శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

65 ని 95 చెయ్యటానికి 10 లో 1:

Posted by V Srinivasa Chakravarthy Tuesday, July 7, 2009
నేడు అంతర్జాలం మీద మనమంతా ఎంతగా ఆధారపడి బతుకుతున్నామో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శాస్త్రీయ, సాంకేతిక, విద్యా, పరిశోధనా రంగాల్లో అంతర్జాలం లేనిదే రోజు గడవని రోజులివి.
కాని అంతర్జాలాన్ని ఉపయోగించుకోవడానికి భాష అనే మాధ్యమం కీలకం అవుతోంది. అంతర్జాలంలో తెలుగు సమాచారం ఇంకా శైశవ దశలో ఉన్నట్టు కనిపిస్తోంది.

కాదంటారా? అవును తెలుగులో అంతర్జాలంలో చాలా విషయాలే ఉన్నాయి. కాని అందులో చాల మటుకు కల్తీ లేని చెత్త. తెలుగు సినిమా కబుర్లు (ఇది వట్టి కాలయాపన), సినిమా విమర్శలు (ఇది మరీను), సినిమా విశ్లేషణలు (ఇవిక చెప్పనక్కర్లేదు), సినిమా పాటలు, పాటల సాహిత్యం, సినిమా వీడియో డౌన్లోడ్స్ - ఇది అంతూ పొంతూ లేని సినిమా భాగోతం. ఇక పోతే రాజకీయాలు, వార్తలు. ఇంకా చిన్న కథలు, చిట్టి కథలు, చిన్నా చితకా కథలు (కథలంటే తెలుగు వాళ్లకి వల్లమాలిన ప్రేమ. ఎందుకంటే కథలైతే రాయటానికి, చదవటానికి కూడా ఎక్కువ శ్రమ అవసరం లేదు. బద్ధకస్థులకి సదుపాయంగా ఉంటుంది. పుస్తకం రాయాలంటే శ్రమగానీ...). ఈ కథల పొదల మాటున ఓ పిడికెడు నవలా పీడీయెఫ్ లు. ఇవన్నీ కాక వ్యక్తిగత సమాచార సముద్రం: "నా ఫోటో, మా చెల్లి ఫోటో, మా స్నేహితుల ఫోటోలు, మా టామీ ఫోటో, తిరుపతి గుళ్లలో(తో) మా ఫోటోలు, నాకు నచ్చిన సినిమా, నేను సేకరించిన వాటిలో కెల్లా నాకు బాగా నచ్చిన స్టాంప్ ఫోటో..." ఈ బాపతు సమాచారం. ఈ హో(బో)రులో విజ్ఞానం మాట మనకెక్కడ వినిపిస్తోంది?

కనుక తెలుగులో అంతర్జాలంలో వైజ్ఞానిక సమాచారాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఏకీభవించే వాళ్లంతా ఏకమై క్రమబద్ధంగా, వ్యూహాత్మకంగా అలాంటి సమాచారాన్ని పోషించాలి.

"చలి చీమల చేత చిక్కి..." అన్న పద్యంలోలా, చిన్న చిన్న ప్రయత్నాలే కలిసి కలిసి ఓ బృహత్ ఫలితానికి దారితీస్తాయి.

కొన్ని సులభమైన మార్గాలు:

1) తెలుగులో పాత శాస్త్రీయ పుస్తకాలు, ప్రింట్ లో లేనివి ఏవైనా ఉంటే, కాపీరైట్ సమస్యలు లేకపోతే, వాటిని స్కాన్ చేసి అంతర్జాలంలో పెట్టడం. లేదా అందులో ముఖ్యమైన అంశాలే టైప్ చేసి పెట్టొచ్చు.

2) శాస్త్ర రంగాల్లో ప్రవేశం ఉన్న వాళ్ళు ప్రత్యేక అంశాల మీద సొంత బ్లాగ్ లు ప్రారంభించవచ్చు. అలాంటి బ్లాగ్లు అన్నీ ఒక చోట అగ్రిగేట్ చేస్తే అదే గొప్ప సమాచారం అవుతుంది.

3) మరో మెట్టు పైకెక్కి ప్రత్యేక శాస్త్ర రంగాల్లో పిల్లల కోసం వెబ్ సైట్లు ఆరంభించవచ్చు. ఇంగ్లీష్ లో అలాంటివి కోకొల్లలు. మచ్చుకి కొన్ని:

Neuroscience for kids: http://faculty.washington.edu/chudler/neurok.html
Physics for kids: http://www.physics4kids.com/
Geography for kids: http://www.geography4kids.com/
Biology for kids: http://www.biology4kids.com/
Chemistry for kids: http://www.chem4kids.com/
Excellent source for children's activities: http://www.enchantedlearning.com/Home.html


ఇలాంటి సైట్లని అనుమతి తీసుకుని అనువదించినా చాలు ఎంతో మందికి ఉపయోగపడుతుంది.

4) తెలుగులో మన అదృష్టం బావుండి "డిస్కవరీ" అని ఓ చక్కని వైజ్ఞానిక పత్రిక వెలువడుతోంది. సైంటిఫిక్ అమెరికన్ కి దీటైన పత్రిక తెలుగులో ఉండాలన్న గొప్ప లక్ష్యంతో, దూరదృష్టితో ఈ పత్రిక సంపాదకుడు శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ పత్రిక ఇప్పుడు ఇంగ్లీష్ లోను, మరి కొన్ని భారతీయ భాషల్లోను కూడా వెలువడుతోంది. అయితే తెలుగులో ఓ వైజ్ఞానిక వెబ్ జైన్ ప్రారంభిస్తే బావుంటుందని నా అభిప్రాయం. "ఈమాట" అన్న వెబ్ జైన్ చాలా విజయవంతంగా నడుస్తోంది. అలాంటి వెబ్ జైన్ సైన్స్ లో కూడా ఉంటే బావుంటుందేమో.

