శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

సాధువే శాస్త్రవేత్త అయితే

Posted by V Srinivasa Chakravarthy Tuesday, July 21, 2009
పాశ్చాత్య సంస్కృతిలో మతానికి, సైన్సుకి మధ్య నిరంతర ఘర్షణ జరుగుతు ఉంటుంది. ఒక దాని మీద ఒకటి అధిపత్యం కోసం సతతం కలహించుకుంటూ ఉంటాయి. ఆ కలహం కొన్ని సార్లు వికార రూపాలు దాల్చుతుంది కూడా.

భారతీయ సంస్కృతిలో విజ్ఞానానికి, అధ్యాత్మికతకి మధ్య అలాంటి పోరాటం ఉన్నట్టు కనిపించదు. దానికి ఒక కారణం బహుశ సైన్సుకి మన దేశంలో లోతైన వేళ్లు లేకపోవడం కావచ్చు. ఎవరో ఎక్కడో కనుక్కున్న ఎంగిలి ముక్కల్ని ముక్కున పట్టుకుని నడిపిస్తున్న వ్యవహారంలా ఉంటుంది మన విజ్ఞానం. అదీ గాక మన దేశంలో విజ్ఞానం ఏదో పరీక్షల కోసం, పదవుల కోసం పడే ప్రాకులాటలో ఓ పనిముట్టు మాత్రమే! కనుక మతానికి సమాధానం చెప్పగల సత్తా మన విజ్ఞానంలో లేదు. ఇక్కడ విజ్ఞానం మరింత పటిష్ఠం కావాలంటే అందుకు మరింత లోతైన పునాదులు తవ్వాలి...

విజ్ఞానం బలహీనతని అలుసుగా తీసుకుని కాబోలు కుహనా "శాస్త్రాలు" మన దేశంలో పెచ్చరిల్లి పోతుంటాయి. చెయ్యి చూసి జాతకం చెప్పడం పాత పద్ధతి; కంప్యూటర్ ని "క్వెరీ" చేసి తలరాత తేల్చుకోవడం కొత్త "శాస్త్రీయ" పద్ధతి. సివిల్ ఇంజినీరింగ్ పుస్తకాల కన్నా "వాస్తు" మీద పుస్తకాలకి గిరాకి ఎకువగా ఉండడం విచిత్రంగా ఉంటుంది. (రెండిటికీ తేడా తెలీకపోవడం విచారంగా ఉంటుంది.) బల్లిపట్టు, చిలకజోస్యం, రేకీ, ప్రాణిక్ హీలింగ్, రిఫ్లెక్సాలజీ, "యోగా", ఆక్యుపంచర్, చేపవైద్యం, ... ఈ బాపతు పుస్తకాలని నమ్మినంత, సమ్మతించినంత సులభంగా ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని నమ్మదు మన సమాజం. (నమ్మడం అంటే దైనిక జీవితంలో ఆ పరిజ్ఞానాన్ని మన:పూర్వకంగా, లోతుగా భాగంగా చేసుకోవడం.) అపోలో అధినేత సుస్తీ చేస్తే ఆయుర్వేద నిపుణుణ్ణి సంప్రదిస్తాడు. ఇస్రో అధికార్లు లాంచ్ కి ముందు ఉపగ్రహ నమూనాన్ని తిరుపతి దేవుడికి ఓ సారి చూబిస్తారు! క్వాంటం శాస్త్రంలో ష్రోడింగర్ సమీకరణానికి, బ్రహ్మానికి మధ్య సంబంధాన్ని శోధిస్తాడో శాస్త్రవేత్త. ఓ అణు విజ్ఞాన శాస్త్రవేత్త రిటయిరయ్యాక మఠాధిపతి అవుతాడు. వైజ్ఞానిక విషయాలని ఇష్టం వచ్చినట్టు మతబోధకి ఊతగా వాడుకుంటూ ప్రవచిస్తుంటారు మన సాధువులు, ప్రవక్తలు...

ఇవన్నీ చూస్తుంటే మన దేశంలో సైన్సుకి, అధ్యాత్మికతకి మధ్య కలహం లేకపోగా ఓ విడ్డూరమైన స్నేహం, ఓ అసంగతమైన అనుబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. ఏది శాస్త్రమో, ఏది అశాస్త్రమో తెలీని మిథ్యామయ పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితి అంత శ్రేయస్కరం కాదని అనిపిస్తుంది. విజ్ఞానికి, అధ్యాత్మికతకి మధ్య అగాధమైన ఎడం ఉందన్నది స్పష్టం కావాలి. రెండిటీనీ అన్యాయంగా, అకాలంగా కలపకుండా వాటి వాటి శుద్ధ రూపాల్లో వాటిని ముందు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. రెండిటినీ సమన్వయ పరచడానికి కేవలం సదుద్దేశం ఉంటే సరిపోదు. అందుకు తగ్గ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ప్రస్తుతం లభ్యంగా లేదు. విజ్ఞానానికి, అధ్యాత్మికతకి మధ్య వివాదాన్ని వివాహంగా మార్చగల జ్ఞానాన్ని సాధించాలంటే మానవ జాతి మరి కొన్ని శతాబ్దాలు పురోగమించాల్సి ఉంటుందేమో...

ఇంత సుదీర్ఘమైన (కొంచెం భారమైన!) ఉపోద్ఘాతం ఓ మంచి కథకి ముందు మాట మాత్రమే. అది పాశ్చాత్య సంస్కృతికి చెందిన ఓ సాధువు కథ. విజ్ఞానం అంటే మనసు పడ్డ ఓ అరుదైన సాధువు కథ. అయితే అతగాడు మతభావాలని, విజ్ఞానంతో వికారంగా కలగలిపి విజ్ఞానాన్ని భ్రష్టు పట్టించలేదు. ఏ శాస్త్రీయ శిక్షణా లేని అతడు నిర్దోషమైన శాస్త్రీయ ప్రమాణాలని అనుసరిస్తూ తన ఆశ్రమ వాటికనే ప్రయోగశాలగా తీర్చి దిద్దుకున్నాడు. ఓ ముఖ్యమైన ఆధునిక శాస్త్ర రంగానికి ప్రేమగా తన పెరట్లోనే స్వహస్తాలతో పునాదులు తవ్వాడు.

ఆ సాధువు పేరు గ్రెగర్ మెండెల్. ఆ రంగమే జన్యు శాస్త్రం.

- చక్రవర్తి

(వచ్చే కొన్ని టపాల్లో మెండెల్ కథ ధారావాహికంగా...)

గమనిక: ఈ టపాకు పాఠకుల స్పందనకనుగుణంగా వివరణ ఈ బ్లాగులో ఇచ్చాము. వివరణ కోసం ఇక్కడ నొక్కండి (Click here).

21 comments

  1. Dude, for your kind information, Yoga is widely accepted even in the US

    By the way may I know how much you know about Yoga?

     
  2. In ISRO case, both can happen. Second is obviously weather in their case.
    So all they can do is - pray for the luck (to diff gods in diff places)
    or just shut mouth and cry for the loss
    _______________________________________________________________________

    Or perhaps wait for a bee to flap its wings in Mexico so that it will create some la nina effect in the Arabian Ocean that will clear the weather in Bay of Bengal.

     
  3. Yes, I said "Arabian OCEAN", the same word used by, you know who!

     
  4. Check this out - a befitting response!

    http://sainyam.in/?p=429

     
  5. and this post from Bhaskara Ramireddy disproves your assumptions about the Ancient Indian Science

    http://sainyam.in/?p=308

     
  6. వ్యాసం కలగాపులగంగా ఉంది.

    మూలలు ఒక్కటే అనిపించినా మతం వేరు ఆధ్యాత్మికత వేరు.వాటి ఉద్దేశాలు వేరు. మతం సామాజికం. ఆధ్యాత్మికం పారలౌకికం. మతం లేకుండా కూడా ఆధ్యాత్మికత ఉంటుంది. ఓషో,జెన్, జిడ్డుకృష్ణమూర్తి లాంటి వారు దానికి ఉదాహరణ. మతాన్ని ఆధారం చేసుకుని కూడా ఆధ్యాత్మికత ఉండొచ్చు. రామకృష్ణ మిషన్, సత్య సాయిబాబా దానికి ఉదాహరణలు.

    వ్యక్తిగత శోధన,ఆత్మసంతృప్తి ఆధ్యాత్మికతకు మూలాలు. వాటితో సైన్సుకి సమస్య ఎందుకుండాలి? సైన్స్ ఉద్దేశం భౌతికజగత్తులోని విషయాలను శాస్త్రీయపరంగా అర్థం చేసుకోవడం, వాటి లాభాల్ని మానవాళికి అందించడం. ఈ రెండూ contradictory కాదు. నిజానికి complimentary. ఒకటి మేధకు సంబధిస్తే మరొకటి మనసుకు సంబంధించింది. ఏది లేకపోయినా మనిషి మనిషి కాలేడు.

    ఇక మతం. క్రైస్తవానితో సైన్సుకున్న సమస్య తర్కానికీ గుడ్డినమ్మకానికీ ఉండేదే. హేతుతర్కరహిత అంశాల్ని గుడ్డిగా నమ్మమంటుంది మతం. సైన్స్ ఆధారాన్ని కోరుకుంటుంది. మతం తర్కాన్ని అణచడానికి హింసకు పూనుకుంటే ఆ హింసను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తుంది సైన్స్.

    మతానికి సామాజిక-రాజకీయ ఉద్దేశాలు తోడైన ప్రతిసారీ సైన్సుతో సమస్య వస్తుంది. అది ఇక్కడైనా ఎక్కడైనా జరగాల్సిందే.

     
  7. చక్రవర్తి గారూ,
    >> భారతీయ సంస్కృతిలో విజ్ఞానానికి, అధ్యాత్మికతకి మధ్య అలాంటి పోరాటం ఉన్నట్టు కనిపించదు. దానికి ఒక కారణం బహుశ సైన్సుకి మన దేశంలో లోతైన వేళ్లు లేకపోవడం కావచ్చు. ఎవరో ఎక్కడో కనుక్కున్న ఎంగిలి ముక్కల్ని ముక్కున పట్టుకుని నడిపిస్తున్న వ్యవహారంలా ఉంటుంది మన విజ్ఞానం.

    పైవాక్యం పూర్తిగా తప్పని నా అభిప్రాయం. అవును, అధ్యాత్మికవాది కావాలంటే విజ్ఞానం తప్పనిసరి. విజ్ఞానం లేనివారు అధ్యాత్మిక వాదులు కాలేరు.( అఫిర్మేటివ్ సెంటన్స్). ఇది మనదేశంలోనేకాదు , ఏ దేశంలో నైనా .. ఒకసారి సైన్స్ తో పాటి శాస్త్రవేత్తల వ్యక్తిగత చరిత్ర చదివితే తెలుస్తుందేమో..మన సంస్కృతిలో ఏ ఆధ్యాత్మిక వాదిని తీసుకున్నా మీకీ విషయం బోధపడుతుంది. మీరు చెప్పినట్టు తిరుపతి గుడిలో వెంకన్న పాదాలచెంత ఉంచిన ఇస్రో శాస్త్రవేత్త వరకూ.

    మరో విషయం.. సైన్స్ కూడా ఒకనమ్మకం. అదొక సంభావ్యత.. అంతే.. సూత్రికరించే శాస్త్రవేత్త కూడా తన అనుభవసారంతో తెలియని విషయాన్ని ఒక అచేతనా స్థితిలో(దీన్నే ధ్యానం అనవచ్చేమో) ఇలా వుంటుంది అని నమ్మి ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తాడే కానీ తనే సర్వస్వం అని అనుకోరేమో.. తన సూత్రానికి అవసరమైతే ఫిలాసఫీని కూడా వాడుకున్న శాస్త్రవేత్తలే ఎక్కువ..

    >>ఏది శాస్త్రమో, ఏది అశాస్త్రమో తెలీని మిథ్యామయ పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితి అంత శ్రేయస్కరం కాదని అనిపిస్తుంది. విజ్ఞానికి, అధ్యాత్మికతకి మధ్య అగాధమైన ఎడం ఉందన్నది స్పష్టం కావాలి. రెండిటీనీ అన్యాయంగా, అకాలంగా కలపకుండా వాటి వాటి శుద్ధ రూపాల్లో వాటిని ముందు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. రెండిటినీ సమన్వయ పరచడానికి కేవలం సదుద్దేశం ఉంటే సరిపోదు. అందుకు తగ్గ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ప్రస్తుతం లభ్యంగా లేదు.

    ---- శాస్త్రవేత్తకి ఏది శాస్త్రమో తెలియదని మీరనుకుంటున్నారా? నాకైతే అలా అనిపించడంలేదు.. తనకు తెలిసిన శాస్త్రానికి అధ్యాత్మికతనో , దేవుడినో ఆసరాగా చేసుకొని ధైర్యం తెచ్చుకుంటున్నాడు... మన ఇస్రో మాధవన్ నాయర్ వరకు...సమన్వయ పరచడానికి మనదగ్గర న్యాయం పుష్కలంగానే వుంది. ప్రస్తుతం కావలసిందల్లా సైన్స్ జ్ఞానం. జ్ఞానం అనేదానికన్నా డేటా అంటే బాగుంటుందేమో.. ఆ డాటా ఎలా వస్తుంది? ప్రయోగాల వల్ల.. ఉదాహరణ కి మొన్న మన చాంద్రయాన్-1 ప్రాజెక్ట్ నే తీసుకోండి. సెన్సార్ విఫలం అవడానికి కారణం..చంద్రుని రేడియేషన్ గణాంకాలు మనవద్ద లేకపోవడం, అలాగే సూర్య తుఫాను (Solar flares )ల వల్లే ఉత్పన్నమయ్యే రేడిఏషన్ (ఊహకందనిదేమో).. అని నాకనిపిస్తుంది. మరి ఏ పాశ్చాత్యులు ఒకే ఒక ట్రైల్ లో చంద్రప్రయాణాన్ని సఫలం చేశారు?

     
  8. విఙ్నానం ఎంత పెరిగినా మనసుకు ప్రశంతతనిచ్చే మర్గాలు, సుత్రాలు కేవలం భారతీయ గ్రంధాల్లోనే చెప్పబడింది. ఇతర దేశాల్లో ఆ విధానం లేదు.

    అయినా మీ దృష్టిలో సాధువు అంటే ఎవరో చెప్పండి.

     
  9. Anonymous Says:
  10. The true purpose of yoga is ignored long back. People misinterpreted its concept. Yoga is not meant for ordinary health consciousness. I have explained this @ http://vikaasam.blogspot.com/2009/07/blog-post_2522.html

     
  11. రెండిటినీ సమన్వయ పరచడానికి కేవలం సదుద్దేశం ఉంటే సరిపోదు. అందుకు తగ్గ జ్ఞానం కావాలి - ఇది నిజమేనని అనిపిస్తో౦ది. మన౦ ఆ ప్రయాణ౦లో ఇ౦కా బాలారిష్ట దశల్లోనే ఉన్నా౦.

    ఇక ఈ వివాదాన్ని పక్కన పెడితే మీరు చెప్పే కధ మాత్ర౦ ఉత్క౦ఠ గానే ఉ౦టు౦దని భావిస్తున్నా..కధ అయిపోయాక మీ ఉపోధ్గాతానికి మళ్ళీ వద్దా౦.

     
  12. ఇక్కడ మరో విషయ౦...

    చాలా మ౦ది ఆస్తికులు దేవుణ్ణి విపరీత౦గా నమ్మినట్లే, హేతువాదులు మూర్ఖ౦గా సైన్స్ ను అడ్డ౦ పెట్టుకుని వాదిస్తారు. ఈ రె౦డి౦టినీ సమన్వయ౦ చేయడానికి మనకు మరిన్ని శతాబ్దాల ఙ్ఞాన౦ అవసర౦. నాకు మాత్ర౦ సైన్స్ కూడా దేవుణ్ణి చేరే మరో మార్గమనే అనిపిస్తు౦ది. ఒక్కసారి సైన్స్ దేవుణ్ణి(లేక అలా౦టి మరో అ౦శను) చేరుస్తు౦దని మానవాళికి నమ్మక౦ వస్తే అన్ని మతాలూ మాయమైపోతాయి, లేక మానవీకరి౦చబడతాయి.

     
  13. భారతీయులకి చాలా ముఖ్యమైన విజ్ఞానం-అధ్యాత్మికత అనే అంశం మీద ఇంత చర్చ జరగడం (కొంత అసభ్య పదజాలాన్ని పక్కన పెడితే) చాలా సంతోషంగా ఉంది. హడావుడిగా, వివరణ లేకుండా రాయడం వల్లనేమో ఎంతో అపార్థం చోటు చేసుకుంది. నేను చెప్పదలచుకున్న దాని సారాన్ని పాయింట్లుగా ముందు చెప్తాను. ఒక్కొక్క అంశాన్ని మెల్లగా విపులీకరిస్తాను.

    1. భారతీయ అధ్యాత్మికత చాలా గొప్పది.
    2. ప్రాచీన భారత విజ్ఞానపు అవశేషాలని చూసి అబ్బురపడతాను, గర్వపడతాను.
    3. ఆ వైభవం ఏమై పోయిందని తలచుకుని బాధపడతాను.
    4. అధ్యాత్మికతకి, విజ్ఞానానికి ఒక విధమైన వ్యావహారికమైన రాజీ ఉందేమో గాని, నిండైన సమన్వయం లేదు.
    (ఫ్రిట్జఫ్ కాప్రా, డేవిడ్ బోం వంటి వాళ్ల భావాలు, ఆధునిక న్యూరోసైన్సు లో చైతన్యం మొదలైన అంశాల మీద జరుగున్న చర్చ, ఆ దిశలో తొలి ప్రయత్నాలు మాత్రమే.)

    5. మన దేశంలో విజ్ఞానానికి బలమైన పునాదులు ఏర్పడితే, విజ్ఞానానికి, అధ్యాత్మికతకి మధ్య అర్థవంతమైన, ఫలదాయకమైన చర్చకి మన దేశం వేదిక కాగలదు.

    6. అలాంటి అపురూపమైన చర్చ ఆరంభం అయినా పూర్తి సమన్వయం సాధ్యం కావడానికి కొన్ని శతాబ్దాలు పడుతుందని నా అభిప్రాయం.

     
  14. @శ్రీనివాస చక్రవర్తి: మీరు మీ వాదనలోని మూల వైరుధ్యాన్ని గ్రహించినట్లు లేరు. మతమెప్పుడూ వ్యవస్థీకరణను కోరుకుంటే ఆధ్యాత్మికత వ్యవస్థీకరణను మించిన ఆత్మసంతృప్తిని బోధించింది. కాబట్టి హిందూమతాన్నీ ఆధ్యాత్మికతనూ ఒకటిగా చేసి చూడటం అంత సరైన విషయం కాదు.

    సైన్స్ వైరం మతంలోని మూఢత్వంతోనేతప్ప అధ్యాత్మికతో కాదు. క్రైస్తవమైనా, హిందూమతమైనా సమస్యకు మూలం మతం ప్రజల్ని "నమ్మకం" ఆధారంగా "పరిపాలించాలనుకొవడం". ప్రశ్నలు లేకుండా ప్రజలు చెప్పింది చేస్తూ బ్రతకాలనుకోవడం.

    భారతదేశంలోని సాంప్రదాయక జ్ఞానం వలసపాలనలోని పరాయి మూసజ్ఞానానికి ఏవో కారణాలచేత ఎదురు నిలవలేకపోయింది. అది మన బలహీనతైనా కావచ్చు లేకపోతే వలస పాలకుల yard stick వేరైనా ఉండొచ్చు.ఏదీ ఏమైనా పాశ్చాత్య విజ్ఞానాన్ని ప్రాతిపదికగా చెసుకుని మనం ‘కొత్తవిజ్ఞానాన్ని’ నేర్చుకున్నాం, దానికీ మతానికీ మనదగ్గర పెద్ద ఘర్షణ లేదు. దానికి కారణం ఔదార్యం కాదు. హిందూమతానికి ఏకవ్యవస్థ లేకపోవడం. "ఫత్వాలు - డిక్రీలూ" జారీచేసే అధికారం లేకపోవడం. కానీ ఇస్లాం మరియూ క్రైస్తవంలో అలాంటి పోకడలు ఉన్నాయి. అందుకే క్రైస్తవం అన్ని resistance ఎదుర్కొంది. ఇస్లాం ఇప్పటికీ ఈ సమస్యల్లో తలమునకలౌతోంది.

    If your discussion is about Religion Vs Science, it has some ground for discussion. If your hint is at Spiritualism Vs Science...they are not in fight with each other at all.

     
  15. Anonymous Says:
  16. I request all of you to watch these videos. Hope It will be useful to you. Apart from that read UG and science by O S Reddy
    http://www.well.com/user/jct/

    The New Biology - Where Mind and Matter Meet 1of 2.avi
    http://video.google.com/videoplay?docid=-8506668136396723343

    http://video.google.com/videoplay?docid=-6568107389365915765&hl=en

    Rupert sheldrake : The extended mind Recent Experimental evidence
    http://video.google.com/videosearch?q=rupert+sheldrake&hl=en&emb=0#

    Rupert Sheldrake - The Morphogenetic Universe
    http://video.google.com/videosearch?q=rupert+sheldrake&hl=en&emb=0#

     
  17. Anonymous Says:
  18. శ్రీనివాస్ గారూ, అసభ్యపద జాలం అనే కంటే పరుష పదజాలం అంటే బాగుండేదేమో! నిజానికి మిగిలిన దేశాలతో, మతాలతో పోల్చి చూస్తే హిందూ మతం శాస్త్రీయతకు ఎక్కువగా అవరోధాలు కల్పించలేదు. మరి ఇక్కడ విజ్ఞానం ఎందుకు అభివృధ్ధి చెందలేదంటారా? దానికి కారణాలు వేరు. పేదరికం, 60 ఏళ్ళ క్రితం వరకు వేల సం,,ల బానిస పాలన, వివిధ మత సమస్యలూ వగైరా, వగైరా.. అంతేకాని మన (దేశం) విషయంలో మతమెప్పుడూ విజ్ఞానానికి అవరోధం కాలేదు. ఇక చిలక జ్యోతిష్యాలూ, తతీమా మూఢనమ్మకాలంటారా? అవి మత పరంగా కంటే మనదేశంలో ప్రజల నిరక్ష్యరాస్యత, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పెరిగినవి. మతం ఏనాడూ మన దేశంలో విజ్ఞాన శాస్త్రాన్ని మీరనుకున్నట్లు అడ్డుకోలేదు. ఈ అడ్డుకోలు నిజానికి మిగిలిన ప్రపంచ దేశాల్లోనే జరిగింది. కాబట్టి మిగిలిన దేశాలతో పోల్చి చూసుకుని, మనదేశంలో శాస్త్రానికి అవరధం మతమని నిర్ణయించటం తగదు. దానికి కారణాలు వేరు. నిస్సందేహంగా మతం కాదు. ఇక ఆధ్యాత్మికత, శాస్త్రం మహేష్ చెప్పినట్లు ఏనాడూ విభేదించుకోలేదు. కనుక మీరు మన దేశంలోని శాస్త్రీయ విజ్ఞాన లేమికి మతాన్ని నిందించకుండా మిగిలిన కారణాలను విశ్లేషిస్తే బాగుంటుంది.

