“అయితే మరి ఇది జర్మను అనువాదమా?” అడిగాను.
“అనువాదమా? అనువాదంతో నాకేం పని?” కోపంగా అన్నడు మామయ్య. “ఇది ఐస్లాండ్ భాషలో వ్రాసిన మూలగ్రంథం. అనుపమాన ఉపమాలంకార ప్రయోగంతో, చక్కని వ్యాకరణ విశేషాలతో, సముచిత పదలాస్యంతో అద్భుతంగా వ్రాయబడ్డ పుస్తకం. “
“ఓహ్, భలే! అచ్చు కూడా బాగానే ఉందా?” ఇక ఏం అడగాలో తెలీక అడిగాను.
“అచ్చా?” ఆయన అరిచిన అరుపుకి ఒక అంగుళం ఎగిరి పడ్డాను. “ఒరే ఏక్సెల్ నీకు మతి గాని పోయిందా? అంత పాత పుస్తకం అచ్చు పుస్తకం ఎలా అవుతుంది? ఈది వ్రాతప్రతి. రూనిక్ భాషలో వ్రాసిన వ్రాతప్రతి.
“అవును కదూ? నిజమే,” కాస్త పశ్చాతాపం కనబరుస్తూ అన్నాను.
“ప్రాచీన ఐస్లాండ్ లో రూనిక్ లిపి వాడేవారు. ఆ లిపిని ఓడెన్ దేవత స్వయంగా రూపొందించాడని అంటారు. ఇదుగో చూడు. ఆ స్కాండినావియన్ దేవత స్వయంగా సృష్టించిన అక్షరాలు చూసి తరించు” అంటూ పుస్తకం నా ముందుకు తోశాడు.
ఎందుకొచ్చిందిరా దేవుడా, అంటూ ఆ పుస్తకం ముందు సాష్టాంగపడి లెంపలు వేసుకుందాం అని ఆయత్తం అవుతుంటే అంతలో... ఆ పుస్తకం లోంచి ఓ పాత కాగితం జారి నేల మీద పడింది.
“ఏయ్! ఏంటిది?” మామయ్య వంగి ఉత్సాహంగా ఆ కాగితాన్ని పైకి తీశాడు.
ఐదు అంగుళాల వెడల్పు, మూడు అంగుళాల పొడవు ఉన్న ఆ కాగితం ముక్క మీద ఏవో విచిత్రమైన అక్షరాలు రాసి వున్నాయి.
ఆ అక్షరాలే ప్రొఫెసర్ లీడెంబ్రాక్ ని, అతని మేనళ్లుణ్ణి పందొమ్మిదవ శతాబ్దం లోకెల్లా అత్యద్భుతమైన సాహసయాత్ర మీద పురికొల్పాయి.
మార్థా - పేరు చదవగానే గుర్తొచ్చింది. ఇది 'భూగర్భం లోకి ప్రయాణం' అనీ - చిన్నప్పుడు చదివాను - దీన్ని ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత జూల్స్ వెర్న్ రాసారు. వావ్.. దీని హార్డ్ కాపీ ఎక్కడైనా దొరుకుతుందా ? నేనయితే పిల్లల వెర్షన్ లోనే చదివాను. ఇపుడది సినిమాగా కూడా వస్తూంది - జర్నీ టు ది సెంటర్ ఆఫ్ థి ఎర్థ్ గా - మీరు ఒక్కొక్క పార్టూ ప్రచురిస్తూంటే, చిన్నపుడు చందమామ కోసం చూసినట్టు ఎదురు చూస్తున్నాను. చాలా మంచి ఐడియా.
కామెంట్స్ కి బోలెడు థాంక్స్. భూగర్భ యాత్ర అన్న పేరుతో ఈ పుస్తకానికి అనువాదం ఎవరో చేశారని తెలుసు. కాని పేరు తెలీదు. దాని హార్డ్ కాపీ నా మిత్రుడు, ప్రచురణకర్త సురేష్ కొసరాజు దగ్గర ఉండొచ్చు. suresh.kosaraju@gmail.com ఇక్కడ ఇస్తున్నది ఉన్నది ఉన్నట్టుగా, సంక్షిప్తం చెయ్యకుండా చేసే అనువాదం. ఎందుకంటే ఇలాంటి పుస్తకాల్లో కథ తో పాటు, భాష, శిల్పం, కథనం, వర్ణన కూడా చాలా బావుంటాయి. కాని ఇప్పటి వరకు రెండు అధ్యాయాలు మాత్రం అనువదించడం జరిగింది. మిగతావి మెల్లగా చెయ్యాలి...