స్వయం సిక్షణా పద్ధతి
గ్లెండా బిసెక్స్ అనే ఆవిడ ‘Gnys at work’ అనే ఓ చక్కని పుస్తకం రాసింది.
(http://www.amazon.in/Gnys-Wrk-Child-Learns-Write/dp/0674354907)
తన కొడుకు పాల్ తనకు
తానుగా చదవడం ఎలా నేర్చుకున్నదీ ఆ పుస్తకంలో వివరించింది. మొదట్లో తనే చిన్న చిన్న
వాక్యాలు కూర్చుకుని మెల్లగా వాక్య నిర్మాణాన్ని
మెరుగుపరుస్తూ క్రమంగా పెద్దలు రాసేలాంటి చక్కని భాష రాయగలిగాడు. Gnys at
work మరో ముఖ్యమైన విషయాన్ని కూడా తెలియజేస్తుంది.
పిల్లలని అర్థం చేసుకుని వాళ్లని విశ్వసించే టిచర్లు ఎలా పని చేస్తారో చెప్తుంది. పిల్లలు
ఏం నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో ముందే నిర్ణయించక, దేన్ని నేర్చుకోడానికి అయితే
పిల్లలు ముందుగానే కృషి చేస్తున్నారో ఆ దారిలోనే వాళ్లని ప్రోత్సహించే వివేకం గల టీచర్లు ఎలా నడుచుకుంటారో
ఆ పుస్తకంలో వుంది. విద్యావ్యవస్థని మార్చడానికి కృషి చేస్తున్న టీచర్లకి, తల్లిదండ్రులకి
కూడా ఈ పుస్తకం మంచి ప్రేరణని, స్ఫూర్తిని ఇస్తుంది.
గ్లెండా కొడుకు పాల్ ఐదేళ్లప్పటి నుండే రాయడం మొదలుపెట్టాడు.
ఒకసారి వాళ్లమ్మ ఇంటికొచ్చిన అతిథులతో మాట్లాడుతూ హడావుడిగా వుంది. పిల్లవాడు ఆవిణ్ణి
ఏదో అడగాలని ఒకటి రెండు సార్లు ప్రయత్నించాడు. ఆవిడ పట్టించుకోలేదు. దాంతో విసిగిపోయిన
ఆ పిల్లవాడు ఓ చిన్నకాగితం మీద “RUDF” అని
రాసి వాళ్లమ్మ చేతిలో పెట్టాడు. వాళ్లమ్మ ఆ సందేశాన్ని అర్థం చేసుకుంది. RUDF అంటే “Are you deaf?” (నీకేమైనా చెముడా?) అని అర్థం.
వెంటనే కొడుకు ప్రతిభని గుర్తించింది. అప్పట్నుంచి
వాడి శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలెట్టింది.
పిల్లవాడు మెల్లమెల్లగా ఇంగ్లీష్ భాషా జ్ఞానాన్ని పెంచుకోసాగాడు.
కొడుకు ఏఏ పద్ధతుల్లో పురోగమిస్తున్నాడో, ఎలాంటి అడుగులలో ముందుకు నడుస్తున్నాడో అంతా
ఆ తల్లి నిశితంగా గమనించి తన పరిశీలనా ఫలితాలని శ్రద్ధగా గ్రంథస్తం చెయ్యడం మొదలెట్టింది.
“ఇంకా పసివాడైన నా కొడుకు పురోగతి గురించి నోట్‍సు తీసుకుంటున్నప్పుడు అదంతా తరువాత పరిశోధనగా రూపొందుతుందని
నేను అనుకోలేదు. నాకు ముఖ్యమైన సంగతులని పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. పాల్ పదాల
స్పెలింగ్ నేర్చుకునేటప్పుడు నేను ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గమనించాను. నాకు తరువాత
తెలిసింది. చార్లెస్ రీడ్ పిల్లల మీద పరిశోధనలు చేసి, పిల్లలకి పరిష్కార మార్గం తెలీనప్పుడు
వాళ్లంతకు వాళ్లే కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటారు, అని గమనించాడు. పాల్ విషయంలో
కూడా ఆ ఒరవడినే గమనిస్తున్నాను.
“ఈ విధంగా ఓ పిల్లవాడి విద్యాజీవనం మొత్తాన్ని, విద్యానుభవం
మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరంగా రాయడం అనేది తల్లిని గనుక, ఎప్పుడూ పిల్లవాడి
దగ్గరే ఉంటాను గనుక నాకు వీలయ్యింది గాని అది మరొకరికి సాధ్యం కాని పని.”
(ఇంకా వుంది)
0 comments