     
  19. Anonymous Says:
  20. This is als wonderful presentation by VS Ramachandran. Please watch it.
    And let me share your openion if posible.

    Neurology & Art
    http://video.google.com/videosearch?q=ramachandran+v+s+&emb=#

     
  21. karthik Says:
  22. hi..

    i have just read this post completely and i dont know what made you to make such a horrible remarks about our culture.

    Critisizing sciences like "yoga" shows either ignorance or arrogance or a dangerous combination of both!!

    Coming to science in Indian society: science is always imbibed in our culture. we use turmeric as a sacred thing. dont you know how powerful antibacterial it is?

    let me tell you something, the tribes of south america were using cinchona bark for curing malaria and other fevers long before your noble laureates named it as "quinine".

    so any civilization in this world would not have survived for so many ages without "science" in them. May be they have not documented in the way we can understand!!

    coming to palmistry and horoscopes: Have you read the proof given by Aryabhatta for a fourth degree algebraic equation? if not please read and then think "A logical thinker of that kind can believe in anything without proof?"
    Having said that I'm NOT supporting blind belief in them, but no need to make fun of them.I read the story of Varaha mihira and came to know that he used to foretell things based on some calculations. Its a unfortunate that we could not carry such knowledge to the coming generations.

    And biggest joke is using same tone to palmistry and Ayurveda. Do you know that Ayurveda has the same base as english medicines?

    The whole point I want to make is "we cant understand something never implies its rubbish".

    Overall your post shows the inferior feeling we carry towards anything that is "INDIAN". No wonder others ruled for centuries!!


    -Karthik

    I never knew I would use this kind of language in blogs but your post is simply unacceptable. I apologize if anything would have sounded like personal derogatory remarks.

     
  23. Prasad Says:
  24. I select "Name/URL" profile in the 'comment as'drop down box and write my name in Name field and leave the URL field blank because I don't have any. May be its a bug in sw which shows the same post if URL is left blank. I am sorry for the inconvenience. I will look for some other alternative.

    I am also surprised that you and Manohar are also part of this blog. I thought this Dr. Srinivas Chakravarhi's blog.

    Friend- Frankly I did not like this part of the post. Not just don't like.. I hated it ..may be because of I have reached my boiling point after reading these kinds of posts from few other bloggers.

    BTW , which hostel you are in. I was in Narmada Hostel in 1998. Ofcourse I did not complete in IITM, I transferred to IITKGP next year.


    - Sorry ..I have use the same profile this time also..

     
  25. Prasad గారు, ఇప్పుడే గమనించాను. Anonymous గా కామెంటు రాసినా కూడా default గా నా బ్లాగు లింకే వస్తోంది. బహుశా అది టెంప్లెట్‌లో సమస్య కావచ్చు. నా పేరులో కూడా ప్రసాద్ అని ఉండటం వల్ల Mislead అవుతుందని మీ ముందు కామెంటు తొలగించాను. Sorry for that.

     
  26. Prasad గారు, నేను ఉంటున్న హాస్టల్ కొత్తగా కట్టినది. హాస్టర్ పేరు: పంపా హాస్టల్.

    ఇకపోతే, ఈ బ్లాగు Admin నేనే కాబట్టి, ఇందులోని రాతలకు నాదే బాధ్యత అవుతుంది.

     
  27. చిన్న మనవి: మాకు చేతనైనంతవరకు సైన్సును తెలుగులోకి అనువదించాలనే ఉద్దేశ్యంతో ఈ బ్లాగును మొదలుపెట్టాం.

    ఈ టపాలో కూడా మేము చెప్పదల్చుకున్న విషయాన్ని సరిగా చెప్పలేకపోవడం వల్ల అది కాస్తా పక్కదారి పట్టింది. Sorry for the inconvenience.

    I am closing comments for this Post.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts