సర్క్యుట్ థియరీ నుంచి ఓ చిన్న సమస్య... కెపాసిటర్లకి సంబంధించినది.
(పీ. హెచ్. డీ. ఇంటర్వ్యూ లకి వచ్చిన అభ్యర్థులని ఇబ్బంది పెట్టడానికి దీన్ని విసురుతూ ఉంటారు మా వాళ్లు:-)
పైన చిత్రంలో రెండు సమాన కెపాసిటర్లు ఉన్నాయి. అంటే వాటి కెపాసిటన్స్ C1 = C2 = C అనుకుందాం. రెండిటినీ కలిపే స్విచ్ ముందు తెరిచి (open) ఉంది. C1 మీద Q విద్యుదావేశం (charge) ఉంది; C2 మీద ఉన్న విద్యుదావేశం సున్నా. ఇప్పుడు స్విచ్ ని వేశాం (close).
1) స్విచ్ ని వేశాక రెండు కెపాసిటర్లలోని విద్యుదావేశం ఎంత? (ఇది చాలా సులభం)
2) పై మార్పు వల్ల శక్తి నిత్యత్వ సూత్రం (law of conservation of energy) ఉల్లంఘింప బడుతోందా?
స్విచ్ - ఇడియల్ స్విచ్ అనుకుంటే సగం ఎనర్జి మాయం అయినట్టే :-).. ప్రాక్టికల్ గా ఈ ఎక్స్పరిమెంట్ చేసి చూస్తే ఆ సగం ఎనర్జి స్విచ్ లేనూ, ఆ కెపాసిటర్లని కలిపే తీగ యొక్క నిరొదం (రెసిస్టన్స్) లోను ఖర్చు (డిసిపేట్) అవుతుంది అందువల్ల law of conservation of energy is still valid.
You are absolutely right. నూటికి నూరు! :-)