శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
మన వైజ్ఞానిక వ్యవస్థల్లో వెలితి ఎక్కడుంది అన్న విషయాన్ని చర్చిస్తున్నాం. మొదటి మాటగా ’Saga of Indian Science’ అన్న పుస్తకం నుండి కొన్ని అంశాలు పేర్కొన్నాను. అసలు లోపం మన సంస్కృతిలోనే ఉందని నా నమ్మకం. ఆ విషయాన్ని పాయింట్లుగా విపులీకరిస్తూ వరుసగా కొన్ని పోస్ట్ లు రాసుకొద్దామని ప్రయత్నం.

1. ప్రశ్నించే పద్ధతికి మన సంస్కృతిలో పెద్దగా స్థానం లేదు

మనది ప్రాచీన సంస్కృతి అని మనం ఎంతో గర్విస్తాం. కాని ఎన్నో సార్లు చాంతాడంత గతం ఒక భారంలా కూడా పరిణమిస్తుంది. మన సంస్కృతిలో జీవితం విస్తృతంగా వ్యవస్థీకరించబడుతుంది. పుట్టినదగ్గర్నుండి, పుడకల దాకా ఎప్పుడు ఏం చెయ్యాలో అన్నీ ఎప్పటికప్పుడు ఎవరో నిర్ణయించేస్తూ ఉంటారు. ఏం చదవాలి, ఏం ఉద్యోగం చెయ్యాలి, ఎప్పుడు ఎవర్ని పెళ్ళాడాలి, ఎప్పుడు ఎంతమంది, ఎలాంటి (ఆడా? మగా?) పిల్లల్ని కనాలి, వాళ్లని ఎలా పెంచాలి?.... ఇక్కడ జీవితం మన ప్రమేయం లేకుండానే మంత్రం వేసినట్టు దానికదే జరిగిపోతుంటుంది! ఏం చెయ్యాలో తెలీక సందేహంలో పడితే స్వామీజీలు ఉంటారు, జ్యోతిష్యులు ఉంటారు, న్యూమరాలజిస్టులు ఉంటారు (“రాష్ట్రం పేరు కొద్దిగా మార్చితే సమస్యలు వాటికవే సర్దుకుంటాయి”), బామ్మలు ఉంటారు (“దిష్టి తీసేయండి, తగ్గిపోతుంది”) ... ప్రతీ ప్రశ్నకి సమాధానం/సలహా చెప్పడానికి ఎవరో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రతీ దానికి ఏదో మార్గం ఉంటుంది.

ఇలా ఎందుకు చెయ్యాలి, ఈ పద్ధతి సరైనదా కాదా, అర్థవంతమా కాదా అన్న ప్రశ్న ఎవరికీ పట్టనట్టు ఉంటుంది. “పెద్దలు చెప్పారు, చెయ్యాలి:” ఈ గడ్డ మీద ఈ మాట విని విని విసిగిపోని వాడు ఉండడు. తాత చెప్పినట్టు, తండ్రి వింటాడు, తండ్రి చెప్పినట్టు కొడుకు వింటాడు... ప్రతీ తరం ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేకుండానే పుట్టి చచ్చిపోతూ ఉంటుంది. ఎవరికీ వాళ్ళంతకు వాళ్లు ఆలోచించాల్సిన అవసరం రాదు. ప్రశ్నించాల్సిన సందర్భమూ రాదు.

మన సంస్కృతిలో ఎటు చూసినా సమాధానలే కనిపిస్తాయి. ప్రశ్నలు ఎంత వెతికినా కనిపించవు. ప్రశ్నని పుట్టినవెంటనే ఎలా మట్టుపెట్టాలో మన సంస్కృతి ఉగ్గుపాలతో నేర్పుతుంది.

మరి ప్రశ్నలేకుండా, ప్రశ్నించే అలవాటు లేకుండా విజ్ఞానం అసంభవం. అసలు శాస్త్రవేత్తలు ఆరాధించే దేవత ’ప్రకృతి’ కాదు, ’విశ్వం’ కాదు, ’సత్యం’ కూడా కాదు. ఆ దేవత పేరు ’ప్రశ్న.’ ఆ ప్రశ్నని వెన్నంటడంలోని ఆనందం సమాధానం తెలిశాక ఉండదు. సమాధానం కనిపించగానే కార్పొరేట్ నేతలు పేటెంట్ల కోసం ఎగబడతారు; శాస్త్రవేత్త మరో ప్రశ్నని వెన్నంటుతూ ముందుకి సాగిపోతాడు.

“ఒక కాంతి తరంగం మీద స్వారీ చేస్తే అది కదులుతున్నట్టు కనిపిస్తుందా, లేక నిశ్చలంగా కనిపిస్తుందా?” అనే విచిత్రమైన ప్రశ్న ఐన్స్టయిన్ ని అంతటి వాణ్ణి చేసింది. “కేంద్రకం చుట్టూ గిర్రున తిరిగే ఎలక్ట్రాన్ కేంద్రకంలో ఎందుకు పడిపోదు?” అని బోర్ వేసిన ప్రశ్న ఆధునిక పరమాణు శాస్త్రంలో ఓ మైలు రాయి అయ్యింది. కొన్ని ప్రశ్నల వల్ల స్థూల ప్రయోజనాలు కూడా ఉండవు. కార్ల్ సాగన్ తన జీవితమంతా ’ఇతర ప్రపంచాలలో ప్రజ్ఞ గల జీవులు ఉన్నారా?” అన్న ప్రశ్న యొక్క శోధనకే అంకితం చేశాడు. దాని వల్ల స్థూలమైన ప్రయోజనాలు పెద్దగా ఒరగక పోయినా ఆయన రచనలు ఎంతో మంది శాస్త్రవేత్తలకే స్ఫూర్తినిచ్చాయి.


మనం ప్రశ్నించడానికి ఎందుకు ఇష్టపడం? ఎందుకంటే ప్రశ్నించడం అంటే తెలీదని ఒప్పుకోవడం, అజ్ఞానాన్ని ప్రకటించుకోవడం. మరి అజ్ఞానం భయపెడుతుంది, కలవరపెడుతుంది. అజ్ఞానం అంటే శూన్యం, న్యూనత. ఆ శూన్యాన్ని భరించలేక అందుబాటులో ఉన్న ఏదో చెత్తని తెచ్చి నింపుకుంటాం. ప్రశ్నించడం అంటే అవిధేయత, అగౌరవం, అస్థిరత, విప్లవం. పిల్లలు తల్లిదండ్రులని ప్రశ్నిస్తే అవిధేయత. శిష్యుడు గురువుని ప్రశ్నిస్తే అగౌరవం. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అస్థిరత, విప్లవం.

ప్రశ్నించే అలవాటు లేని సమాజంలో విజ్ఞానం వేళ్లూనదు. సైన్సు తెలియడం అంటే బోలెడు సమాధానాలు తెలియడం కాదు, ప్రశ్నించడం ఎలాగో తెలియడం. “ఇలా ఎందుకు ఉంది?” “ఇలా ఎందుకు చెయ్యాలి?” “మరోలా చేస్తే ఏమవుతుంది?” ప్రపంచంలో ప్రతీ అంగుళాన్నీ తూట్లు పొడిచేలా ప్రశ్నించాలి. రాత్రనక, పగలనక... నిద్రాహారాలు మాని ప్రశ్నించాలి. అదీ ప్రశ్నించడం అంటే!

ప్రశ్నించే కౌశలం విజ్ఞాన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మొదటి ప్రవేశార్హత.


ఇక రెండవ అంశం:

2. మన విద్యావిధానం ఎక్కువగా శోధన మీద కాక, స్మృతి మీద ఆధారపడి ఉంది.

దీని వివరణ వచ్చే పోస్ట్ లో...

24 comments

  1. మంచు Says:
  2. I agree with you 100%

     
  3. durgeswara Says:
  4. మీరు పొరబడుతున్నారు

    భారతీయ విద్యావిధానమంతా గురువుశిష్యుల పరస్పరచర్చ ద్వారానే సాగుతుంది . శిష్యుడు గురువునాశ్రయించి వినయవిధేయతలతో ప్రశ్నిస్తాడు ,{ఈనాటి విద్యార్థిలాచదువుకొంటున్నానన్న అహంకారం తోకాదు] గురువు సహితం తనకుతెలుసునన్న అహంతోకాక ఇది నిజమాకాదా అనేస్త్యాన్ని నిగ్గుతేల్చేలా శిష్యునితో చర్చిస్తాడు. మీరు సరిగా పరిశీలించి చూడండి

     
  5. ప్రతిదానికీ మన సంస్కృతిని తిట్టడం ఒక పాత అలవాటు. అసలు సంస్కృతి అంటే నిర్వచనం ఖచ్చితమైన ఏదైనా ఉన్నప్పుడు అలా చెయ్యొచ్చు. అదీగాక మన సాంస్కృతిక అలవాట్లు మనకే కాక అన్ని దేశాలవాళ్ళకీ ఉన్నాయి.

    ఈ కాలపు శాస్త్రవిజ్ఞానం అనబడేది నిజానికి మానవజాతికి అవసరం లేని పెనుభారం. దీనివల్ల దుంపనాశనాలూ, శాశ్వతనష్టాలే తప్ప దీర్ఘకాలిక లాభాలేమీ లేవు. ఎంత తెలుసుకుంటే అంత అశాంతి, అల్లకల్లోలంలా కనిపిస్తున్నది.

    ఈ విజ్ఞానం యూరప్ లో మొదలుకావడం, అక్కడే వృద్ధి చెందడం - ఇదంతా ఒక కాలపట్టిక ప్రకారం జఱిగింది. అలా జఱగాల్సి ఉంది కనుక అలా జఱిగింది. దాని వెనక కారణాలు ఊహించడం అనవసరం. యుగధర్మం తప్ప ఏ కారణాలూ లేవు కనుక. ఈ యుగం మారగానే యూరప్ మళ్ళీ చీకట్లోకి జాఱుకుంటుంది. అప్పుడు యూరప్ పతనానికి కనిపించే కారణాల మీద కూడా ఇలాగే చర్చ మొదలవుతుంది. అది యుగధర్మం అనీ, కాలపట్టిక అనీ తెలియక.

     
  6. మంచు Says:
  7. లేదండి దుర్గేశ్వర గారు.. భారతీయ విద్యావిధానం లొనొ లేక మన సంస్కృతిలో వున్న పెద్ద డ్రాబాక్ అదే.. పైన రచయత రెండవ పాయింటు మొదలు పెట్టారు చూడండి "మన విద్యావిధానం ఎక్కువగా శోధన మీద కాక, స్మృతి మీద ఆధారపడి ఉంది." అది కూడ సరి అయినదే.. నేను ఇక్కడ అక్కడ యూనివర్సిటిలు చూసాను.. నాకున్న కొద్ది అనుభవం తొ చూస్తే రచయత చెప్పిన దానికి నేనయితే పూర్తిగా ఏకీభవిస్తాను ..

     
  8. మంచు Says:
  9. దయచేసి ..ఈ పొస్ట్ మన ఘనమైన సంస్కృతి ని కించపరచడానికి వుద్దేసించినది కాదని ..కేవలం మనలొ వున్న బలహీనతలను, లోటుపాట్లను గుర్తించి అవి మెరుగుపరచుకొవడానికి కృషిచెయ్యలని చెప్పె ఒక ప్రయత్నం అని గమనించగలరు.. కొన్నిట్లొ మనం ఘనం.. కొన్నిట్లొ మనం ఇంకా నేర్చుకొవల్సి వుంది.. ఈ పొస్ట్ అందుకే..
    నాకు బాగా నచ్చింది..

     
  10. ఇది కొంచం సేరయాస్ శాస్త్ర విజ్ఞానం కాబట్టి నాకు తెలిసినవి రెండు ముక్కలు చెబుతాను.మన కాగ్నిషన్ ప్రాసెస్ (మెదడు పని చేయటం) లో, ఆలోచించటం, సూ క్ష్మం గ ఆలోచించటం(క్రిటికాల్ థింకింగ్), న్యూ నత గ ఆలోచించటం (creative థింకింగ్) అనేవి చివర వస్తాయి. ముందర మనం సంగతులను (ఇన్ఫర్మేషన్) ని తెలుసు కోవాలి, తరువాత దాన్ని మెదడులో దాచి పెట్టాలి. కావలిసి వచ్చినప్పుడు బయటికి వచ్చేటట్లు. బయటికి వచ్చిన తరువాత వాటిని ఏవిధంగా ఉపయోగించగలం అనేది ప్రశ్న. వీటన్నిటికి కొన్ని బాగా పనిచేసే పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి పరిశీలనగా ప్రస్నించటంఅనేది గొప్ప వాళ్ళ లక్షణాలు.
    మనం ఆపరిస్థితికి రావాలంటే చెయ్యవలసినది, ముందర చదువు చెప్పటం, చెప్పిన చదువు వంటబట్టటానికి (మెదడులో దాచి పెట్టటానికి) తగిన ఆలోచింప చేసే హోం వర్క్ ఇవ్వటం. చేసిన హోం వర్క్ చూసి కొత్తవిధానాలు ఎమన్నా ఉన్నయ్యా చెయ్యటానికి అని ఆలోచించటం. ఈ విధంగా మనస్సుకి వ్యాయామం చేయిస్తే మన పిల్లల్ని గొప్పవాళ్ళుగా చెయ్యచ్చు దేశం బాగు పడుతుంది.
    .
    రామకృష్ణారావు

     
  11. దుర్గేశ్వర గారు చెప్పినది మన సాంప్రదాయ పద్ధతి గురించి. అక్కడ పరి ప్రశ్న చేసి తెలుసుకోవడం తప్ప కేవలం ప్రశ్న ద్వారా కాదు. మీరు చెప్పేది ఆధునిక విద్యాబోధన గురించి. అది మెకాలే లాంటి వారి దయ, వారివారసుల నిర్వాకం. ఈవిషయంమీదబ్లాగ్లోకంలోనే చాలా చర్చలు జరిగాయి.
    సంస్కృతి అన్నది చాలా పెద్దమాట. బైబిల్లో చెప్పినదానికి భిన్నంగా చెప్పినందుకు గెలీలియోని రాళ్ళిచ్చుకుని కొట్టడం కూడా సంస్కృతిలో భాగమే. హిందూమతపునాదుల్ని కుదిపిన బుధ్ధుడిని అవతారాల్లో కలిపేసినదీ సంస్కృతే.

     
  12. ఒక మనది అనే గాకుండా దాదాపు అన్నీ అంతే. కానీ వాటన్నిటికీ కారణం ఆయామతాలని నా అభిప్రాయం. మన వద్దకు వస్తే మనలో ఒకప్పుడేమైనా ఈ ప్రశ్నించే గుణం వుండేదేమోగానీ ఇప్పుడు మాత్రంలేదు. ఒకవేళ ఎవరైనా అలా ప్రశ్నించినా "మనల్ని మనం తూలనాడుకోవడం ఒక ఫ్యాషన్" అంటూ స్టీరియోటిపికల్ డైలాగులతో విరుచుకుపడతారు ఈ సాంప్రదాయ మేధావులు, స్వయం ప్రకటిత సంస్కృతి పరిరక్షకులు. ఇలాంటప్పుడు ఇంకేం ప్రశ్నిస్తాం? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకిందట కొన్ని ఆచారాలేర్పడ్డాయి వాటిలో కొన్ని ఈ కాలానికి సరిపడకపోవచ్చు వాటిని కొంచెం మార్చుకుందాం అనేటప్పటికి సంస్కృతి, విధ్వంసం ఇలాంటిమాటలు దూసుకొచ్చేస్తాయి. పరిరక్షణ అంటే ఉధ్ధరణకూడా అని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంతబాగుంటుందో కదా. ఇదో రకంగా ఫర్వాలేదనిచెప్పాలి ఎందుకంటే ఇంకొన్ని సమాజాల్లో ఏకంగా తలకాయలు నరకడాలు, తగలబెట్టడాలు జరుగుతుంటాయికదా.

     
  13. Anonymous Says:
  14. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం రాసిన వ్యాసమొ చెప్పి ఉంటె బాగుండెది. మరీ రచయితకి సంస్కృతి సంగతి ఎమో గాని గత 150 సంవత్సరాల చరిత్ర మీద అవగాహన కూడా లేనట్లు ఉన్నాది.
    *ప్రశ్నించే పద్ధతికి మన సంస్కృతిలో పెద్దగా స్థానం లేదు* అని సంస్కృతి పరమైన ప్రశ్నలను మీరు విజ్ఞాన సంబందమైన ప్రశ్నల కి లింక్ చేయడం బాగా లేదు. ఈ రోజు చాలా మంది పిల్ల లు 15 సం|| ప్రేమ అని పెద్దలను ఎదిరించి పేళ్ళి లు చేసుకొని పిల్లల లను కంట్టున్నారు చిరంజీవి కూతురు శ్రీజా లాగ. ఇటువంటి ఘటనలు ఎన్ని ఎక్కూవ జరిగితె అంత మన సమాజంలో ప్రశ్నిచటం మొదలై వైజ్ఞానికం గా అభివృద్ది చెందుతామా?
    అలా అనుకోవటానికి మీరు చెప్పినదే నిజమైతే జగదీస్ చంద్ర బోస్, యల్ల ప్రగడ, రామనుజం, సి.వి. రామన్ లాంటి వారందరు ఎలా ఆ సంస్కృతి లో నించి వచ్చారు? సదరు రచైత ఒక ముఖ్యమైన ప్రశ్న వేసు కొవలసింది తెల్ల వాళ్ళకి సైన్స్ అవసరం మిగతా ఖండాల వారితో పోలిస్తె ఎందుకు అవసరం అయింది. వారు దాని అభివృద్ది కొరకు డబ్బులు ఎందుకు పెట్టుబడి పేట్టారు? ఆ డబ్బు వారికి ఎక్కడ నుండి వచ్చింది అని? అదే భారత దేశం లో సైన్స్ ఎందుకు వారిలా అవసరం రాలేదు?
    *ఒక కాంతి తరంగం మీద స్వారీ చేస్తే అది కదులుతున్నట్టు కనిపిస్తుందా, లేక నిశ్చలంగా కనిపిస్తుందా?” అనే విచిత్రమైన ప్రశ్న ఒక కాంతి తరంగం మీద స్వారీ చేస్తే అది కదులుతున్నట్టు కనిపిస్తుందా, లేక నిశ్చలంగా కనిపిస్తుందా?” అనే విచిత్రమైన ప్రశ్న ఐన్స్టయిన్ ని అంతటి వాణ్ణి చేసింది.ని అంతటి వాణ్ణి చేసింది.*
    ఇక్కడ మీరు ఐన్స్టయిన్ గొప్పతనాన్ని ఉటంకించారు కాని వారి ఆవిష్కరణలవలణ జపాన్ లో చని పోయిన సంఖ్యని పక్కన జత చేసి ఉంటె ఆయన గొప్పతనం మరోలా అర్థమౌతునంది. రూజ్వెల్ట్ కి ఆయన ఇచ్చిన సలహా మీరు ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి.

    *ఇలా ఎందుకు ఉంది?” “ఇలా ఎందుకు చెయ్యాలి?” “మరోలా చేస్తే ఏమవుతుంది?” ప్రపంచంలో ప్రతీ అంగుళాన్నీ తూట్లు పొడిచేలా ప్రశ్నించాలి. రాత్రనక, పగలనక... నిద్రాహారాలు మాని ప్రశ్నించాలి. అదీ ప్రశ్నించడం అంటే!*
    అసలికి ఇటువంటి ప్రశ్నలు ప్రపంచ చరిత్ర బాగా చదివితే భారత దేశం, ఆసియా వాళ్ళె ప్రశ్నిచుకున్నారు.
    అదే కాక ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వస్త్తున్నాది అని కూడా ప్రశ్నించుకున్నారూ.People like RamaNa maharshi and UG Krishnamoorti. పశ్చిమ దేశ మేధావులంతా ఒకతో రెండొ ప్రశ్నలు వేసుకొని కాన్సెప్ట్ డేవేలప్ చేసి జనం మీద రుద్దారు.

    I request you to read Guns, germs and Steel by Jared Diamond (Pulitzer Prize won) and The Other Side Of Belief - Interpreting U.g. Krishnamurti by Mukunda Rao

     
  15. Anonymous Says:
  16. ఈ దేశ ప్రాచీన చరిత్ర చదివితె వసుదైక కుటుంబ, సర్వే జనా సుఖినో భవంతు లాంటి భావాలను ప్రచారం చేసింది. నిరంతరం ప్రశ్నించు కోవలసిన అవసరం ఈ దేశం లో చాలమంది కి కలగ లేదు కారణం మనకు ఉన్న వాతావరణం, ప్రకృతి వనరుల వలన తిండి కి ఏ లోటు లేకుండా జరిగేది. కూడు, గూడు,గుడ్డా పుష్కలం గా చిక్కిన మన దేశ ప్రజలకి ప్రశ్నలు పెద్దగా అవసరం లేకుండా పోయాయి. మన పెద్దలకు విజ్ఞాన లేక పోవచ్చెమో గాని జ్ణానం మాత్రం ఉన్నది అని చేప్పగలం. జ్ణానం అంటె మనిషి తన పరిధి తెలుసు కోవట0 సమాజ పరం గా, ప్రకృతి పరంగా.

     
  17. Anonymous Says:
  18. Indian craftsmen, artisans used nanotech 2000 yrs ago
    Visakhapatnam (PTI): Indian craftsmen and artisans used nanotechnology extensively about 2000 years ago to make weapons and long lasting cave paintings, a Nobel laureate of Chemistry said here.
    ....
    http://www.hinduonnet.com/holnus/001200801061523.htm

    Two years back Sceince conference was held in Andhra University, Vizag
    " Vedanta and science both are same" said by ECG Sudarshan. It was published in Eenadu paper.

    http://en.wikipedia.org/wiki/George_Sudarshan
    http://www.iop.org/EJ/article/1742-6596/196/1/012027/jpconf9_196_012027.pdf?request-id=b6b016f4-882b-4dec-b1aa-47d5983d647e


    Srikar

     
  19. Anonymous Says:
  20. ప్రశ్నించడం వల్లనే మనిషి ఎదుగుదల అధార పడి ఉన్నది అన్న మీ వాదన కొంతవరకూ నిజమే. కానీ ఇది అన్నివేళలా పనికిరాదు.మన హిందు శాస్త్రాలలో అటువంటి సదుపాయం లేదు. ఎందుకంటే ఇది పరిపూర్ణంగా పరిఢవిల్లిన ఒక సంపూర్ణజ్ఞాన భాండాగారం. మనకి ఇక్కడ దొరకని అంశం అంటూలేదు. విజ్ఞానం , పశుశాస్త్రం, యుద్ధవిద్యలు,అశ్వశాస్త్రం, గజశాస్త్రం సైకాలజీ, సౌందర్యం , ఆరోగ్యం తారా,గ్రహ లక్షణాలు, చివరికి శృంగారాన్ని కూడ వెలివెయ్యకుండా సమర్ధిస్తూ గ్రంధస్థం చేస్తూ మన విజ్ఞానం లో భాగం చేసారు..

    కనిపించేవాటికే కాకుండా, కనిపించని లోకాలని పరిచయం చేస్తూ గ్రహాంతర వాసులను పరిచయం చేసిన ఘనత మన భారతీయ విజ్ఞానానిదే అన్నది ఒప్పుకొని తీరవలసిన విషయం. దీనికి తిరుగులేదు.

    కాబట్టి మనలో ఉద్భవించే ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకి వెంటనే మన శాస్త్రాల్లోనే ఉంటాయి. మరి మనకి ప్రశ్నలడిగే అవకాశం లేకుండ చేశారు అని బాధపడదామా... లేక గర్వపడదామా?పాశ్చాత్యుల కి ఇటువంటి విజ్ఞాన గ్రంధాలు లేవు కనుక శోధించాల్సిన అవసరం ఏర్పడింది.. కార్ల్ సగన్ చేప్తేనే మనకి తెలుసా గ్రాహాంతర వాసుల గురించి? మన వాళ్ళు ఎప్పుడో చెప్పిన విషయాన్ని వీళ్ళిప్పుడు తిరగదోడుతున్నారు అంతే.

    అయినా,ప్రశ్నించే అవకాశం మనకిఇవ్వలేదా మన సంస్కృతి.? బౌద్ధాన్ని ప్రశ్నిస్తూ జైనం రూపుదిద్దుకుంది... జైనాన్ని ప్రశ్నిస్తూ అద్వైతం ఉద్భవించింది... అద్వైతాన్ని ప్రశ్నిస్తూ ద్వైతం రూపుదాల్చింది. ద్వైతాద్వైతాలని మమేకం ఎందుకు చెయ్యకూడదన్న ప్రశ్నే విశిష్టద్వైతానికి దారి తీసింది. ఇవన్ని ప్రశ్నలు కావా? చరిత్రని తిరగరాసిన ప్రశ్నలివి. ఇటువంటి ఆరోగ్యకరమయిన ప్రశ్నలకి భారతీయ సంస్కృతి ఎప్పటికీ ఆహ్వానిస్తుంది, తనలో భాగమిస్తుంది.

    -SN

     
  21. Anonymous Says:
  22. చదువు కున్న వారికి ముఖ్యం గా ఒక చదువు వలన నే అన్ని సమస్యలు సమసి పోతాయి అని ఒక పెద్ద నమ్మకం. ప్రాథమికం గా సైన్స్ మనకు ఎందుకు అవసరం? దానిని మన నిత్య జీవితం లో ఎంతవరకు ఉపయొగించు కుంట్టున్నాము? అనేది చాలా అవసరం. ఇన్ని ఐఐ.టి. లు, ఇంజనీరింగ్ కాలేజిలు ఉన్నా మనదేశం లో రోడ్లు ఎలా ఉంటాయొ తెలుసుకదా. సివిల్ ఇంజనీరింగ్ లో ఎన్నో విభాగాలు ఉన్నయొ చాలా మంది స్పెషలై జెషన్ చేస్తూన్నారు కాని మన జీవితం లో కనీసం రోడ్ల నణ్యతను మెరుగు పరచు కోలేని పరిస్థి. ఊరక నే ప్రశ్నిస్తూ కొత్త కన్సెప్ట్లు డేవెలప్ చేయటం దాని ని చూపి డబ్బులు చేసు కోవటం, డబ్బా కొట్టు కోవటం తెల్ల వాళ్ళ పని. వారి అసలు అభివృద్ది, గ్లొబలిసషన్ రెండవ పార్ట్ ఇక రానున్న రోజులలో వేండి తేర మీద మనం చూస్తాం అప్పుడు అందరికీ అర్థమౌతునంది నిరంతరం ప్రశ్నించు కొంటె పరిస్థితులు ఎవిధంగా ఉంటాయో.

