మన సమాజంలో సత్యం కన్నా వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత జ్ఞానం పట్ల, ఆ జ్ఞానాన్ని సాధించగోరే విద్యార్థి పట్ల మన విద్యావిధానంలో సాధారణంగా చలామణిలో ఉండే కొన్ని తప్పుడు భావాల గురించి క్రిందటి పోస్ట్ లో చూశాం.అలాంటిదే మన సమాజంలో ఉన్న మరో తప్పుడు ఆచారం – సత్యం కన్నా వ్యక్తులకి ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం. మన సమాజంలో విజ్ఞానం లోతుగా వేళ్లూనకపోవడానికి ఇది మరో కారణం అని నా అభిప్రాయం. ఒక చిన్న ఉదాహరణతో మొదలెడదాం.హర్గోబింద్ ఖొరానా పేరు అందరం వినే వుంటాం. పంజాబ్ లోని రాయపూర్ లో జన్మించిన ఈయన తదనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. మాలిక్యులర్ బయాలజీలో...
“జ్ఞానం అన్న పదం పట్ల మన అవగాహనలో ఒక మౌలిక దోషం ఉంది” అని కిందటి పోస్ట్ చివర్లో చెప్పుకున్నాం.ఆ తప్పుడు అవగాహన మన విద్యావిధానాలలో ఎన్నో రకాలుగా ప్రతిబింబిస్తుంది. దాని పర్యవసానాలని మనం ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నాం. శాస్త్రరంగంలో ముఖ్యంగా శాస్త్ర సృజనలో మనం వెనుకబడడానికి కూడా ఆ తప్పుడు అవగాహనే కారణం అని నా నమ్మకం.మన దృష్టిలో జ్ఞానం అనేది పుస్తకాలలో, హార్డ్ డిస్కులలో, ట్యూషన్ మాస్టర్ల బుర్రల్లో, ఇంటర్నెట్లో ఇలా నానారకాల మాధ్యమాలలో విస్తరించి ఉన్న ఒక జడ రాశి. చదువు అనే ప్రక్రియలో ఆ రాశిని వీలైనంత మేరకు మన తలలోకి, లారీలోకి బస్తాలని...
మా సంస్థలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ పిల్లలకి తప్పనిసరిగా National Service Scheme (NSS) అనే శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా రకరకాల సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు. పల్లెటూరి బడులలో చదువు చెప్పడం, లేదా చెన్నైలోనే ప్రభుత్వ బడులలో చదువు చెప్పడం మొదలైనవి చేస్తుంటారు. అలాగే వృద్ధాశ్రమాలలో, ఆసుపత్రులలో వివిధ సేవా కార్యక్రమాలు నడుపుతుంటారు.ఈ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఒక కొత్త సైన్స్ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. దాని లింక్:www.kaleidoscopeindia.blogspot.comభారతీయ భాషల్లో సైన్సు ప్రచారం చెయ్యాలనే ఉద్దేశంలో ఈ బ్లాగ్ లో...
సృజనత్మకమైన స్వేచ్ఛ + క్రమబద్ధీకరణ = చదువుకి మరింత మెరుగైన ఫార్ములాబ్లాగర్లకి గణతంత్ర దిన శుభాకాంక్షలు! ఈ రెండవ ఉదాహరణ కూడా జాన్ హోల్ట్ రాసిన ’How children learn?’ అన్న పుస్తకం నుండి తీసుకున్నదే.ఇందులో హోల్ట్ తన మిత్రులు కొందరు పిల్లలతో చేసిన కొన్ని ప్రయోగాల గురించి ఒక చోట ఇలా వర్ణిస్తాడు.కొత్త కొత్త పద్ధతుల్లో ఆసక్తికరంగా పిల్లలకి చదువు చెప్పడంలో చిరకాల అనుభవం ఉన్న Bill Hull తదితరులు బాగా చిన్న పిల్లలకి రంగులు, పరిమాణాలు, ఆకృతులు మొదలైన భావనలు నేర్పడానికి పనికొచ్చేట్టుగా ’Attribute blocks’ లేదా ’A blocks’ అనే విద్యాసంబంధమైన...
