మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తారీఖున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. ఉదాహరణకు DRDO, ISRO వంటి సంస్థల్లోకి ముందస్తు అనుమతిలేకుండా ఆ రోజు ఎవరైనా వెళ్ళవచ్చును. కాబట్టి, మీకు కుదిరినచో మీ పిల్లలని మీకు అందుబాటులోనున్న ఆయా సంస్థల సందర్శనానికి తీసుకెళ్ళండి. ఆ రోజు ఏయే సంస్థల్లోకి అనుమతినిస్తున్నారో, సమయం వంటి వివరాలు తెలుసుకోవడానికి ఆ రోజు దినపత్రికలను చూడగల...

Banding చెయ్యబడ్డ 338 షేర్వాటర్ పక్షులని తమ గూళ్ల నుంచి 200-400 మైళ్ల దూరంలో ఉన్న వివిధ స్థానాల వద్దకి తీసుకెళ్లి విడిచిపెట్టాడు డా మాథ్యూస్. అనుకున్నట్లుగా వాటిలో చాలా మటుకు పక్షులు వాటి గూళ్లకి తిరిగి వచ్చాయి. కాని విశేషం ఏంటంటే విడిచిపెట్టిన కొద్ది నిమిషాల్లోనే అవి సరైన దిశకి మళ్లడం కనిపించింది. ఆ పక్షుల తలలో ఆ ప్రాంతానికి చెందిన ఏదో మ్యాపు ఉన్నట్టు, దిశ తెలిపే ఏదో దిక్సూచి ఉన్నట్టు అనిపించింది. కాని క్రేమర్ జరిపిన ప్రయోగాలలో లాగానే...

వలస పోయే సమయం వచ్చినప్పుడు పక్షుల్లో ఒక రకమైన అసహనం మొదలవుతుంది. అంత వరకు కొమ్మ మీద కుదురుగా కూర్చున్న గువ్వ కూడా అసహనంగా మసలడం మొదలెడుతుంది. వలసపోవాల్సిన దిశగా తిరిగి కొమ్మ మీద కూర్చుంటుంది. అలజడిగా రెక్కలు టపటపా కొట్టుకుంటుంది. కొన్ని సార్లు వెళ్లాల్సిన దిశలో కాస్తంత దూరం ఎగిరి తిరిగి కొమ్మ మీదకి వచ్చి వాల్తుంది. ఆ సమయంలో ఆ ప్రత్యేక దిశలో ఎగరాలనే ప్రోద్బలం, ఆత్రుత ఎంత బలంగా ఉంటాయంటే పంజరంలో ఉన్న పక్షులు దాని వల్ల గాయపడవచ్చు కూడా! కొన్ని...

డ్రోస్ట్ అనే శాస్త్రవేత్త పిల్ల పక్షుల గమనంలో ఓ విశేషాన్ని గమనించాడు. పరిపాటిగా అనుసరించే మార్గం నుండి తప్పిపోయిన పిల్ల పక్షులు అసలు మార్గానికి సమాంతరంగా ప్రయాణించాయి. అసలు మార్గానికి తిరిగి రాలేకపోయాయి. కాని పెద్ద పక్షులు మాత్రం దారి తప్పినా, తమ గతిని సరిదిద్దుకుని అసలు దారికి తిరిగి రాగలిగాయి.పక్షులలో సహజంగా ఉండే ఈ మార్గాన్వేషణా సామర్థ్యం (navigational ability) ఎక్కణ్ణుంచి వస్తుంది అన్న విషయం గురించి ఎన్నో సిద్ధాంతలు ప్రతిపాదించబడ్డాయి....

ఆంబోతుకి అచ్చు వేసినట్టు, పక్షుల గమనాలని కనిపెట్టుకోడానికి వాటికి ఓ చిన్న అలూమినమ్ బిళ్ల కడతారు. దాని మీద ఆ పక్షి కి సంబంధించిన ’సీరియల్ నంబర్’ ముద్ర వేసి ఉంటుంది. దీన్నే bird banding అంటారు. ఉత్తర అమెరికా ఖండంలో పక్షుల చలనాలని కనిపెట్టడానికి పెద్ద సంఖ్యలో పక్షులకి ఇలాంటి బిళ్లలు తగిలించారు. నేల మీద దారులు ఉన్నట్లుగానే ఆకాశంలో కూడా కొన్ని ప్రత్యేక వినువీధుల వెంట పక్షులు సామాన్యంగా ప్రయాణిస్తూ ఉంటాయి. అమెరికా ఖండం మీద అలాంటి ఏడు ముఖ్య ఆకాశ...

పక్షులు ప్రతీ ఏటా గొప్ప దూరాలు వలస పోయి, కొన్ని నెలల ఎడం తరువాత మళ్లీ తిరిగి తమ ఇంటికి చేరుతుంటాయి. అంత చిన్న జీవాలకి అది ఎలా సాధ్యం? వాటి తలలో ఉంటూ వాటికి దారి చూపే దిక్సూచి ఏమిటి? వరుసగా కొన్ని పోస్ట్ లలో ఈ ప్రశ్నలకి సమాధానాలు చర్చించుకుందాం.అది జూన్ 3, 1952. లండన్ విమానాశ్రయం నుండి ఓ విమానం బయలుదేరింది. అందులో ప్రయాణిస్తున్న ఓ అమెరికన్ వద్ద ఓ వింతైన పెట్టె ఉంది. ఆ పెట్టెలోంచి ఉండుండి ఏవో కూతలు వినిపిస్తున్నాయి. కూతలు వినిపించిన ప్రతిసారి...

శక్తి ఉత్పత్తిని అమాంతంగా పెంచుకుని, ప్రకృతి వైపరీత్యాలని శాసించి, ఉన్న గ్రహం మీద అమరమై వెలిగే రెండవ రకం నాగరికత గురించి కిందటి పోస్ట్ లో చూశాం.ఉన్న గ్రహాన్నే కాక, ఉన్న సౌరమండలాన్ని కూడా వొదిలి, గెలాక్సీలో అధిక భాగం వ్యాపించి అక్కడి తారల శక్తిని సేకరిస్తూ జీవించే అద్భుతమైన నాగరికతే మూడవ రకం నాగరికత. కర్డషేవ్ వర్గీకరణ ప్రకారం ఈ రకం నాగరికత యొక్క శక్తి వినియోగం రమారమి 10^37 watts ఉంటుంది. మన గెలాక్సీలోని తారలు అన్నిటి నుండి ఉత్పన్నం అయ్యే...

కర్డషేవ్ వర్గీకరణ ప్రకారం సగటున 10^26 Watts power ని ఖర్చు పెట్టే నాగరికత 2 వ రకం నాగరికత అవుతుంది. సాగన్ ప్రతిపాదించిన సూత్రంలో ఈ విలువని ప్రతిక్షేపిస్తే,K = (log10(W) - 6)/10వచ్చే K విలువ 2 అవుతుంది. అంత శక్తి కావాలంటే ఆ నాగరికత కేవలం అది ఉన్న గ్రహం మీద ఉన్న వనరుల మీద ఆధారపడితే సరిపోదు. దాని సమీపంలో ఉన్న తార వెలువరించే శక్తి మొత్తాన్ని గ్రహించి వాడవలసి ఉంటుంది. ఉదాహరణకి ఒక సెకనుకి మన సూర్యుడి నుండి వెలువడే శక్తి విలువ 3.86 X 10^26 Watts....

తీరని చీలికలతో సంక్షుభితంగా ఉండే 0 వ రకం నాగరికతలో, ఆ చీలికలు నెమ్మదిగా చెరిగిపోతూ వివిధ జాతుల మధ్య సహకారం, సహవర్తనం వృద్ధి చెందుతున్నదంటే, ఆ నాగరికత మెల్లగా 1 వ రకం నాగరికత దిశగా వికాసం చెందుతోందన్నమాట. అయితే అలాంటి పరిణామం జీవన కాంక్ష గల ఏ నాగరికతలోనైనా ఏదో ఒక దశలో రావలసిందే. ఎందుకంటే వైవిధ్యం జీవన సహజం అయినా, తీరని విభేదం, తెగని విభజన జీవన వృద్ధికి వ్యతిరేకం. విభజన వల్ల వచ్చే దుష్పరిణామాలకి తట్టుకోలేక, వాటికి విరుగుడుగా మానవ జాతి ఏదో...

రష్యన్ ఖగోళశాస్త్రవేత్త నికోలాయ్ కర్డషేవ్ విశ్లేషణ ప్రకారం భావి మానవ నాగరికతలో మూడు రకాలు, లేక దశలు ఉంటాయట.1 వ రకం నాగరికత - ఇది గ్రహవ్యాప్త నాగరికత2 వ రకం నాగరికత - ఇది దాని సౌరమండలానికే పరిమితమైన నాగరికత3 వ రకం నాగరికత - ఇది తారల దారులు తెలిసిన నాగరికతఈ మూడూ కూడా భావి నాగరికతలలో రకాలు అనుకుంటే మన ప్రస్తుత నాగరికత ఇంకా 0 వ రకం నాగరికతే నని చెప్పుకోవాలి. ఈ 0 రకం నాగరికత లక్షణాలేంటి?ఈ రకం నాగరికత యొక్క మొట్టమొదటి లక్షణం తీరని విభజనలతో కూడుకున్న...

వైభవోపేతమైన గతం ఉందని కాబోలు మన దృష్టి తరచు భవిష్యత్తు మీద కన్నా గతం మీద ఎక్కువగా నిలుస్తుంది.మరి కనీసం రెండు వేల ఏళ్ల గతం ఉన్నా, ఎంచుచేతనో పాశ్చాత్యుల మనసు గతం కన్నా తరచు భవిష్యత్తు మీదకే పోతుంటుంది. భవిష్యత్తు గురించి పథకాలు వెయ్యడం, విస్తృత ప్రణాళికలు రూపొందించడం, వాటి అమలు కోసం పాటు పడడం వారి సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన విషయం. పాశ్చాత్యులలో ఆ లక్షణానికి ఓ చక్కని తార్కాణం మార్స్ మీద వలస పోయే విషయం గురించి పాశ్చాత్యలోకంలో జరిగిన చర్చ,...

డిగ్రీలు లేని, నిజమైన శాస్త్రవేత్త హుమాసన్ఆ విధంగా స్లిఫర్ కి సాధ్యం కాని పనిని, హబుల్ తన 100-ఇంచిల దూరదర్శినితో సాధించాలని పూనుకున్నాడు. దూరదర్శిని శక్తివంతమైనదే అయినా ఆ రోజుల్లో అంతరిక్షంలో అంతంత దూరాలు చూసిన వీరుడు లేడు. అప్పటికే హబుల్ కి అంతరిక్షంలో విపరీతమైన దూరాలు కొలవడంలో గొప్ప పేరుంది. అయితే తను చేపట్టిన పని సాధించడానికి కౌశలమే కాక, గొప్ప సహనం కూడా కావాలి. చెప్పలేనంత ప్రయాసతో కూడుకున్న పని అది. అదంతా తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని...

వెస్టో స్లిఫర్ అమెరికాలో, ఆరిజోనా రాష్ట్రంలోని ఫ్లాగ్స్టాఫ్ నగరంలో లొవెల్ వేధశాలలో పనిచేసేవాడు. పార్సివాల్ లొవెల్ అనే వ్యాపారస్థుడు ఇచ్చిన విరాళంతో నిర్మించబడింది ఈ వేధశాల. ఓ విచిత్రమైన లక్ష్యంతో నిర్మించబడిన వేధశాల ఇది. ’మార్స్ మీద జీవరాశులు ఉన్నాయా?’ అన్న ప్రశ్నని శోధించడమే ఆ లక్ష్యం.లొవెల్ వేధశాలలోని 24-ఇంచిల దూరదర్శీనితో తన పరిశీలనలు మొదలుపెట్టాడు స్లిఫర్. ఈ దూరదర్శని చిన్నదే అయినా. దీనితో పాటు ఒక వర్ణపట దర్శిని (spectrograph) జతచేసి...

కేవలం వాయు, ధూళి మేఘం అయిన ఆండ్రోమెడా నెబ్యులాకి ఏంటంత ప్రాముఖ్యత?హుమాసన్, షాప్లీ తదితరులు ఆండ్రోమెడా నెబ్యులా మీద దృష్టి సారించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ నెబ్యులా అర్థమైతే ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభకాలంలో విశ్వం గురించిన మన అవగాన సరైనదో కాదో తేల్చుకునే అవకాశం ఉంటుంది.(Picture: Milton Humason)ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభ కాలంలో విశ్వం గురించి చాలా సంకుచితమైన అవగాహన ఉండేది. మన పాలపుంత గెలాక్సీయే విశ్వానికి కేంద్రం అనుకునేవారు. మన గెలాక్సీకి బయట...
హ్యూగో బెనియోఫ్ అనే రీసెర్చ్ స్కాలర్ తన సెలవుదినాలలో మౌంట్ విల్సన్ వేధశాలలో పని చెయ్యడానికి వచ్చాడు. దూరదర్శినితో ఎలా ఫోటోలు తియ్యాలో హుమాసన్ కి నేర్పించాడు. హుమాసన్ లో ఓ గొప్ప లక్షణం అతని అపారమైన సహనం. ఆ ఓర్పు మరి మొండి ఘటాలైన మ్యూల్ జంతువులతో వ్యవహరించడం వల్ల వచ్చిందేమో తెలీదు. లేక సైన్స్ అంటే ఆసక్తి ఉండడం వల్ల సహజంగా వచ్చింది కావచ్చు. సెలవు ముగిశాక బెనియోఫ్ వెళ్లిపోయాడు. హుమాసన్ మాత్రం ఫోటోలు తీసే కార్యక్రమాన్ని కొనసాగించాడు.హుమాసన్ ప్రతిభ ఆ వేధశాలలో పనిచేసే సీనియర్ ఖగోళశాస్త్రవేత్త అయిన హార్లో షాప్లీ కంట పడింది. ’ఖగోళ విజ్ఞాన...
శాస్త్రవేత్త కావాలంటే పట్టాలు, పి.హెచ్.డి. లు అక్కర్లేదు. ఎందుకటే శాస్త్రీయత అనేది మనసుకి సంబంధించినది, ఒక విధమైన మానసిక దృక్పథానికి సంబంధించినది. ఏ పట్టాలూ లేకపోయినా సైన్సు అంటే అపారమైన ప్రేమ కలిగి, పని పట్ల వెలితిలేని అంకితభావం కలిగిన కొందరు మేటి ఏకలవ్య శాస్త్రవేత్తలు ఉన్నారు. పదో క్లాసు కూడా పాసు కాని అలాంటి ఓ ఏకలవ్య శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రంలో ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశల్లో ఓ అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషించాడు. అతడి పేరు మిల్టన్ హుమాసన్.1905 ఆధునిక విజ్ఞానం ఓ పెద్ద మలుపు తిరిగిన సంవత్సరం. ఐన్స్టయిన్ తన సాపేక్షతా...
(డా. రవిశంకర్ ప్రసంగంలో తరువాతి భాగం)“అలాంటి శిక్షణతో పిల్లలు క్రమంగా ప్రయోగాలు చెయ్యడం నేర్చుకున్నారు. కాని ఇంకా ఒక సమస్య మిగిలిపోయింది. చేసిన ప్రయోగం ఎందుకు పని చేస్తోందో తమ సొంత మాటల్లో చెప్పమంటే చెప్పలేకపోయేవారు. ప్రయోగాలని ఎలా ప్రదర్శించాలో, ప్రదర్శించేటప్పుడు ఏం చెప్పాలో టీచర్లకి, మరి కొందరు వొలంటీర్లకి తర్ఫీదు ఇచ్చాం. కాని వీళ్లతోనూ అదే ఇబ్బంది! ప్రయోగం చేసేటప్పుడు ఏం చెప్పాలో బట్టీ పట్టి గడగడ ఒప్పచెప్పేస్తారు (“’ఒక బుడగలో గాలిని పూరించినచో...”), గాని ఆ చెప్తున్నదానికి, చూపిస్తున్న దానికి సంబంధం ఉందో లేదో గమనించరు. ఒకసారి...

నిన్న మా సంస్థలో ఎయిడ్-ఇండియా అనే ఎన్.జి.ఓ. కి చెందిన డా. రవిశంకర్ అరుణాచలం మన దేశంలో సైన్సు చదువులకి సంబంధించిన కొన్ని మౌలిక సమస్యల గురించి మాట్లాడారు. ఆ ప్రసంగం లోని ముఖ్యాంశాల గురించి ఈ పోస్ట్.ప్రసంగం గురించి చెప్పే ముందు వక్త గురించి నాలుగు ముక్కలు.ఐ.ఐ.టి చెన్నై లో బీటెక్ పూర్తి చేసిన డా. రవిశంకర్ అమెరికాలో కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పిహెచ్ డి పూర్తి చేసి, కొంత కాలం ఐబిఎమ్ లో పని చేసి 2003 లో ఇండియాకి తిరిగి...
postlink