శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

పాతాళానికి ప్రయాణం - 10 వ భాగం

Posted by V Srinivasa Chakravarthy Saturday, July 11, 2009
"బావుంది," చదవుకుండానే అన్నారు ప్రొఫెసర్."ఇప్పుడా పదాలని మళ్లీ అడ్డుగా రాయి."

ఈ సారి ఆయన చెప్పినట్టు చేస్తే వచ్చిన ఫలితం ఇది.

Iyloau lolwrb ou,nGe vwmdrn eeyea!


"అద్భుతం" కాగితాన్ని నా చేతిలోంచి లాక్కుంటూ అన్నాడు మామయ్య. "ఇది సరిగ్గా ఏదో ప్రచీన రచన లాగానే ఉంది. అచ్చులు, హల్లులు చిందర వందర అయ్యాయి. కామాలు కూడా ఇష్టం వచ్చిన చోట ఉన్నాయి. అచ్చం సాక్నుస్సేం పత్రంలో లాగానే ఉన్నాయి."

ఆయన పరిశీలినలలోని ప్రతిభకి అబ్బురపోయాను.

"ఇప్పుడు," నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు మామయ్య, "నువ్వు రాసిన ఆ అజ్ఞాత వాక్యాన్ని చదవాలి అంటే, ముందు ప్రతీ పదం లోను మొదటి అక్షరాలు తీసుకోవాలి, తరువాత రెండవ అక్షరాలు తీసుకోవాలి... అలా వచ్చిన క్రమంలో అక్షరాలని పేర్చాలి.

అలా కూర్చగా వచ్చిన వాక్యాన్ని చూసి మామయ్య, ఆయన్ని చూసి నేను, ఇద్దరం నిర్ఘాంతపోయాం.


"I love you well, my own dear Gräuben!"
(నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను, నా బంగారు గ్రౌబెన్)

"అమ్మ నాయనోయ్!" మామయ్య రంకె వేశాడు.

ఓ బలహీన క్షణంలో ఆ వాక్యం రాసి మామయ్య చేతిలో శుభ్రంగా పట్టుబడిపోయాను.


"అయితే గ్రౌబెన్ ని ప్రేమిస్తున్నావు అన్నమాట!" సూటిగా అడిగాడు.

"అవును...లేదు" తత్తర పడుతూ అన్నాను.

"సరే. గ్రౌబెన్ ని ప్రేమిస్తున్నావనే అనుకుందాం. ఇందాక మనం అనుకున్న ప్రక్రియని ఆ రహస్య సందేషం మీద ప్రయోగిస్తే..." మామయ్య ఆలోచనలు అంతలోనే ఎటో వెళ్లిపోయాయి.

నేను అన్న అంత ముఖ్యమైన మాటలని మర్చిపోయి, అంతలోనే ఎటో వెళ్లిపోయాడు మామయ్య.
నాకు బుద్ధి తక్కువై ఏదో ఇలా బయట పడ్డాను గాని, అలాంటి గొప్ప వాళ్ల మనసుల్లో ప్రేమ కలాపాలకి, సరస సల్లాపాలకి స్థానం ఎక్కడ ఉంటుంది? ఆయన మనసు అంతలోనే రహస్య పత్రం మీదకి మళ్లింది. నేను బతికిపోయాను.

ఇక చరమ ప్రయోగం చేసే సమయం వచ్చేసరికి మామయ్య కళ్లలో ఏదో కొత్త మెరుపు మెరిసింది. ఆ మెరుపు కళ్లజోడు లోంచి కూడా బయటికి కనిపించింది. ఓం ప్రధమంగా కొంచెం దగ్గాడు. ముఖం గంభీరంగా మారింది. అప్పుడు ఒక్కొక్క పదంలోను ముందు మొదటి అక్షరాన్ని, తరువాత రెండవ అక్షరాన్ని ఇలా వరుసగా ఏరి బయటికి ఇలా చదవసాగాడు.


mmessvnkaSenrA.icefdoK.segnittamvrtn ecertserrette,rotaisadva,ednecsedsadne lacartniiilvIsiratracSarbmvtabiledmek meretarcsilvcoIsleffenSnI.


వాక్యం చివరికి వచ్చేసరికి ఇక ఉద్వేగం పట్టలేక పోయాను. నాకైతే ఆ వాక్యానికి తలా తోకా లేదని అనిపించింది. కనుక ఆ రహస్య వాక్యానికి అడుగున ఉన్న లాటిన్ సందేశాన్ని మా ప్రొఫెసర్ గారు బిగ్గరగా చదివితే విందామని ఎదురుచూస్తూ ఉండిపోయాను.

"ఈ వాక్యానికి తలా తోకా లేదు," నిట్టూరుస్తూ అన్నాడు మామయ్య.

అలా అనడం తోటే కుర్చీ లోంచి దిగ్గున లేచి, మెట్ల మీంచి చెంగున దూకి, కోనిగ్స్ స్ట్రాసే లోకి, అక్కణ్ణుంచి చీకట్లోకి, రివ్వున దూసుకుపోయాడు.

(అధ్యాయం 3 సమాప్తం)

6 comments

  1. గురువు గారు., ఎప్పుడో 9వ తరగతిలో(1997) ఉన్నప్పుడు చదివిన కధ ఇది. మళ్ళీ ఇన్ని రోజులకు చదవటం బాగుంది. కాని ... టైటిల్ పేరు... " భూగర్భం లోకి ప్రయాణం' కదా... పాతాళంలోకి అని పెట్టారేంటి. ???

     
  2. కానీ ఆపకండి... రోజు ...చూస్తుంటా... ఈ కధ కోసం...

     
  3. భూగర్భం అంటే భూమి యొక్క అంతర్భాగం అన్న అర్థం మాత్రమే వస్తుంది. పాతాళం అంటే భూమి లోపల ఉన్న మరో లోకం అన్న అర్థం వస్తుంది. నిజంగానే ఈ కథలో పాత్రలు భూమిలో మరో సజీవ లోకాన్ని కనుక్కుంటారు. మీరు 9 వ క్లాసులో చదివిన అనువాదం పేరు "భూగర్భ యాత్ర." ఇది మరో అనువాదం.

     
  4. keep rocking....

     
  5. good explanation on title

     
  6. Raju Sykam Says:
  7. hmmmmm..... whatever be the title. Story is ultimate.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts