
అగ్నిపర్వతం యొక్క అడుగుభాగాన్ని తడిమి చూస్తాం అన్న ప్రకటనకి హన్స్ అదురుకుంటాడని ఊహించాడు మామయ్య. కాని హన్స్ నిర్లిప్తంగా తలూపాడు. పాతాళంలో పూడుకుపోయినా, పర్వత శిఖరాలని కావలించుకున్నా – తనకి రెండూ ఒక్కటే. నేను కూడా అంతవరకు జరిగిన సంఘటనల గురించే ఆలోచించాను గాని ఇక ముందు పొంచివున్న ప్రమాదాల గురించి ఆలోచించలేదు. కాని భవిష్యత్తు తలచుకుంటే వెన్నులో చలి పుడుతోంది. అయినా ఇప్పుడు తలచుకుని ఏం లాభం. మా మామయ్య దూకుడుకి అడ్డుపడే ఉద్దేశమే ఉంటే ఆ పనేదో...
కాల్యులస్ ని కనిపెట్టింది న్యూటన్ అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. అయితే ఇంచుమించు అదే కాలంలో న్యూటన్ సమకాలీనుడు అయిన లీబ్నిజ్ కూడా కాల్యులస్ ని కనిపెట్టాడని, ఇద్దరిలో మొదట కనిపెట్టిన ఘనత ఎవరికి దక్కాలన్న విషయం మీద ఇద్దరికీ మధ్య చాలా వివాదం చెలరేగిందని గణిత చరిత్ర బట్టి మనకి తెలుస్తుంది.అయితే ఆ ఇద్దరికీ ఆ అవకాశం ఇవ్వకుండా ఆ ఘనత అంతా వారిద్దరికన్నా ఇంచుమించు రెండు వందల ఏళ్ల ముందు పుట్టిన మాధవుడు అనే కేరళకి చెందిన గణిత వేత్తకి చెందుతుందన్న విషయానికి గత ఒకటి రెండు దశాబ్దాలుగా ప్రాచుర్యం పెరిగింది.కేరళలో కొచ్చిన్ కి సమీపంలో ఉండే...

మక్కా నుండి వచ్చిన ఓడని దగ్ధం చేశాక పోర్చుగీస్ నౌకాదళం కాననూర్ దిశగా పయనమయ్యింది. ఇండియాకి మొదటి యాత్రలో వాస్కో ఇక్కడి రాజుతో స్నేహం చేసుకున్నాడు. ఈ రాజుకి కాలికట్ ని ఏలే జామొరికి మధ్య చిరకాల శత్రుత్వం ఉంది. కాననూర్ రాజు వాస్కోదగామాని తన మందిరంలోకి ఆహ్వానించి సాదరంగా ఆతిథ్యం ఇచ్చాడు. ఇద్దరూ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. రాజు వద్ద నానా రకాల సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని వాస్కో దా గామా కాలికట్ కి బయల్దేరాడు.ఉదయభాను కిరణాలకి అడ్డుపడుతూ అల్లంత...

అసలు ఘనకోణం అనే బావన ఎందుకు అవసరం? కోణం అనే భావన తలానికి పరిమితమైన ఓ లక్షణం అని మనకి తెలుసు. ఉదాహరణకి త్రిభుజం, చతురస్రం మొదలైన బహుభుజులకి శీర్షాలు (కొసలు, vertices) ఉంటాయి. ఆ శీర్షాలకి కోణాలు ఉంటాయి.మరైతే ఘనపరిమాణం గల వస్తువులైన ఘనం, పిరమిడ్, టెట్రహెడ్రన్, శంకువు మొదలైన వస్తువులకి కూడా శీర్షాలు ఉంటాయి కదా?ఆ కొసలని కూడా కోణాలతో వర్ణించగలమా? ఉదాహరణకి ఒక ఘనంలో ప్రతీ శీర్షం వద్ద మూడు ముఖాలు కలుస్తున్నాయి. మూడు ముఖాలలోను మూడు కోణాలు ఆ శీర్షం...

బంగాళ దుంపల నుండి కరెంటు తీయొచ్చు తెలుసా? ఈ తమాషా ప్రయోగానికి కావలసిన సరంజామా –• ఒక బంగాళదుంప• ఒక రాగి బద్ద• ఒక జింకు బద్ద• ఒక ఎల్.ఇ.డి. లేదా పెన్ టార్చిలో వాడేటటువంటి చిన్న బల్బు• రెండు చిన్న కరెంటు వైర్లు (ఇన్సులేషన్ ఉన్నవి)రాగి, జింకు బద్దల్లో ఒక కొస వద్ద వైర్లు పోవడానికి చిన్న రంధ్రాలు చెయ్యోలి. ఆ బద్దలని బంగాళదుంపలో గుచ్చాలి. గుచ్చిన బద్దలు దగ్గర దగ్గరగా ఉండాలి కాని, ఒకదాన్నొకటి తాకకూడదు. ఇప్పుడు రాగి, జింకు బద్దలని వైర్లతో ఎల్.ఇ.డి....

అధ్యాయం 14ఆర్కిటిక్ ప్రాంతంలో చివరి మజిలీ (పాతాళానికి ప్రయాణం - 38)స్టాపీ గ్రామంలో పట్టుమని ముప్పై గడపలు కూడా లేవు. తడకలతోనో, ఇటుకలతోనో చేసిన ఇళ్లు కావవి. లావారాతి ఇళ్లు. ఓ అగ్నిపర్వతానికి దక్షిణాన ఉందీ గ్రామం. ఉవ్వెత్తున లేచిన బేసల్ట్ శిలా ప్రాకారాల మధ్య నెమ్మదిగా ప్రవహించే ఓ లోతైన కాలువ గట్టు వెంట విస్తరించింది ఈ గ్రామం.బేసల్ట్ చాలా చిత్రమైన రాయి. అగ్నిశిలా జాతికి చెందిన ఈ రాయి గోధుమ రంగులో ఉంటుంది. కచ్చితమైన, క్రమబద్ధమైన ఆకృతులు దాల్చుతుంది....

మాలింది నగర వాసులు వాస్కో బృందాన్ని సాదరంగా ఆహ్వనించారు. నానా రకాల ఫలహారాలు ప్రసాదించి వారి సేద తీర్చారు. కాని అప్పటికే అరబిక్ సముద్రపు విపరీత పరిస్థితుల వల్ల బాగా అస్వస్థత పడ్డ కొందరు నావికులకి ఆ ఫలహారాల వల్ల పెద్దగా మేలు జరగలేదు. పైగా ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉండే మాలింది వాతావరణం వల్ల వారి పరిస్థితి మరింత విషమించింది. వ్యాధి వాత పడ్డ కొంతమంది నావికులు పాణాలు కోల్పోయారు. మాలిందిలో ఐదు రోజులు బస చేశాక వాస్కో బృందం పోర్చుగల్ కి బయల్దేరింది....

దృగ్గోచర కాంతిమితికి సంబంధించిన కొన్ని భావనలని అర్థం చేసుకోవాలంటే, కాంతిని ఓ ద్రవంగా ఊహించుకుంటే సులభంగా ఉంటుంది. కాంతి కూడా ద్రవం లాగా ప్రవహిస్తుంది. ఓ కొళాయి లోంచి నీరు ప్రవహించినట్టు, ఓ టార్చి లోంచి కాంతి బయటికి ప్రవహించినట్టు ఊహించుకోవచ్చు. కాంతి పుంజంలోని కిరణాలు విస్తరించకుండా సమాంతరంగా (లేజర్ లోలాగా) ప్రసారం అయినప్పుడు, ఆ పుంజానికి అధిక బలం వస్తుందని, దాంతో స్టీలు లాంటి కఠినమైన పదార్థాలని కూడా కోయవచ్చని ముందు చదువుకున్నాం. అదే విధంగా...

వాల్యూమ్ బాగా పెంచి టీవీ చూడ్డం అలవాటు సుబ్బారావుకి. ఇక ఆదివారం వస్తే రోజల్లా ఆ టీవీ చప్పుళ్ళలోనే ఓలలాడూతుంటాడు. పక్కింటివాళ్లు తిడితే తలుపులు, కిటికీలు బిగించి మరీ చూడడం మొదలెట్టాడు. దాంతో పగలు కూడా ఇల్లంతా చీకటి. అందుకోసం ఆదివారం పగలంతా ఇంట్లో లైట్లు వెలుగుతుంటాయి. వారం అంతా అయ్యే పవర్ ఖర్చు ఒక్క ఆదివారం ఖర్చుతో సమానం. ఇలా తెచ్చిపెట్టుకున్న కారణాల వల్ల కాకపోయినా, ఈ రోజుల్లో నిటారుగా పెరిగే ‘ఫ్లాట్’ భవనాలలో, ఎన్నో ఇళ్లలో సరైన వెలుతురు...

