ప్రఖ్యాత అమెరికన్ శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ ఫెయిన్మన్ గురించి తెలియని వాళ్లు తక్కువ. కెయాస్ థియరీ మీద పుస్తకం రాసిన జేంస్ గ్లైక్ ఫెయ్న్మన్ జీవిత కథ కూడా "జీనియస్" అన్న పేరుతో రాశాడు. ఫెయిన్మన్ అసమాన ప్రతిభను తెలిపే ఘట్టాలతో బాటూ, అతని పట్టరాని చిలిపి చేష్టల వృత్తాంతాలతో ఈ పుస్తకం అద్భుతంగా ఉంటుంది. ఒక చోట ఒక సంఘటన తమాషాగా ఉంటుంది.
కాల్ టెక్ లో పని చేసే ముర్రే గెల్మన్ కి ఫెయిన్మన్ కి వృత్తిరీత్యా కొంత పోటీ ఉన్నా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవమే.
ఒకసారి ఫెయిన్మన్ రాసిన ఓ పేపర్ ని గెల్మన్ శిష్యుడు ఎక్కడో చూసి బావుందని తెచ్చి గెల్మన్ కి చూపిస్తాడు. అది చూసి గెల్మన్
“ఇది ఫెయిన్మన్ తన పద్ధతిలో చేశాడు. సమస్యలని మనం అలా పరిష్కరించం. మన పద్ధతి వేరు,” అన్నాడు.
శిష్యుడి ముఖం చిన్న బోయింది.
“ఇంతకీ ఏంటా ఫెయిన్మన్ పద్ధతి?” అడిగాడు శిష్యుడు.
“ఫెయిన్మన్ పద్ధతా? ముందు సమస్యని బోర్డు మీద రాయాలి. తరువాత పిడికిలి బిగించి, ఓ సారి నుదుటి మీద ఆనించి, కొద్దిగా భృకుటి ముడి వెయ్యాలి. ఒక్క క్షణం ఆలోచించాలి. వెంటనే పరిష్కారం బోర్డు మీద రాసేయాలి. అదీ ఫెయిన్మన్ పద్ధతి!” అని వివరించాడు.
శిష్యుడి ముఖం మీద నవ్వు పువ్వులు విరిశాయి.
ఫెయిన్మన్ పద్ధతి నాకు నచ్చింది :-)
బాగుంది ఫెయిన్మన్ పధ్ధతి. కానీ భూమి గురించి ఆపేశారే?
Indian Minerva గారు, భూమి గురించి ఈ-పుస్తకాన్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
http://scienceintelugu.blogspot.com/2009/05/e.html