(సశేషం... )

9 comments

  1. మీరు చెప్పిన విషయాలు మనం తప్పక ఆచరించాల్సినవే. ఐతే అందుకు మీరు ఇతరబ్లాగులను తప్పుపట్టటాం సబబు కాదు. బ్లాగును మొదలుపెట్టే వారిలో ఒక్కక్కరికి ఒక్కొక్క కారణం. నాకు ప్రస్తుతం పనిచేసే ప్రాంతంలో ఉండే ఒంటరి తనాన్ని పోగొట్టుకొనెందుకు రాసుకొంటున్నాను. మరొకరు వాళ్లకు ఇష్టమైన ప్రవృత్తికి సంబంధించిన విషయ్యలపై రాసుకొంటారు. అందుకు కారణం వారి అభిరుచికి సరిపోయే వారెవరైనా దొరికితే మరిన్నివిషయాలపై విశ్లేషించటమో లెక కొత్త విషయాలను తెసుకోవటమో జరుగుతుంది. ఉదయంనుంచి పని ఒత్తిడిలో అలిసిపోయే వాళ్లకి కొంతసేదదీరే మార్గాన్ని వెతుక్కోవటం తప్పుకాదు. పైగా సమాజానికి విజ్ఞనం ఎంత అవసరమో కళలుకూడ అంతే అవసరం. ఎవరి ఇష్టంవచ్చిన భావాలను వారు ఇతరుల మనసులను ఇబ్బంది పెట్టనంతవరకు తెలుపుకొనెందుకే ఇలాంటి వాటిని ఉండేది. మీరు ఈబ్లాగులో చెప్పినకొన్ని అంశాలను ఇప్పటికే కొంతమంది ప్రారంభించారు. ఐతే అది ఇంకా ఎంతొ ఎదగాలి. మీ టపా చదివి ఇందులో మరింత మంది భాగస్వాములు అవుతారు అని అశిస్తున్నాను.

     
  2. తప్పకుండా చెయ్యొచ్చు. మీరు ఒక ప్రణాళికని ప్రకటించి వాలంటీర్లని ఆహ్వానించండి. ఆసక్తి ఉన్నవారు తప్పక చేరుతారు. తెలుగు వికీపీడియా ఇలా మొదలైనదే! మీకు ఏదన్నా ఆంగ్లం నించి తెలుగు తర్జుమా కావాలంటే నన్ను అడగండి, చేతనైన సహాయం చెయ్యగలను.

     
  3. మీరీ బ్లాగుపేజీలో ప్రదర్శించిన అసిమోవ్ పుస్తకాల్ని తర్జుమా చేసిన శ్రీనివాస చక్రవర్తి గారు ఎవరు? వారి వివరాలు తెలిస్తే చెప్పగలరు.

     
  4. ఈ బ్లాగులు రాస్తున్న schakra యే అసిమోవ్ పుస్తకాలు అనువదించిన శ్రీనివాస చక్రవర్తి :-)

     
  5. కొత్త పాళీ గారు, తెలుగులో శాస్త్రీయ అనువాదాలు చెయ్యడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. మీ ఈమెయిల్ ఐడి తెలుపండి. మిమ్మల్ని ప్రత్యేకంగా కాంటాక్ట్ చేస్తాను.

     
  6. శ్రీనివాసు గారు,
    మీ ఆలోచన బాగుంది. అందరు కలసి రావాలి దీనికి. మీరు కూడా అందరిని కలుపుకుని పోయేటట్లు గా కొంచెం ప్రేరేపించండి, ఇది జరుగుతుంది. కాని ఒకటి మీరు మర్చిపోతున్నారు. ఈ విద్య విప్లవం రావాలంటే మనం తెలుగులో బ్లాగ్ లు రాసి, సమాచారం పెడితే చాలదు, శారీరక శ్రమ చేయ్ప్పలి. అంటే చదువుకున్న అందరు గురువు అవతారం ఎత్తాలి. ప్రతి ఒక్కరు ఇద్దర్ని చడువుకునేట్లు చెయ్యాలి, లేదా ఒక సంఘటిత ప్రణాళిక అమలు చెయ్యాలి. మీరు దీఇనికి పెద్దరికం వహించండి అందరు మీకు తోడు అవుతారు. కొత్తపాళీ గారు, వీవెన్ గారు, సత్య గారు, శ్రీధర్ గారు, చదువరి గారు ఏదో ఒక రకమైన భాద్యతలను ఐచ్చికంగా తలకెత్తుకున్న వాళ్ళే.

     
  7. చంద్ర గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఊరికే వెబ్ కంటెంట్ తయారు చేస్తే సరిపోదు. దాన్ని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాలి. దాని గురించి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ ధారావాహికంగా రాద్దామని అనకున్నాను. మధ్యలో ఆ త్రెడ్ తెగిపోయింది.
    అందరం కలిసి తప్పకుండా ఏమైనా చేద్దాం.

    అవునూ, సైన్స్ పాపులరైజేషన్ లో ఎంతో కృషి చేసిన నండూరి రామమోహన రావు గారు మీకేమైనా బంధువా?

     
  8. Anonymous Says:
  9. Srinivas chakravarti gaaru,
    mIru MBBS doctor lEka Ph.D.naa? Can you tell about your self.

     
  10. Hari Sri Says:
  11. Srinivasa Chakravarthi garu IITMadras lo Professor.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts