్కర్లేదు. మరొకరి అనుభవం నుండి కూడా నేర్చుకోవచ్చు. ఈ సామర్థ్యం ఉన్న జీవాలు మరింత త్వరగా నేర్చుకోగలవు, జీవితంపై మరింత గొప్ప దక్షత సంపాదించగలవు. దీన్నే ’పరిశీలనాత్మక విద్య (observational learning) అంటారు. ఇలాంటి సామర్థ్యం ఆక్టోపస్ లు కూడా ప్రదర్శిస్తాయి. ఉదాహరణకి ఇటలీలోని నేపుల్స్ నగరంలో ఓ ప్రయోగశాలలో చేసిన అధ్యయనంలో ఓ ఆక్టోపస్ కి ఓ తెల్ల బంతిని ఎంచుకోమని, ఎర్ర బంతిని తిరస్కరించమని నేర్పించారు. కేవలం ఆ ఆక్టోపస్ ని చూసి మరో అక్టోపస్ ఆ క్రియని నేర్చుకోగలిగింది.


ఇవన్నీ చాలనట్టు ఆక్టోపస్ మరో వింతైన ఒడుపు కూడా ప్రదర్శించగలిగాయి. సీసా మూతలని జాగ్రత్తగా తొండంతో తిప్పి మూత తెరవగలిగాయి!


ఇక ఇటీవలి కాలంలో ఆక్టోపస్ లు కేవలం తెలివేటలే కాదు, “దివ్యదృష్టి” లాంటి మానవాతీత శక్తులు కూడా ప్రదర్శించి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఏడాది World Cup Soccer మ్యాచిలలో జర్మనీకి చెందిన పాల్ అనే ఆక్టోపస్ మాచ్ ఫలితాల గురించి అద్భుతంగా జోస్యం చెప్పి మహా మహా జ్యోతిష్యులే తలవంచుకునేట్టు చేసింది! జర్మనీ ఆడిన ప్రతీ మ్యాచ్ ఫలితాన్ని కచ్చితంగా చెప్పడమే కాక, ఫైనల్స్ లో విజేత పేరు కూడ కచ్చితంగా ముందే చెప్పగలిగింది. అయితే ఆక్టోపస్ ల యొక్క ఈ సామర్థ్యం మాత్రం సైన్స్ కి అందని విషయం అన్న సంగతి గుర్తుంచుకోవాలి.

మనిషి మనసుని, మెదడుని అర్థం చేసుకోవడం కష్టం కనుక, మరింత సరళమైన నాడీమండలాలు గల జంతువులని అధ్యయనం చెయ్యడం నాడీశాస్త్రవేత్తలకి పరిపాటి. అయితే అలాంటి “సరళమైన” నాడీమండలాలు కూడా ఎన్నో సార్లు సంభ్రమాశ్చర్యాలు కలిగించే శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తాయి. వెన్నెముక కూడా లేని ఈ సుతిమెత్తని ప్రాణి, నాడీశాస్త్రవేత్తల మనసుని ఆకట్టుకున్న ఆక్టోపస్, నిజంగా అకశేరుకలోకపు మహామేధావే!

References:
http://animals.howstuffworks.com/marine-life/octopus3.htm
http://en.wikipedia.org/wiki/Octopus
http://en.wikipedia.org/wiki/Paul_the_Octopus






3 comments

  1. తిరు Says:
  2. "ఇవన్నీ చాలనట్టు ఆక్టోపస్ మరో వింతైన ఒడుపు కూడా ప్రదర్శించగలిగాయి. సీసా మూతలని జాగ్రత్తగా తొండంతో తిప్పి మూత తెరవగలిగాయి!"

    దీనిగురించి నిన్న అడుగుదామనుకున్నాను సర్. ఏదో మూవీలో చూసాను. చాలా ఇంటరెస్టింగ్ టాపిక్.
    థాంక్ యు.

     
  3. మంచి సమాచారం అందించారు. మీరు చూసారో లేదో కానీ, సుమారు సంవత్సరం క్రితం బిబిసిలో ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ అని ఒక కార్యక్రమం ప్రసారమైంది. మనుగడ కోసం చేసే పోరాటాల్లో ఎలా మార్పులొస్తున్నాయి అని చాలా జీవాల గురించి అద్భుతంగా దృశ్యీకరించారు. మెదటి ఎపిసోడ్।లో మొదటి పది నిమిషాలు ఇక్కడ చూడొచ్చు.http://www.youtube.com/watch?v=5ix5Aq3EUCA
    మిగతా ఎపిసోడ్లు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. మొత్తంగా తొమ్మిదో పదో ఎపిసోడ్లు.

     
  4. Kanna garu, Thank you for the info. Will watch the videos.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts