మానవ చరిత్రలో ఎంతో కాలం - సముద్రపు లోతుల మాట దేవుడెరుగు - సముద్రం పై పొరలలో కూడా ఏముందో మనిషికి తెలియదు. సముద్రం ఎంత లోతు ఉందో, ఆ లోతుల్లో ఏముందో ఎంతో కాలం మనిషికి తెలియలేదు.
నదులలో, సరస్సులలో జీవరాశులు ఉన్నట్లే, సముద్రంలో కూడా జీవరాశులు ఉన్నాయని మనిషికి తెలుసు. ఎన్నోరకాల చేపలు ఉంటాయి. ఆలుచిప్పలు, రొయ్యలు, పీతలు మొదలైన ఎన్నో రకాల జీవులు ఉంటాయి. ఆదిమవాసులు కూడా చేపలని ఆహారంగా తీసుకునేవారు. కొన్ని ప్రాంతాల్లో జలచరాలు ఆహారంలో ముఖ్యభాగం అయిపోయాయి. సముద్రపు లోతుల్లో ఎంత లోతు వరకు చేపలు మొదలైన జలచరాలు దొరుకుతాయో పాతకాలపు బెస్తవారికి తెలుసునంటారా? సాగరంలో అడుగంటా జలచరాలు ఉంటాయని అనుకుని ఉంటారు. కాని అది నిజమో కాదో తెలుసుకోవడం ఎలా?
జలకన్యలు జీవించే మహార్ణవపు లోతుల్లో
మా ఎదురులేని సాధనం తవ్వుకుంటు పోతుంది
నీటి నట్టింట నడయాడే ఏ వస్తువునైనా
అది ఇట్టే పట్టేస్తుంది.
మసలే, కదిలే, మెదిలే,
గిలగిలమనే జీవి ఏదైనా
ఇది అట్టే ఆకర్షిస్తుంది
పరిశోధనా భాండాగారాలని పూరిస్తుంది.
మా ఎదురులేని సాధనం తవ్వుకుంటు పోతుంది
నీటి నట్టింట నడయాడే ఏ వస్తువునైనా
అది ఇట్టే పట్టేస్తుంది.
మసలే, కదిలే, మెదిలే,
గిలగిలమనే జీవి ఏదైనా
ఇది అట్టే ఆకర్షిస్తుంది
పరిశోధనా భాండాగారాలని పూరిస్తుంది.

డా. వి.శ్రీనివాస చక్రవర్తి గారు తెలుగులోకి చక్కగా అనువదించారు. ఆ పుస్తకాన్ని
ఇక్కడి నొక్కి డౌన్‌లోడ్ చేసుకోండి. (Click here to download) లేదా పుస్తకం హస్తభూషణమనుకునే వారు ఈ క్రింది చిరునామాల యందు సంప్రదించి కొనుగోలు చేయవచ్చును. ధర కేవలం రూ. 15/- మాత్రమే.మంచి పుస్తకం
12-13-452, వీధి నెం.1,
తార్నాక, సికింద్రాబాద్ - 500 017.
జన విజ్ఞాన వేదిక
జి. మాల్యాద్రి, కన్వీనర్, ప్రచురణల విభాగం
ఇంటి నెం. 8-1-6, బాలాజీరావు పేట,
తెనాలి - 522 202
ఫోన్: 94405 03061.
0 comments