శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

సైన్స్ ప్రియులకి ఒక మనవి

Posted by V Srinivasa Chakravarthy Wednesday, November 20, 2013


సైన్స్ విషయాలని నలుగురితో పంచుకోవడం ఈ బ్లాగ్ లక్ష్యం. ఇలాంటి ప్రయాస విస్తృత స్థాయిలో జరగాలని ఒకరు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రంగంలో ఎవరికి తోచిన కృషి వారు చేస్తే బావుంటుంది. అయితే ఏం చేస్తే బావుంటుంది?... అని ఆలోచిస్తుంటే కొన్ని పాయింట్లు తట్టాయి. (ఎందుచేతనో మరి పాయింట్ల సంఖ్య సరిగ్గా 18 దగ్గర ఆగింది. అలా ఎందుకు జరిగిందబ్బా? ఏ  17  దగ్గరో  19  దగ్గరో ఆగితే పోలా? ఈ  18  సంఖ్య గురించి న్యూమరాలజీ ఏవంటుందో …   సారీ ఏదో ఫ్లో లో అలా వచ్చేసింది. ప్రస్తుతానికి న్యూమరాలజిస్టులని గోకే ఉద్దేశం అయితే అస్సల్లేదు :-)

1   1. మీ దగ్గర్లో ఏదైనా స్కూలుకి వెళ్లి మీకు నచ్చిన సైన్స్ రంగం మీద ఓ టాక్ ఇవ్వడం.

2  2. మీద దగ్గర్లో ఏదైనా ప్రభుత్వ పాఠశాల ఉంటే  మంచి సైన్స్ పుస్తకం కొని వాళ్ల లైబ్రరీకి  దానం చెయ్యడం.

3  3. పిల్లల పుట్టిన రోజు వేడుకల సందర్భంలో బొమ్మలో, బట్టలో కాకుండా సైన్స్ పుస్తకాలు (వాళ్ల వయసుకు తగ్గవి) బహుకరించడం

4  4. నచ్చిన సైన్స్ రంగంలో ఆన్ లైన్ వ్యాసాలు రాయడం, బ్లాగులు నిర్వహించడం, వెబ్ సైట్లు తయారుచెయ్యడం

5  5. ఇంట్లో పర్సనల్ లైబ్రరీలో పాపులర్ సైన్స్ పుస్తకాలు జత చేసుకోవడం

6  6. మిగతా పుస్తకాలతో పాటు పాపులర్ సైన్స్ పుస్తకాలు వీలున్నప్పుడు చదవడం, చదివించడం

7  7. ఏదైనా ప్రభుత్వ  పాఠశాలకి వెళ్లి పిల్లలకి సైన్స్ ప్రయోగాలు ప్రదర్శించడం

8  8. ఇంట్లో సైన్స్ ప్రయోగాలు చేసి, వాటిని వీడియో తీసి, దానికి స్థానిక భాషల్లో వ్యాఖ్యానం జతచేసి, యూట్యూబ్ లోకి ఎక్కించడం

 
    9. నచ్చిన సైన్స్ రంగంలో పుస్తకాలు రాయడం లేదా అనువదించడం


    10.  వికీ పీడియాలో సైన్స్ వ్యాసాలని పోషించడం

    11.   ఇరుగు పొరుగు పిల్లలని పోగేసి సైన్స్ ప్రయోగాలు ప్రదర్శించి ఆనందింపజేయడం


     12.  సైన్స్ ప్రచారం చేస్తున్న సంస్థలకి విరాళాలు ఇవ్వడం

     13.  రామాయణ, భారత కథలు ప్రచారం చేసినట్టుగానే బుర్రకథలు మొదలైన సాంప్రదాయక మాధ్యమాల ద్వార సైన్స్ విషయాలని ప్రచారం చెయ్యడం


     14.  తోలుబొమ్మలాటల ద్వార సైంటిస్టుల జీవిత కథలు ప్రచారం చెయ్యడం

     15.  సైన్స్ విషయాలకి సంబంధించిన నాటకాలు వెయ్యడం, పిల్లలతో వెయ్యించడం


    16.  మీ పిల్లలకి సైన్స్ ఫిక్షన్ కథలు చదివే అలవాటు చెయ్యడం
     17.  మీ ప్రాంతంలో ఉండే ‘లెండింగ్ లైబ్రరీ’ ఓనరుకి పల్ప్ ఫిక్షన్ తో పాటు పాపులర్ సైన్స్ పుస్తకాలు కూడా తెచ్చి పెట్టుకోమని సలహా ఇవ్వడం
ఇక చిట్టచివరిగా…
    18.  మీ దగ్గర్లో ఉన్న గుళ్లో గీతోపన్యాసాలకి బదులుగా ‘అంగారక దర్శానం’ మీద ఉపన్యాసాలు దంచేయడం (నా పేరు మాత్రం ఎక్కడా రానివ్వకండేం!!!)

పై ప్రయత్నం కాస్త ప్రమాదకరం అనుకుంటే ఈ కింది పాయింట్ వాడుకోవచ్చు…

     19.  మీరు మనసు పడ్డ అమ్మాయితోగాని/అబ్బాయితోగాని లేటెస్ట్ సైన్స్ విషయాల గురించి అడ్డదిడ్డంగా వాగి ఇంప్రెస్ చేసేయడం.

3 comments

  1. Anonymous Says:
  2. anni baagaane unnai kaani 18va point mathram baagale andi .

     
  3. Anonymous Says:
  4. Bhothika sassthram, Rasaayana Saasthram, Bhoogola saastram, Jeeva saasthram, Naadi saassthram,Maanasika saasthram, Vaidhya Saasthram annni kalipithe Yoga Saasthram. Manishi sarreeram lone anni saasthraalu unddaai. prathi mani oka Yogi ani Chaati cheppina Geetha nu Vaddhu ani salaha ivvadam mee yokka avagaahana lemi ki dharpanam paduthundhi

     
  5. Anonymous Says:
  6. Bhaasha edhuku saasthram kaadho aalochinchandi. Bhaarathiyya Praachinulu Bhaasha nu saasthram ga nirvachinchaaru ani gurthu pettuko nayana . Nirvachanam ani vachinchadam kooda Bhaarathiyyla Sontham naayana. Samskrutham ela puttindho aalochinchu nyana

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts