శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ఎప్పుడు చూసినా చదువే (!!!)

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, November 24, 2013

 
ఇవాళ ఉదయానే మా పక్కింటి ఆవిడ ఏడో క్లాసు చదువుతున్న వాళ్ల పాపని స్కూల్ కి తీసుకెళ్తూ కనిపించింది. “ఆదివారం కూడా స్కూలు వుందా?” అడిగాను. 

“ఏదో పరీక్షట…” అంటూ ఆ స్కూలు మీద దండకం అందుకుంది ఆవిడ.

అవును కదూ? మన కడు విచిత్ర మైన విద్యావ్యవస్థలో పిల్లలని సంస్కరించాలంటే వాళ్లకి ముప్పూటలా పరీక్షలు పెట్టాలి. కిండర్ గార్టెన్ నుండి ఐఐటి వరకు మనకి తెలిసింది అదొక్కటే! పాఠాలు చెప్పడం – పరిక్షలు పెట్టడం, తప్పితే మళ్లీ పాఠాలు చెప్పడం… అంతకు మించి పెద్దగా ఏవైనా సాధ్యం అవుతుందో లేదో నాక్కూడా చాలా కాలం వరకు తెలిసేది కాదు. కాని నేను యూ. ఎస్. లో పి.హెచ్.డి. చదివే రోజుల్లో ఓ చిన్న పుస్తకం చేతిలో పడింది. చదువు విషయంలో అది నా ఆలోచనలని పూర్తిగా మార్చేసింది. నా పాత ఆలోచనలకి నిప్పంటించేసింది. చదువు మీద నమ్మకం కలిగేలా చేసింది. ప్రేమ పెరిగేలా చేసింది. 

ఆ పుస్తకం పేరు “Learning all the time.”   ఆ టైటిల్ వినగానే కొందరు కోచింగ్ సెంటర్ల వాళ్ళు “మరి మేం చేస్తున్నది కూడా అదే కదా?” అని ఉత్సాహపడే ప్రమాదం వుంది. కాని ఇక్కడ రచయిత చెప్తుంది అలాంటి రంపపుకోత చదువు కాదు. సహజంగా శ్వాసలా, హృదయస్పందనలా, ఓ ఆటలా, అప్రయత్నంగా సాగిపోయే చదువు. అంతర్యాన్ని పోషించి, వ్యక్తిని తీర్చిదిద్దే చదువు. పుట్టుకకి అర్థం ఏంటో వెల్లడి చేసే చదువు. జీవితం మీద, ప్రపంచం మీద పట్టును పెంచే చదువు. 

Learning all the time,  పుస్తక రచయిత పేరు జాన్ హోల్ట్ (John Holt). ఇతడు అమెరికా కి చెందిన ఓ విద్యావేత్త. 


హోల్ట్ యొక్క వృత్తి జీవనం ఓ ఐదో క్లాసు టీచరుగా మొదలయ్యింది. పిల్లలు అంటే సహజంగా ఇష్టం వుండే హోల్ట్ పిల్లలకి యథాలాపంగా పాఠం చెప్పి ఇంటికి వెళ్లిపోకుండా, క్లాసులో పిల్లలు నేర్చుకునే విధానాన్ని, వాళ్ల ప్రవర్తనని నిశితంగా పరిశీలించేవాడు. పిల్లలలో ఒక విషయం హోల్ట్ స్పష్టంగా గమనించాడు. ఎంతటి తెలివైన పిల్లలైనా, ఎంత శ్రీమంతుల కుటుంబాల లోంచి వచ్చిన పిల్లలైనా, క్లాసులో కాస్త భయంగా, బెరుగ్గా, ఒక విధమైన అభద్రతా భావంతో బాధపడుతున్నట్టు కనిపించేవారు. క్లాసులో జరిగే తంతంతా ఒక విధంగా వారి మీద, వారి మనసుల మీద జరిగే దాడిలాగా భావిస్తూ, దాని నుండి తమను తాము ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపించారు.

హోల్ట్ గమనించిన స్కూలు పిల్లలు అంటే కాస్త పెద్ద పిల్లలు ( సుమరు  10  ఏళ్ల వాళ్లు) ఇలా ఉంటే, మరీ చిన్న పిల్లల (2-3  ఏళ్ల వారు) తీరు బాగా భిన్నంగా ఉండడం హోల్ట్ గమనించాడు. పెద్ద పిల్లల్లో కనిపించే బెరుకుదనం, ఆత్మవిశ్వాస రాహిత్యం మొదలైన లక్షణాలు పసిపిల్లల్లో కనిపించవు. బాగా పసి పిల్లలు సందేహాలు ఉంటే తముడుకోకుండా  ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. ఏదైనా ఆసక్తి కరంగా కనిపిస్తే (అది పురుగో పుట్రో అని చూడకుండా) జంకు గొంకు లేకుండా దాని వెంట పడి దాన్ని పరిశీలించి, దాని గురించి తెలుసుకోవాలని చూస్తారు. విషయాల పట్ల ఇలాంటి సహజమైన ఆసక్తి పెద్ద పిల్ల్లల్లో అణగారిపోయినట్టు కనిపించింది హోల్ట్ కి. ఈ పిల్లల్లో ఏం జరిగింది?

ఈ రకంగా ఆలోచిస్తున్న హోల్ట్ కి ‘బిల్ హల్’ (Bill Hull)  అనే మరో టీచరు తారసపడ్డాడు. అతడికి కూడా విద్య, బోధన విషయంలో కొన్ని నూతన భావాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి బళ్లో కొన్ని ప్రయోగాలు మొదలెట్టారు. ఆ ప్రయోగం ప్రకారం బిల్ క్లాసులో పిల్లలకి పాఠం చెప్తుంటే హోల్ట్ ఒక మూల కూర్చుని పిల్లల స్పందనలని, ప్రవర్తనని పరిశీలిస్తుంటాడు. ఈ పరిశీలనలే తదనంతరం రెండు గొప్ప పుస్తకాలుగా వెల్లివిరిశాయి.

“How children fail”, “How children learn” అనే ఈ రెండు పుస్తకాలు 60  లలో అమెరికాలో విద్యారంగంలో చింతనలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. బడులలో పిల్లలు అపజయం చెందడానికి కారణాలు శోధించిన హోల్ట్ ఓ విప్లవాత్మకమైన ప్రకటన చేశాడు.  స్కూళ్లు ఎంత కృషి చేసినా పిల్లలు ఓడిపోతున్నారు అని స్కూళ్లు వాపోతుంటాయి. కాని పిల్లలు ఓడిపోడానికి కారణం అసలు స్కూళ్లే నంటాడు హోల్ట్.  

 బడిలో పిల్లలు నేర్చుకోక పోవడానికి ముఖ్య కారణం భయం. తప్పుడు సమాధానాలు చెప్తానేమో ననే భయం, అలా చెప్తే టీచరు, తోటి విద్యార్థులు వెక్కిరిస్తారనే భయం, తను చాతకాని వాణ్ణేమో ననే భయం. అది సరిపోనట్టు బళ్ళు బలవంతం మీద పిల్లల చేత అడ్డవైన విషయాలు రుద్దుతాయి. ఇష్టం లేని, ఆసక్తి లేని విషయాలు వాళ్లకి నేర్పించాలని చూస్తాయి.

(He held that the primary reason children did not learn in schools was fear: fear of getting the wrong answers, fear of being ridiculed by the teacher and classmates, fear of not being good enough. He maintained that this was made worse by children being forced to study things that they were not necessarily interested in.) http://en.wikipedia.org/wiki/John_Holt_%28educator%29

స్కూళ్లు, పరీక్షలు, టీచర్లు, హోం వర్కులు, ఫైన్లు, యూని ఫామ్లు – ఈ ‘బాధ’రబందీ లేవీ లేకుండా పిల్లలు ఇంట్లో కూర్చుని హాయిగా, స్వేచ్ఛగా, తమని నచ్చిన విషయాలని చదువుకునే ఏర్పాటు గురించి ఆలోచించి Homeschooling  (ఇంటిపట్టున చదువు) పద్ధతికి పునాదులు వేశాడు. ఈ భావాలని పోషించడానికి, వ్యాపింపజేయడానికి ‘Growing without schooling’ అనే పత్రిక ప్రారంభించాడు హోల్ట్.

బడి చదువుల కన్నా ఈ ఇంటిపట్టువు చదువు ఎలా మిన్న? అన్న ప్రశ్నకి సమాధానంగా హోల్ట్ ఇలా అంటాడు.
“బళ్లు బాలేవు కనుక అందుకు ప్రతిక్రియగా ఇంటిపట్టున చదువు అవసరం అని నేను అనడం లేదు. చదువు అనేది ఒక అన్వేషణ, ఒక పరిశీలన. మన చుట్టూ ఉండే ప్రపంచం యొక్క, మన పరిసరాల యొక్క పరిశీలన. ఆ పరిశీలనకి ఇల్లే సరైన వేదిక, అనువైన ఆధారం. బళ్లు ఎంత గొప్పవైనా ఇల్లే మన జీవితానికి శ్రేష్ఠమైన పునాది.”

హోల్ట్ భావాలని మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా విద్యావిధానం మీద అతడి పరిశీలనలు మనని ఆలోచించేలా చేస్తాయి. ఈ రోజుల్లో మన దేశంలో విద్యాసంస్థల సంఖ్య అయితే పెరుగుతోంది గాని, వాటిలో జరిగే తంతులో పెద్దగా మార్పేమీ రావడం లేదు. చదువులు ఊపిరి సలపనీయనంతగా యాంత్రికంగా మారుతున్నాయి. దేశ భవిష్యత్తు, పురోగతి అనగానే మన ధ్యాస ‘ఆర్థిక వ్యవస్థ’ మీదకి మళ్లుతుంది గాని, ఆ వ్యవస్థకి పునాదులు వ్యక్తులు కనుక, ఆ వ్యక్తులని తీర్చిదిద్దేది విద్య  కనుక, సమాజం యొక్క భవితని నిర్ణయించడంలో విద్య అత్యంత ముఖ్యమైన  వ్యాపకం  అవుతుంది. ఈ సత్యాన్ని మనం తరచు విస్మరిస్తుంటాం అనిపిస్తుంది.

హోల్ట్ రాసిన  Learning all the time పుస్తకానికి అనువాదం సీరియల్ రూపంలో మొదలుపెట్టాలని ఉద్దేశం.3 comments

 1. Anonymous Says:
 2. great

   
 3. Waiting for that serial
  and good post sir

   
 4. GANESH Says:
 5. very nice sir

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email