శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

అంతరిక్షంలో అంబికా తనయుడు (గణపతి).

Posted by నాగప్రసాద్ Monday, August 17, 2009
పురాణకథల్లో ఎలా ఉన్నప్పటికీ ఖగోళ విజ్ఞానం ప్రకారం భాద్రపద శుద్ద చవితికి ప్రత్యేకత ఉంది. ఆరోజు తెల్లవారుజామున ఉత్తరాకాశంలో సప్తఋషి మండలానికి దగ్గరగా ఒక నక్షత్ర మండలం ఉదయిస్తుంది. ఈ నక్షత్రాలను ఒక క్రమంలో కలుపుకుంటూ గీతగీస్తే అది వినాయకుడి ఆకారాన్ని సూచిస్తుంది. దీని కిందుగా మినుకుమినుకుమనే నక్షత్ర సముదాయాన్ని రేఖీకరిస్తే అది ఎలుకలా కనిపిస్తుంది. ఈ మొత్తం నక్షత్ర మండలాన్ని గణేశ మండలం అంటారు. సూర్యోదయానికి ముందు ఇది బాగా కనిపిస్తుంది. ఈ ఖగోళ హేలకు సంకేతంగా వినాయక చవితిని జరుపుతారు.

ఈ విషయాన్ని 2007 వ సంవత్సరంలో వినాయకచవితి సందర్భంగా "వార్త" దినపత్రికలో ప్రచురించారు.

ఇటువంటిదే మరో విషయం ఈ మధ్య (ఆగష్టు 2009) సప్తగిరి/భక్తి /SVBC చానల్‌లో మైలవరపు శ్రీనివాస్‌గారు చెప్పారు:

శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించిన సంగతి మీకందరికీ తెలుసు. పునర్వసు నక్షత్రమండలంలో ఐదు నక్షత్రాలు, ధనుస్సు ఆకారంలో ఉంటాయట. (బహుశా) అందుకే రాముడు ఎప్పుడూ ధనుర్భాణాలు ధరించేవాడు. ఇలానే భరతుని జన్మనక్షత్రము, లక్ష్మణుని జన్మనక్షత్రాల గురించి కూడా చెప్పారు.

రచయిత: పద్యాల విక్రమ్‌కుమార్.

6 comments

  1. Nice collection

     
  2. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సనాతన భారతీయ ఆధ్యాత్మికానికి సామ్యము చూపే ఇటువంటి అంశాలు post చేయటం చాల ప్రసంసనీయం

    " శ్రీ లలితా సహస్ర నామాలను సరైన స్వరోచ్చారణ తో గానము చేసిన దానికి graph గీస్తే శ్రీ చక్రం రూపం లో గ్రాఫ్ వచ్చింది "

    (అని ఆ మధ్య ఎప్పుడో ఎక్కడో విన్నాను వాస్తవమో కాదో కూడా తెలియదు )

    ?!

     
  3. పైన విక్రమ్ రాసిన అంశం గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి-

    1. అసలు ‘పునర్వసు నక్షత్ర మండలం’ అంటే ఏమిటి?
    ఆధునిక ఖగోళవిజ్ఞానం ప్రకారం పునర్వసు నక్షత్రం ‘జెమినీ’ constellation లో Castor మరియు Pollux అనే రెండు ప్రకాశ వంతమైన తారలకి కలిపి ఇచ్చిన పేరు.
    http://en.wikipedia.org/wiki/Punarvasu
    కనుక ‘పునర్వసు నక్షత్రమండలం’ లో ఐదు తారలు ఎలా వచ్చాయి?

    2. పోనీ మొత్తం జెమినీ కాన్స్టలేషనే ‘పునర్వసు నక్షత్ర మండలం’తో సమానం అనుకున్నా (అసలు అలా అనుకోడానికి వీల్లేదు, ఎందుకంటే అలాంటప్పుడు నక్షత్రం బదులుగా రాశిని పేర్కొనాలి) జెమినీలో ప్రధానంగా ఎనిమిది (ఐదు కాదు!) తారలని ఒక రేఖతో కలుపుతారు. ఈ కింది వికిపీడియా వ్యాసంలో జెమినీ లోని తారల చిత్రం చూడండి.
    http://en.wikipedia.org/wiki/Punarvasu

    3. పైగా ఎలా ఊహించినా ఆ ఎనిమిది తారలని కలిపే గీత ధనుస్సులా నాకైతే కనిపించడం లేదు.
    http://en.wikipedia.org/wiki/Punarvasu

    4. మరికాస్త సూక్ష్మంగా గీసే పటాల్లో జెమినీలో ఇంచుమించు పదిహేను తారలని కలుపుతు గీతలు గీస్తారు. ఇక్కడ చూడండి-
    http://en.wikipedia.org/wiki/Gemini_(constellation)

    5. ఇంకా సూక్ష్మాలు తవ్వితే అసలు కాస్టర్ అనే తార ఏకైక తార కాదు, ఆరు తారలు దగ్గర దగ్గరగా ఉన్న ‘తారా వ్యవస్థ’ (a sextuple star system).
    http://en.wikipedia.org/wiki/Gemini_(constellation)

    ఈ సమాచారం అంతా చూస్తే SVBC చానెల్ లో ఆయనెవరో చెప్పిన దానికి అర్థం ఏంటో తెలియడం లేదు.

    నాకు ఒకటే అభ్యంతరం. ఒక విషయాన్ని శాస్త్ర సత్యంగా సమ్మతించాలంటే అది ఎన్నో కఠోరమైన పరీక్షలకి తట్టుకోవాలి, ఎంతో బలమైన ప్రమాణాలకి నిలవాలి. కాని ఉఫ్ఫని ఊదితే ఎగిరిపోయే ఇలాంటి సమాచారం ఎందుకో చాలా ప్రచారంలో ఉంటుంది.

    “మాన వాళ్లకి అన్నీ తెలుసు” అని నిరూపించుకోడానికి ఇలాంటివి రాస్తుంటారు కాబోలు. నిజంగా ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి రాయాలంటే దానికి మంచి ప్రామాణిక రచనలు ఉన్నాయి. ఉదాహరణకి –
    1. Bajendranath Seal, The positive sciences of the Ancient Hindus, Motilal Banarasi Das, 1985.
    2. A concise history of Science in India, DM Bose, SN Sen, BV Subbarayappa, (Eds), Indian National Science Academy, Universities Press, 1971.

    అలాంటి వాటి నుండి సమాచారాన్ని గ్రహించి, మూలరచనలని పేర్కొంటూ, రాస్తే ఇంపుగా ఉంటుంది. ఇలాంటి ‘ఆఫా తూఫా’ కథనాలకి దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం! దాని వల్ల ప్రాచీన భారత సంస్కృతిని “డిఫెండు” చెయ్యబోయి దిగజార్చుకోవడమే అవుతుంది.

     
  4. Anonymous Says:
  5. http://en.wikipedia.org/wiki/Bow_and_arrow

    http://en.wikipedia.org/wiki/File:GeminiCC.jpg

     
  6. Anonymous Says:
  7. Lakshmana - Ashlesha (Hydra) - behavior of snake-

    Hydra is the largest of the 88 modern constellations, measuring 1303 square degrees. It has a long history, having been included among the 48 constellations listed by the 2nd century astronomer Ptolemy. It is commonly represented as a water snake. It should not be confused with the similarly named constellation of Hydrus.

     
  8. Anonymous Says:
  9. చక్రవర్తి గారికి నమస్కారాలు!

    మన శాస్త్రాలపైన నాకు ఎంత పూర్తి అవగాహన వుందో నాకు తెలియదు కానీ చాలా విషయాలు వ్యక్తిగతంగా పరిశోధించిన మీదటే నాకు నమ్మకం రూడి అయ్యింది.

    మీరు కూడా వీలున్నప్పుడు ప్రయత్నించండి....మన తల్లి గొప్పదనం మనము కాక ఎవరు చాటి చెప్తారు చెప్పండి???

    -సామ

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts