శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

అవి ఉరుములా, మనుషుల ఊసులా?

Posted by V Srinivasa Chakravarthy Sunday, December 30, 2012 0 comments
అధ్యాయం 28 అవి ఉరుములా, మనుషుల ఊసులా? నాకు తిరిగి స్పృహ వచ్చిన తరువాత ముఖం అంతా కన్నీటితో తడిసి వుంది. అలా స్పృహ లేకుండా ఎంత సేపు పడి వున్నానో తెలీదు. సమయం తెలుసుకోడానికి కూడా ఏ ఆధారమూ లేదు. ఇంత దారుణమైన ఒంటరితనం ఈ లోకంలో మరెక్కడా ఉండదేమో? ఇంత దారుణమైన పరిచ్యుతిని ఈ లోకంలో మరెవ్వరూ అనుభవించి వుండరేమో? ఇందాక కింద పడ్డప్పుడు తగిలిన దెబ్బ వల్ల చాలా రక్తం పోయింది. నా మీదుగా నెత్తురు ప్రవహించడం గుర్తు. అసలు ఇప్పటికే చచ్చిపోయి వుంటే ఎంతో సంతోషంగా వుండేది! ఇక ఏమీ ఆలోచించే స్థితిలో లేను. లోనుండి తన్నుకొస్తున్న ఆవేదనలో ఆలోచనలన్నీ...
రచన - రసజ్ఞ మెండెల్ తన ప్రయోగాల మరియు సంభావ్యతల ఆధారంగా ప్రతిపాదించిన సిద్ధాంతాలు సరయినవే అని ఋజువు చేయబడ్డాయి కనుక సంప్రదాయ జన్యుశాస్త్రంలోని మొదటి శాఖ అయిన Mendelian Genetics పూర్తయ్యింది. తరువాత వచ్చే ప్రతీ శాఖనూ అర్థం చేసుకుందుకు మెండెల్ ప్రయోగాలు బాగా ఉపయోగపడతాయి. అనువంశికత అధిక శాతం మెండెల్ చెప్పినట్టుగానే ఉన్నా, కొన్ని సందర్భాలలో మాత్రం వైవిధ్యంగా ఉంటోంది. దీనికి కారణం ఏమిటి? మెండెల్ చేసినవి తప్పా? లేక వేరే ఏమయినా కారణాలు ఉన్నాయా?...

“దారులన్నీ మూసుకున్నాయి”

Posted by V Srinivasa Chakravarthy Tuesday, December 25, 2012 1 comments
సందేహం ఏవుంది? పైకే వెళ్లాలి. ఎక్కడైతే దారి తప్పానో ఆ చోటికి వేగంగా చేరుకోవాలి. ప్రవాహం ఎక్కడుంతో తెలుసుకుంటే దాని సహాయంతో మళ్లీ స్నెఫెల్ పర్వతపు నోటి వద్దకు చేరుకోవచ్చు. ఈ ఆలోచన ఇంతకు ముందే ఎందుకు రాలేదబ్బా? తిరిగి హన్స్ బాక్ ప్రవాహం ఎక్కడుందో పట్టుకోవడమే నా తక్షణ కర్తవ్యం. వడిగా అడుగులేస్తూ ముందుకి సాగాను. వాలు కాస్త ఎక్కువగా ఉండడంతో నడక కాస్త కష్టమయ్యింది. పెద్దగా ఆశ లేకపోయినా మనసులో సందేహం మాత్రం లేదు. ఒక అరగంట పాటు ఏ అవరోధమూ ఎదుట పడలేదు. సొరంగంలో శిలల ఆకారాల బట్టి, చీలికల విన్యాసాల బట్టి దారిని పోల్చుకోడానికి...

వైరస్ పరిమాణం ఎంత?

Posted by V Srinivasa Chakravarthy Friday, December 21, 2012 0 comments
వైరస్ పరిమాణం ఎంత? ఆ విధంగా పాశ్చర్ తదితరుల ప్రయాసల వల్ల కొన్ని వైరల్ వ్యాధుల మీద తొలి విజయాలు సాధ్యమయ్యాయి. వైరల్ వ్యాధి సోకిన రోగి నుండి తీసుకున్న ద్రవాన్ని తగు రీతిలో “క్షీణపరిచి” దాన్ని తిరిగి మరో రోగిలోకి ఎక్కిస్తే, రోగిలో ఆ వ్యాధి పట్ల రోగనిరోధకత ఏర్పడి, రోగి నయం కావడం జరిగింది. కాని ఈ రకమైన చికిత్స ఎందుకు పని చేస్తోందో, ఎలా పని చేస్తోందో ఆ రోజుల్లో ససేమిరా అవగాహన ఉండేది కాదు. ఎందుకంటే వైరల్ వ్యాధులని కలుగజేస్తున్న “క్రిమి” యొక్క...

“By Studying the Masters” - గణిత వ్యాసం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, December 18, 2012 3 comments
“By Studying the Masters” రచన – “తార” When asked how he developed his mathematical abilities so rapidly, Abel replied "by studying the masters, not their pupils." (Niels Henrik Abel) గతవారం ఒక ప్రఖ్యాత తెలుగు సైన్సు రచయిత, మూఢనమ్మకాలని తరిమెయ్యడానికి ఒక "విజ్ఞాన వేదిక" ఉన్న ఒకరి "వైజ్ఞానిక విధానం" అంటే ఏమిటి అని రాసిన ఒక వ్యాసం దురదృష్టవశాత్తూ చదవటం జరిగింది, మూఢనమ్మకాలని పారద్రోలుతాను అనే వ్యక్తే ఇంత మూఢంగా సైన్సు గురించి...

చిమ్మ చీకట్లో చిన్ని ఆశ

Posted by V Srinivasa Chakravarthy Sunday, December 16, 2012 1 comments
అధ్యాయం 27 చిమ్మ చీకట్లో చిన్ని ఆశ నా ఆవేదన వర్ణించడానికి నాకైతే మాటలు చాలవు. సజీవంగా భూస్థాపితం అయినట్టు అనిపిస్తోంది. ఆకలి దప్పులతో ఈ చీకటి లోతుల్లో సమసిపోవడం ఖాయం. యాంత్రికంగా ఓ సారి చేత్తో నేల తడిమాను. కింద శిల అతి కఠినంగా అనిపించింది. ప్రవాహం నుండి అలా ఎలా దూరమయ్యాను? నాకు తోడుగా ఆ ప్రవాహం లేకపోవడం భరించరాని యాతనగా వుంది. ఇప్పుడు గుర్తొచ్చింది. పొరబాటు ఎక్కడ జరిగిందో అర్థమయ్యింది. ఇందాక నేను కుడి పక్క దారి తీసుకున్నప్పుడు ప్రవాహపు శబ్దం లేకపోవడం అప్పుడు గమనించలేదు. ఆ సమయంలో నేనొక దారి తీసుకుంటే, హన్స్ బాక్ ప్రవాహం...

దారి చూపని గోదారి

Posted by V Srinivasa Chakravarthy Thursday, December 13, 2012 0 comments
అధ్యాయం 26 దారి చూపని గోదారి ఇంతవరకు మా యాత్ర సాఫీగా గడిచిందనే చెప్పాలి. మరీ భరించరానంత ఇదిగా ఏమీ లేదు. ఇలాగే సాగితే మా గమ్యాన్ని చేరుకుంటామేమో కూడా. అదే గనక జరిగితే ఎలాంటి వైజ్ఞానిక శిఖరాలని చేరుకుంటామో? తర్కంలో, వాదనాపటిమలో నేనూ ఓ బాల లిండెన్ బ్రాక్ గా మారిపోతున్నాను. గమ్యం చేరేవరకు ఇలాగే ఉంటానో లేదో మరి తెలీదు. అలా కొన్ని రోజులు ప్రయాణించాము. ఎన్నో వాలు తలాలని దాటాము. కొన్ని సార్లు ఆ వాలు నిలువుగా లోతుల్లోకి చొచ్చుకుపోతోంది. క్రమంగా భూగర్భపు లోతుల్లోకి చొచ్చుపోయాము. కొన్ని రోజులు అయితే ఒక్క రోజులో కోసున్నర లోతుకి పోయాం,...

మామయ్య పిడివాదం, అల్లుడి ఖేదం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, December 11, 2012 0 comments
నా తర్కానికి మామయ్య నుండి ఏ సమాధానమూ రాలేదు. నేను నా వాదాన్ని ఇంకా పొడిగించాను. “మరో విషయం ఏంటంటే పదహారు కోసుల లోతు చేరడానికి నేలకి సమాంతరంగా ఎనభై ఐదు కోసులు ప్రయాణించాల్సి వచ్చింది. అంటే భూమి కేంద్రాన్ని చేరాలంటే దక్షిణ-తూర్పు దిశలో ఎనిమిది వేల మైళ్ల దూరం ప్రయాణించాలి. కాని అలా చేస్తే భూమి కేంద్రాన్ని చేరకుండా ఉపరితలం మీద ఏదో బిందువు వద్దకి చేరుకుంటాం.” “నీ వాదన అంతా అయోమయంగా వుంది. నీ లెక్కలన్నీ తప్పుల తడకలు,” కోపంగా అన్నాడు మామయ్య. “అసలు నీ వాదనకి ఆధారం అంటూ ఏవైనా వుందా? ఈ మార్గం సూటిగా మన గమ్యానికి చేర్చదని నమ్మకం ఏంటి?...
రోగకారక క్రిమిని క్షీణింపజేసి రోగి లోకి ఎక్కించినప్పుడు, రోగి శరీరంలో ఆ క్రిమినుండి ఆత్మరక్షణ ఏర్పడుతుందన్న చికిత్సా విధానాన్ని అవలంబిస్తూ ఫ్రాన్స్ లో లూయీ పాశ్చర్ కొన్ని అంటువ్యాధులకి విరుగుళ్ళ కోసం అన్వేషణ సాగించాడు. పాశ్చర్ మొట్టమొదట చికెన్ కలరా (chicken cholera) అనే వ్యాధి మీద ధ్వజం ఎత్తాడు. (దీన్ని కలుగజేసే క్రిమి పాశ్చరెల్లా మల్టోసిడా (Pasteurella Multocida) అనే ఒక రకం బాక్టీరియా. అయితే క్రిమి గురించి, దాని లక్షణాల గురించి...
రచన - రసజ్ఞ జన్యురూపంలో రెండు ఒకే రకమయిన (అంతర్గత/బహిర్గత) లక్షణాలు ఉంటే సమయుగ్మజాలనీ (Homozygous, Ex: RR/rr), రెండు విభిన్నమయిన (ఒకటి బహిర్గతం, ఒకటి అంతర్గతం) లక్షణాలు ఉంటే విషమయుగ్మజాలనీ (Heterozygous, Ex: Rr) చెప్పాడు. సంయోగ బీజాల కలయిక స్వతంత్ర్యంగా జరిగినందున ఏక సంకర సంకరణం చేసినప్పుడు F2లో 4 మొక్కలోస్తే, ద్వి సంకర సంకరణం చేసినప్పుడు 42 = 16 మొక్కలు వచ్చాయి. ఈ 16లో: దృశ్యరూప నిష్పత్తి (Phenotypic ratio) ప్రకారం తీసుకుంటే - 9 (గుండ్రం, పసుపు - రెండూ బహిర్గత లక్షణాలు) : 3 (గుండ్రం, ఆకుపచ్చ - మొదటిది బహిర్గతం, రెండవది...

ద్వి సంకర సంకరణం (Dihybrid cross):

Posted by V Srinivasa Chakravarthy Tuesday, December 4, 2012 0 comments
ఇంతవరకు మెండెల్ ఒకే లక్షణం కింది తరాలకి ఎలా సంక్రమిస్తుందో పరిశీలించాడు. ఒక్కో లక్షణానికి రెండు రూపాంతరాలు ఉంటాయి. (ఉదాహరణకి కాయరంగు అనే లక్షణానికి రెండు రూపాంతరాలు – పసుపు, ఆకుపచ్చ. ) ఒకే లక్షణం యొక్క రెండు రూపాంతరాలని కలుగజేస్తూ రెండు “అనువంశిక కారకాలు” (inheritable factors) ఉంటాయని గుర్తించాడు. (ఆ “అనువంశిక కారకాల”నే ఆధునిక పరిభాషలో మనం జన్యువులు (genes) అంటాము. ఒకే లక్షణం యొక్క రెండు రూపాంతరాలకి కారణామైన రెండు జన్యువులని ఇప్పుడు యుగ్మవికల్పాలు(...

ఎంత దూరం? ఇంకెంత దూరం?

Posted by V Srinivasa Chakravarthy Thursday, November 29, 2012 4 comments
అధ్యాయం 25 ఎంత దూరం? ఇంకెంత దూరం? మర్నాడు తెల్లారే లేచి పరుగు పెట్టాల్సిన పని లేదని తెలియడం వల్ల కాస్త ఆలస్యంగా లేచాను. మనిషికి తెలిసిన అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్నా ఈ పరిసరాలలో ఏదో కొత్త అందం కనిపిస్తోంది. పైగా ఈ గుహాంతర వాసానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను. ఇక సూర్య, చంద్ర, తారల గురించి చెట్లు చేమల గురించి, ఇళ్ళ గురించి ఊళ్ల గురించి ఆలోచించడం మానేశాను. భూమి ఉపరితలం మీద జీవించే మానవమాత్రుల తాపత్రయాలేవీ ఇప్పుడు నా మనసుని తాకడం లేదు. మేం వున్న సొరంగం ఓ విశాలమైన చీకటి మందిరం. దాని గ్రానైట్ నేల మీద మా అంతర్వాహిని...
రచన - రసజ్ఞ మెండెల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలని సంభావ్యత (Probability) ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంభావ్యత అంటే అందరికీ తెలిసే ఉంటుంది, అయినా మరొక్కసారి చెప్పుకుందాం. ఒక ఘటన (event) జరగడాన్ని, లేదా జరగకపోవడాన్ని సంభావ్యత అంటారు. మరో విధంగా చెప్పాలంటే వాస్తవంలో జరిగిన ఘటనలకి, జరిగే అవకాశం వున్న మొత్తం ఘటనలకి మధ్య గల నిష్పత్తిని సంభావ్యత అంటారు. ఉదాహరణకి ఒక నాణేన్నే తెసుకుంటే దానికి బొమ్మ, బొరుసు ఉంటాయి. ఇప్పుడు ఒక నాణెము పదిసార్లు...
కౌ పాక్స్ సోకిన వ్యక్తికి స్మాల్ పాక్స్ నుండి కూడా రోగనిరోధకత కలుగుతుందని గ్లౌసెస్టర్ లో ఓ నమ్మకం చలామణిలో ఉండేది. దానికి అంతోఇంతో ఆధారాలు కూడా లేకపోలేదు. గొల్లస్త్రీలకి గోవులతో సాన్నిహిత్యం వల్ల సులభంగా కౌపాక్స్ సోకుతుంది. కాని వారికి స్మాల్ పాక్స్ సోకినా వారికి అందరిలాగా ముఖం మీద స్ఫోటకపు మచ్చలు రావు. అదే ఊళ్లో ఉండే ఎడ్వర్డ్ జెన్నర్ (1749 – 1823) అనే ఓ వైద్యుడికి ఆ నమ్మకం ఆసక్తి కలిగించింది. అదేంటో పరీక్షించి తేల్చుకోవాలని అనుకున్నాడు....

మెండెల్ ప్రయోగాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, November 18, 2012 3 comments
మెండెల్ మొట్టమొదటగా 34 రకాల బఠానీలను ఎన్నుకుని ఆయన మఠంలోని తోటలో 2 సంవత్సరాలు (ఇవి ఏక వార్షికాలు అని చెప్పుకున్నాం కనుక రెండు తరాలు) పెంచి, వానిలో 22 రకాలను ఎన్నుకున్నారు. ఎన్నుకొన్న రకాలలో కృత్రిమ పరాగ సంపర్కము (artificial pollination) జరపటం ద్వారా శుద్ధ వంశ క్రమాలను (pure lines*) తయారుచేశారు. వీటి నుండి ఏడు లక్షణాలను ఎన్నుకొన్నారు. ఆ ఏడు లక్షణాలకు 7 జతల యుగ్మ వికల్పాలు (Alleles*) ఉన్నాయి. అవి: లక్షణము                                          ...
ప్రతీ పావుగంటకి ఓ సారి ఆగి విశ్రాంతి తీసుకుని ముందు సాగాల్సి వస్తోంది. ఓ బండ మీద కూర్చుని, ఏదో ఇంత తిని, పక్కనే ప్రవహించే స్రవంతి లోంచి గుక్కెడు నీరు తాగి మళ్లీ బయల్దేరాము. ఈ ‘దోషం’ యొక్క వాలు మీదుగా మేం పేరు పెట్టిన హన్స్ బాక్ స్రవంతి ప్రవహిస్తోంది. కొంత భాగం పక్కలలోకి ప్రవహించడం వల్ల కొంత నీరు నష్టమవుతోంది. కాని తగినంత నీరు మాకా వస్తోంది, మా దప్పిక తీర్చుకోడానికి సరిపోతోంది. వాలు తక్కువైతే ప్రశాంతంగా ప్రవహిస్తోంది. వాలు పెరిగితే దూకుడు పెరిగి విజృంభిస్తోంది. అలాంటప్పుడు దాని ధోరణి చూస్తే అసహనంగా, ఉద్వేగంగా అనుక్షణం కంపించే...

మెండెల్ జీవిత కథ

Posted by V Srinivasa Chakravarthy Tuesday, November 13, 2012 2 comments
రచన - రసజ్ఞ విజ్ఞానం సాగరంలా అనంతమయినది. అలాగే అనువంశికత, జన్యు వైవిధ్యాల విధానాలు కూడా అనంతం కనుక వాటి గురించి తెలుసుకోవడానికి, మనకి అర్థమవటానికి వీలుగా మూడు ప్రధాన శాఖలుగా, ఒక్కో శాఖనీ మరికొన్ని ఉపశాఖలుగా విభజించారు. దీని వలన అధ్యయనం సులువయ్యింది. ఒక్కోదాని గురించీ వివరంగా తెలుసుకుందాం. 1. సాంప్రదాయ జన్యుశాస్త్రం (Classical Genetics):- ఇది మొట్టమొదటి శాఖ. జన్యువులు అదే విధంగా కానీ, చిన్న చిన్న మార్పులతో కానీ తరువాతి తరానికి వెళతాయి...
postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

  • Total Posts: 1105
  • Total Comments: 1564
Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts