ఇటీవల వరదల వల్ల రాష్ట్రంలో ఎంత ఘోరమైన విధ్వంసం జరిగిందీ చూస్తూనే వున్నాం.
వరద బాధితులు ఎదుర్కునే ఓ ముఖ్యమైన సమస్యల్లో ఒకటి ఆహారం కొరత, మంచినీటి కొరత. నలుదిశలా నీరు ఉన్నా అది కలుషితమై వుంటుంది కనుక, మంచి నీటి గొట్టాల్లో, బావుల్లో, చెరువుల్లో కూడా ఆ నీరు కలిసిపోయి వుంటుంది కనుక ఆ నీటిని శుద్ధి చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. అయితే నీటిని కాచుకోవడానికి అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి విద్యుత్తు కూడా ఉండదు కనుక ఇదో పెద్ద సమస్య అవుతుంది.
అలాంటి సందర్భాలలో సౌరశక్తితో నీటిని శుద్ధి చేసుకునే సరళమైన మార్గాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల డిజైన్లు ఉన్నాయి. ఒక సరళమైన డిజైన్ ఇలా ఉంటుంది.
1. సోలార్ స్టిల్ (solar still)
నిర్మాణం:
నేలలో (చిత్రంలో ఇది 6) 0.6 m లోతు, 0.9 m వెడల్పు ఉన్న గొయ్యి తవ్వాలి. ఆ గోతిలో నీరు సేకరించడానికి ఓ డబ్బా (చిత్రంలో 4) పెట్టాలి. పాత్ర లోంచి గొయ్యి బయటికి వచ్చేట్టుగా ఓ గొట్టం (చిత్రంలో 5) అమర్చాలి. గోతిని తగినంత పెద్ద ప్లాస్టిక్ షీట్ (చిత్రంలో 1) తో కప్పాలి. ఆ షీట్ లోపలికి పడిపోకుండా చుట్టూ చిత్రంలో చూపించినట్టుగా రాళ్లు (చిత్రంలో 2) పెట్టాలి. షీట్ యొక్క కేంద్ర బిందువు కొంచెం కిందికి దిగి వుండేట్టుగా ఏదైనా బరువు (రాయి లాంటిది) పెట్టాలి. సోలార్ స్టిల్ నిర్మాణం పూర్తయ్యింది.
పని తీరు:
వరద ప్రాంతంలో నేలలో చాలా తేమ వుంటుంది. ప్లాస్టిక్ షీట్ లోంచి గొయ్యి లోపలికి ప్రవేశించే సూర్యకిరణాల వల్ల గొయ్యి లోపల ఉండే గాలి, చుట్టూ ఉండే మట్టి కూడా వేడెక్కుతాయి. అందువల్ల మట్టిలో ఉన్న నీరు ఆవిరై పైకి లేస్తుంది. పైన కప్పబడి ఉన్న ప్లాస్టిక్ షీట్ మీద అ ఆవిరి ద్రవీభవించి (condense) నీరు అవుతుంది. అలా ప్లాస్టిక్ షీట్ కి అంటుకున్న నీటి చుక్కలు వాలుగా ఉన్న ప్లాస్టిక్ షీట్ ఉపరితలం అడుగ్ భాగం వెంట కిందకి జారి ప్లాస్టిక్ షీట్ కేంద్ర బిందువు వద్దకి వస్తాయి. ఆ బిందువు వద్ద నిలవడానికి ఆధారం లేక కిందకి రాలి, కింద వున్న సేకరణ పాత్రలో పడతాయి. పాత్రలో ఉన్న నీటిని అప్పుడప్పుడు గొట్టంతో బయటికి పీల్చుకుంటూ వుండొచ్చు.
ఈ పద్ధతిలో నీరు ఆవిరై మళ్లీ ద్రవీభవిస్తుంది కనుక ఇసుక లాంటీ పెద్ద రేణువులు ఉన్న పదార్థం మాత్రమే కాక, లవణాలు, సూక్ష్మక్రిములు కూడా చాలా మటుకు తొలగిపోతాయి.
http://en.wikipedia.org/wiki/Solar_still
దీనికి వరద ప్రాంతాలలో ప్రచారం కావాలి. అప్పుదే దానికి సార్థకత. వెంటనే ఆ ప్రయత్నం చెయ్యండి.
మీరు చెప్పింది నిజమే. ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా సంస్థకి దగ్గర్లో ఉన్న మురుగప్ప చెట్టియార్ రీసెర్చ్ సెంటర్లో కొన్ని రకాల ఎండ పొయ్యిలు తయారుచేస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. అలాగే మా సంస్థలోనే మెకానికల్ ఇంజినీరింగ్ కి చెందిన ఒక ఫాకల్టీ మెంబర్ నుండి కూడా సలహాలు తీసుకుంటున్నాం. ఈ సమాచారాన్ని నాగప్రసాద్ హైదరాబాద్ లో ఎండపొయ్యిలు నిర్మించగోరుతున్న ఒక బృందానికి చేరవేస్తున్నాడు. ఎండ పొయ్యిలని బయట కొంటే Rs. 3-4 K అవుతుంది. కాని చవకైన సామగ్రితొ కొన్ని వందల రూపాయల ఖర్చుతో సులభంగా నిర్మించుకోవచ్చు. అలాంటి చవకైన డిజైన్లు తాత్కాలిక అవసరాలకి సరిపోతాయి.
your ideas was very good sir. i appriate you