మర్నాడు ఉదయం ఐదింటికి మాకు ఆతిథ్యం ఇచ్చిన రైతు కుటుంబానికి వీడ్కోలు చెప్పాం. మామయ్య అతికష్టం మీద ఆ రైతుకి ఇవ్వాల్సిన పారితోషకం అతగాడు వద్దంటున్నా బలవంతంగా చేతిలో పెట్టాడు. హన్స్ ఇచ్చిన సంజ్ఞతో బృందం అంతా బయల్దేరింది.గర్దర్ నుండి ఓ నూరు గజాల దూరం వచ్చామో లేదో మట్టిలో కొన్ని మార్పులు రావడం కనిపించింది. అంతవరకు పొడిగా ఉన్న నేల కాస్తా చితకనేలగా మారి నడవడం కష్టం అయ్యింది. మాకు కుడి వైపున ఓ బృహత్తరమైన పర్వత శ్రేణి పెట్టని కోటలా విస్తరించింది....
ఈ బ్లాగ్ లో తరచు ఒక వివాదాంశం తలెత్తుతూ ఉంటుంది. ఆధునిక విజ్ఞానం గురించి విస్తారంగా చెప్పుకోవడం ఒక విధంగా ప్రాచీన భారత విజ్ఞానాన్ని, అసలు మొత్తం భారతీయ సంస్కృతినే కించపరిచినట్టుగానిర్లక్ష్యం చేసినట్టుగా కొంత మంది భావిస్తూ ఉంటారు. ఆ ధోరణిలో ఎన్నో కామెంట్లు కూడా గతంలో చూశాం. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు స్పష్టీకరించదలచుకున్నాను.ఆధునిక విజ్ఞానం "పాశ్చాత్య" విజ్ఞానం కాదు. విశ్వజనీన విజ్ఞానం. దాని ఆరంభంలో కొన్ని శతాబ్దాల క్రితం పాశ్చాత్యులు ప్రముఖ పాత్ర పోషించి ఉండొచ్చును గాక. గత శతాబ్దాలలో కూడా వారే ఎంతో కృషి చేసి ఉండొచ్చును గాక....

కాంతి పుంజాలలో కిరణాలు ఏవిధంగా విస్తరిస్తాయి అన్నదాన్ని బట్టి కాంతి పుంజాలని మూడు రకాలుగా విభజించవచ్చు.అపసరణ కాంతి పుంజాలు (divergent light beams)సామాన్యంగా వాస్తవ ప్రపంచంలో మనకి కనిపించే కంతి పుంజాలలో కిరణాలు ఒకదాని నుండి ఒకటి దూరం అవుతున్నట్టుగా ప్రసారం అవుతాయి. అలాంటి పుంజాన్ని అపసరణ కాంతి పుంజం (divergent light beam) అంటారు. ఇంతవరకు చూసిన కాంతి పుంజాల ( సినిమా ప్రొజెక్టర్, లైట్ హౌస్ మొ॥) ఉదాహరణల్లో అన్నీ అపసరణ కాంతి పుంజాలే.సమాంతర కాంతి...

కేవలం బహుమతులు నచ్చని దానికే రాజుకి తనపై అంత కోపం రావడం వాస్కో ద గామాకి ఆశ్చర్యం కలిగించింది. తరువాత వాకబు చెయ్యగా తన గురించి, పోర్చుగీస్ గురించి రాజుకి ఎవరో బోలెడు చాడీలు చెప్పినట్టు తెలిసింది. పోర్చుగీస్ వారు కాలికట్ కి రావడం మొదట్నుంచీ కూడా స్థానికులైన అరబ్ వర్తకులకి ఇష్టం లేదు. వాళ్లకి చెందవలసిన వాణిజ్య లాభాలు పోర్చుగీస్ వారు తన్నుకు పోతారని వారి భయం. అందుకే వాస్కో ద గామా గురించి లేని పోని కథలల్లి రాజుకి చెప్పారు. వాస్కో పరమ కిరాతకుడని,...
postlink