శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

సుబ్బారావు – సాపేక్ష లోకం

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, July 11, 2010మా ఊళ్లో స్పీడ్ లిమిట్

ఆ రోజు బ్యాంక్ హాలీడే.

గడియారం తొమ్మిది కొట్టింది. నెమ్మదిగా దుప్పటి తెరుచుకుని, ఒళ్లు విరుచుకుని, కళ్లు నులుముకుని బద్ధకంగా లోకం కేసి చూశాడు సుబ్బారావ్. చదవని పరీక్షలో ఆన్సరు పేపర్ లా రోజంతా ఖాళీగా కనిపించి వెక్కిరిస్తోంది. సవాలు చేస్తోంది. బాంక్ ఉన్న రోజుల్లో అయితే బెంగ లేదు. గంట గంటకీ టీ కాఫీలు, మేనేజర్ వ్యక్తిగత జీవితం గురించి తోటి ఉద్యోగులతో కూపీలు, క్రికెట్ స్కోర్లు రంజీత్ టోఫీలు... కాలానికి నిప్పెట్టడానికి శతకోటి మార్గాలు. కాని ఈ రోజు పొద్దుపోయేదెలా?మెల్లగా శక్తంతా కూడదీసుకుని, పక్క మీంచి లేచి, ఒక్కడూ వెళ్లి వరండాలో కూర్చుని ఓ రంకె వెయ్యగానే, సతీ సక్కుబాయి లాంటి భార్య రుక్మిణి, ఠక్కున ఓ కప్పు తెచ్చి చేతిలో పెట్టింది. చిన్న చప్పుడుతో కాఫీ ఆస్వాదిస్తూ, మందగమనంతో ఎక్స్ ప్రెస్ తిరగేస్తూ కూర్చున్నాడు. తన దృష్టి ముందు సినిమాల కాలమ్ మీద, ముఖ్యంగా ఓ కొత్త సినిమా మీద పడింది. “లేచిపోదాం...రా!” ఛీఛీ! ప్రతీ సినిమాలోను ఇదే గోల. అయినా వీళ్లు మనుషులా పక్షులా? కాస్త ఎదిగిన కూతురున్న సుబ్బారావుకి ఆ రోజు సినిమాలేవీ నచ్చలేదు.

ఏదో కొత్తదనం కోసం వెతుకుతున్న సుబ్బారావుకి ఒకే సినిమాకి నానా పేర్లూ పెట్టి కాలమ్ నిండా అచ్చు వేశారేమోనన్న చిన్న అనుమానం కూడా కలిగింది. విసుగుతో సినిమాల పేజీ తిప్పి మిగతా పేజీలు తిరగేస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక చోట మూలగా అచ్చయిన ఓ చిన్న ప్రకటన తన దృష్టిని ఆకట్టుకుంది. దగ్గర్లోనే ఉన్న ఓ కాలేజిలో ఆధ్జునిక భౌతిక శాస్త్రం మీద వరుసగా ఉపన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఐనిస్టయిన్ సాపేక్షతా వాదం మీద ఉపన్యాసం. పిక్చరు మాని లెక్చరు కెళ్తే ఎలా ఉంటుందని ఓ సారి ఆలోచించాడు. ఈ మొత్తం భూప్రపంచకంలో ఐనిస్టయిన్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న వాళ్లు పట్టుమని ఓ డజను మంది కన్నా ఉండరని ఎక్కడో విన్నాడు. ఏం తెలుసు? తను పదమూడో వాడు అవుతాడేమో? ఎలాగైనా ఈ లెక్చరు కెళ్లాల్సిందే, అసలు ఇలాంటి లెక్చర్లు తన లాంటి వారి కోసమేనని అక్కడి వాళ్లకి నిరూపించాల్సిందే – అనుకున్నాడు సుబ్బారావు.

కొంచెం ఆలస్యంగా కాలేజి ఆడిటోరియం చేరాడు సుబ్బారావు. అప్పటికే ఉపన్యాసం మొదలైపోయింది. ఆడిటోరియంలో ఎక్కువగా స్టూడెంట్లే ఉన్నారు. జెండా కొయ్య లాంటి, నెరిసిన గడ్డపు పెద్దాయన ఎవరో బ్లాక్ బోర్డు మీద ఏవో పిచ్చి గీతలు గీస్తూ సాపేక్షతా వాదానికి సంబంధించిన మౌలిక భావనలు వివరిస్తుంటే పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు.

విన్న కాసేపట్లో సుబ్బారావుకి ఐనిస్టయిన్ సిద్ధాంతం గురించి ఒక విషయం అర్థమయ్యింది. సాధ్యమైన వేగాలలో ఒక గరిష్ఠ వేగం ఉంటుందని, కదిలే ఏ వస్తువూ అంత కన్నా ఎక్కువ వేగంతో కదలలేదని, ఈ పరిమితి వల్ల కొన్ని విచిత్రమైన పరిణామాలు కలుగుతున్నాయని మాత్రం అతడి అర్థమయ్యింది. అయితే ఆ గరిష్ఠ వేగం సెకనుకి 186,000 మైళ్లని, అందుకే సాధారణ జీవనంలో సాపేక్షతా ప్రభావాలు కనిపించవని కూడా ఉపన్యాసం చెప్తున్న ప్రొఫెసర్ అన్నాడు. ఆ సాపేక్షతా ప్రభావాల గురించి ఆలోచిస్తే చాలా విపరీతంగా అనిపించాయి సుబ్బారావుకి. ప్రపంచం పట్ల మనకి ఉండే సాధారణ అవగాహనకి, ఆ ప్రభావాలకి మధ్య ఎక్కడా సంబంధం లేనట్టు కనిపించింది. కుంచించుకుపోయే మానదండాల (measuring rods) గురించి, వేగం తగ్గే విడ్డూరపు గడియారాల గురించి ఊహించుకోవడం మొదలెట్టాడు. కాంతివేగాన్ని సమీపిస్తుంటే ఇలాంటి పరిణామాలు కనిపిస్తాయని ఫ్రొఫెసర్ అన్నాడు. వాటి గురించి ఆలోచిస్తుంటే మెల్లగా నిద్ర ముంచుకొచ్చింది.
(సశేషం...)

8 comments

 1. nagarjuna Says:
 2. అసలు వేగానికి ఒక గరిష్ట పరిమితి ఉంటుందనే విషయం ఇప్పటికి నాకు ఆశ్చర్యంగానూ,అనుమానంగాను ఉంటుంది. అప్పట్లో కాంతి కూడా accelerate (తెలుగు పదం ? ) అవుతుంది అని శాస్త్రజ్ఞులు కనుగొన్నారని విన్నాను. దాని సంగతి ఎంటొకుడా తెలియలేదు

 3. అవును. వేగానికి గరిష్ఠ పరిమితి ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే v అనే వేగం ఉంటే సాపేక్ష వేగాల సూత్రాన్ని ఉపయోగించి అంత కన్నా ఎక్కువ వేగాన్ని సాధించవచ్చని హైస్కూల్ భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం.
  ఎందుకంటే v అన్న వేగం గల రెండు వాహనాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వాహనం నుండి చూస్తే అవతలి వాహనం 2v వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగా అనంతంగా వేగాన్ని పెంచుకోవచ్చని అనిపిస్తుంది. కాని ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో (special theory of relativity) ఐనిస్టయిన్ కనుక్కున్నది ఏంటంటే అంతకు ముందు గెలీలియో కాలం నాటి నుండి ప్రతిపాదించిన సాపేక్ష వేగాల సూత్రాలు తప్పని. అవి చిన్న చిన్న వేగాల వద్దనే వర్తిస్తాయని. కాంతిని సమీపించే వేగాల వద్ద పని చెయ్యవని.

  గెలీలియన్ సాపేక్షతా వేగాల సూత్రాలు:
  రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఎదురెదురుగా వస్తే వాటి మధ్య సాపేక్ష వేగం u+v అవుతుంది.
  అలాగే రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి మధ్య సాపేక్ష వేగం u-v అవుతుంది.

  కాని మికెల్సన్ మార్లే ప్రయోగం (Michleson-Morley) ప్రయోగం ప్రకారం ఈ సాపేక్ష వేగాల సూత్రం కాంతికి వర్తించదన్న విషయం అర్థమయ్యింది. (నిజానికి వారి ప్రయోగ ఫలితాలని ఆ విధంగా అన్వయించింది ఐనిస్టయిన్ యే).

  ఎందుకంటే c వేగంతో ప్రయాణించే ఓ కాంతి పుంజం (light beam) పక్కగా v వేగంతో అదే దిశలో ప్రయాణిస్తే కాంతి పుంజం c-v వేగంతో ప్రయాణించినట్టు ఉండదు, మారని c వేగంతోనే ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది.
  ఈ విషయంలోకి ఇంకా లోతుగా శోధించిన సాపేక్షతా సిద్ధాంతం, సాంప్రదాయక సాపేక్ష వేగాల సూత్రాలని కేవలం కాంతి మాత్రమే ఉల్లంఘించడం లేదని, అసలు ఆ సూత్రమే తప్పని, దాని మరింత నిర్దుష్ట రూపం ఇలా ఉంటుందని ప్రతిపాదించింది:

  సాపేక్ష వేగం = (u+v)/(1 + uv/(c*c))
  పై సూత్రంలో u=c అనుకుంటే, సాపేక్ష వేగం c యే అవుతుంది.
  ఆ విధంగా కాంతి యొక్క ఈ ప్రత్యేక లక్షణం వల్ల విశ్వంలో అన్ని వేగాలకి ఓ గరిష్ఠ పరిమితి ఏర్పడుతోంది.

  కాంతి యొక్క త్వరణం (acceleration) గురించి నాకు తెలీదు. త్వరణం అనేది సామాన్య సాపేక్షతా సిద్ధాంతం కిందకి వస్తుంది. గురుత్వ క్షేత్రంలో కాంతి వంగగలదు. అది ఒక విధంగా త్వరణం చెందడమే అవుతుంది. కాని నాకు అంతకన్నా వివరాలు తెలివు. ఎవరైనా సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తని అడగాలి.

 4. అవును. వేగానికి గరిష్ఠ పరిమితి ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే v అనే వేగం ఉంటే సాపేక్ష వేగాల సూత్రాన్ని ఉపయోగించి అంత కన్నా ఎక్కువ వేగాన్ని సాధించవచ్చని హైస్కూల్ భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం.
  ఎందుకంటే v అన్న వేగం గల రెండు వాహనాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వాహనం నుండి చూస్తే అవతలి వాహనం 2v వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగా అనంతంగా వేగాన్ని పెంచుకోవచ్చని అనిపిస్తుంది. కాని ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో (special theory of relativity) ఐనిస్టయిన్ కనుక్కున్నది ఏంటంటే అంతకు ముందు గెలీలియో కాలం నాటి నుండి ప్రతిపాదించిన సాపేక్ష వేగాల సూత్రాలు తప్పని. అవి చిన్న చిన్న వేగాల వద్దనే వర్తిస్తాయని. కాంతిని సమీపించే వేగాల వద్ద పని చెయ్యవని.

  గెలీలియన్ సాపేక్షతా వేగాల సూత్రాలు:
  రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఎదురెదురుగా వస్తే వాటి మధ్య సాపేక్ష వేగం u+v అవుతుంది.
  అలాగే రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి మధ్య సాపేక్ష వేగం u-v అవుతుంది.

  కాని మికెల్సన్ మార్లే ప్రయోగం (Michleson-Morley) ప్రయోగం ప్రకారం ఈ సాపేక్ష వేగాల సూత్రం కాంతికి వర్తించదన్న విషయం అర్థమయ్యింది. (నిజానికి వారి ప్రయోగ ఫలితాలని ఆ విధంగా అన్వయించింది ఐనిస్టయిన్ యే).

  ఎందుకంటే c వేగంతో ప్రయాణించే ఓ కాంతి పుంజం (light beam) పక్కగా v వేగంతో అదే దిశలో ప్రయాణిస్తే కాంతి పుంజం c-v వేగంతో ప్రయాణించినట్టు ఉండదు, మారని c వేగంతోనే ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది.
  ఈ విషయంలోకి ఇంకా లోతుగా శోధించిన సాపేక్షతా సిద్ధాంతం, సాంప్రదాయక సాపేక్ష వేగాల సూత్రాలని కేవలం కాంతి మాత్రమే ఉల్లంఘించడం లేదని, అసలు ఆ సూత్రమే తప్పని, దాని మరింత నిర్దుష్ట రూపం ఇలా ఉంటుందని ప్రతిపాదించింది:

  సాపేక్ష వేగం = (u+v)/(1 + uv/(c*c))
  పై సూత్రంలో u=c అనుకుంటే, సాపేక్ష వేగం c యే అవుతుంది.
  ఆ విధంగా కాంతి యొక్క ఈ ప్రత్యేక లక్షణం వల్ల విశ్వంలో అన్ని వేగాలకి ఓ గరిష్ఠ పరిమితి ఏర్పడుతోంది.

  కాంతి యొక్క త్వరణం (acceleration) గురించి నాకు తెలీదు. త్వరణం అనేది సామాన్య సాపేక్షతా సిద్ధాంతం కిందకి వస్తుంది. గురుత్వ క్షేత్రంలో కాంతి వంగగలదు. అది ఒక విధంగా త్వరణం చెందడమే అవుతుంది. కాని నాకు అంతకన్నా వివరాలు తెలివు. ఎవరైనా సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తని అడగాలి.

 5. అవును. వేగానికి గరిష్ఠ పరిమితి ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే v అనే వేగం ఉంటే సాపేక్ష వేగాల సూత్రాన్ని ఉపయోగించి అంత కన్నా ఎక్కువ వేగాన్ని సాధించవచ్చని హైస్కూల్ భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం.
  ఎందుకంటే v అన్న వేగం గల రెండు వాహనాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వాహనం నుండి చూస్తే అవతలి వాహనం 2v వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగా అనంతంగా వేగాన్ని పెంచుకోవచ్చని అనిపిస్తుంది. కాని ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో (special theory of relativity) ఐనిస్టయిన్ కనుక్కున్నది ఏంటంటే అంతకు ముందు గెలీలియో కాలం నాటి నుండి ప్రతిపాదించిన సాపేక్ష వేగాల సూత్రాలు తప్పని. అవి చిన్న చిన్న వేగాల వద్దనే వర్తిస్తాయని. కాంతిని సమీపించే వేగాల వద్ద పని చెయ్యవని.

  గెలీలియన్ సాపేక్షతా వేగాల సూత్రాలు:
  రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఎదురెదురుగా వస్తే వాటి మధ్య సాపేక్ష వేగం u+v అవుతుంది.
  అలాగే రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి మధ్య సాపేక్ష వేగం u-v అవుతుంది.

  కాని మికెల్సన్ మార్లే ప్రయోగం (Michleson-Morley) ప్రయోగం ప్రకారం ఈ సాపేక్ష వేగాల సూత్రం కాంతికి వర్తించదన్న విషయం అర్థమయ్యింది. (నిజానికి వారి ప్రయోగ ఫలితాలని ఆ విధంగా అన్వయించింది ఐనిస్టయిన్ యే).

  ఎందుకంటే c వేగంతో ప్రయాణించే ఓ కాంతి పుంజం (light beam) పక్కగా v వేగంతో అదే దిశలో ప్రయాణిస్తే కాంతి పుంజం c-v వేగంతో ప్రయాణించినట్టు ఉండదు, మారని c వేగంతోనే ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది.
  ఈ విషయంలోకి ఇంకా లోతుగా శోధించిన సాపేక్షతా సిద్ధాంతం, సాంప్రదాయక సాపేక్ష వేగాల సూత్రాలని కేవలం కాంతి మాత్రమే ఉల్లంఘించడం లేదని, అసలు ఆ సూత్రమే తప్పని, దాని మరింత నిర్దుష్ట రూపం ఇలా ఉంటుందని ప్రతిపాదించింది:

  సాపేక్ష వేగం = (u+v)/(1 + uv/(c*c))
  పై సూత్రంలో u=c అనుకుంటే, సాపేక్ష వేగం c యే అవుతుంది.
  ఆ విధంగా కాంతి యొక్క ఈ ప్రత్యేక లక్షణం వల్ల విశ్వంలో అన్ని వేగాలకి ఓ గరిష్ఠ పరిమితి ఏర్పడుతోంది.

  కాంతి యొక్క త్వరణం (acceleration) గురించి నాకు తెలీదు. త్వరణం అనేది సామాన్య సాపేక్షతా సిద్ధాంతం కిందకి వస్తుంది. గురుత్వ క్షేత్రంలో కాంతి వంగగలదు. అది ఒక విధంగా త్వరణం చెందడమే అవుతుంది. కాని నాకు అంతకన్నా వివరాలు తెలివు. ఎవరైనా సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తని అడగాలి.

 6. అవును. వేగానికి గరిష్ఠ పరిమితి ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే v అనే వేగం ఉంటే సాపేక్ష వేగాల సూత్రాన్ని ఉపయోగించి అంత కన్నా ఎక్కువ వేగాన్ని సాధించవచ్చని హైస్కూల్ భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం.
  ఎందుకంటే v అన్న వేగం గల రెండు వాహనాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వాహనం నుండి చూస్తే అవతలి వాహనం 2v వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగా అనంతంగా వేగాన్ని పెంచుకోవచ్చని అనిపిస్తుంది. కాని ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో (special theory of relativity) ఐనిస్టయిన్ కనుక్కున్నది ఏంటంటే అంతకు ముందు గెలీలియో కాలం నాటి నుండి ప్రతిపాదించిన సాపేక్ష వేగాల సూత్రాలు తప్పని. అవి చిన్న చిన్న వేగాల వద్దనే వర్తిస్తాయని. కాంతిని సమీపించే వేగాల వద్ద పని చెయ్యవని.

  గెలీలియన్ సాపేక్షతా వేగాల సూత్రాలు:
  రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఎదురెదురుగా వస్తే వాటి మధ్య సాపేక్ష వేగం u+v అవుతుంది.
  అలాగే రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి మధ్య సాపేక్ష వేగం u-v అవుతుంది.

  కాని మికెల్సన్ మార్లే ప్రయోగం (Michleson-Morley) ప్రయోగం ప్రకారం ఈ సాపేక్ష వేగాల సూత్రం కాంతికి వర్తించదన్న విషయం అర్థమయ్యింది. (నిజానికి వారి ప్రయోగ ఫలితాలని ఆ విధంగా అన్వయించింది ఐనిస్టయిన్ యే).

  ఎందుకంటే c వేగంతో ప్రయాణించే ఓ కాంతి పుంజం (light beam) పక్కగా v వేగంతో అదే దిశలో ప్రయాణిస్తే కాంతి పుంజం c-v వేగంతో ప్రయాణించినట్టు ఉండదు, మారని c వేగంతోనే ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది.
  ఈ విషయంలోకి ఇంకా లోతుగా శోధించిన సాపేక్షతా సిద్ధాంతం, సాంప్రదాయక సాపేక్ష వేగాల సూత్రాలని కేవలం కాంతి మాత్రమే ఉల్లంఘించడం లేదని, అసలు ఆ సూత్రమే తప్పని, దాని మరింత నిర్దుష్ట రూపం ఇలా ఉంటుందని ప్రతిపాదించింది:

  సాపేక్ష వేగం = (u+v)/(1 + uv/(c*c))
  పై సూత్రంలో u=c అనుకుంటే, సాపేక్ష వేగం c యే అవుతుంది.
  ఆ విధంగా కాంతి యొక్క ఈ ప్రత్యేక లక్షణం వల్ల విశ్వంలో అన్ని వేగాలకి ఓ గరిష్ఠ పరిమితి ఏర్పడుతోంది.

  కాంతి యొక్క త్వరణం (acceleration) గురించి నాకు తెలీదు. త్వరణం అనేది సామాన్య సాపేక్షతా సిద్ధాంతం కిందకి వస్తుంది. గురుత్వ క్షేత్రంలో కాంతి వంగగలదు. అది ఒక విధంగా త్వరణం చెందడమే అవుతుంది. కాని నాకు అంతకన్నా వివరాలు తెలివు. ఎవరైనా సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తని అడగాలి.

 7. అవును. వేగానికి గరిష్ఠ పరిమితి ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే v అనే వేగం ఉంటే సాపేక్ష వేగాల సూత్రాన్ని ఉపయోగించి అంత కన్నా ఎక్కువ వేగాన్ని సాధించవచ్చని హైస్కూల్ భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం.
  ఎందుకంటే v అన్న వేగం గల రెండు వాహనాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వాహనం నుండి చూస్తే అవతలి వాహనం 2v వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగా అనంతంగా వేగాన్ని పెంచుకోవచ్చని అనిపిస్తుంది. కాని ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో (special theory of relativity) ఐనిస్టయిన్ కనుక్కున్నది ఏంటంటే అంతకు ముందు గెలీలియో కాలం నాటి నుండి ప్రతిపాదించిన సాపేక్ష వేగాల సూత్రాలు తప్పని. అవి చిన్న చిన్న వేగాల వద్దనే వర్తిస్తాయని. కాంతిని సమీపించే వేగాల వద్ద పని చెయ్యవని.

  గెలీలియన్ సాపేక్షతా వేగాల సూత్రాలు:
  రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఎదురెదురుగా వస్తే వాటి మధ్య సాపేక్ష వేగం u+v అవుతుంది.
  అలాగే రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి మధ్య సాపేక్ష వేగం u-v అవుతుంది.

  కాని మికెల్సన్ మార్లే ప్రయోగం (Michleson-Morley) ప్రయోగం ప్రకారం ఈ సాపేక్ష వేగాల సూత్రం కాంతికి వర్తించదన్న విషయం అర్థమయ్యింది. (నిజానికి వారి ప్రయోగ ఫలితాలని ఆ విధంగా అన్వయించింది ఐనిస్టయిన్ యే).

  ఎందుకంటే c వేగంతో ప్రయాణించే ఓ కాంతి పుంజం (light beam) పక్కగా v వేగంతో అదే దిశలో ప్రయాణిస్తే కాంతి పుంజం c-v వేగంతో ప్రయాణించినట్టు ఉండదు, మారని c వేగంతోనే ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది.
  ఈ విషయంలోకి ఇంకా లోతుగా శోధించిన సాపేక్షతా సిద్ధాంతం, సాంప్రదాయక సాపేక్ష వేగాల సూత్రాలని కేవలం కాంతి మాత్రమే ఉల్లంఘించడం లేదని, అసలు ఆ సూత్రమే తప్పని, దాని మరింత నిర్దుష్ట రూపం ఇలా ఉంటుందని ప్రతిపాదించింది:

  సాపేక్ష వేగం = (u+v)/(1 + uv/(c*c))
  పై సూత్రంలో u=c అనుకుంటే, సాపేక్ష వేగం c యే అవుతుంది.
  ఆ విధంగా కాంతి యొక్క ఈ ప్రత్యేక లక్షణం వల్ల విశ్వంలో అన్ని వేగాలకి ఓ గరిష్ఠ పరిమితి ఏర్పడుతోంది.

  కాంతి యొక్క త్వరణం (acceleration) గురించి నాకు తెలీదు. త్వరణం అనేది సామాన్య సాపేక్షతా సిద్ధాంతం కిందకి వస్తుంది. గురుత్వ క్షేత్రంలో కాంతి వంగగలదు. అది ఒక విధంగా త్వరణం చెందడమే అవుతుంది. కాని నాకు అంతకన్నా వివరాలు తెలివు. ఎవరైనా సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తని అడగాలి.

 8. అవును. వేగానికి గరిష్ఠ పరిమితి ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే v అనే వేగం ఉంటే సాపేక్ష వేగాల సూత్రాన్ని ఉపయోగించి అంత కన్నా ఎక్కువ వేగాన్ని సాధించవచ్చని హైస్కూల్ భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం.
  ఎందుకంటే v అన్న వేగం గల రెండు వాహనాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వాహనం నుండి చూస్తే అవతలి వాహనం 2v వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగా అనంతంగా వేగాన్ని పెంచుకోవచ్చని అనిపిస్తుంది. కాని ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో (special theory of relativity) ఐనిస్టయిన్ కనుక్కున్నది ఏంటంటే అంతకు ముందు గెలీలియో కాలం నాటి నుండి ప్రతిపాదించిన సాపేక్ష వేగాల సూత్రాలు తప్పని. అవి చిన్న చిన్న వేగాల వద్దనే వర్తిస్తాయని. కాంతిని సమీపించే వేగాల వద్ద పని చెయ్యవని.

  గెలీలియన్ సాపేక్షతా వేగాల సూత్రాలు:
  రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఎదురెదురుగా వస్తే వాటి మధ్య సాపేక్ష వేగం u+v అవుతుంది.
  అలాగే రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి మధ్య సాపేక్ష వేగం u-v అవుతుంది.

  కాని మికెల్సన్ మార్లే ప్రయోగం (Michleson-Morley) ప్రయోగం ప్రకారం ఈ సాపేక్ష వేగాల సూత్రం కాంతికి వర్తించదన్న విషయం అర్థమయ్యింది. (నిజానికి వారి ప్రయోగ ఫలితాలని ఆ విధంగా అన్వయించింది ఐనిస్టయిన్ యే).

  ఎందుకంటే c వేగంతో ప్రయాణించే ఓ కాంతి పుంజం (light beam) పక్కగా v వేగంతో అదే దిశలో ప్రయాణిస్తే కాంతి పుంజం c-v వేగంతో ప్రయాణించినట్టు ఉండదు, మారని c వేగంతోనే ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది.
  ఈ విషయంలోకి ఇంకా లోతుగా శోధించిన సాపేక్షతా సిద్ధాంతం, సాంప్రదాయక సాపేక్ష వేగాల సూత్రాలని కేవలం కాంతి మాత్రమే ఉల్లంఘించడం లేదని, అసలు ఆ సూత్రమే తప్పని, దాని మరింత నిర్దుష్ట రూపం ఇలా ఉంటుందని ప్రతిపాదించింది:

  సాపేక్ష వేగం = (u+v)/(1 + uv/(c*c))
  పై సూత్రంలో u=c అనుకుంటే, సాపేక్ష వేగం c యే అవుతుంది.
  ఆ విధంగా కాంతి యొక్క ఈ ప్రత్యేక లక్షణం వల్ల విశ్వంలో అన్ని వేగాలకి ఓ గరిష్ఠ పరిమితి ఏర్పడుతోంది.

