ఆక్టోపస్ లు ప్రదర్శించే మరో ప్రత్యేక సామర్థ్యం తోటి ఆక్టోపస్ లు చేసే చర్యలు చూసి నేర్చుకునే సామర్థ్యం. కొత్త సినిమా కదాని ఎగేసుకెళ్లి ఆహుతై తిరిగొచ్చిన సోదరుణ్ణి చూసి మనం నేర్చుకుంటాం. ప్రతి ఒక్కటి స్వానుభవంతో నేర్చుకోనక్కర్లేదు. మరొకరి అనుభవం నుండి కూడా నేర్చుకోవచ్చు. ఈ సామర్థ్యం ఉన్న జీవాలు మరింత త్వరగా నేర్చుకోగలవు, జీవితంపై మరింత గొప్ప దక్షత సంపాదించగలవు. దీన్నే ’పరిశీలనాత్మక విద్య (observational learning) అంటారు. ఇలాంటి సామర్థ్యం ఆక్టోపస్ లు కూడా ప్రదర్శిస్తాయి. ఉదాహరణకి ఇటలీలోని నేపుల్స్ నగరంలో ఓ ప్రయోగశాలలో చేసిన అధ్యయనంలో ఓ ఆక్టోపస్ కి ఓ తెల్ల బంతిని ఎంచుకోమని, ఎర్ర బంతిని తిరస్కరించమని నేర్పించారు. కేవలం ఆ ఆక్టోపస్ ని చూసి మరో అక్టోపస్ ఆ క్రియని నేర్చుకోగలిగింది.
ఇవన్నీ చాలనట్టు ఆక్టోపస్ మరో వింతైన ఒడుపు కూడా ప్రదర్శించగలిగాయి. సీసా మూతలని జాగ్రత్తగా తొండంతో తిప్పి మూత తెరవగలిగాయి!
ఇక ఇటీవలి కాలంలో ఆక్టోపస్ లు కేవలం తెలివేటలే కాదు, “దివ్యదృష్టి” లాంటి మానవాతీత శక్తులు కూడా ప్రదర్శించి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఏడాది World Cup Soccer మ్యాచిలలో జర్మనీకి చెందిన పాల్ అనే ఆక్టోపస్ మాచ్ ఫలితాల గురించి అద్భుతంగా జోస్యం చెప్పి మహా మహా జ్యోతిష్యులే తలవంచుకునేట్టు చేసింది! జర్మనీ ఆడిన ప్రతీ మ్యాచ్ ఫలితాన్ని కచ్చితంగా చెప్పడమే కాక, ఫైనల్స్ లో విజేత పేరు కూడ కచ్చితంగా ముందే చెప్పగలిగింది. అయితే ఆక్టోపస్ ల యొక్క ఈ సామర్థ్యం మాత్రం సైన్స్ కి అందని విషయం అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
మనిషి మనసుని, మెదడుని అర్థం చేసుకోవడం కష్టం కనుక, మరింత సరళమైన నాడీమండలాలు గల జంతువులని అధ్యయనం చెయ్యడం నాడీశాస్త్రవేత్తలకి పరిపాటి. అయితే అలాంటి “సరళమైన” నాడీమండలాలు కూడా ఎన్నో సార్లు సంభ్రమాశ్చర్యాలు కలిగించే శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తాయి. వెన్నెముక కూడా లేని ఈ సుతిమెత్తని ప్రాణి, నాడీశాస్త్రవేత్తల మనసుని ఆకట్టుకున్న ఆక్టోపస్, నిజంగా అకశేరుకలోకపు మహామేధావే!
References:
http://animals.howstuffworks.com/marine-life/octopus3.htm
http://en.wikipedia.org/wiki/Octopus
http://en.wikipedia.org/wiki/Paul_the_Octopus
"ఇవన్నీ చాలనట్టు ఆక్టోపస్ మరో వింతైన ఒడుపు కూడా ప్రదర్శించగలిగాయి. సీసా మూతలని జాగ్రత్తగా తొండంతో తిప్పి మూత తెరవగలిగాయి!"
దీనిగురించి నిన్న అడుగుదామనుకున్నాను సర్. ఏదో మూవీలో చూసాను. చాలా ఇంటరెస్టింగ్ టాపిక్.
థాంక్ యు.
మంచి సమాచారం అందించారు. మీరు చూసారో లేదో కానీ, సుమారు సంవత్సరం క్రితం బిబిసిలో ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ అని ఒక కార్యక్రమం ప్రసారమైంది. మనుగడ కోసం చేసే పోరాటాల్లో ఎలా మార్పులొస్తున్నాయి అని చాలా జీవాల గురించి అద్భుతంగా దృశ్యీకరించారు. మెదటి ఎపిసోడ్।లో మొదటి పది నిమిషాలు ఇక్కడ చూడొచ్చు.http://www.youtube.com/watch?v=5ix5Aq3EUCA
మిగతా ఎపిసోడ్లు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. మొత్తంగా తొమ్మిదో పదో ఎపిసోడ్లు.
Kanna garu, Thank you for the info. Will watch the videos.