
ఇంతకు ముందు ’అంతేలేని అంతరిక్షం..." పోస్ట్ లో చెప్పుకున్నట్టు ఇప్పట్నుంచి వరుసగా కొన్ని పోస్టులలో విశ్వం యొక్క విస్తృతిని తెలిపే మ్యాప్ లని ప్రదర్శిస్తాం. సూర్యుడి నుండి క్రమంగా ఇంకా ఇంకా దూరంగా పోతుంటే ఏవేం కనిపిస్తాయో ఈ మ్యాపులు చూబిస్తాయి.సూర్యుడికి అతి దగ్గరి తార ప్రాక్సిమా సెంటారీ అని, అది 4.2 కాంతిసంవత్సరాల దూరంలో ఉందని చాలా మందికి తెలుసు. కాని మరి కొంచెం దూరం వెళ్తే ఏవేం తారలు కనిపిస్తాయి?పై మ్యాప్ లో సూర్యుడి నుండి 12.5 కాంతి...

అది 1696 సంవత్సరం.
అప్పటికి న్యూటన్ వయసు యాభై దాటింది. "నూనూగు మీసాల నూత్న యవ్వనం" లోనే గురుత్వాకర్షణ సిద్ధాంతం, యంత్ర శాస్త్రం, కాంతి శాస్త్రం, కాల్క్యులస్ లాంటి రంగాలకి పునాదులు వేసి వైజ్ఞానిక లోకాన్ని హడలెత్తించాడు. కాని 30 లు దాటాక ఆరోగ్యం దెబ్బ తినడం వల్ల, ప్రత్యర్థుల విమర్శలకి బాగా విసిగిపోవడం వల్ల, తదితర కారణాల వల్ల వైజ్ఞానిక కార్యక్రమాలు కొంచెం నెమ్మదించాయి. ఆ రోజుల్లో ఇంగ్లండ్ టంక శాలకి అధికారిగా పనిచేసేవాడు. పరిశోధనలకి దూరంగా,...
అధ్యాయం 7.ఓ మగువ తెగువఆ విధంగా మా సంభాషణ సమాప్తమయ్యింది. మా మాటల పర్యవసానాలని ఊహించుకుంటూంటే వెన్నులో చలి పుట్టుకొస్తోంది. ఆ దిగ్భ్రాంతి లోనే మెల్లగా మామయ్య గదిలోంచి బయటకి నడిచాను. హాంబర్గ్ పురవీధుల్లోని ప్రాణవాయువు అంతా పోగుచేసినా ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి స్థితి. అలా పరధ్యానంగా నడుచుకుంటూ ఎల్బే నదీ తీరానికి చేరుకున్నాను. స్టీమర్లోంచి అక్కడ యాత్రికులు దిగుతూ ఉంటారు. ఊరిని హాంబర్గ్ రైల్వేతో కలుపుతుంది ఈ స్టీమర్.ఇందాక నేను విన్నది సత్యమని నిర్ధారించుకునేది ఎలా? ప్రొఫెసర్ లీడెన్బ్రాక్ వజ్రసంకల్పానికి ఎదురుచెప్పలేక లొంగిపోతున్నానా?...
సూక్ష్మ దర్శిని నిర్మాణం తరువాత కంటికి కనిపించనంత చిన్న జీవాలు ఉంటాయన్న విషయం మనుషులకి తెలిసింది. పెద్ద జంతువుల విషయంలో అయితే పిల్ల జంతువులు తల్లిజంతువుల నుండీ పుడతాయని అందరికీ తెలుసు. కాని ఈ సూక్ష్మజీవులు ఎక్కణ్ణుంచి వస్తాయో అర్థమయ్యేది కాదు. అవి ఊరికే అలా గాల్లోంచి పుడతాయని అనుకునేవారు. దీనికే సహజోత్పత్తి (spontaneous generation) సిద్ధాంతం అని పేరు. ఇటాలియన్ జీవశాస్త్రవేత్త స్పల్లాంజానీ ఓ చక్కని ప్రయోగం చేసి సహజోత్పత్తి ...
"ఏమిటా వాదన?" ఆశ్చర్యంగా అడిగాను."భూమి అంతరంగం ద్రవ రూపంలో ఉన్నట్లయితే, ఆ ద్రవ్య రాశి, సముద్ర జలాలకి మల్లె, చంద్రుడి ఆకర్షణకి లోనవుతుంది. కనుక రోజూ రెండు సార్లు భూమిలో అంతరంగ తరంగాలు జనించాలి. దాని వల్ల కచ్చితమైన ఆవృత్తితో భూకంపాలు రావాలి.""కాని మరి భూమి యొక్క ఉపరితలం అగ్ని యొక్క చర్యకి గురయ్యింది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయిగా మరి? కనుక ఉపరితలం చల్లబడి, మిగిలిన వేడిమి అంతా భూమి అంతరంగంలో చిక్కుకుపోయింది అనుకోవచ్చు" సమాధానంగా అన్నాను."ఇది శుద్ధ తప్పు," అన్నాడు మామయ్య. ఉపరితలంలో జరిగిన కొన్ని రసాయన చర్యల వల్ల ఉపరితలం వేడెక్కింది...
12 జనవరి, సోమవారం, 2342తారాంతర నౌకాశ్రయం, శ్రీ హరికోట, ఇండియా"పండుగ నాళ్ళన్నీ ఉన్న ఊళ్లోన్నే దండుగ చేసే కన్నా, సరదాగా అలా (ఇంచుమించు) కాంతివేగంతో రోదసిలో దూసుకుపోతూ పాలపుంత అంచుల్ని తాకి రావాలన్న తీరని కోరికతో, మా ఈ ప్రత్యేక యాభై శాతం పండుగ స్పెషల్ డిస్కవుంట్ ఆఫర్ని సద్వినియోగం చేసుకుని, పాలపుంత పొలిమేరలకి తరలించుకుపోయే మా ఈ లిమిటెడ్ స్టాప్ సర్వీస్ ని ఎంచుకున్న యాత్రిక మహాశయులకి ’తారావళీ సూపర్ ట్రావెల్స్’ తరపున స్వాగతం... సుస్వాగతం!" తారానౌక గైడ్ ఉత్సాహంగా గుక్క తిప్పకుండా చెప్పుకుపోతున్నాడు."తారావళీ సూపర్ ట్రావెల్స్ గురించి...

అనగనగా ఓ ఊరు. ఆ ఊరి పేరు పాలపుంత.అందులో ఓ పేటలో, ఓ వీధిలో, ఓ తొమ్మిది అంతస్థుల అపార్ట్మెంట్ కాంప్లెక్స్... పేరు సూర్యా రెసిడెన్సీ. అందులో మూడో అంతస్థులో... మన ఇల్లు.మరి మన ఇరుగు పొరుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ల పేర్లు ఏంటో? మన ఉండే వీధి పేరేంటో? మరి పేట పేరు?ఈ ఊళ్లో ఇతర ముఖ్యమైన పేటలేంటి?మనం ఉండే పేట, ’సిటీ సెంటర్’ లో ఉందా? పొలిమేరల్లో ఉందా? మరేం లేదు. సెంటర్ అయితే అన్నీ అందుబాటులో ఉంటాయి కదా అని.మనం ఉండే ఊరికి దరిదాపుల్లో ఇంకేవైనా ఊళ్లు...
అయినా ధైర్యంగా చెప్పుకుపోయాను."అవును. భూమి లోపలికి పోతున్నప్పుడు ప్రతీ 70 అడుగులకి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరుగుతుంది అన్న సంగతి బాగా తెలిసిందే. భూమి వ్యాసార్థం 1500 లీగ్ లు కనుక, భూమి కేంద్రంలో ఉష్ణోగ్రత 360,032 డిగ్రీలు ఉంటుంది. అంత వేడి వద్ద మనకి తెలిసిన పదార్థాలన్నీ వాయురూపంలో ఉంటాయి. వేడికి బాగా తట్టుకోగల బంగారం, ప్లాటినం వంటి లోహాల దగ్గర్నుండి, కఠిన శిలల వరకు ఆ వేడి వద్ద ఘన రూపంలోగాని, ద్రవ రూపంలో గాని ఉండే అవకాశమే లేదు. కనుక అలాంటి మాధ్యమంలోంచి మనిషి ముందు పోయే అవకాశమే ఉండదు.""అయితే ఏక్సెల్! నీ అభ్యంతరం అంతా వేడి గురించా?""లేకపోతే...
"ముమ్మాటికీ అదే. ఐదు వేల అడుగులు ఎత్తున్న పర్వతం. ప్రపంచం ఇలాంటి పర్వతం మరొకటి లేదు. దాని మధ్యలో ఉండే పర్వత బిలం భూమి కేంద్రం వరకు చొచ్చుకుపోతుంది.""కాని అది అసంభవం!" అరిచినంత పని చేశాను. అసలు ఆ ఆలోచనకే నా ఒళ్లు గగుర్పొడుస్తోంది. "అసంభవమా?" ఎదురు ప్రశ్న వేశాడు ప్రొఫెసర్ మామయ్య. "ఎందుకో కొంచెం సెలవిస్తావా?""ఎందుకంటే... ఎందుకంటే ఆ బిలం లావా తోను, రగిలే రాతి కణికల తోను నిండి ఉంటుంది కనుక.""బహుశ అది అంతరించిపోయిన అగ్నిపర్వతం అయితేనో?""అంతరించి పోయిన అగ్నిపర్వతమా?""అవును. భూమి మీద ప్రస్తుతం సక్రియంగా ఉన్న అగ్నిపర్వతాల సంఖ్య కేవలం...
పురాణకథల్లో ఎలా ఉన్నప్పటికీ ఖగోళ విజ్ఞానం ప్రకారం భాద్రపద శుద్ద చవితికి ప్రత్యేకత ఉంది. ఆరోజు తెల్లవారుజామున ఉత్తరాకాశంలో సప్తఋషి మండలానికి దగ్గరగా ఒక నక్షత్ర మండలం ఉదయిస్తుంది. ఈ నక్షత్రాలను ఒక క్రమంలో కలుపుకుంటూ గీతగీస్తే అది వినాయకుడి ఆకారాన్ని సూచిస్తుంది. దీని కిందుగా మినుకుమినుకుమనే నక్షత్ర సముదాయాన్ని రేఖీకరిస్తే అది ఎలుకలా కనిపిస్తుంది. ఈ మొత్తం నక్షత్ర మండలాన్ని గణేశ మండలం అంటారు. సూర్యోదయానికి ముందు ఇది బాగా కనిపిస్తుంది. ఈ ఖగోళ హేలకు సంకేతంగా వినాయక చవితిని జరుపుతారు.ఈ విషయాన్ని 2007 వ సంవత్సరంలో వినాయకచవితి సందర్భంగా...
"అదేంటో చూద్దాం" అన్నాడు. ఆయన పెదాల మాత్రం ఓ విచిత్రమైన చిరునవ్వు విరిసింది."హా(!" ఖంగుతిన్నట్టుగా అన్నాను. "అయినా ఈ పత్రానికి ప్రతికూలంగా ప్రతివాదనలన్నీ నేను ఇంకా వివరించనే లేదు.""వివరించు బంగారూ! నీ తనివి తీరా అన్నీ వివరించు. ఈ క్షణం నుండి నువ్వు కేవలం నా మేనల్లుడివి మాత్రమే కావు. నా సహోద్యోగివి. ఊ, చెప్పు చెప్పు. వింటున్నా!""మనం మొట్టమొదట తేల్చుకోవలసిన విషయం ఏంటంటే ఈ జోకుల్, ఈ స్నెఫెల్స్, ఈ స్కార్టారిస్ ఈ పదాలకి అర్థం ఏంటి? ఈ పదాలు నేనెప్పుడూ విన్లేదు.""ఓహ్! అదా? చాలా సులభం. ఆ మధ్యన లీప్జిగ్ లో ఉండే నా మిత్రుడు ఆగస్టస్ పీటర్మన్...
ఇలాంటి వికార రూపంగల జీవాల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా లేకపోలేవు. అయినా శాస్త్రవేత్తలు వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఉదాహరణకి 1791 లో, అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో, సెత్ రైట్ అనే ఓ రైతు తన గొర్రెకి పొట్టి కాళ్లు ఉన్న గొర్రె పిల్ల పుట్టటం గమనించాడు. కాళ్లు పొట్టివి అని తప్ప గొర్రె పిల్ల ఆరోగ్యంగానే ఉంది. కాని పెరిగి పెద్దయ్యాక, కాళ్లు పొట్టివి కావటంతో కంచె మీంచి గెంతలేకపోయేది. చేను దాటి బయటికి పోలేకపోయేది.ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు రైట్ రైతు. ఈ గొర్రె ఇక కంచె దాటి బయటికి పారిపోయే సమస్యే ఉండదు, కనుక దాన్ని వెంబడించి పట్టుకునే...

మెదడు విభజన ప్రయోగాలురోజర్ స్పెరీ (1981 నోబెల్ బహుమతి గ్రహీత), మైకేల్ గజనీగా అనే ఇద్దరు నాడీశాస్త్రవేత్తలు శస్త్రచికిత్సతో కార్పస్ కల్లోసం తెగకోయబడ్డ రోగుల ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించారు. ఈ పరిశోధనలనే ’మెదడు విభజన ప్రయోగాలు’ (split-brain experiments) అంటారు.(వాడా పరీక్ష: మెదడు మీద శస్త్ర చికిత్స చేసే ముందు, మెదడులో ఏ గోళార్థం భాషకి ప్రధానంగా ఉందో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు న్యూరోసర్జన్ మెదడులో భాషా ప్రాంతాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడతాడు....

మామూలుగా మనందరిలో మేలుకున్న స్థితిలో అనుక్షణం ’నేను’ అన్న భావన ఎప్పుడూ నేపథ్యంలో ఉంటుంది. ఆ భావనని కలిగించే శక్తులని గురించి, కారణాల గురించి మనం ఎప్పుడూ పట్టించుకోం. కారణాలు ఏమైతేనేం? ’నేనున్నాను!’ అదీ మన ధీమా!మన మనసులలో పరస్పర విరుద్ధమైన ఆలోచనలు కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా ఆ ఆలోచనలన్నీ ఆ ’నేను’ అన్న ఒక్క వ్యక్తిలోనే కలుగుతున్నాయనే మనకి అనిపిస్తుంది.కాని మెదడులో సమూలమైన మార్పులు వచ్చిన కొన్ని పరిస్థితులలో మనలో ఎప్పుడూ అనుభవమయ్యే ఒక్క...
అధ్యాయం 6ఓ అద్భుత యాత్రకి సన్నాహం ఆ మాట నా చివిన పడగానే సన్నగా వెన్నులో చలి మొదలయ్యింది. తూలి కిందపడకుండా తమాయించుకున్నాను. శాస్త్రీయ వాదనలు తప్ప మామూలు మనుషులు మాట్లాడుకునే మాటలు ప్రొఫెసర్ లీడెన్బ్రాక్ తలకెక్కవు. అలాంటి అమానుష, తలతిక్క యాత్ర ఎందుకు శ్రేయస్కరం కాదో నిరూపించటానికి ఎన్నో చక్కని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. భూమి కేంద్రానికి చొచ్చుకుపోవడమా? వట్టి పిచ్చి! అయినా కాసేపు నా వాదనాపటిమకి కళ్లెం వేసుకుని నిగ్రహించుకున్నాను. ఇది శాస్త్ర చర్చకి సమయం కాదు. ముందు కడుపులో ఏదైనా పడాలి. అయితే భోజనం వస్తున్న సూచనలు ఎక్కడా కనిపించలేదు.ఖాళీ...

అంతర్జాలం తరువాత విజ్ఞాన వ్యాప్తకి అత్యంత ముఖ్యమైన సాధనాలు పుస్తకాలు. వాటి గురించి కొంచెం చర్చిద్దాం.పుస్తకాల గురించి చర్చ అంటే మొత్తం పుస్తక ప్రపంచం గురించి చర్చ అన్నమాట. అంటే పుస్తకాలు, రచయితలు, పుస్తకాల షాపులు, ప్రచురణ కర్తలు, పంపిణీ దార్లు, గ్రంథాలయాలు. ఇక చివరిగా వీటన్నిటినీ మూల్యాంకనం చేసే పాఠక దేవుళ్లు.ముందు గ్రంథాలయాలతో మొదలెడదాం.ప్రాచీన అలెగ్జాండ్రియాకి చెందిన గ్రీకులకి ఒక చక్కని ఆలోచన వచ్చిందట. విజ్ఞానం, కళ, కవిత్వం... ఇలా ప్రతీ...
స్విస్ వృక్ష శాస్త్రవేత్త కార్ల్ విల్ హెల్మ్ ఫాన్ నాగెలీ (1817-1891) కి తన పత్రాలని పంపించాడు మెండెల్. ఈ ఫాన్ నాగెలీ ఆ రోజుల్లో యూరప్ లో ఓ పేరుమోసిన వృక్షషాస్త్రవేత్త. ఇలా తమ భావాలని విన్నవించుకుంటూ దేశదేశాల నుండి ఎంతో మంది అతనికి రాస్తుంటారు. మెండెల్ పత్రాలని ఫాన్ నగెలీ పట్టించుకోలేదు.ఆ పత్రాలని తిరిగ్ మెండెల్ కే తిప్పి కొట్టాడు. మెండెల్ నిరుగారి పోయాడు. (1865-1869) ప్రాంతాల్లో మెండెల్ తన పత్రాలని కాస్తో కూస్తో పేరున్న పత్రికల్లో ప్రచురించగలిగాడు. కాని అత్యుత్తమ పత్రికలలో మాత్రం అవి స్థానాన్ని సంపాదించలేకపోయాయి.ప్రముఖుల...
పై కారణాలన్నీ ఆ సమయంలో నాకు సమంజసంగా తోచాయి గాని అవే కారణాలని క్రితం రాత్రి ససేమిరా తోసిపుచ్చింది నేనేనా అనిపిస్తుంది. అసలు ఇంత చిన్న దానికి ఇంత సేపు ఆగి ఆలస్యం చేసినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.ఈ ప్రస్తావనని ఎలా తీసుకు రావాలా అని అదను కోసం ఎదురు చూస్తుంటే అంతలో ప్రొఫెసరు మామయ్య తటాలున లేచి, టోపీ పెట్టుకుని, బయటకి నడవబోయాడు. ఈ సారి బయటికి వెళ్లేది కొంపతీసి మళ్లీ మమ్మల్ని లోపల పెట్టి తాళం వెయ్యడానికి కాదుగద!"మామయ్యా!" గట్టిగా అరిచాను.నా కేక ఆయనకి వినిపించినట్టు లేదు."లీడెంబ్రాక్ మామయ్యా" ఈ సారి కూత మరి కొంచెం పెద్దది చేసాను."ఆ!"...

అనగనగా కోనిగ్స్ బర్గ్ అనే ఊళ్లో 7 వంతెనలు ఉండేవి (చిత్రం 1). నగరం లోంచి ప్రవహించే కాలువల మీదుగా కట్టబడ్డ ఈ వంతెనలు నగరంలో వివిధ ప్రాంతాలని కలిపేవి. ఈ వంతెనల గురించిన ఓ చక్కని గణిత సమస్య ఒకటుంది."ఎక్కిన వంతెన ఎక్కకుండా వంతెనలన్నీ తిరిగి రావాలి. ఎలా?"ఇంచుమించు ఇలాంటిదే మరో సమస్య కూడా ఉంది. చిన్నప్పుడు అందరూ దాంతో ఆడుకుని ఉంటారు. ఈ కింద కనిపించే చిత్రాన్ని (చిత్రం 2) చెయ్యి ఎత్తకుండా, గీసిన గీత మళ్లీ గియ్యకుండా, పెన్నుతో కాగితం మీద గీయాలి.అయితే...
postlink