ఇంతకు ముందు ’అంతేలేని అంతరిక్షం..." పోస్ట్ లో చెప్పుకున్నట్టు ఇప్పట్నుంచి వరుసగా కొన్ని పోస్టులలో విశ్వం యొక్క విస్తృతిని తెలిపే మ్యాప్ లని ప్రదర్శిస్తాం. సూర్యుడి నుండి క్రమంగా ఇంకా ఇంకా దూరంగా పోతుంటే ఏవేం కనిపిస్తాయో ఈ మ్యాపులు చూబిస్తాయి.
సూర్యుడికి అతి దగ్గరి తార ప్రాక్సిమా సెంటారీ అని, అది 4.2 కాంతిసంవత్సరాల దూరంలో ఉందని చాలా మందికి తెలుసు. కాని మరి కొంచెం దూరం వెళ్తే ఏవేం తారలు కనిపిస్తాయి?
పై మ్యాప్ లో సూర్యుడి నుండి 12.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న తారా వ్యవస్థలన్నీ ప్రదర్శించబడ్డాయి. వాటిలో చాలా ఎర్ర మరుగుజ్జు తారలే. అవి సూర్యుడి ద్రవ్య రాశిలో పదో వంతు ద్రవ్యరాశి గలవి, సూర్యుడి తేజంలో నూరో వంతు తేజం గలవి. విశ్వంలో ఇంచుమించు ఎనభై శాతం తారలన్నీ ఎర్ర మరుగుజ్జు తారలే. మనకి అతి దగ్గరిదైన ప్రాక్సిమా సెంటారీ అలాంటి తారలకి చక్కని తార్కాణం.
వచ్చే పోస్ట్ లో 250 కాంతి సంవత్సరాల దూరంలో ఏముందో చూద్దాం...
మూలం: http://www.atlasoftheuniverse.com/index.html
0 comments