
ఔషధ సరఫరాలో ఈ BioMEMS కి చాలా భిన్నమైన పద్ధతి, నానోటెక్నాలజీ మీద ఆధారపడ్డ క్వాంటం డాట్ (quantum dot) పద్ధతి. క్వాంటం డాట్లు అంటే కొద్ది పాటి నానోమీటర్లు (నూరు కోట్ల నానోమీటర్లు ఒక మీటరుతో సమానం) పరిమాణం గల స్ఫటికలు. ఇవి సామాన్యంగా కాడ్మియమ్ సెలినైడ్ అనే సెమీకండక్టరు పదార్థంతో నిర్మించబడుతాయి. కొన్ని ప్రత్యేక పౌన:పున్యాల (frequencies) వద్ద కాంతిని గ్రహించడం, ఉద్గారించడం వీటి ప్రత్యేకత. చిన్న క్వాంటం డాట్లు వర్ణమాలలో నీలి ధృవానికి దగ్గరగా...

(కొన్నేళ్ల క్రితం పిల్ల సైన్సు పత్రిక ’విద్యార్థి చెకుముకి’ కోసం రాసిన వ్యాసం ఇది.)భవిష్యత్ ఇంజెక్షన్లు: నానోటెక్నాలజీతో ఔషధ సరఫరా"అమ్మబాబోయ్!"అంతవరకు బుద్ధిగా కార్టూన్ నెట్వర్క్ చూస్తున్న ఐదేళ్ల అనిల్, ఉన్నట్లుడి అలా కేకేసి ఒక్క గంతులో లోపలి గదిలోకి పారిపోయాడు. "ఏవయ్యిందిరా?" అడిగింది తల్లి. "డాక్టర్ అంకుల్..." అంటూ లోపలినుంచే సణిగాడు. ఆవిడ వెనక్కి తిరిగి చూస్తే నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశిస్తున్న వాళ్ల బంధువు డాక్టర్ మురళీధర్ కనిపించాడు....
సివి రామన్ కి, మద్యపానానికి సంబంధించి ఒక గమ్మత్తయిన సన్నివేశం ఉంది. అది చెప్పాలంటే ఆయన కనుక్కున్న ’రామన్ ప్రభావం (Raman effect)’ గురించి ఒకసారి చెప్పుకోవాలి.పారదర్శకమైన ఒక రసాయన పదార్థంలోంచి కాంతి ప్రసరిస్తున్నప్పుడు, ఆ పదార్థంలో కాంతి పరిక్షేపణం (scattering) చెందుతుంది. మామూలుగా అలా పరిక్షేపణం చెందిన కాంతి యొక్క తరంగదైర్ఘ్యం (wavelength) పదార్థంలోకి ప్రసరించిన కాంతి తరంగదైర్ఘ్యంతో సమానం అవుతుంది. కాని కొంత భాగం కాంతి మాత్రం మూలంలో లేని వేరే తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. తరంగదైర్ఘ్యంలో ఈ మార్పునే రామన్ ప్రభావం అంటారు. అయితే ఇది...

11. భూగర్భ యాత్రలో మార్గదర్శకుడుఆ రోజు సాయంత్రం సముద్ర తీరంలో చాలా సేపు షికారు కెళ్లి వచ్చి నా చెక్క మంచం మీద బుద్ధిగా పడుకున్నాను.నాకు తిరిగి తెలివి వచ్చే సరికి మా మామయ్య పక్క గదిలో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. వెంటనే లేచి తయారై ఆ గదిలోకి వెళ్లాను.మామయ్య మాట్లాడుతున్న మనిషెవరో చెట్టంత ఎత్తున ధృఢంగా ఉన్నాడు. చూస్తే మహా మహాబలశాలి అని అర్థమవుతుంది. ఆ నీలి కళ్లలో ఏదో చమక్కు ఉంది. తెలివైనవాడేమో కూడా! పొడవైన కేశాలు కెరటాల్లా భుజాల మీద పడుతున్నాయి....

"ఇదంతా మీరు నేర్పించిందే నాన్నా" - అసిమోవ్కాల్పనిక విజ్ఞాన (science fiction) ప్రియులకు ఐసాక్ అసిమోవ్ పేరు తెలియకుండా ఉండదు. కాల్పనిక విజ్ఞానం మీదే కాక ఇతడు విజ్ఞానం మీద కూడా అందరూ చదవదగ్గ, గొప్ప వైవిధ్యం గల అంశాల మీద, చక్కని పుస్తకాలెన్నో రాశాడు. ఇతడు మొత్తం ఇంచుమించు ఐదొందల పుస్తకాల దాకా రాశాడని చెప్పుకుంటారు.మరి సహజంగా అసిమోవ్ వద్ద ఓ పెద్ద వ్యక్తిగత గ్రంథాలయం ఉండేదట. ఒకరోజు అతడి తండ్రి తన పుస్తకాలని చూడడానికి వచ్చాడు. ఆ పుస్తకాలన్నీ...

ఫిబొనాచీ సంఖ్యలు - గవ్వల్లోనూ ఉన్నాయిసర్పిలాకార వస్తువులని ప్రకృతిలో ఎన్నో చోట్ల చూస్తాం. విశాలమైన పాలపుంత గెలాక్సీలోనే (చిత్రం) కాదు, సముద్రపు హోరు నిరంతరం జపించే గవ్వల్లోనూ (చిత్రం) గువ్వల్లా ఒదిగిపోతాయి సర్పిలాలు. మనిషి చెవిలోని కాక్లియా (చిత్రం) లోనూ సర్పిలాలు దాగున్నాయి.ఇక్కడ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఫిబొనాచీ సంఖ్యలే మనకి దర్శనమిస్తాయి.సువర్ణ దీర్ఘ చతురస్రానికి, ఫిబొనాచీ సంఖ్యలకి మధ్య సంబంధాన్ని కిందటి పోస్ట్ లో గమనించాం. సువర్ణ...

ఫిబొనాచీ సంఖ్యలు - పూవుల్లోనూ అవేఫిబొనాచీ సంఖ్యలు ప్రకృతిలో ఎంత తరచుగా కనిపిస్తాయంటే అది కేవలం కాకతాళీయం అంటే నమ్మబుద్ధి కాదు.1)ఎన్నో పూల జాతుల్లో పూల రేకుల సంఖ్యలు ఫిబొనాచీ సంఖ్యలు కావడం విశేషం. ఉదాహరణకి -పూవులు రేకుల సంఖ్యలిలీ, ఐరిస్ - 3కొలంబైన్, బటర్కప్, లార్క్స్ పుర్ - 5డెల్ఫినియమ్ - 8కార్న్ మేరీగోల్డ్ - 13ఆస్టర్ - 21డెయిసీ ...

మామయ్య ఆనందం చూసి అపార్థం చేసుకున్న ఫ్రెడిరిక్సెన్ చిన్నబుచ్చుకున్నారు."ఏంటండీ మీరు అంటున్నది?" కొంచెం కోపంగా అడిగారు."ఇప్పుడు అర్థమయ్యింది. మొత్తం అర్థమయ్యింది. తన ఆవిష్కరణలని బాహాటంగా ప్రకటించకూడదన్న నిషేదం ఉండడం వల్ల, ఆ రహస్యన్ని గూఢసందేశంలో గుప్తంగా దాచి ఉంచాడన్నమాట." మామయ్య వివరించాడు."ఏ రహస్యం గురించి మీరు మాట్లాడుతున్నది?""ఓ రహస్యమా? అదీ... అదీ..." మామయ్య నసిగాడు."మీ వద్ద ప్రస్తుతం ఏమైనా రహస్య పత్రం ఉందా?" అడిగారు ఫ్రెడిరిక్సెన్."అబ్బే....

ఫిబొనాచీ సంఖ్యలు - సువర్ణ నిష్పత్తిబహుభుజులలో (polygons) సమబాహువులు, సమకోణాలు గల బహుభుజులు చక్కని సౌష్టవంతో అందంగా ఉంటాయి. అందుకే సమబాహు చతుర్భుజానికి ఉన్న అందం సామాన్యంగా దీర్ఘ చతురస్రానికి ఉండదు. కాని దీర్ఘ చతురస్రాలలో కూడా పొడవు, వెడల్పుల మధ్య ఒక ప్రత్యేక నిష్పత్తి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయని ప్రాచీన గ్రీకులు భావించేవారు. ఆ నిష్పత్తినే సువర్ణనిష్పత్తి (golden ratio) అనేవారు. ఆ నిష్పత్తిలో పొడవు, వెడల్పు గల దీర్ఘచతురస్రాన్ని సువర్ణ...

ఫిబోనాచీ సంఖ్యలుమధ్యయుగపు యూరప్ కి చెందిన ఓ పేరుమోసిన గణితవేత్త ఫిబొనాచీ. అంకగణితం, ఆల్జీబ్రా, జ్యామితి మొదలైన రంగాల్లో ఎనలేని కృషి చేశాడు. ఇతడి అసలు పేరు లియొనార్డో ద పీసా (1775-1850). ఇతడి తండ్రి బోనాచీ, ఇటాలియన్ కస్టమ్స్ అధికారిగా, దక్షిణాఫ్రికాలో బర్గియాలో పని చేసేవాడు. (అసలు ఫిబోనాచీ అంటే బోనాచీ పుత్రుడు అని అర్థం). తండ్రి బోనాచీ ఉద్యోగ రీత్యా ఎన్నో ప్రాంతాలు తిరిగేవాడు. తండ్రితో బాటు ఫిబొనాచీ కూడా అరేబియా, ఇంకా తూర్పు ప్రాంతపు నగరాలెన్నో...

ప్రపంచ పౌరుడు ఐనిస్టయిన్ఐనిస్టయిన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే కార్యాన్ని ఫ్రాన్స్ తలపెట్టింది. ఆ సందర్భంలో సోర్బోన్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ, మనుషులు సమయానుకూలంగా ఎలా రంగులు మారుస్తారో వివరిస్తూ పరిహాసంగా ఐనిస్టయిన్ ఇలా అన్నార్ట:"నా సాపేక్షతా సిద్ధాంతం నిజమని తేలితే జర్మనీ నన్ను జర్మన్ పౌరుడిగా గుర్తిస్తుంది, ఫ్రాన్స్ నన్ను ప్రపంచ పౌరుడు అంటుంది. అదే సిద్ధాంతం తప్పని తేలితే ఫ్రాన్స్ నన్ను జర్మన్...

సర్క్యుట్ థియరీ నుంచి ఓ చిన్న సమస్య... కెపాసిటర్లకి సంబంధించినది.(పీ. హెచ్. డీ. ఇంటర్వ్యూ లకి వచ్చిన అభ్యర్థులని ఇబ్బంది పెట్టడానికి దీన్ని విసురుతూ ఉంటారు మా వాళ్లు:-)పైన చిత్రంలో రెండు సమాన కెపాసిటర్లు ఉన్నాయి. అంటే వాటి కెపాసిటన్స్ C1 = C2 = C అనుకుందాం. రెండిటినీ కలిపే స్విచ్ ముందు తెరిచి (open) ఉంది. C1 మీద Q విద్యుదావేశం (charge) ఉంది; C2 మీద ఉన్న విద్యుదావేశం సున్నా. ఇప్పుడు స్విచ్ ని వేశాం (close).1) స్విచ్ ని వేశాక రెండు కెపాసిటర్లలోని...
10. ఐస్లాండ్ పండితులతో ఆసక్తికర సంవాదాలుభోజనం సిద్ధమయ్యింది. ప్రొఫెసర్ మామయ్య ఆయన వంతు ఆయన ఆవురావురని తినేశాడు. ప్రయాణంలో పస్తులు ఉండడం చేసి కాబోలు, ఆయన కడుపు చెరువు అయినట్టు పళ్ళెంలో ఉన్నదంతా హాం ఫట్ చేసేశాడు. భోజనంలో పెద్దగా విశేషమేమీ లేదు. కాని మేము ఉంటున్న ఇంటాయన ఆతిథ్యం మహిమ కాబోలు. భోజనం మరింత రుచిగా అనిపించింది. ఈయన చూడబోతే ఐస్లాండ్ దేశస్థుడిలా లేడు. డేనిష్ మనిషిలా ఉన్నాడు. ఆయన అదరానికి మా మొహమాటం మటుమాయం అయిపోయింది.సంభాషణ అంతా స్థానిక భాషలోనే సాగింది. అయితే నా సౌలభ్యం కోసం అందులో మా మామయ్య కొంచెం జర్మన్ కలిపితే, ఫ్రెడిరిక్సెన్...
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి. ఊరెళ్లి ఇప్పుడే తిరిగొచ్చాను. రాగానే కిందటి పోస్ట్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చూశాను.చాలా సవివరమైన స్పందన అవసరం అనిపించి ఇలా ప్రత్యేక పోస్ట్ గా రాస్తున్నాను.మలక్ గారు చెప్పిన విషయాల్లో చాలా మటుకు నిజమే. కాని ఏది ఎప్పుడు, ఏ సందర్భంలో జరుగుతుందో వివరించాలంటే వాదనలో మరి కొంచెం నిర్దుష్టత (rigor) చొప్పించాలి. వరుసగా పాయింట్లు గమనిద్దాం:1. నా వ్యాఖ్యలో: "భూమికి బంతికి మధ్య friction బట్టి, బంతి angular velocity తగ్గొచ్చు, లేదా పూర్తిగా వ్యతిరేక దిశలో కూడా తిరగడం మొదలెట్టొచ్చు. " అని ఉంది.మలక్...

ఆటగాడి మహిమా - మాగ్నస్ ప్రభావమా?గాల్లోకి ఒక వస్తువుని విసిరినప్పుడు పైకి ఎగిరి, ఒక గరిష్ఠ ఎత్తుని చేరి ఆ తరువాత కొంత దూరంలో కింద పడుతుందని మన సామాన్య అనుభవం చెప్తుంది. అలాంటి వస్తువు యొక్క గమన రేఖ పారాబోలా ఆకారంలో ఉంటుందని చిన్నప్పుడు భౌతిక శాస్త్రంలో చదువుకుని వుంటాం.అయితే ఆ బంతి యొక్క గమన రేఖ పూర్తిగా నిలువుగా ఉన్న ఒక సమతలానికి పరిమితమై ఉంటుంది.కాని ఆ వస్తువు, దాని చుట్టూ అది, ఒక అక్షం మీద గిర్రున తిరుగుతుంటే, దాని గమనం కొంచెం విచిత్రంగా...

(ఇక్కడ అల్ గోర్ వ్యక్తిగత జీవన కథనం కొంచెం ఉంటుంది. ఒక ప్రమాదంలో అకాలంగా గోర్ తన కుమారుణ్ణి కోల్పోతాడు. దాంతో..)నా ప్రపంచం తలక్రిందులయ్యింది.అంతా శూన్యంగా అనిపించింది.నా జీవితమంతా పూర్తిగా మారిపోయింది.ఇక ఈ భూమి మీద జీవితం ఎలా గడపాలి?ఎంతో ఆలోచించాను.చాలా లోతుగా ఆలోచించాను.అంటార్కిటికా వెళ్లాను.దక్షిణ ధృవానికి, ఉత్తర ధృవానికి, అమేజాన్ కి వెళ్ళాను.ముందు అంతగా అర్థం కాని విషయాన్నిశాస్త్రవేత్తల నుండీ నేర్చుకోడానికిఎన్నో ప్రాంతాలు తిరిగాను.నాకెంతో...

ఇక్కడ మనకో సందేశం వినిపిస్తోంది.ఓ విశ్వవ్యాప్తమైన సందేశం.ఈ కరిగే మంచు మనకెన్నో కథలు చెప్తోంది.నా స్నేహితురాలు లానీ థాంసన్ మంచు గడ్డలని తవ్వుతుంది.లోతుగా తవ్వి తవ్విన మంచుగడ్డలని పైకి తెచ్చిచూసి వాటిని పరీక్షిస్తారు.మంచు పడినప్పుడు అందులో వాతావరణం చిన్న బుడగలుగా చిక్కుకుంటుంది.వాటిని కోసి, కొలిచి ఆ మంచు పడ్డ ఏట వాతావరణంలో CO2 ఎంతుందోకొలవచ్చు.అంతకన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆక్సిజన్ యొక్క వివిధ ఐసోటోప్ లనికూడా కొలవచ్చు. అదో కచ్చితమైన ధర్మామీటర్...

కాని నాలో ఓ ప్రశ్న మిగిలిపోయింది.ప్రతి ఏటా అది (CO2) ఒకసారి పైకి కిందకి ఎందుకు పోతుంది?దానికి సమాధానంగా ఆయన ఇలా అన్నాడు.భూమి మీద భూభాగాన్ని ఓసారి గమనిస్తే భూమధ్య రేఖకి దిగువగా ఎక్కువ భూమి లేదు.భూమధ్యరేఖకి ఉత్తరంలోనే ఎక్కువ ఉంది.కనుక వృక్ష సంపద కూడా ఎక్కువ భూమధ్యరేఖకి పైనే ఉంది.కనుక వసంతంలోను, ఎండా కాలంలోను ఉత్తర భూగోళంసూర్యుడి వైపుకి వొరిగి నప్పుడుఆకులు పొడుచుకొచ్చి కార్బన్ డయాక్సయిడ్ ని లోనికి పీల్చుకుంటాయి.కనుక వాతావరణంలో ఆ వాయువు మోతాదు...

కాని అవి నిజానికి అవి కదులుతాయని మనకి తెలుసు.అవి ఒకదాన్నుండి ఒకటి దూరంగా జరుగుతాయి. నిజానికి ఒక సమయంలో అవి ఒకదాంతో ఒకటి సరిగ్గా అతికిపోయేవి. కాని ఆ తప్పుడు భావనతోనే వచ్చింది చిక్కు. జీవితంలో అనుభవం చెప్పే పాఠం ఒకటుంది. మనకు సమస్యలు వచ్చేది తెలీని విషయాల వల్ల కాదు. తెలుసునని నమ్మే విషయాల వల్ల.అలాంటి తప్పుడు నమ్మకమే ఇక్కడ కూడా ఒకటి ఉంది.ధరాతాపనం విషయంలో కూడా చాలా మంది, అసలలాంటిది లేదనిమనస్పూర్తిగా నమ్ముతారు. ఆ నమ్మకం తీరు ఇలా ఉంటుంది. భూమి...

ప్రస్తుత సమాజంలో, మీడియాలో పర్యావరణాన్ని గురించి, ధరాతాపనం (global warming) గురించి చాలా చర్చ జరుగుతోంది.ఈ అంశం మీద అమెరికాకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి ఆల్ గోర్ "An Inconvenient Truth" అనే పేరుతొ ఒక చక్కని డాక్యుమెంటరీ రూపొందించాడు.ప్రస్తుతం వాతావరణంలో కనిపిస్తున్న సంచలనాత్మక మార్పులన్నీ ఎప్పుడూ ఉండే ఆటుపోట్లే నని చాలా మంది ధరాతాపనాన్ని మొదట్లో కొట్టిపారేశారు. అసలు అలాంటిది ఉందని కూడా ఒప్పుకునేవారు కారు. కాని ధరాతాపనం అనేది మనకి నచ్చినా...

అలాగే ఆ ఊరి మేయర్ మోన్ ష్యూ ఫిన్సెన్ కూడా మామయ్యని సాదరంగా ఆహ్వానించాడు. ఇతడి తీరు తెన్నులు కూడా కొంచెం సేనా విభాగానికి చెందిన అధికారిలాగానే ఉన్నాయి.తరువాత బిషప్ సహచరుడైన పిక్టర్సెన్ ని కలుసుకున్నాం. ఇతగాడు ప్రస్తుతం ఏదో మతకార్యం మీద ఉత్తర ప్రాంతాన్ని సందర్శిసున్నాడు. ఆయనతో పరిచయం కలిగే భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాం. కాని రెయిక్జావిక్ లో ప్రకృతిశాస్త్రపు ప్రొఫెసర్ అయిన ఫ్రెడెరిక్ సెన్ చాలా హుషారైన మనిషి.ఆయనతో స్నేహం త్వరలోనే బలపడింది....
బక్షాళి వ్రాతప్రతి గురించి ప్రఖా సత్యనారాయణ శర్మ గారి పుస్తకంలో ఇచ్చిన పరిచయాన్ని ఈ కింది రెండు పేరాలలో ఉన్నదున్నట్టు ఇస్తున్నాను."అది 1881 వ సంవత్సరం. ఆగస్టు నెల.పెషావర్ జిల్లా, బక్షాళి గ్రామం. మార్ధాన్. బక్షాళి రహదారికి తూర్పు పక్కనే ఉన్న మట్టి దిబ్బలు. ఒకప్పుడు అక్కడ ఉన్న ఒక గ్రామము శిధిలమై ఆ మట్టి దిబ్బల్లో, రాళ్లు రప్పల్లో కలిసిపోయి వుంది. ఎవరో బహుశా ఏ నిధి నిక్షేపాల కోసమో ఓ దిబ్బను తవ్వుతున్నారు. క్రమంగా రాళ్లు, రప్పలు, ఒక శిధిల గృహం బయటపడ్డాయి. అందులో నేల మీద ఒక మూల త్రిభుజాకృతిలో ’దివా’ అనబడే రాతినిర్మాణము, వ్రాయటానికి...
postlink