
గాలెన్, వెసేలియస్ ల లాగానే లియొనార్డోకి కూడా మెదడులోని కోష్ఠాల గురించి తెలుసు. వాటికి వరుసగా 1, 2, 3, 4 అని పేర్లు పెట్టాడు. వాటిలో మూడవ కోష్ఠాన్ని (third ventricle, 3v - చిత్రంలో చూడండి) sensus communis అని పిలిచాడు. అది ఇంద్రియాలు (senses) కలిసే సంగమ (commune) స్థానం అని భావించడం చేత దానికలా పేరు పెట్టాడు. (అయితే అక్కడ కచ్చితంగా పప్పులో కాలు వెయ్యడం జరిగిందని వేరే చెప్పనక్కర్లేదు!) దృశ్యాలు, శబ్దాలు, వాసనలు మొదలైన వాటికి సంబంధించిన...

కొన్ని సార్లు ఒక ప్రత్యేక వ్యక్తి తను పుట్టిన తరం మొత్తం వివిధ రంగాలలో సాధించవలసిన పురోగతి యొక్క సారాన్ని తాను ఒక్కడే సాధించి ఆ పురోగతికి ఆదర్శంగా నిలుస్తాడు. యూరప్ లో మధ్య యుగానికి అంతంలో, సాంస్కృతిక పునరుజ్జీవన శకారంభంలో పుట్టిన లియొనార్డో డా వించీ నిజంగా ఓ యుగపురుషుడే. జరామరణాలు లేని మోనాలిసాకి ప్రాణం పోసిన అసమాన చిత్రకళాకారుడు. గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ అనేకముఖ ప్రతిభాశాలి కేవలం కళాకారుడు మాత్రమే కాడు. అనుపమాన శాస్త్రవేత్త, ఇంజినీరు...

"ఒకే పుట్టినరోజు" సమస్యపార్టీలలో సరదాగా అడగదగ్గ ఓ సమస్య ఇది.ఓ గదిలో 23 మంది ఉన్నారను కోండి. వాళ్లలో ఏ ఇద్దరి పుట్టిన రోజులైనా ఒక్కటి అయ్యే ఆస్కారం ఎంత? (పుట్టిన తారీఖు, నెల ఒకటైతే చాలు, సంవత్సరం ఒక్కటి కానక్కర్లేదు.)మామూలుగా ఆలోచిస్తే చాలా తక్కువే అనిపిస్తుంది. ఏడాదిలో 365 రోజుల్లో ఇద్దరి పుట్టినరోజులు ఒకటయ్యే ఆస్కారం మరి తక్కువే అనిపిస్తుంది. కాని మొత్తం 23 మందిలో ఏ ఇద్దరి పుట్టినరోజులైనా ఒక్కటయ్యే ఆస్కారం అంటే కొంచెం ఎక్కువే కావచ్చు....

ఫాబ్రికా (చిత్రం) ప్రభావం యూరప్ ఖండం అంతా పాకింది. లాటిన్ నుండి ఆ పుస్తకాన్ని జర్మన్, ఫ్రెంచ్ వంటి ఆధునిక భాషల్లోకి కూడా తర్జుమా చేశారు. వెసేలియస్ అధ్యయనాలతో ప్రభావితులై అతడి బాటనే అనుసరించిన శరీర శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారు. చెప్పుడు మాటల మీద కాక ప్రత్యక్షానుభూతికి, ప్రయోగానికి ప్రాముఖ్యత నిస్తూ ఆధునిక వైద్య సాంప్రదాయానికి పునాదులు వేసిన వెసేలియస్ జీవితం సాఫీగా సాగిపోయింది అనుకుంటే పొరబాటే. ఫాబ్రికా వలన ప్రభావితులు అయినవారు ఉన్నట్టే,...

