
అరబ్బులుఏడవ శతాబ్దంలో అరబ్బులు రంగప్రవేశం చేశారు. అంతకు పూర్వం వారి ప్రభావం ఆ ఎడారి ద్వీపకల్పానికే పరిమితమై ఉండేది. కాని మహమ్మదు ప్రవక్త కొత్తగా స్థాపించిన ఇస్లామ్ మతం వల్ల అరేబియా ప్రాంతం కొత్త ఊపిరి పోసుకుంది. అరబ్బీ సేనలు గొప్ప బలోద్ధతితో అన్ని దిశలలో ముందుకు దూసుకుపోయాయి. ఆ జైత్రయాత్రలో పశ్చిమ ఆసియా లోను, ఉత్తర ఆఫ్రికాలోను విశాల భూభాగాలు వారి హస్తగతం అయ్యాయి. క్రీ.శ. 641 లో ఈజిప్ట్ మీద దండయాత్ర చేశారు. కొన్నేళ్ళలోనే మొత్తం పెర్షియా...

ఒక దశలో గ్రీకు తత్వచింతన అవసాన దశ చేరుకుంది. దాంతో పాటు ఖెమియా కళ కూడా క్షీణించింది. క్రీ.శ. 100 తరువాత ఆ విద్యలో కొత్తగా కనుక్కున్నది ఏమీ లేదనే చెప్పాలి. అలా ఎదుగు బొదుగు లేకుండా స్థబ్దుగా ఉన్న విజ్ఞానంలోని వెలితిని పూడ్చడానికి లేనిపోని అధ్యాత్మిక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి.క్రీ.శ. 300 ప్రాంతాల్లో ఈజిప్ట్ కి చెందిన జోసిమస్ అనే రచయిత ఖెమియా మీద 28 పుస్తకాలుగల ఒక గొప్ప విజ్ఞాన సర్వస్వాన్ని (encylcopedia) రాశాడు. అంతకు పూర్వం ఐదు, ఆరు...

గ్రీకు, ఈజిప్ట్ సంస్కృతుల సంగమంలో ఏర్పడ్డ ఖెమియా సాంప్రదాయంలో మనకి తెలిసిన మొట్టమొదటి గొప్ప పండితుడి పేరు బోలోస్. నైలు నది లంక (delta) ప్రాంతంలో ఉన్న మెండెస్ నగరానికి చెందిన ఈ వ్యక్తి రమారమి క్రీ.పూ. 200 ప్రాంతాల్లో జీవించాడు. తన రచనల్లో తరచు డెమోక్రిటస్ పేరు ప్రస్తావిస్తూ ఉంటాడు కనుక ఇతడిని బోలోస్-డెమోక్రిటస్ అని కూడా పిలిస్తుంటారు. కొన్ని సార్లు కుహనా డెమోక్రిటస్ అని కూడా అంటుంటారు.ఖెమియా కళలో కెల్లా అతి ముఖ్యమైన ఓ సమస్య మీద బోలోస్ శ్రద్ధ...

పైగా ఆనాటి ఖెమియా కళ మతానికి సన్నిహితంగా ఉండేది కనుక, ఆ కళని ఉపాసించేవారికి ఏవో మహత్తర శక్తులు ఉన్నాయని, వారికి ఏవో ప్రమాదకరమైన విద్యలు తెలుసని జనం అపోహపడేవారు. (భయంకరమైన భవిష్యత్ జ్ఞానాన్ని కలిగిన జోస్యుల గురించి, పదార్థ లక్షణాలని అద్భుతంగా మార్చగల రసాయనికుల గురించి, దేవతలని ఉపాసించి వారి అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని శాసించే మహత్తర శక్తులు గల అర్చకుల గురించి ఆ రోజుల్లో కథలుగా, గాధలుగా విస్మయంగా, భయంగా చెప్పుకునేవారు. ఆ విధంగా కాస్తోకుస్తో...

అధ్యాయం 2పరుసవేదం అలెగ్జాండ్రియాఅరిస్టాటిల్ కాలంలోనే మాసెడాన్ ని (ఇది గ్రీస్ కి ఉత్తరాన ఉన్న ఓ రాజ్యం) ఏలే అలెగ్జాండర్ చక్రవర్తి విశాలమైన పర్షియా సామ్రాజ్యాన్ని జయించాడు. క్రీ.పూ. 323 లో అలెగ్జాండర్ మరణం తరువాత అతడు స్థాపించిన విశాల సామ్రాజ్యం అంతా ముక్కలుచెక్కలు అయ్యింది. అయితే ఆ తరువాత కూడా మిడిల్ ఈస్ట్ కి చెందిన ఎన్నో ప్రాంతాలు ఇంకా గ్రీకుల, మాసెడోనియన్ల హయాంలో ఉండేవి. తరువాత కొన్ని శతాబ్దాల పాటు ఆ ప్రాంతంలో ఎన్నో విభిన్న సంస్కృతుల సమ్మేళనం...

గ్రీకుల “అణువులు”పదార్థ లక్షణాల గురించి ఆలోచించిన ప్రాచీన గ్రీకు తాత్వికులలో మరో ముఖ్యమైన ప్రశ్న కూడా బయలుదేరింది. అది పదార్థం యొక్క భాజనీయతకి సంబంధించిన ప్రశ్న. ఒక రాయిని బద్దలు కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేశాం అనుకుందాం. ఆ ముక్కలు కూడా ఇంకా రాతి ముక్కలే. ఆ ముక్కలని ఇంకా బద్దలు కొడితే పొడి గా మారుతాయి. ఆ పొడిలో చాలా చిన్న రేణువులు ఉంటాయి. అలా పదార్థాన్ని విభజిస్తూ పోతే ఏం జరుగుతుంది? అలా ఎంతవరకు విభజించగలం?ఈ విషయంలో అయోనియాకి చెందిన...

అనాక్సీమినీస్ కాలంలోనే పెర్షియన్లు అయోనియా తీరం మీద దండెత్తారు. తిరగబడ్డ అయోనియన్లని పెర్షియన్లు ఉక్కుపాదంతో తొక్కేశారు. అలాంటి విషమ పరిస్థితుల్లో వైజ్ఞానిక సాంప్రదాయం కాస్త బలహీనమైనా కొంత రసాయనిక పరిజ్ఞానం పశ్చిమదిశగా వ్యాపించింది. అయోనియాకి కాస్త దూరంలో సామోస్ అనే దీవి మీద జీవించే పైథాగొరాస్ (క్రీ.పూ. 582-497) క్రీ.పూ.529 లో సామోస్ వదిలి దక్షిణ ఇటలీ ప్రాంతానికి ప్రయాణించాడు. అక్కడ అతడు చేసిన బోధనలు ఎన్నో తరాల వారిని ప్రభావితం చేశాయి.పైథాగొరాస్...

ప్రాచీన గ్రీస్ లో అయోనియా ప్రాంతానికి చెందిన మెలిటస్ నగరంలో ఉండేవాడు థేల్స్. ఈ అయోనియా పశ్చిమ ఏజియన్ సముద్ర తీరం మీద ఉండేది. ఇది ఆధునిక టర్కీ దేశంలోకి వస్తుంది. థేల్స్ చింతన ఈ ప్రశ్నతో మొదలై ఉండొచ్చు. ఒక పదార్థం మరో పదార్థంగా మారగలిగినప్పుడు, అసలు పదార్థం యొక్క లక్షణం ఎటువంటిది? ఉదాహరణకి కాల్చిన నీలి రంగు రాయి రాగిగా మారుతుందని మనకి తెలుసు. మరి రాయి దాని నిజస్వరూపమా, రాగి దాని నిజస్వరూపమా? లేక ఈ రెండూ కాని మరేదో తత్వమా? అలాగే ఒక పదార్థాన్ని...

భారీ ఎత్తున ఇనుప శస్త్రాలని సాధించిన మొట్టమొదటి సైన్యం అసీరియన్ సైన్యం. క్రీ.పూ. 900 నాటికే మరింత ఉన్నతమైన అస్త్రశస్త్రజాలం గల అసీరియన్లు ఓ మహాసమ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు.గ్రీకు నాగరికత మహర్దశ చేరుకున్న నాటికే వాళ్లు రసాయనిక విద్యలలో ఆరితేరిపోయారు. ఈజిప్షియన్ నాగరికతలో కూడా రసాయనిక విద్యలలో అలాంటి సామర్థ్యమే కనిపిస్తుంది. ప్రాచీన ఈజిప్ట్ లో మరణానంతరం మృతదేహాలకి తగు లేపనాలు పూసి వాటిని దీర్ఘకాలం భద్రపరిచే ఆచారం ఒకటి ఉండేది. ఆ ప్రక్రియలో...

ఈ కాంస్య యుగంలో సంభవించిన అతి ముఖ్యమైన సంఘటన ట్రోజన్ యుద్ధం (Trojan war). ఈ యుద్ధంలో కంచు కవచాలు ధరించిన సిపాయిలు కంచు మొనలు గల శూలాలని ఒకరి మీద ఒకరు విసురుకున్నారు. లోహపు ఆయుధాలు లేని సేనలు ఈ కాంస్య యోధులని ఎదుర్కుని నిలవలేకపోయాయి. కనుక ఈ రోజుల్లో ఓ అణుశాస్త్రవేత్తకి ఉండే గౌరవ మర్యాదలు ఆ రోజుల్లో లోహకారులకి ఉండేవని ఊహించుకోవచ్చు. లోహకారుణ్ణి ఓ దేవుడిలా కొలిచేవారేమో. గ్రీకు పురాణాల్లో హెఫాయెస్టర్ అనేవాడు దేవతల లోహకారుడు. అందుకే నేటికీ యూరప్...

మొట్టమొదటి లోహాలు చిన్న చిన్న కణికల రూపంలో లభించి ఉంటాయి. రాగి, బంగారపు ముక్కలు అక్కడక్కడ దొరికి ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు లోహాలు ప్రకృతిలో సహజ రూపంలో దొరికే బహుకొద్ది పదార్థాలకి తార్కాణాలు. కాస్త ఎర్రని ఛాయ గల రాగి, పచ్చని పసిమి గల బంగారం కళ్లని సులభంగా ఆకట్టుకుని ఉంటాయి. కళావిహీనంగా కనిపించే రాళ్లతో పోలిస్తే, ఈ లోహాల తళుకు, జిలుగు చూసి మనిషి మురిసిపోయి ఉంటాడు. తొలి దశల్లో లోహాలని ఎక్కువగా ఆభరణాలలోనే వాడుకుని ఉంటాడు. రంగులేసిన గులకరాళ్లు,...

క్రీ.పూ. 8000 లో ఓ ముఖ్యమైన పరిణామం జరిగింది. అంత వరకు మనిషి రాతియుగంలోనే ఉన్నాడు. ఆ పరిణామం ఆహారోత్పత్తికి సంబంధించినది. ప్రస్తుతం మనం మిడిల్ ఈస్ట్ అని పిలుచుకునే ప్రాంతంలో జరిగిందది. అంతవరకు మనిషి కూడా జంతువుల లాగే ఇతర జంతువులని వేటాడి ఆహారాన్ని సంపాదించేవాడు. క్రీ,పూ. 8000 నుండి మనిషి జంతువులని పెంచి, పోషించి సకాలంలో వాటిని ఆహారంగా వాడుకోవడం నేర్చాడు. అలాగే కేవలం ప్రకృతిలో సహజంగా పెరిగే మొక్కల మీద ఆధారపడడం కాకుండా, తనే మొక్కలు పెంచి...

అధ్యాయం 1ప్రాచీనులు1. నిప్పు – రాయిఅప్పుడప్పుడే పనిముట్లని వాడడం నేర్చుకుంటున్న ఆదిమానవుడు, ప్రకృతిలో సహజంగా దొరికే వస్తువులనే వాడేవాడు. పెద్ద జంతువుల తుంటి ఎముకలు, చెట్ల కొమ్మలు, పదునైన రాళ్లు – ఇవే అతడి అస్త్రశస్త్రాలు. కాలక్రమేణా రాళ్లని చెక్కి, కోయడానికి పదునైన వాదర, పట్టుకోడానికి అనువైన పిడి కలిగేలా వాటిని మలచడం నేర్చుకున్నారు. మరి కొంత కాలం పోయాక ఆ రాళ్లని చెక్కతో చేసిన ఒరలో ఇమడ్చడం నేర్చుకున్నారు. ఇన్ని చేసినా ఆ రాయి రాయిగానే ఉండిపోయింది,...
ప్రియమైన బ్లాగర్లూ,Isaac Asimov రాసిన A short history of Chemistry ని ఇప్పట్నుంచి సీరియల్ గా పోస్ట్ చేద్దామని ఉద్దేశం.సామాన్యంగా స్కూళ్ళలో కెమిస్ట్రీ చెప్పే తీరు ఆ సబ్జెక్ట్ అంటే ఏవగింపు కలిగించేలా ఉంటుంది. మరి ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించే అవకాశం లేకుండా, విషయాలని తీరిగ్గా ఆలోచించి, ఆరగించుకునే వ్యవధి లేకుండా ఉన్నప్పుడు ఏ రంగమైనా బోరు కొడుతుంది, కంఫు కొడుతుంది. ఏ రంగంలోనైనా ఆ రంగంలోని సత్యాలని మొట్టమొదట ఎలా కనుక్కున్నారు, ఎంత శ్రమపడి కనుక్కున్నారు, అంతకు ముందు ఆ రంగం గురించి మనుషుల అవగాహన ఎలా ఉండేది, ఎవరెవరు ఎంతెంత మేరకు...
ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత వాతావరణంలో ఫిబ్రవరి 1633 లో గెలీలియో రోమ్ లోకి ప్రవేశించాడు. నగరంలోకి అడుగుపెట్టగానే రాజభటులు తనకి సంకెళ్ళు వేసి బరబర లాక్కెళతారని ఊహించాడు. కాని అలంటిదేం జరగలేదు. టస్కనీ ప్రాంతానికి చెందిన వాడు కనుక మొదట్లో రోమ్ లోని టస్కనీ దౌత్యాలయంలో కొంత కాలం అతిథిగా ఉన్నాడు. ఇతర అతిథులతో సమానంగానే తనకీ మర్యాదలు జరిగాయి. అయితే ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజుల్లో చాలా బాధపడేవాడు. ఆర్త్ రైటిస్ వల్ల కీళ్లు బాగా నొప్పి పుట్టేవి. ఆ బాధకి రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. బాధ భరించలేక గట్టిగా రోదించేవాడు. ఇలా కొన్ని...

శ్రీరామ
ఈ బ్లాగులో కేవలం సైన్సు విషయాలు తప్ప మరొకటి ప్రచురించకూడదన్నది మా నియమం. కానీ, ప్రస్తుతానికి నాకు ఈ విషయాన్ని పంచుకోవడానికి మరో సరైన బ్లాగు లేకపోవడం వల్ల ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఈ బ్లాగును క్రమం తప్పకుండా చదువుతున్న పాఠకులకు కలిగిస్తున్న ఈ అసౌకర్యానికి మన్నించగలరు.
మన రాష్ట్రంలో కొత్తగా స్థాపించిన మూడు ఐఐఐటీల గురించి మీకు తెలిసిందే...అవి ఇడుపులపాయ, నూజివీడు మరియు బాసరలో ఉన్నవన్న సంగతి కూడా మీకు తెలుసు. ఈ మూడు విశ్వవిద్యాలయల లక్ష్యం...
గెలీలియో పుస్తకం ప్రచురితం అయిన నాటికి యూరప్ లో ’ముప్పై ఏళ్ల యుద్ధం’ ఉధృతంగా కొనసాగుతోంది. 1618 లో మొదలైన యుద్ధం మూడు దశాబ్దాల పాటు అంటే 1638 వరకు సాగింది. ఈ యుద్ధానికి ఒక ఏకైక కారణం ఆంటూ ఏమీ లేదు. అయితే కాథలిక్కులకి, ప్రొటెస్టంట్ లకి మధ్య మతకలహం ఈ యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. 1618 లో జరిగిన ఓ దారుణమైన సంఘటన జరిగింది. ప్రాగ్ నగరంలో కొంతమంది ప్రొటెస్టంట్ లు రాజగృహంలోకి జొరబడి ఇద్దరు అధికారులని పై అంతస్థు కిటికీ లోంచి బయటికి విసిరేశారు. దీన్నే ప్రాగ్ నగరపు నిర్గవాక్షీకరణ (Defenestration of Prague, fenestra...

గెలీలియోకి చర్చికి మధ్య భావసంఘర్షణ కొనసాగుతూనే ఉంది. చర్చి అధికారులు వాళ్లు చెప్పేది చిలకల్లా వల్లెవేస్తూనే ఉంటారు గాని, గెలీలియో సేకరించిన పరిశీలనల మీద వ్యాఖ్యానించరు, ఆ సమాచారానికి స్పందించరు. గెలీలియో కూడా పట్టువదలకుండా ఓ కొత్త విశ్వదర్శన స్థాపన కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా 1623 లో చర్చిలో పరిస్థితులు గెలీలియోకి అనుకూలంగా మరాయి. తన చిరకాల స్నేహితుడైన కార్డినల్ మాఫియో బర్బెరీనీ ఇప్పుడు కొత్త పోప్ అయ్యాడు. ఈ కొత్త పోప్ పేరు అర్బన్...
postlink