  కాంతి యొక్క త్వరణం (acceleration) గురించి నాకు తెలీదు. త్వరణం అనేది సామాన్య సాపేక్షతా సిద్ధాంతం కిందకి వస్తుంది. గురుత్వ క్షేత్రంలో కాంతి వంగగలదు. అది ఒక విధంగా త్వరణం చెందడమే అవుతుంది. కాని నాకు అంతకన్నా వివరాలు తెలివు. ఎవరైనా సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తని అడగాలి.

 9. అవును. వేగానికి గరిష్ఠ పరిమితి ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే v అనే వేగం ఉంటే సాపేక్ష వేగాల సూత్రాన్ని ఉపయోగించి అంత కన్నా ఎక్కువ వేగాన్ని సాధించవచ్చని హైస్కూల్ భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం.
  ఎందుకంటే v అన్న వేగం గల రెండు వాహనాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక వాహనం నుండి చూస్తే అవతలి వాహనం 2v వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగా అనంతంగా వేగాన్ని పెంచుకోవచ్చని అనిపిస్తుంది. కాని ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో (special theory of relativity) ఐనిస్టయిన్ కనుక్కున్నది ఏంటంటే అంతకు ముందు గెలీలియో కాలం నాటి నుండి ప్రతిపాదించిన సాపేక్ష వేగాల సూత్రాలు తప్పని. అవి చిన్న చిన్న వేగాల వద్దనే వర్తిస్తాయని. కాంతిని సమీపించే వేగాల వద్ద పని చెయ్యవని.

  గెలీలియన్ సాపేక్షతా వేగాల సూత్రాలు:
  రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఎదురెదురుగా వస్తే వాటి మధ్య సాపేక్ష వేగం u+v అవుతుంది.
  అలాగే రెండు వస్తువులు u, v అనే వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తుంటే వాటి మధ్య సాపేక్ష వేగం u-v అవుతుంది.

  కాని మికెల్సన్ మార్లే ప్రయోగం (Michleson-Morley) ప్రయోగం ప్రకారం ఈ సాపేక్ష వేగాల సూత్రం కాంతికి వర్తించదన్న విషయం అర్థమయ్యింది. (నిజానికి వారి ప్రయోగ ఫలితాలని ఆ విధంగా అన్వయించింది ఐనిస్టయిన్ యే).

  ఎందుకంటే c వేగంతో ప్రయాణించే ఓ కాంతి పుంజం (light beam) పక్కగా v వేగంతో అదే దిశలో ప్రయాణిస్తే కాంతి పుంజం c-v వేగంతో ప్రయాణించినట్టు ఉండదు, మారని c వేగంతోనే ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది.
  ఈ విషయంలోకి ఇంకా లోతుగా శోధించిన సాపేక్షతా సిద్ధాంతం, సాంప్రదాయక సాపేక్ష వేగాల సూత్రాలని కేవలం కాంతి మాత్రమే ఉల్లంఘించడం లేదని, అసలు ఆ సూత్రమే తప్పని, దాని మరింత నిర్దుష్ట రూపం ఇలా ఉంటుందని ప్రతిపాదించింది:

  సాపేక్ష వేగం = (u+v)/(1 + uv/(c*c))
  పై సూత్రంలో u=c అనుకుంటే, సాపేక్ష వేగం c యే అవుతుంది.
  ఆ విధంగా కాంతి యొక్క ఈ ప్రత్యేక లక్షణం వల్ల విశ్వంలో అన్ని వేగాలకి ఓ గరిష్ఠ పరిమితి ఏర్పడుతోంది.

  కాంతి యొక్క త్వరణం (acceleration) గురించి నాకు తెలీదు. త్వరణం అనేది సామాన్య సాపేక్షతా సిద్ధాంతం కిందకి వస్తుంది. గురుత్వ క్షేత్రంలో కాంతి వంగగలదు. అది ఒక విధంగా త్వరణం చెందడమే అవుతుంది. కాని నాకు అంతకన్నా వివరాలు తెలివు. ఎవరైనా సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తని అడగాలి.

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email