ఈ రెండు అస్తిపంజరాలని పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తుంటే ఒక రోజు ఎంతో కాలంగా తనని వేధిస్తున్న ఓ ప్రశ్న మబ్బులా విడిపోయింది.(ఫాబ్రికా నుండి ఓ చిత్రం)గాలెన్ బోధనలన్నీ తప్పులతడకలు అనుకోవడంలో పొరబాటు తనదే! గాలెన్ పొరబడలేదు. నిజంగానే అతడు మహా ప్రతిభావంతుడు. శవపరిచ్ఛేదనలో తను ప్రదర్శించిన సూక్ష్మబుద్ధిలో, నిశితదృష్టిలో వెలితి లేదు. అయితే వచ్చిన చిక్కేంటంటే గాలెన్ వర్ణించింది మానవ శరీరాలని కాదు! జంతు శరీరాలని. మానవ శరీరాలని దృష్టిలో పెట్టుకుని...

వెసేలియస్ - వైద్య లోకపు గెలీలియో1514 లో, డిసెంబర్ 21, బెల్జియం లోని బ్రసెల్స్ నగరంలో పుట్టాడు ఆండ్రియాస్ వెసేలియస్. వాళ్ల కుటుంబంలో అప్పటికే నలుగురు డాక్టర్లు ఉన్నారట. ఐదో డాక్టర్ కావాలని కుర్రవాడైన వెసేలియస్ కి తెగ ఉత్సాహంగా ఉండేది. కనుక వైద్య నేర్చుకోడానికి పారిస్ వెళ్ళాడు.ఆ రోజుల్లో పారిస్ లో వైద్య విద్యాలయాల్లో వ్యవహారం మహా ఛాందసంగా, సాంప్రదాయ బద్ధంగా ఉండేది. గాలెన్ చెప్పిందే వేదం. మంగలివాళ్లు శవాలు కోస్తుంటే అల్లంత దూరంలో వైద్యులు...

ప్లేటోనిక్ ఘనవస్తువుల లక్షణాలుకుంభాకార క్రమ బహుముఖు లని (convex regular polyhedra) మాత్రమే ప్లేటోనిక్ ఘనవస్తువులు అంటారని ముందు చెప్పుకున్నాం.(కుంభాకార అంటే ఉబ్బిత్తుగా పొంగినట్టు, లొత్తలు లేకుండా ఉండేది, అని అర్థం. ఈ కుంభాకారత (convexity) కి మరింత శాస్త్రీయ నిర్వచనం ఉంది. ఒక వస్తువులో ఉన్న రెండు బిందువులు A, B లని ఒక ఋజురేఖతో కలిపితే ఆ రేఖ కూడా పూర్తిగా ఆ వస్తువులోనే ఇమిడి ఉంటే, ఆ వస్తువు కుంభాకార వస్తువు అన్నమాట).పైన ఇచ్చిన పట్టిక (table)...

ప్లేటోనిక్ ఘన వస్తువులు (Platonic Solids)జ్యామితిలో ఐదు ప్రత్యేకమైన ఘన వస్తువులు (solids) ఉన్నాయి. వీటిని సమిష్టిగా ప్లాటోనిక్ ఘనవస్తువులు అంటారు.ఈ వస్తువుల ముఖాలు సమతలాలు (flat sufrace). ప్రతీ ముఖం ఒక క్రమ బహుభుజి (regular polygon) అవుతుంది. క్రమ బహుభుజిలో అన్ని భుజాలు, అన్ని కోణాలు ఒక్కలా ఉంటాయి. (ఉదాహరణకి, సమబాహు త్రిభుజం, చదరం మొదలైనవి). క్రమ బహుభుజి లలో భుజాలు ఒక్కలా ఉన్నట్టే, ఈ ప్లాటోనిక్ ఘనవస్తువులలో ముఖాలన్నీ ఒక్కలా ఉంటాయి. అంటే...

ఒకసారి గాలెన్ ఓ పంది మీద శస్త్ర చికిత్స చేసున్నాడు. ఊపిరితిత్తులని శాసించే నాడులు ఎక్కడున్నాయో వెదుకుతున్నాడు. ఒక ప్రత్యేక నాడికి కోసే సరికి, అంతవరకు గిలగిల కొట్టుకుంటూ అరుస్తున్న పంది, అరవడం మానేసింది గాని, శ్వాస మాత్రం ఆగలేదు. ఇదే పద్ధతిలో మరి కొన్ని జంతువుల మీద ప్రయోగాలు చేసి ’స్వరాన్ని నియంత్రించే నాడి’ని కనుక్కున్నాడు గాలెన్. ఆ నాడులనే ప్రస్తుతం recurrent laryngeal నాడులు అంటారు.మన కదలికలని శాసించడంలో వెన్నుపాము (spinal cord) పాత్ర...

మైకేల్ ఫారడే చెప్పిన ’కొవ్వొత్తి రసాయన చరిత్ర’ (A Chemical History of a Candle)విద్యుదయస్కాంత, విద్యుత్ రసాయన శాస్త్రాలలో అగణనీయమైన కృషి చేసిన మైకేల్ ఫారడే పేరు తెలియన వారు వైజ్ఞానిక ప్రపంచంలో ఉండరు.ఫారడే 1791 సెప్టెంబర్ 22 న ఒక పేద కుటుంబంలో లండన్ లో జన్మించాడు. తండ్రి కమ్మరి. పని కోసం లండన్ చేరుకున్నాడు. తండ్రి ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో ఫారడే 13 వ ఏట దినపత్రికలు వేయటం మొదలుపెట్టాడు. ఒక సంవత్సరానికి పుస్తకాలు బైండింగ్ నేర్చుకున్నాడు....

గాలెన్ఆధునిక టర్కీ లో ఉన్న అందమైన పెర్గమన్ నగరంలో రమారమి క్రీ.శ. 129 లో పుట్టాడు గాలెన్. అతడి తండ్రి నికొన్ ఓ స్థపతి (architect). గాలెన్ కి పదిహేడేళ్లప్పుడు నికొన్ కి ఎస్కులేపియస్ అనే దేవత కనిపించి కొడుకుని వైద్యుణ్ణి చెయ్యమని ఆదేశించాట్ట. (ఈ దేవత ఇప్పటికీ సర్వీస్ లో ఉంటే బహుచక్కని కెరియర్ కౌన్సెలర్ అయ్యేవాడేమో!) దేవత మాట నమ్మిన నికొన్ కొడుకుని పెర్గమన్ లోనే ఉన్న ఎస్కులేపియన్ అనే వైద్య విద్యాలయంలో చేర్పించాడు.ఈ వైద్యసంస్థలో వివిధ వైద్య...

మెదడు చరిత్ర గురించి వరుసగా కొన్ని పోస్ట్ లలో చెప్పుకొద్దామని ఉద్దేశం. అరిస్టాటిల్, గాలెన్ ల దగ్గర్నుండి, ఆధునికులైన రోజర్ స్పెర్రీ, సర్ జాన్ ఎక్లిస్ ల వరకు ఒక్కొక్కరి కృషి గురించి, భావనల గురించి క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తాను. ఈ సీరీస్ లో ఇది మొదటి పోస్ట్.---మెదడు చరిత్రమనిషి మెదడు గురించి మనిషి మెదడుకి తట్టిన ఆలోచనల చరిత్ర(హిప్పోక్రేటిస్)మానవుడు అన్న మాటకి ’మనసు గల వాడు’ అనే అర్థం వుంది. ఆ మనసు గలిగి ఉండే లక్షణమే మనిషిని జీవలోకంలో అగ్రస్థానంలో...

అంతకన్నా కొంచెం సున్నితమైన eye-tracker ని చేసిన వాడు చికాగో నగరానికి చెందిన గయ్ థామస్ బాస్వెల్. ఈ పద్ధతిలో కళ్ల మీదకి సన్నని కాంతి రేఖని ప్రసరిస్తారు. ఆ రేఖ కళ్ల మీద నుండి పరావర్తనం చెంది ఓ తెర మీద పడుతుంది. తెర మీద కాంతి బిందువు యొక్క కదలికలని బట్టి, కళ్ల కదలికల గురించి తెలుసుకోవచ్చు. మనుషులు చదువుతున్నప్పుడు, చిత్రాలు చూస్తున్నప్పుడు కళ్లు ఎలా కదులుతాయి అన్న విషయం మీద ఇతడు విస్తృతంగా పరిశోధనలు చేశాడు.1950 లలో ఆల్ఫ్రెడ్ యార్బస్ ఈ నయన చలనాల...

ఈ వ్యాసాన్ని మీ కళ్లు ఎలా చదువుతున్నాయి?మీరు దేన్నయినా చదువుతున్నప్పుడు మీ కళ్లు అక్షరాల మీద ఏ విధంగా కదులుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? మీ కళ్లు ఒక్కొక్క అక్షరాన్ని ఎడమ నుండి కుడి పక్కకి వరుసగా ఓ టైప్ రైటర్ లాగా చదువుతూ పోవు. పదం నుండి పదానికి, కొన్ని సార్లు పదాల కూటముల మీద గంతులు వేస్తూ పోతాయి. పోనీ వాక్యాలని చదువుతున్నప్పుడు ఎంత లేదన్నా వాక్యాల అమరిక మన కళ్ల కదలికలని శాసిస్తుంది. వాక్యాల కన్నా, అక్షరశూన్యమైన చిత్రాన్ని చూస్తున్నప్పుడు...
విద్య, వైజ్ఞానిక రంగాల్లో మా మిత్రుడు పైడన్న, నేను చేసిన అనువాదాలు. వీటిని ’జన విజ్ఞాన వేదిక’, "మంచి పుస్తకం" ప్రచురణలు కలిసి ప్రచురించాయి.మరిన్ని వివరాల కోసం:http://www.manchipustakam.in/showcat.asp?cat=101. “Learning all the time” by John Holt.నేర్చుకోవడం పిలల్ల నైజంఅనువాదం: శ్రీనివాస చక్రవర్తి2. “How children learn” by John Holtపిల్లలు ఎలా నేర్చుకుంటారు. - 4 volumesఅనువాదం: శ్రీనివాస చక్రవర్తి3. “A chemical history of candle” by Michael Faradayకొవ్వొత్తి రసాయన చరిత్రఅనువాదం: శ్రీనివాస చక్రవర్తి4. “The Story of Physics” by...
పావులూరి మల్లన చెప్పిన కవితా గణితంమహావీర్యాచార్యుడు క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో సంస్కృతంలో రాసిన "గణితసార సంగ్రహం" అనే గణిత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన వాడు పావులూరి మల్లన. "సారసంగ్రహ గణితం" అన్న పేరు గల ఈ పుస్తకం కేవలం ఓ లెక్కల పుస్తకంలా కాక పద్యకావ్యంలా ఉంటుంది. అందులో చక్కని పద్యాలతో లెక్కలని వర్ణిస్తాడు. తెలుగులో ఇదే మొట్టమొదటి గణిత గ్రంథమని చెప్పుకుంటారు.ఆ పుస్తకం లోంచి ఓ పద్యం/సమస్య:ఖర్జూర ఫలములు గణకుండు కొనితెచ్చి సగపాలు మోహంపు సతికి నిచ్చెనందు నాల్గవ పాలు ననుగు దమ్ముని కిచ్చె నష్ట భాగం బిచ్చె ననుజు సతికితగ...

(కాస్మో-1 ఊహా చిత్రం)సౌర తెరచాపలకి కొన్ని కనీస అర్హతలు ఉండాలి.1. వీటి వైశాల్యం వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వైశాల్యం ఎంత ఎక్కువ ఉంటే, తెరచాప మీద కాంతి చూపించే బలం అంత ఎక్కువగా ఉంటుంది.2. బరువు తక్కువగా ఉండాలి. వీటి బరువే ఎక్కువ ఉంటే, ఇక వీటిని కదిలించే సరికే సరిపోతుంది.3. ఇవి ధృఢంగా ఉండాలి. దారే పోయే ఉల్కల నుండి రాలే రేణువుల తాకిడికి దెబ్బతినకుండా ఉండాలి. అలాగే అంతరిక్షంలో ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పులకి దెబ్బ తినకుండా ఉండాలి.సౌర...

సౌర తెరచాపలుసౌరశక్తి కేవలం నీళ్లు కాచుకోవడానికి, ఆమ్లెట్లు వేసుకోవడానికి మాత్రమే కాదు. అంత కన్నా గొప్ప ప్రయోజనాలు అంతరిక్షంలో ఉన్నాయి.అలాంటి ప్రయోజనాలలో ఒకటి సౌర తెరచాప.వీచేగాలి తోసే తోపుకి పడవ కదిలినట్టు, సూర్య కాంతి ఈ సౌరతెరచాపల మీద చేసే ఒత్తిడికి వ్యోమనౌకలు బలం పుంజుకుంటాయన్న మాట!కాని అసలు కాంతి ఒత్తిడి చెయ్యడం ఏంటి అంటారా?కాంతి విద్యుదయస్కాంత తరంగం అని విద్యుదయస్కాంత శాస్త్రం చెప్తుంది. అందులోని శక్తి ఫోటాన్లు అనే రేణువుల (particles)...

గత మూడు పోస్ట్ లలో వర్ణించబడ్డ ఎండ పొయ్యిలు సరళమైనవి, ఎవరికి వారు ఇంట్లో చేసుకోదగ్గవి. కాని వాటితో ఒక ఇబ్బంది ఏంటంటే అవి ఆరుబయట మాత్రమే పని చేస్తాయి. కాని ఇంట్లో వంట గదిలో వండుకోవాలంటే ఆ పద్ధతి పని చెయ్యదు. ఆరుబయట సూర్య తాపాన్ని ఏదో విధంగా సేకరించి దాన్ని ఇంట్లోకి, వంటింట్లోకి పంపించగలిగితే సౌకర్యంగా ఉంటుంది.అలాంటి మరో ఎండపొయ్యి డిజైన్ ని ఇప్పుడు చూద్దాం.మూల సూత్రం:ఈ సాధనంలో ఆరుబయట లభ్యం అయ్యే సూర్య తాపంతో చమురును వేడి చేసి, ఆ వేడెక్కిన...

నీటి కటకంతో ఎండపొయ్యిఎండపొయ్యిలలో మరొ చక్కని డిజైన్ ని గమనిద్దాం. ఇందులో సూర్యకిరణాలని పాత్రమీద కేంద్రీకరించడం జరుగుతుంది. అలా పాత్ర వేడెక్కుతుంది. పాత్రలో ఉన్న పదార్థం ఉడుకుతుంది.కాంతిని కేంద్రీకరించడానికి ఇందులో ఒక కటకాన్ని (లెన్స్) వాడుతారు. అయితే ఇది మామూలు లెన్స్ కాదు. మామూలు లెన్స్ ల ఖరీదు కొంచెం ఎక్కువ. ముఖ్యంగా వంట చేసుకోవడానికి కావలసిన లెన్స్ అంటే ఒకటి రెండు అడుగుల వ్యాసం ఉన్న లెన్స్ ఖరీదు వేలలో ఉంటుంది.కాని అలాంటి లెన్స్ ని చాలా...

వరద ప్రాంతాల్లో తాగు నీటి కొరతే కాక, వండుకోడానికి తగ్గ వసతులు కూడా ఒక్కోచోట ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఎండ పొయ్యిలు (solar cookers) చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎండ పొయ్యిలలో లెక్కలేనన్ని డిజైన్లు ఉన్నాయి.వాహనం టైరుని ఉపయోగించి నిర్మించబడే ఓ ఎండపొయ్యి పనితీరు చూద్దాం. దీన్ని డిజైన్ చేసిన వారు సురేష్ వైద్యరాజన్ అనే అర్కిటెక్ట్.నిర్మాణం:1. ఒక పాత కార్ టైరు (ట్యూబు) తీసుకోవాలి. పంచరు ఉంటే దాన్ని పూడ్చి, ట్యూబులో గాలి పూరించి దాన్నొక చెక్క పలక మీద...

ఇటీవల వరదల వల్ల రాష్ట్రంలో ఎంత ఘోరమైన విధ్వంసం జరిగిందీ చూస్తూనే వున్నాం.వరద బాధితులు ఎదుర్కునే ఓ ముఖ్యమైన సమస్యల్లో ఒకటి ఆహారం కొరత, మంచినీటి కొరత. నలుదిశలా నీరు ఉన్నా అది కలుషితమై వుంటుంది కనుక, మంచి నీటి గొట్టాల్లో, బావుల్లో, చెరువుల్లో కూడా ఆ నీరు కలిసిపోయి వుంటుంది కనుక ఆ నీటిని శుద్ధి చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. అయితే నీటిని కాచుకోవడానికి అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి విద్యుత్తు కూడా ఉండదు కనుక ఇదో పెద్ద సమస్య అవుతుంది.అలాంటి సందర్భాలలో...

స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో అత్యంత కీలకమైన అంశం దానికి మూలమైన "త్రాడు" యొక్క నిర్మాణం. ఆ త్రాడు చాలా తేలిగ్గా, చాలా బలంగా ఉండాలి. దాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి వీలవ్వాలి. ఖరీదు మరీ ఎక్కువ కాకూడదు. ఆ పదార్థం యొక్క tensile strength విలువ 65-120 Giga Pascals (GPa)అయ్యుండాలి. (Pascal పీడనాన్ని (pressure) కొలిచే యూనిట్. సైకిల్ టైరులో పీడనం 500-600 kilo Pascals ఉంటుంది. దీన్ని బట్టి Giga Pascal విలువ ఎంతో ఊహించుకోవచ్చు). అంతే కాక అంతరిక్షంలో...

రాకెట్ యుగానికి పునాది రాళ్ళు పేర్చిన వాళ్లలో ఇద్దరు ముఖ్యులు. ఒకరు అమెరికాకి చెందిన గోడార్డ్, మరొకరు రష్యాకి చెందిన సియాల్కీవిస్కీ.రాకెట్ సాంకేతిక విషయాల గురించి పందొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలో ఎన్నో విషయాలు ఊహించి, సైద్ధాంతికంగా లెక్కలు వేసిన వాడు ఈ సియాల్కోవిస్కీ. అప్పటికే ద్రవ్య ఇంధనాల గురించి, వాటి మంచి చెడ్డల గురించి చర్చించాడు. ఇంధనం మండడానికి ఆక్సిజన్ అవసరం గనుక, అంతరిక్షంలో అది దొరకదు కనుక, తక్కువ పరిమాణం ఉండేలా ఆక్సిజన్ ని ద్రవ్యరూపంలో...

ఆకాశానికి నిచ్చెనలు వెయ్యగలమా? - 2పక్కన చిత్రంలో ’స్పేస్ ఎలివేటర్’ ని చూడొచ్చు. ఒక ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతున్నట్టు, ఈ త్రాడు మొత్తం నిలువుగా ఉంటూ భూమితో పాటూ భూమి ఆత్మభ్రమణ వేగంతోనే భూమి చుట్టు తిరుగుతుంటుంది.నిలువుగా విస్తరించి వుంటుంది గనుక, త్రాడు మీద బలాల సమతూనికని వర్ణిస్తూ లెక్కలు వెయ్యడం కొంచెం కష్టం గాని, బిందు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భారం (point mass) మీద పని చేసే బలాలని సులభంగా అంచనా వెయ్యొచ్చు.దాని మీద రెండు బలాలు పని చేస్తుంటాయి.-...
postlink