మన చదువులలో ఈ కింది లొసుగులు ఉన్నాయని కిందటి పోస్ట్ లో చూశాం:1. జ్ఞాపక శక్తి పాత్ర విపరీతంగా ఉందని చూశాం. 2. అన్నీ కచ్చితంగా ప్రణాళికాబద్ధంగా నియంత్రించబడతాయి. విద్యార్థికి పెద్దగా స్వాతంత్ర్యం ఉండదు.విద్యార్థికి స్వేచ్ఛనిస్తే ఏమవుతుంది? అదీ చిన్నప్పటి నుంచి ఇస్తే ఏమవుతుంది? (ఏం మునిగిపోతుంది?) చిన్నపిల్లలకి స్వేచ్ఛా? అదీ చదువులోనా? నూటికి ఒక్కరు కూడా ఈ ఆలోచనని ఒప్పుకోరు. స్వేచ్ఛగా “విచ్చలవిడిగా” తిరిగే పిల్లలకి “క్రమశిక్షణ” పేరుతో కళ్లెం వేసి, వాళ్లకి “తప్పకుండా తెలియవలసిన నాలుగు ముక్కలు” నేర్పించడమే మరి మన ఉద్దేశంలో చదువంటే!...
2. మన విద్యావిధానం ఎక్కువగా శోధన మీద కాక, స్మృతి మీద ఆధారపడి ఉంది.ఎల్.కె.జి. నుంచి పీ.హెచ్.డి. వరకు మన దేశంలో చదువు అంటే గురువు చెప్పింది (లేదా గురువు చెప్పిన పుస్తకాలు చెప్పింది) గుర్తుపెట్టుకోవడం, దాన్ని భక్తిగా ఆచరించడం! ఎల్.కె.జి. లో ఎక్కాలతో మొదలవుతుంది. కొంచెం పెద్దయ్యాక పిరియాడిక్ టేబుళ్లు, భౌతిక, గణితశాస్త్రాల్లో ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటాము. (“ఒక చక్రీయచతుర్భుజం యొక్క భుజములు a, b, c, d అయినచో దాని వైశాల్యమును ఈ సూత్రముతో కనుగొనవచ్చును.”) ఇక ఇంజినీరింగ్ లో ఒకప్పుడు లాగర్థమ్ టేబుళ్లు, స్టీమ్ టేబుళ్లు కూడా గుర్తుపెట్టునేవారంటే...
మన వైజ్ఞానిక వ్యవస్థల్లో వెలితి ఎక్కడుంది అన్న విషయాన్ని చర్చిస్తున్నాం. మొదటి మాటగా ’Saga of Indian Science’ అన్న పుస్తకం నుండి కొన్ని అంశాలు పేర్కొన్నాను. అసలు లోపం మన సంస్కృతిలోనే ఉందని నా నమ్మకం. ఆ విషయాన్ని పాయింట్లుగా విపులీకరిస్తూ వరుసగా కొన్ని పోస్ట్ లు రాసుకొద్దామని ప్రయత్నం.1. ప్రశ్నించే పద్ధతికి మన సంస్కృతిలో పెద్దగా స్థానం లేదుమనది ప్రాచీన సంస్కృతి అని మనం ఎంతో గర్విస్తాం. కాని ఎన్నో సార్లు చాంతాడంత గతం ఒక భారంలా కూడా పరిణమిస్తుంది. మన సంస్కృతిలో జీవితం విస్తృతంగా వ్యవస్థీకరించబడుతుంది. పుట్టినదగ్గర్నుండి, పుడకల...
బోస్ తరువాత ఆ శోధనా స్రవంతి ఎందుకు ఆగిపోయింది?బోస్ తరువాత ఆ శోధనా స్రవంతి ఎందుకు ఆగిపోయింది అని ఎవరో అడిగారు. దానికి సూటిగా సమాధానం చెప్పే ముందు ఒక విషయం పేర్కొంటాను.“The Saga of Indian Science” by Pushpa Bhargava and Chandana Chakrabartiఅన్న పుస్తకంలో రచయితలు భారతీయ వైజ్ఞానిక వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి విస్తృతంగా చర్చిస్తారు. అందులోని నాలు ముఖ్యమైన అంశాలని మా సహోద్యోగి ఒకాయన ఈ మధ్యనే ఈమెయిల్ ద్వార మా సంస్థలో circulate చేశాడు. ఆ అంశాల సారాంశం ఇది:1) ఇండియాలో [వైజ్ఞానిక రంగంలో] జరగాల్సి ఉండి, జరగకుండా మిగిలిపోయిన దాని బాధ్యత...

వామనుడు... విశ్వాన్ని మూడు అడుగులతో కొలిచాడు అంటుంది పురాణం. శాస్త్రవేత్తలు కూడా విశ్వాన్ని మూడు అడుగులతో కొలుస్తున్నారు.అదెలాగ అంటారా? ఇక్కడ నొక్కి పూర్తి ప్రజెంటేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొండి....
1923 లో బోస్ మారోసారి యూరప్ ఖండాన్ని పర్యటించాడు. ఆ ఏటే బోస్ రాసిన 227-పేజీల “Physiology of the ascent of Sap” అన్న పుస్తకం వెలువడింది. ఫ్రాన్స్ లో సోర్బోన్ విశ్వవిద్యాలయంలో బోస్ ప్రసంగం విన్న ప్రఖ్యాత ఫ్రెంచ్ తాత్వికుడు హెన్రీ బెర్గ్సన్ ఇలా వ్యాఖ్యానించాడు: “బోస్ నిర్మించిన అద్భుత పరికరాల పుణ్యమా అని నోరు లేని ఆ మొక్కలకి స్వరం పెల్లుబికి అలేఖ్యమైన వాటి జీవితకథలని సవివరంగా చెప్పుకోగల సామర్థ్యం అలవడింది. అంత వరకు ప్రకృతి చాలా గుట్టుగా దాచుకున్న రహస్యాలు నేటితో రట్టయ్యాయి.” స్తుతిలో హాస్యాన్ని జోడిస్తూ ఫ్రెంచ్ పత్రిక ’ల మాటీన్’...
కువిమర్శ వైజ్ఞనిక ప్రగతికి అవరోధంఇదే సాధనసామగ్రిని ఉపయోగించి నానా రకాల మొక్కల్లోను, చెట్లలోను ప్రతిస్పందనలు ఉంటాయని నిరూపించాడు బోస్. “ఒక మహావృక్షం అయితే ప్రేరణకి నెమ్మదిగా, సావకాశంగా స్పందిస్తుంది. అదే చిన్న మొక్క అయితే లిప్తలో దాని ఉత్తేజానికి పరాకాష్టని చేరుకుంటుంది. వృక్షలోకం సమస్తంలోను ప్రతిస్పందన ఉన్నా అది వ్యక్తం అయ్యే తీరు అనంతమైన వైవిధ్యం ఉంటుందని నిరూపించాడు. 1919-1920 కాలంలో బోస్ మరో సారి లండన్ కి, యూరప్ కి ప్రయాణించాడు. ఈ సారి New Statesman అనే పత్రికలో ప్రొఫెసర్ జాన్ ఆర్థర్ థామ్సన్ అనే పేరుమోసిన శాస్త్రవేత్త బోస్...
నోర్బర్ట్ వీనర్ ఓ పేరు మోసిన అమెరికన్ గణితవేత్త. చాలా కాలం ప్రఖ్యాత ఎం.ఐ.టి. లో పనిచేశాడు. సైబర్నెటిక్స్ అనే గణిత/ఇంజినీరింగ్ రంగానికి పునాదులు వేశాడు. ఈ సైబర్నెటిక్స్ యే తదనంతరం ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుకునే ’కంట్రోల్ థియరీ’ గా పరిణమించింది.. (మేం బీ.టెక్ చదివే రోజుల్లో మాకు కంట్రోల్ థియరీ చెప్పిన ప్రొఫెసర్ ఒకాయన ఈ ’సైబర్నెటిక్స్’ అంతా “మన వేదాల్లోనే ఉంది” అని, దాన్ని మన ప్రాచీనులు ’శైవనాటిక స్వస్థ్య విద్యా’ అని సంస్కృతంలో పిలుచుకునే వారని అనేవారు. మొదట్లో జోక్ చేస్తున్నారేమో అనుకున్నాం. సరే అదో పెద్ద కథ.) అలాగే ఎలక్ట్రానిక్స్...
జీవశాస్త్రంలో ఒక విచిత్ర లక్షణం ఉంది. దాన్ని లక్షణం అనే కన్నా జాఢ్యం అంటే సబబేమో. వృక్షలోకంలో కనిపించే ప్రతీ ప్రక్రియకి, అది అర్థం అయినా కాకపోయినా దానికో పేరు పెడతారు. కొన్ని సార్లు అలా తయారైన భార పదజాలం విషయాన్ని వివరించకపోగా, ఆ విషయం గురించిన అజ్ఞానాన్ని కప్పుపుచ్చుకోడానికా అన్నట్టు ఉంటుంది. (ఇలాటి మాటలకనికట్టు మనకి వైద్యపరిభాషలో కూడా కనిపిస్తుంది. రోగకారణం తెలీనప్పుడు “etiology idiopathic” అంటుంటారు. Etiology = రోగకారణం, idopathic = తెలీదు! ’ఈ రోగం ఏంటో మాకు బొత్తిగే తెలీదు సుమా!’ అని కాస్త ఘరానాగా చెప్పడం అన్నమాట!) పరిసరాల...

పాశ్చాత్యుల స్తుతిని, సమ్మతిని పొంది ఇండియాకి తిరిగొచ్చిన బోస్ ని బెంగాలు పెద్ద ఎత్తున సత్కరించింది. బోస్ గౌరవార్థం బెంగాలు గవర్నరు ఓ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి కలకత్తా షెరీఫ్ అధ్యక్షుడుగా ఉన్నాడు. అతి నెమ్మదిగా సాగే మొక్కల ఎదుగుదలని కొలవడానికి తను చేస్తున్న ప్రయత్నాల గురించి బోస్ ఆ సందర్భంలో మాట్లాడాడు.1917 లో బ్రిటిష్ ప్రభుత్వం బోస్ కి Knighthood ఇచ్చి సత్కరించింది. ఆ సందర్భంలో బోస్ కేవలం వైజ్ఞానిక సత్యాలని కనుక్కునే...
బోస్ సాధించిన విప్లవాత్మక ఫలితాలని తన తోటి వృక్ష శాస్త్రవేత్తలు సమ్మతించకపోవడానికి ఒక ముఖ్య కారణం తను నిర్మించిన నునిశిత పరికరాలని పోలిన పరికరాల నిర్మాణం వాళ్లకి సాధ్యపడకపోవడమే. అయినా ఇతర వృక్ష శాస్త్రవేత్తలని ఒప్పించడానికి, తన ప్రయోగాలలో వారికి నమ్మకం కుదిరేలా చెయ్యడానికి మొక్కలకి యాంత్రికంగా ప్రేరణలు ఇవ్వడానికి, వాటి చలనాలని రికార్డు చెయ్యడానికి మరింత అధునాతన పరికరాలని నిర్మించాలని నిశ్చయించాడు బోస్. వీటిలో క్షణంలో వెయ్యోవంతులో జరిగే మార్పులని కూడా రికార్డు చెయ్యడానికి వీలవుతుంది. దాంతో మొక్కల్లో అత్యంత వేగవంతమైన చలనాలని కూడా...
అదే కాలంలో బోస్ రాసిన రెండో పుస్తకం పేరు ’తులనాత్మక విద్యుత్ జీవక్రియా శాస్త్రం’ (Comparative Electrophysiology). 321 ప్రయోగాలు వర్ణించబడ్డ ఈ పుస్తకం కూడా భారీ గ్రంథమే. ఈ ప్రయోగాలన్నీ కూడా సాంప్రదాయ బద్ధమైన బోధనలకి వ్యతిరేకంగా ఉన్నాయి. వృక్ష ధాతువుకి, జంతు ధాతువుకి మధ్య అందరికీ తెలిసిన తేడాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాటి ప్రవర్తనలో, ప్రతిక్రియలలో ఏకత్వాన్ని, అవిచ్ఛిన్నతని ఎత్తి చూపాడు. మామూలుగా చలనం ఉండదని అనుకునే నాడులలో కూడా సూక్ష్మమైన చలనం ఉంటుందని నిరూపించాడు.మొక్కల నుండి వెలికి తీయబడ్డ “నాడి”కి, మామూలు జంతు నాడికి, ప్రతిక్రియలలో...
ఆ విధంగా ఎన్నో మొక్కల్లో విద్యుత్ ప్రవాహం యాంత్రిక చలనాలని కలుగజేస్తుందని నిరూపించాడు బోస్. మరి జంతు కండరాలలో కూడా జరిగేది సరిగ్గా ఇదే కదా? నాడి లోంచి ప్రవహించే విద్యుత్తు కండరం మీద పని చేసి, అది సంకోచించేట్టు చేస్తుంది. వేడి/చల్లదనం, మత్తు పదార్థం, బలహీనమైన విద్యుత్ ప్రవాహం – ఈ ప్రేరక శక్తులన్నీ ఇటు జంతు వ్యవస్థల్లోను, అటు మొక్కల్లోను కూడా ఒకే విధమైన ప్రతిస్పందనలు కలుగజేస్తాయని తదనంతరం నిరూపించాడు.జంతువుల్లో ఉన్నట్టుగానే మిమోసా మొక్కలో ఒక రకమైన ’ప్రతిక్రియా చాపం’ (reflex arc) ఉంటుందని చూపించాడు బోస్. మన చేయి ఒక వేడి వస్తువును...

మొక్కల్లో యాంత్రిక చలనాలుతన పేపర్ల ప్రచురణలో రాయల్ సొసయిటీ వైఖరి చూసి విసిగిపోయాడు బోస్. ఆ నాటి నుండి తన ఆవిష్కరణల గురించి ప్రపంచానికి తెలుపడానికి పత్రికల మీద ఆధారపడకూడదని నిశ్చయించుకున్నాడు . ఆ విషయం గురించే, “పుస్తకాలు రాయాలంటే బద్ధకంగా ఉండేది కాని ఈ పరిస్థితుల్లో ఇక తప్పలేదు,” అని రాసుకున్నాడు. లండన్, పారిస్, బెర్లిన్ నగరాల్లో తన ప్రసంగాలన్నీ సమీకరిస్తూ ఒక పుస్తకంగా రాసి 1902 నడిమి కాలంలో ప్రచురించాడు. అదే “Response in the Living and...
వైజ్ఞానిక రంగంలో “కుల వ్యవస్థ”బోస్ ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ఆ ప్రసంగం విని, లోహ శాస్త్రంలో నిపుణుడైన సర్ రాబర్ట్ ఆస్టెన్, బోస్ ని మెచ్చుకుంటూ, “నేను జీవితమంతా లోహాల మీద పని చేస్తూ వచ్చాను, ఇప్పుడు వాటిలోనూ ప్రాణం ఉందని వింటుంటే చాలా సంతోషంగా ఉంది,” అన్నాడు. అయితే బోస్ పరిశోధనలు నచ్చని వాళ్లు లేకపోలేదు.సర్ జాన్ బర్డన్ సాండర్సన్ ఇంగ్లండ్ లో జీవక్రియా శాస్త్రానికి పితామహుడు అని పేరు. కండరాలలో చలనాలనే కాక, ప్రత్యేక చలనాలు గల వీనస్ ఫ్లై ట్రాప్ (Venus Flytrap) అనే మొక్కని కూడా ఇతడు పరిశోధించాడు. ఈ రంగంలో ఇతడి మాటే వేదం. మొక్కల్లో...
ఏది జీవం? ఏది అజీవం - బోస్ఆ విధంగా భౌతిక శాస్త్రవేత్తల నుండి ఎంతో మన్నన లభించినా, జివక్రియాశాస్త్రవేత్తల నుండి అలాంటి ఆదరాభిమానాలు దొరకలేదు. ఎందుకంటే బోస్ పరిశోధనలు కేవలం విద్యుదయస్కాంత తరంగాలకి, భౌతిక శాస్త్రానికి పరిమితమైతే బావుంటుంది. కాని తగుదునమ్మా అని ఇప్పుడు కొత్తగా జీవపదార్థం మీద ప్రేరణల ప్రభావం గురించి, జీవ, జీవరహిత పదార్థాల మధ్య సాన్నిహిత్యం గురించి మట్లాడి తనకి సంబంధం లేని రంగంలోకి అడుగుపెడుతున్నాడు! ఈ దుడుకుతనం జీవక్రియాశాస్త్రవేత్తలకి (physiologists) బొత్తిగా నచ్చలేదు. హెర్జియన్ తరంగాలని జివపదార్థం మీద ప్రసరించినప్పుడు,...
విజయుడై ఇండియాకి తిరిగొచ్చిన బోస్ చెవిన ఓ శుభవార్త పడింది. ప్రెసిడెన్సీ కాలేజిలో, భౌతిక శాస్త్ర అధ్యయనంలో, పరిశోధనలో, బ్రిటిష్ “సామ్రాజ్యం యొక్క హోదాకి తగ్గ” ఓ సాటిలేని కేంద్రాన్ని స్థాపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ, రాయల్ సొసయిటీకి అధ్యక్షుడిగా ఉన్న లార్డ్ లిస్టర్, భారత రాష్ట్ర కార్యదర్శికి ఓ ఉత్తరువు పంపించాడు. అందుకు మొదటి విడతగా 40,000 పౌన్ల నిధులు కూడా మంజూరు అయ్యాయి. అయితే బోస్ పొడ గిట్టని బెంగాల్ విద్యా విభాగ అధికారులు ఆ ప్రాజెక్టు ముందుకు సాగనీకుండా అడ్డు పడ్డారు. ఆ రోజుల్లోనే బోస్ ని సందర్శించి అభినందనలు చెప్పడానికి...
బోస్ - ఇండియాకి తిరిగి రాకతన ప్రతిభా పాటవాల గురించి ఫాసెట్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఇచ్చిన సిఫారసు పత్రాన్ని పట్టుకుని ఇండియాకి తిరిగి వచ్చిన బోస్ అప్పటికి వైస్రాయ్ గా ఉన్న లార్డ్ రిప్పన్ ని కలుసుకున్నాడు. రిప్పన్ గారి అభ్యర్థన మీదట, ప్రజా బోధనా రంగానికి అధ్యక్షుడిగా ఉన్న సర్ ఆల్ఫ్రెడ్ క్రాఫ్ట్, బోస్ ని కలకత్తాలో ప్రెసిడెన్సీ కాలేజిలో భౌతిక శాస్త్రపు ప్రొఫెసర్ గా నియమించాడు. కాలేజి ప్రిన్సిపాలు గా ఉన్న సి.హెచ్. టానీ ఆ సంగతి నచ్చక కొంచెం నిరసన చూపించినా, పై అధికార్ల ఒత్తిడికి తల ఒగ్గక తప్పలేదు.నియామకం అయితే జరిగిపోయింది గాని,...
బోస్ – బాల్యం 1858లో నవంబర్ 30 నాడు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న మైమెన్సింగ్ లో జన్మించాడు బోస్.బోస్ తండ్రి గొప్ప దేశభక్తుడు. నవతరం మీద బ్రిటిష్ విద్యావ్యవస్థ యొక్క హానికరమైన ప్రభావాన్ని బాగా గుర్తించినవాడు. పాశ్చాత్య విషయాలని నిర్విమర్శగా స్వీకరించే బానిస ప్రవృత్తి, పాఠ్యాంశాలని గుడ్డిగా కంఠస్థం చేసే పద్ధతి – ఇవీ బ్రిటిష్ విద్యా వ్యవస్థ మనకు మిగిల్చిన వారసత్వం. కనుక బోస్ తండ్రి బ్రిటిష్ వారు నడిపించే బడికి కాకుండా, సాంప్రదాయబద్ధమైన ఓ పాఠశాలకి జగదీశ్ చంద్రుణ్ణి పంపించాడు.నాలుగేళ్ళ బోస్ రోజూ పాఠశాలకి వెళ్లే తీరు చిత్రం గా ఉండేది....
postlink