     
  23. Anonymous గారికి:
    మీరు చాల పెద్ద పాయింట్ తీసుకు వచ్చారు. ప్రభుత్వానికి ఒక భాద్యత ఉంది. సామాజికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు పిల్లల్ని ఏవిధంగా చదివించాలి అని. అమెరికాలో చాల మంది (50 %) హాయిస్కోల్ తో ఆపేస్తారు. వాళ్లకి జీవితం ప్రోడుక్టివే గ గడపటానికి యేమి కావాలి? ఎలేక్ట్రోన్స్ నుట్రోనస్ అవసరమా? Sine లు cosine లు కావాలా? అని ప్రశ్నే వచ్చింది . అక్కర లేదని తేల్చు కున్నారు. ఎందుకు బాధించటం. వాళ్లకిష్టమయినవే చెప్పటం జరుగు తోంది. వాళ్ళు చడువైన తరువాత ఆటో లు బాగు చెయ్యటం, ఇల్లు గట్టటం, పరిశ్రమలు పెట్టటం వగైరా లో రాణి స్తున్నారు. కొందరికి అసలు స్కూల్ కి వెళ్ళటమే ఇష్ట ముండదు. కాని పిల్లలని స్కూల్ కి పంపక పోతే అది crime . తల్లి దండ్రుల్ని జైల్లో పెడతారు.
    అందర్నీ ఒక మూసలో పెట్టి చదువు చెప్పలేము.
    రామకృష్ణారావు

     
  24. Anonymous Says:
  25. కొంత వరకూ బాగుంది కాని ఒప్పుకోతగ్గదిగా లేదు. ప్రశ్నించడాన్ని ఏ సంస్కృతి ఆపలేదు, అదే లేకుంటే ఇన్ని విభిన్న జాతులు, భాష, ఆచారాలు, ఆహార్యాలలో దేశవ్యాప్తంగా ఇంత వైవిధ్యం వుండేది కాదనుకుంటా. ప్రశ్నించడం ద్వారా తెలుసుకోవాలనే ఆసక్తిని రేపడం అంటే మరీ ఇలా బకెట్ చన్నీళ్ళు
    గుమ్మరించడం కాదేమోనండి, చక్రవర్తి గారు. :))

    /మన సంస్కృతిలో ఎటు చూసినా సమాధానలే కనిపిస్తాయి. ప్రశ్నలు ఎంత వెతికినా కనిపించవు. ప్రశ్నని పుట్టినవెంటనే ఎలా మట్టుపెట్టాలో మన సంస్కృతి ఉగ్గుపాలతో నేర్పుతుంది./
    హ హా హ్హా... ఇది కొంచెం అతిగా వుంది. :)
    Snkr

     
  26. ఇన్ని సంస్కృతులు, భాషలు, ఆచారాలు, ఆనవాయితీలు అవసరవా? అని ప్రశ్నించకపోవడం వల్లనే ఇన్ని సంస్కృతులు, భాషలు, ఆచారాలు, ఆనవాయితీలు ఇలా దాపురించాయని అనుకోవచ్చేమో!-)

     
  27. Anonymous Says:
  28. అందరికీ, చక్కని చర్చ జరుగుతున్నది. పాల్గొన్న అందరికీ ముందుగా అభినందనలు.

    శ్రీనివాస చక్రవర్తి గారూ,
    ఉన్న లోపాన్ని సవరించుకోకపోవటమూ, లేని లోపాన్ని గుఱించి ఆలోచించటమూ రెండూ ప్రమాదకరమే. ప్రశ్నించటమే కాదు ఎలా ప్రశ్నించాలో కూడా నేర్పిన సంస్కృతి మనది. వాల్మీకి రామాయణములో రాముడు విశ్వామిత్ర మహర్షితో ఇలా అంటాడు "మహర్షీ, ఇక్కడ మానవ సంచారము ఉన్నట్టు లేదు, క్రూర మృగాలు, కీచురాళ్ళ రొద ఎక్కువగా ఉన్నది ఎందువలన?" అని (సంస్కృత మూలముతో విభేదించవచ్చు). అలా అడిగిన తర్వాతే రాముడికి ధర్మాధర్మములను గుఱించి వివరించటమూ, తాటకి వధా జరిగాయి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ప్రశ్నలు లేకుండా ప్రగతి సాధ్యం కాదు. గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన భారతీయులకు ప్రశ్నించటం రాదనటం పొఱపాటు. గ్రహచారమో మఱొకటో ప్రశ్నించటం మానివేశారనటం కొంతలో కొంత సబబు.

     
  29. lalithag Says:
  30. ప్రశ్నించడం అవసరం. నమ్మడం కూడా అవసరం. దేని ప్రాధాన్యత, పాత్ర దానికి ఉన్నాయి. మన ఉపనిషత్తులలో కొన్ని శ్లోకాలు చూస్తే అన్నీ ప్రశ్నలే. సమాధానాలు లేవు. మళ్ళీ మనమే అంటాం ఇలా ఎందుకు అని అడిగితే సమధానం చెప్పరు అని. కొన్ని చోట్ల సమాధానాలు మనమే వెతుక్కోవాలసి ఉంటుంది. కానీ మనం అన్వేషించకుండా "వారికి తెలియదు" అని "సమాధానం" చెప్పేసుకుంటుంటాం. స్మృతిని అంత తేలికగా తీసెయ్యవద్దు. అక్షరాలు గుర్తు ఉంచుకుంటాం. ఎక్కాలు గుర్తు ఉంచుకుంటాం. విషయాలు గుర్తు ఉంచుకుంటాం. అవి గుర్తు ఉంచుకోవడం వల్ల అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. మన మెదడులో మ్యాపుల వంటివి (నేను technical గా చెప్పట్లేదు) ఏవో ఏర్పడి ఒక సమస్య గురించి ఆలోచించేటప్పుడూ ప్యాటర్న్ వంటిది ఏదో మనకి తెలియకుండా గుర్తింపబడడం వంటిది జరుగుతుంది. memory a a very important tool in alaysis and interpretation and even coming up with ideas. కొంత తెలిస్తేనే ప్రశ్న పుడుతుంది. మీ సమాధానం trigger చేసిన ఆలోచనలు పంచుకోవాలనిపించింది.
    సంస్కృతులు, భాషలు, ఆచారాలు, ఆనవాయితీలు "దాపురించలేదు" అని మాత్రం చెప్పగలను. వైవిధ్యాన్ని సౌందర్య దృష్టితో చూస్తే ఆనందం కలుగుతుంది. ఇంకోలా ఆలోచించినా వైవిధ్యమే లేకుంటే ప్రశ్నలు ఎక్కడ్నుంచి పుడతాయి? ఇంకెప్పుడైనా ఈ విషయం మీద ఇంకొంచెం తీరికగా చర్చించగలనేమో.

     
  31. Anonymous Says:
  32. నేను ఈ కోర్సు మాత్రమే ఎందుకు చదవాలి? ఈ పని మాత్రమే ఎందుకు చెయ్యాలి? అని ప్రశ్నించే వారిని మనం ఎంత మందిని చూస్తాం? పోనీ, చూసినా, వారిలో ఎంత మంది "ఇది డబ్బు సంపాదన కోసం మాత్రమే" అని తెలుసుకొన్న రోజు "కష్టానికి వెనుకాడకుండా, సమస్యలు లెక్క పెట్టకుండా",వారి దారి మార్చుకొని తమకు ఇష్టమైన కోర్సు లో చేరటమో, నచ్చిన ఉద్యోగం ఎంత కష్టపడి అయినా సరే, సంపాదించుకోవడమో, లేదా, సొంతం గా కంపెనీ లు పెట్టడమో చేయడం చూస్తున్నాం?
    ఇలా చెయ్యడానికి వారికి వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గరి నుంచి ఎంత వరకు సహకారం అందుతోంది? మనలో ఎంత మంది పెద్ద వాళ్ళు తమ పిల్లలకు సినిమా రంగం లోకి వెళ్ళడానికి అనుమతి ఇస్తారు?
    ఈ సోది అంతా ఎందుకంటే, ప్రశ్నించే తత్వం ఉన్నవాడు, ఎవరు ఆపినా అగడు!
    మీరు ఇలాంటి పిచ్చి పనులు చేసే వారిని ఎంత మందిని రోజూ చూస్తూ ఉంటారో, మన సమాజం లో, ప్రశ్నించే తత్వం అంత బాగా ఉన్నట్టు మరి!
    పరీక్షలకు పది రోజులకు ముందు పుస్తకాలు తీసేవారు, సంవత్సరం మొత్తం సబ్జెక్ట్ ను రుబ్బేసే వారికీ , భయం! తప్పుతామనో, మార్కులు సరిగ్గా రావనో! ఈ రెండు రకాలకూ సబ్జెక్ట్ మీద ఇష్టం ఉండదు! కానీ, ఇష్టం లేని పని ఎందుకు చచ్చినట్టు చెయ్యాలా? అని అలోచించరు! ఒకవేళ తెలుసుకొన్నా, ఏదైనా మార్చగల ధైర్యం వీరికి ఉండదు!
    మన సమాజం లో ప్రశ్నించే తత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి వేదాలూ, పురాణాలూ అక్కర్లేదు! చుట్టూ ఒకసారి చూసుకొంటే చాలు!
    రాజకీయ నాయకులు దోచెస్తున్నారని తెలుసు, కానీ ప్రశ్నించరు! మేము కట్టిన పన్నులు ఏమి అయ్యాయి అని అడగరు! ఇదండీ, కొన్ని పే..ద్ద దెశాలతొ పొలిస్తే మనకు తెలిసే నిజాలు! ఓహ్....ఆ దేశాలలొ విద్యార్ధులు స్వతంత్రం గా ఉంటారని చెప్పాల్సిన అవసరం లేదేమో!

     
  33. Anonymous Says:
  34. ఒకవేళ తెలుసుకొన్నా, ఏదైనా మార్చగల ధైర్యం వీరికి ఉండదు!

    మార్చగల ధైర్యం ఎందుకు ఉండదో కూడా, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లెదనుకొంటా!

    Elders takes no risk, orders their sons and daughters to take the regular safe and secure path, these young ones (most of them), can not go against their word and would never get to risk it by taking the "path less traveled". and no risk, no gain! they could become successful in their work only if they could love their work, if all this circus is all about earning money....they say, I don't love my work!!!who cares! life goes on! no steve jobs from this race! oh...steve jobs and ambani are two different types! dont go on comparing them now!
    thanks....Raj.

     
  35. Elders takes no risk,
    -------------
    Why should they take risk ? when their hard earned money is on the table. The government should take the intellectual kids into their fold and spend money on them and take the risk.

     
  36. మంచు Says:
  37. మాలిక లొ ఎదొ కామెంట్ చూసి ఇదేదొ కొత్త టపా అనుకుని మళ్ళీ చదివాను.. చివరకొచ్చేసరికి మీతొ నూరు శాతం ఏకీభవిస్తున్నాను అని కామెంట్ రాయడానికి సిద్దపడి చూస్తే అదే కామెంట్ కింద ఉంది .. నేను రాసిందే... రెండున్నర సంవత్సరాల క్రితం :-)

    ఈ రెండున్నర సంవత్సరాలలొమరికొంత మంది గొప్ప వ్యక్తులను కలవగలిగాను, కొన్ని ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు సందర్శించ గలిగాను. అప్పటితొ పొలిస్తే ఇప్పుడు లొకజ్ఞానం కొంచెం ఎక్కువ అని చెప్పగలను.. ఇప్పటికీ మీ అభిప్రాయం తొ నూరు శాతం ఏకీభవిస్తున్నాను చక్రవర్తి గారు.

     
  38. Anonymous Says:
  39. /ఇన్ని సంస్కృతులు, భాషలు, ఆచారాలు, ఆనవాయితీలు అవసరవా? అని ప్రశ్నించకపోవడం వల్లనే ఇన్ని సంస్కృతులు, భాషలు, ఆచారాలు, ఆనవాయితీలు ఇలా దాపురించాయని అనుకోవచ్చేమో!-)/
    అందరూ ఒకే సంస్కృతితో ఒకే పద్ధతులు, ఒకే దేవుడినే ఎందుకు పూజించాలి? ఏమిటి సంస్కృతం గొప్ప? అని 'ప్రశ్నించడం' వల్లనే ఇలా ముక్కోటి దేవుళ్ళు, శతకోటి ఆచారాలు, రాష్ట్రానికి 5/6 భాషలు, యాసలు వచ్చాయేమో! :) కాబట్టి ప్రశ్నించే అత్యుత్సాహం మనలోనే ఎక్కువవుందేమో అనిపిస్తోంది. ఆఖరుకు నాస్థికవాదం కూడా హిందూ గ్రంధాల్లో చోటు చేసుకుని ఓ 'మతం' లాంటిదయ్యిందంటే... :) మనకు ప్రశ్నించే ఆచారం మనకు లేదనడం సరి కాదనిపిస్తుంది.

    / వైవిధ్యాన్ని సౌందర్య దృష్టితో చూస్తే ఆనందం కలుగుతుంది. ఇంకోలా ఆలోచించినా వైవిధ్యమే లేకుంటే ప్రశ్నలు ఎక్కడ్నుంచి పుడతాయి?/

    Exactly! That's what I mean.

    Sankar

     
  40. చర్చ చాలా ఘాటుగా,ఘనంగా సాగుతోంది. పైన వ్యాసంలో రెండు విషయాలు స్పష్టీకరించదలచుకున్నాను.
    1) మన సంస్కృతి అన్నప్పుడు నా ఉద్దేశం మన ప్రాచీన సంస్కృతి కాదు. ప్రస్తుత సంస్కృతి, ప్రస్తుత సమాజం. ప్రస్తుతం కానిది మరి... అప్రస్తుతం! మన గతాన్ని గురించి ఆలోచించినంత, ఆరాటపడినంత ఇదిగా, వర్తమానం గురించి, ఇంకా ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఆలోచించినట్టయితే, ఆరాటపడినట్టయితే మరింత వేగంగా పురోగమిస్తాం. అసలు గతం గురించి అతిగా ఆలోచిస్తున్నామంటేనే మనకి ప్రగతిశీలత కొంత కొరవడింది అన్నమాట. కనుక గతం ఎంత గొప్పదైనా అంత ముఖ్యం కాదనిపిస్తుంది.

    2) మరీ ఎక్కువగా ప్రశ్నించడం మంచిది కాదన్నట్టు కొందరు రాశారు. ప్రశ్నించినంత మాత్రాన సరిపోదు. ఆ ప్రశ్నకి సమాధాన్ని శోధించడానికి ఒక పద్ధతి ఉంది. ఊరికే ప్రశ్నలు వేసుకుంటూ, నేను చెప్పిందే నిజం అని వాదులాడుకోవడం వల్ల ప్రశ్నలకి సమాధానాలు రావు.గొడవలు పెరుగుతాయి. సమాధానానికి మార్గం ప్రయోగం. ప్రయోగం, లేదా యదార్థం చెప్పే తీర్పుని సమ్మతించినప్పుడు ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి, వివాదాలు తగ్గుతాయి.ఈ పద్ధతి పని చెయ్యాలంటే వస్తుగత దృష్టి ఉండాలి. వ్యక్తులని పక్కన పెట్టి, విషయానికి, వాస్తవానికి పెద్ద పీట వేసే సంస్కారం ఉండాలి. ఇది మన ప్రస్తుత సమాజంలో కొంచెం తక్కువ. (నేతల దగ్గర్నుండి, సామాన్యుల వరకు 'నువ్వా, నేనా?' అన్న వివాదం తప్ప, 'ఏది వాస్తవం, ఏది మేలైన పద్ధతి?' అన్న వస్తుగత దృష్టితో కూడిన శోధన చాలా అరుదు.) మన సమాజం అనుక్షణం కలహాలతో, వివాదాలతో కుతకుతలాడడానికి కారణాలలో ఇదొకటి అనిపిస్తుంది. సైన్సులో మొదట్నుంచి వస్తుగత దృష్టికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కనుక శాస్త్రీయ దృక్పథం పెరిగితే కొంత వరకు మన దేశంలో సర్వత్ర తాండవించే కల్లోలానికి ఉపశమనం కలుగుతుందని ఓ ఆశ!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts