కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 11ఆధునిక వాతావరణ నమూనాలు ఎలా పని చేస్తాయో ఓసారి చూద్దాం. రమారమి అరవై మైళ్ళ సమమైన ఎడం ఉన్న స్థానాలతో భూమి అంతా విస్తరించిన ఓ ఊహాత్మక గడిని తీసుకుంటారు. ప్రతీ స్థానంలోని వాతావరణాన్ని గురించిన సమాచారం పృథ్వీ కేంద్రాల నుండి, ఉపగ్రహాల నుండి వస్తుంది. అయితే కొన్ని కొన్ని స్థానాల నుండి - కేంద్రాలు లేకపోవడం చేతగాని మరే కారణం చేతగాని సమాచారం లభించకపోవచ్చు. అటువంటప్పుడు పొరుగుస్థానాలలో నమోదు అయిన సమాచారం బట్టి ఇక్కడి సమాచారాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ అంచనాల్లో దోషాల వల్ల వాతావరణ నిర్ణయంలో తప్పులు దొర్లుతాయి....
కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 101980 లలో అమెరికన్ ప్రభుత్వం వాన్ నాయ్మన్ ఊహించిన లక్ష్యసాధన కోసం పెద్ద యెత్తున నిధులు కేటాయించింది. ఆ రోజుల్లో వాతావరణ నిర్ణయ విభాగం మేరీలాండ్ లో ఉండేది. అందులో ఓ పెద్ద సూపర్ కంప్యూటర్లో వాతావరణాన్ని సిములేట్ చేసే ప్రోగ్రామ్‌లు నడిచేవి. అయితే ఈ నమూనాకి లారెంజ్ వాడిన నమూనాకి అట్టే పోలిక లేదు. లారెంజ్ నమూనాలో కేవలం 12 సమీకరణాలే ఉన్నాయి. కాని అధునిక ధరావ్యాప్త నమూనాలో 500,000 సమీకరణాలు ఉంటాయి. లారెంజ్ వాడిన రాయల్‌మక్‌బీ కంప్యూటర్ సెకనుకి 60 గుణకారాలు చేస్తుంది. కాని వాతావరణ కార్యాలయం వాడే "కంట్రోల్...

మామయ్య ఆ అక్షరాల కేసి కళ్లజోడు సర్దుకుని తదేకంగా చూశాడు.“ఇవి రూనిక్ అక్షరాలే. స్నోర్ టరెల్సన్ వ్రాసిన వ్రాతప్రతి లోని అక్షరాల మాదిరిగానే ఉన్నాయి. కాని ఇంతకీ వాటి అర్థం ఏమిటి?”చిచిత్ర విచిత్రంగా మెలికలు తిరిగిపోతున్న ఆ అక్షరాలని చూస్తే అవి కచ్చితంగా అమాయక ప్రజలని తికమక పెట్టటానికి ఎవరో తెలివైన వాళ్లు పన్నిన పన్నాగం అనిపించింది నాకైతే.“ఇది నిజంగా ప్రాచీన ఐస్లాండిక్ భాషే,” గొణుగుతున్నట్టుగా అన్నాడు మామయ్య.చెప్పలేదు కదూ? మా మామయ్య బహుభాషా కోవిదుడు....

ఇటువంటి చింతనకి ఊపిరి పోసిన వాడు జాన్ వాన్ నోయ్మన్. ఇతడే ప్రప్రథమ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ నిర్మాత. వాతావరణాన్ని నియంత్రించే ఉద్దేశంతోనే ఈ కంప్యూటర్ నిర్మాణానికి పూనుకున్నాడు. కంప్యూటర్ సహాయంతో వాతావరణాన్ని ఎలా శాసించవచ్చో వివరిస్తూ సంచలనాత్మక ఉపన్యాసాలిస్తూ భౌతిక శాస్త్రవేత్తలని సమ్మోహింపజేశాడు. తన ఉద్యమంలో ఎందరో వాతావరణ శాస్త్రవేత్తలు చేరారు. ‘క్షణ క్షణముల్’ అన్నట్టుండే వాతావరణాన్ని కంప్యూటర్ సహాయంతో నియంత్రించడం ఎందుకు సాధ్యం అన్న విషయం...
“ఈ బుజ్జి తల్లి పేరా?” రెట్టించిన ఉత్సాహంతో అన్నాడు మామయ్య. “దీని పేరు ‘హైంస్ క్రింగా.’ రాసిన వాడు స్నోర్స్ టరెల్సన్ అని పన్నెండవ శతాబ్దానికి చెందిన ఐస్లాండ్ పండితుడు. ఐస్లాండ్ ని పాలించిన నార్వేజియన్ రాజవంశీయుల చరిత్ర ఇందులో ఉంది.”“అయితే మరి ఇది జర్మను అనువాదమా?” అడిగాను.“అనువాదమా? అనువాదంతో నాకేం పని?” కోపంగా అన్నడు మామయ్య. “ఇది ఐస్లాండ్ భాషలో వ్రాసిన మూలగ్రంథం. అనుపమాన ఉపమాలంకార ప్రయోగంతో, చక్కని వ్యాకరణ విశేషాలతో, సముచిత పదలాస్యంతో అద్భుతంగా వ్రాయబడ్డ పుస్తకం. ““ఓహ్, భలే! అచ్చు కూడా బాగానే ఉందా?” ఇక ఏం అడగాలో తెలీక అడిగాను.“అచ్చా?”...

భూమి ప్రసక్తి ఎవరో తెస్తే ఒక జోక్ గుర్తుకొస్తోంది. ఇది నిజంగా జరిగిందని విన్నాను.--ఒక తండ్రి తన కూతురికి చీకటి ఆకాశంలో తారలు అవీ చూపిస్తున్నాట్ట.“చూడమ్మా, అక్కడ తార లాగా మెరుస్తోందే, అది అసలు తార కాదు. వీనస్ గ్రహం. ఇంకా ఆ మూల కనిపిస్తోంది చిన్న ఎర్రని చుక్కలా, అది మార్స్ గ్రహం.”“డాడీ, మరి మా పుస్తకంలో వీనస్ కి , మార్స్ మధ్య ఎర్త్ ఉంటుందని వుంది. ఇంతకీ భూమి ఎక్కడుంది డాడీ?”--పుస్తకాలకే పరిమితమైన మన బట్టీ చదువులకి మరో అసమాన తార్కా...
అధ్యాయం – 2మా మామయ్య స్టడీ రూం చిన్న మ్యూజియం లా ఉంటుంది. ఖనిజ ప్రపంచంలో ఎక్కడలేని నమూనాలూ అక్కడ కనిపిస్తాయి. జ్వలనీయ ఖనిజాలు, లోహపు ఖనిజాలు, అశ్మకపు ఖనిజాలు ఇలా రకరకాల ఖనిజాలు -- మీద పేర్లు అంటించిన సీసాల్లో గది నిండా ఉంటాయి.ఈ ఖనిజ శకలాలే నా ప్రియ నేస్తాలు. నా తోటి కుర్రాళ్లతో సరదాగా గడపకుండా ఎన్నో సార్లు ఈ గ్రాఫైట్లని, ఆంత్రసైట్లని, లిగ్నైట్, పీట్ మొదలైన బొగ్గు జాతులని దుమ్ము దులుపుతూ కాల క్షేపం చేస్తుంటాను. ఇక బిట్యుమెన్లు, రెసిన్లు, సేంద్రియ రసాయన లవణాలు – వీటినయితే చిన్న ధూళి కణం కూడా పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి....

ప్రఖ్యాత అమెరికన్ శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ ఫెయిన్మన్ గురించి తెలియని వాళ్లు తక్కువ. కెయాస్ థియరీ మీద పుస్తకం రాసిన జేంస్ గ్లైక్ ఫెయ్న్మన్ జీవిత కథ కూడా "జీనియస్" అన్న పేరుతో రాశాడు. ఫెయిన్మన్ అసమాన ప్రతిభను తెలిపే ఘట్టాలతో బాటూ, అతని పట్టరాని చిలిపి చేష్టల వృత్తాంతాలతో ఈ పుస్తకం అద్భుతంగా ఉంటుంది. ఒక చోట ఒక సంఘటన తమాషాగా ఉంటుంది.కాల్ టెక్ లో పని చేసే ముర్రే గెల్మన్ కి ఫెయిన్మన్ కి వృత్తిరీత్యా కొంత పోటీ ఉన్నా ఇద్దరికీ...

మామూలుగా చూస్తే లారెంజ్ చేసినది సబబే ననిపిస్తుంది. ఆ రోజుల్లో వాతవరణ సాటిలైట్లు సెంటిగ్రేడులో వెయ్యో వంతు నిర్దుష్టతతో సముద్రాల ఉష్ణోగ్రత కొలవగలిగితే చాలా గొప్ప. కనుక కొలవబడ్డ ఫలితాల్లోనే అంత దోషం ఉన్నప్పుడు అంత కన్నా చిన్న దశమ స్థానాలతో పనేముంది అనుకోవడం సమంజసమే అనిపిస్తుంది. పోనీ ఏ నాలుగో స్థానంలోనో, ఐదో స్థానంలోనో కాస్తంత దోషం ఉంటే, ఫలితాల్లో కూడా కాస్తంత దోషం మాత్రమే వస్తుందని ఆశిస్తాం. లారెంజ్ చిత్రం 1 లోని గ్రాఫులని కాస్త క్షుణ్ణంగా...
ఇవన్నీ కాక మా మామయ్య ముక్కోపి అని ముందే చెప్పాను. నడుస్తున్నప్పుడు కూడా గట్టిగా పిడికిలి బిగించి, ఏదో గొణుక్కుంటూ (మరి ఖనిజాల పేర్లు జపిస్తున్నాడో, మనసులో ఎవరినో శపిస్తున్నాడో తెలీదు), పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తాడు. ఇలాంటి మనిషితో మా మార్తా ఎలా వేగుతోందో మీకూ అర్థం కావడం లేదు కదూ?జర్మను ప్రొఫెసర్ అయినా మా మామయ్య కొద్దో గొప్పో ఆస్తిపరుడే అని చెప్పాలి. తన సొంత ఇల్లు ఉంది. ఆ ఇంట్లోని సభ్యులు – ఆయన, ఆయన పెంపుడు కూతురు గ్రౌబెన్, ఓ పదిహేడేళ్ల పనిపిల్ల, మార్తా, నేను. అనాథ నైన నేను ఆయన ప్రయోగశాలలో సహచరుడిగా పని చేస్తుంటాను.చిన్నప్పట్నుంచి...

మానవ చరిత్రలో ఎంతో కాలం - సముద్రపు లోతుల మాట దేవుడెరుగు - సముద్రం పై పొరలలో కూడా ఏముందో మనిషికి తెలియదు. సముద్రం ఎంత లోతు ఉందో, ఆ లోతుల్లో ఏముందో ఎంతో కాలం మనిషికి తెలియలేదు.నదులలో, సరస్సులలో జీవరాశులు ఉన్నట్లే, సముద్రంలో కూడా జీవరాశులు ఉన్నాయని మనిషికి తెలుసు. ఎన్నోరకాల చేపలు ఉంటాయి. ఆలుచిప్పలు, రొయ్యలు, పీతలు మొదలైన ఎన్నో రకాల జీవులు ఉంటాయి. ఆదిమవాసులు కూడా చేపలని ఆహారంగా తీసుకునేవారు. కొన్ని ప్రాంతాల్లో జలచరాలు ఆహారంలో ముఖ్యభాగం అయిపోయాయి....
బాగా సరళీకృతమైన వాతావరణ నమూనా ప్రోగ్రాముని తన కంప్యూటర్లో నడిపిస్తున్నాడు లారెంజ్. ప్రోగ్రాము సరళమైనదైనా అది ప్రదర్శించే వాతావరణ లక్షణాలు ఎంతో సహజమైనవిగా ఉన్నాయి. పడి లేచే పీడనాలు, ఉష్ణోగ్రతలు, తేమలు, అటు ఇటు విను వీధుల వెంట పచార్లు చేసే ఋతుపవనాలు – వీటి గతులన్నిటినీ ప్రోగ్రాము చక్కగా కంప్యూటర్ ప్రింటవుట్ మీద చిత్రిస్తోంది. వివిధ వాతావరణ సంబంధిత రాశులు ఆ ప్రింటవుట్లో లయబద్ధంగా మారుతున్నాయి. అవును. ఆ మార్పులో ఒక లయ ఉంది. ఒక రచన ఉంది. ఒక విన్యాసం ఉంది. అలాగని చక్రికంగా జరుగుతోందని కాదు. ఒకసారి జరిగింది మళ్లీ అదే సందర్భంలో, అదే...
సరే చివరికి ఆ సూక్ష్మదర్శిని వచ్చింది. దాని కోసం ఎదురుచూసే సమయంలో పిల్లలు మరికొన్ని అధ్యయనాలు కూడా చేశారు. పార్శిలు చూడగానే దాన్ని తెరవాలనే ఉత్కంఠ ఎక్కువయ్యింది. జాగ్రత్తగా పార్శిలు విప్పి, దాన్ని ఎలా వాడాలో చెప్పే ఆదేశాలు చదివారు. ఉతక్క ముందు, ఉతికిన తరువాత ఉన్ని దారాలు ఎలా ఉంటాయో చూడడానికి ఆ దారాలు కొన్ని తెచ్చి సూక్ష్మదర్శినిలోకి ఎక్కించారు. ఉన్ని దారాలని గొలుసుకట్టుగా కలిపే కొన్ని సంధులు ఉంటాయి. ఉతికినప్పుడు మరి ఎందుచేతనో ఆ దారాలలోని భాగాలు ఒకదాని మీద ఒకటి జారి (టెలిస్కోప్ లోని భాగాలలా) దారం కుంచించుకుపోతుంది. ఉన్నిని చూశాక...
జాన్ హోల్ట్ ఒక ప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త. ఇతడి రచనలు విద్యారంగంలో ఓ విప్లవాన్ని లేవదీశాయి. "హౌ చిల్డ్రెన్ ఫెయిల్," (How children Fail) "హౌ చిల్డ్రెన్ లెర్న్"(How Children learn) మొదలైన రచనలలో పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్న విషయాన్ని సున్నితంగా శోధిస్తాడు. పిల్లలలో సహజంగా నేర్చుకునే తత్త్వం ఉంటుంది అంటాడు. అలా సహజంగా, స్వతహాగా నేర్చుకోవాలన్న తపనని గుర్తించి మనం సున్నితంగా ఆసరా ఇస్తే చాలు. మనం దూకుడు మీద అడ్డమైన “విద్యా ప్రణాళికలూ” తయారు చేసి వాళ్ల నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తే వాళ్లలో నేర్చుకోవాలన్న ఆదిమ తపన అణగారిపోతుంది....
మా మామయ్యకి ఈ దౌర్బల్యం ఉందని త్వరలోనే అందరికీ తెలిసిపోయింది. ఆయన క్లాసులో పాఠం మొదలుపెట్టగానే పిల్లలంతా సరైన అదను కోసం ఎదురుచూసేవారు. ఆయన మాటలో నత్తి ఛాయలు తొంగి చూడగానే క్లాసంతా పగలబడి నవ్వుతుంది. ఆయన ప్రసంగించినప్పుడు ఆడిటోరియం లు కిక్కిరిసిపోయేవి. అయితే ఆ వచ్చిన వాళ్లలో ఎంత మంది ఆయన చెప్పేది నేర్చుకోవడానికి వచ్చారో, ఆయన నత్తి చూసి నవ్వుకోడానికి వచ్చారో ఆ దేవుడికే తెలియాలి.కాని ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మా మామయ్య అపారమైన పాండిత్యం, పరిజ్ఞానం ఉన్నవాడు. ఇటు భౌగోళిక శాస్త్రవేత్త ప్రతిభ, అటు ఖనిజ శాస్త్రవేత్త సూక్ష్మదౄష్టి...

1950 లలో అమెరికా లో, న్యూ జర్సీ రాష్ట్రంలో, ప్రిన్స్టన్ విష్వవిద్యాలయంలో జాన్ వన్ నాయ్మన్ అనే గొప్ప భౌతిక శాస్త్రవేత్త అధ్వర్యంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రూపుదిద్దుకోసాగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ రహస్య సంకేతాలని భేదించడం, అమెరికా మిసైళ్ల గతులని లెక్కించడం మొదలైన ప్రయోజనాల కోసం ఈ కంప్యూటర్ని తయారు చేస్తున్నారు. కాని వాతావరణ శాస్త్రంలో కూడా కంప్యూటర్కి ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి నాయ్మన్ గుర్తించకపోలేదు.అందుచేత ప్రకౄతి...

అధ్యాయం 1ప్రొఫెసర్ గారిల్లుమే 24, 1863ప్రొఫెసర్ లీడెంబ్రాక్ తటాలున తన ఇంట్లోకి దూసుకొచ్చాడు. ఆ ఇల్లు హాంబర్గ్ లో పాత బస్తీలో, ఒక చిన్న సందులో ఉంది.వంట ఇంకా పూర్తి కాలేదని బెంబేలు పడుతోంది ఆయా మార్తా. భోజనాన్ని ఒవెన్ లో పెడుతూ తన అదౄష్టాన్ని బేరీజు వేసుకుంటోంది.“ఇలాంటి సమయంలో ఆ పెద్ద మనిషి ఇంటి కొస్తే అంతే!’’ మనసులోనే అనుకున్నాను.“ఓరి దేముడా! ఈ మనిషి అప్పుడే ఇంటికి వచ్చేశాడా?” నిట్టూర్చింది మార్తా. ఆమె భయపడినట్టే అయ్యింది.“అయ్యో మార్తా!...

జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ప్రఖ్యాత ఫ్రెంచ్ కాల్పనిక విజ్ఞాన రచయిత, జూల్స్ వెర్న్ రాసిన ‘వొయాష్ ఒ ల సెంత్ర్ ద ల టెర్’ అనే నవల 1864 లో ప్రచురితం అయ్యింది. తదనంతరం అది ఇంగ్లీషులో కూడా అనువదించబడింది. ఆ థీం మీద ఒక ఇంగ్లీష్ చిత్రం కూడా గత సంవత్సరం విడుదల అయ్యింది.ఈఇ నవలలో కథానాయకుడు ఓటో లీడెంబ్రాక్ అనే ఓ జర్మన్ ప్రొఫెసరు. భౌగోళిక శాస్త్రం లో ప్రొఫెసరైన ఈ పెద్దమనిషికి అగ్నిపర్వతాలలో భూ గర్భం లోతుల్లోకి తీసుకుపోయే రహస్య సొరంగ మార్గాలు ఉన్నయని...

చాలా మంది వాతావరణ శాస్త్రవేత్తలకి వాతావరణ భవిష్యత్ నిర్ణయం ఒక శాస్త్రమే కాదు. ఒక ఆర్.ఎం.పి డాక్టరు రోగానికి మందులు ఇచ్చినట్టు, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, పాత ఒరవడులు జ్ఞాపకం పెట్టుకుని, ఏదో ఊహించి చెప్పే ఉజ్జాయింపు వ్యవహారం. ఇంతకు ఇంతైతే, అంతకు అంత అని శాస్త్రీయంగా కోసినట్టు చెప్పగలిగే అవకాశం ఇక్కడ తక్కువ. ఇందులో వ్యక్తి యొక్క అనుభవానికే (కావలిస్తే దానికి కాస్త ఊహాశక్తి జోడించొచ్చు!) ప్రాధాన్యత. శాస్త్రీయమైన ఆధారం అంతగా ఉండదు. పైగా రేపు...

ఇంకా పెద్దవా? బలమైనవా? వేగవంతమైనవా? ఆడ మెదళ్ళకి, మగ మెదళ్ళకి మధ్య నిజంగా ఏమైనా తేడాలు ఉన్నాయా? స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలకే కాదు సామాన్యులకి కూడా ఆసక్తి ఉంటుంది. స్త్రీలకి, పురుషులకి మధ్య ప్రవృత్తిలో తేడా ఉంటుంది కనుక, ఆ తేడా మెదడు నిర్మాణంలోను, క్రియలలోను కూడా ప్రతిబింబిస్తుందా? మరి తేడాలేమిటి? మెదడులో ఏ భాగాల్లో ఆ తేడాలు కనిపిస్తాయి? కొన్ని వందల ఏళ్ళుగా స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి అన్వేషిస్తూ...
తెలిసిన వైజ్ఞానిక ధర్మాలని ఆధారంగా చేసుకుని, కంప్యూటర్ని ఓ సాధనంగా వాడుకుంటూ తన లక్ష్య సాధనలో మునిగిపోయాడు లారెంజ్. కంప్యూటర్ వాతావరణ నిర్మాణానికి ఉపక్రమించాడు.బయటి వాతావరణాన్ని దేవుడి సృష్టించాడేమో గాని ఆ కంప్యూటర్ వాతావరణానికి తనే స్రష్ట. తనకి ఇష్టం వచ్చినట్టు ప్రకృతి ధర్మాలని మార్చుకోవచ్చు. అపర విశ్వామిత్రుడిలా తనకు నచ్చిన తీరులో ప్రకృతిని మలచుకోవచ్చు. ఉష్ణోగ్రత, పీడనం వంటి భౌతిక రాశుల మధ్య సంబంధాలని తెలిపేవే ప్రకృతి ధర్మాలు. ఆ ధర్మాలని గణిత సమీకరణాలుగా వ్యక్తం చేసి, వాటినే ప్రోగ్రాం రూపంలో కంప్యూటర్లో నడిపిస్తే, ఆకాశమంతా...

గదంతా మసక మసకగా ఉంది. నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పరికరాల సన్నని ఝుంకారం వినిపిస్తోంది. స్పీకర్ లో నుండి ఏవో విచిత్రమైన శబ్దాలు వినవస్తున్నాయి. కంప్యూటర్ మానిటర్ మీద ఆకుపచ్చని రేఖలేవో తళుక్కు మంటున్నాయి. నెమ్మదిగా ఓ ఎలక్ట్రోడ్ మెదడు ధాతువులోకి దిగింది. ఓ నాడి కణాన్ని ఛేదించిన ఆ ఎలక్ట్రోడ్ సమయం వృథా చెయ్యకుండా చకచకా ఆ నాడీ కణం యొక్క క్రియ గురించిన సమాచారాన్ని కంప్యూటర్ కి చేరవేస్తోంది. మన నాడీశాస్త్ర వేత్త దినచర్య మొదలయ్యింది. నాడీ శాస్త్రవేత్త...

1. గోరొంతలు కొండంతలు అయితే…అక్కడి ఆకాశంలో కారుమబ్బులు ఉండవు. అక్కడి భూమి మీద మిట్టపల్లాలు ఉండవు. ఛుర్రు మనిపించే రవ్వలు రువ్వడు రవి. ‘నిలు’ అంటే నిలిచిపోతాడు అనిలుడు. అక్కడి మధుమాసంలో మావిచిగుళ్లు ఉండవు. గ్రీష్మంలో మార్తాండ తాండవం కనిపించదు. శీతాకాలపు చలి పెట్టే గిలిగింతలు ఉండవు. వర్షాలు, వాగులు, వరదలు – అసలివేవీ ఉండవు. అదో విచిత్రమైన వాతావరణం. కృత్రిమమైన వాతావరణం. మనిషి ఊహలో ప్రాణం పోసుకుంటున్న వాతావరణం. గుడ్డులోంచి పిట్ట బయటపడుతున్నట్టు...

కల్లోలతా పరిశోధనలలో కంప్యూటర్ల వినియోగం ఒక కొత్త ఎత్తుకి ఎదిగింది. సంక్లిష్టతకి అంతర్లీనంగా ఉండే అద్భుతమైన ఆకృతికి అద్దం పట్టే అతి సుందర గ్రాఫిక్ చిత్రాలు వైజ్ఞానిక కళావస్తువుల స్థాయికి ఎదిగాయి. ఫ్రాక్టల్స్ (fractals) గురించి “బైఫర్కేషన్ల” (bifurcation) గురించి, “ఇంటెర్మిటెన్సీల” (intermittency) గురించి, తువ్వాలు-మడత “డిఫియోమార్ఫిజమ్” (diffeomorphism) ల గురించి పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఒక ఫ్యాషను అయిపోయింది. ఈ పదాలన్నీ చలనాన్ని అభివర్ణించే...

ఇరవయ్యవ శతాబ్ద విజ్ఞానం లో విప్లవాలు అనుకోదగ్గ సిద్ధాంతాలు ప్రధానంగా రెండు ఉన్నాయి - ఒకటి సాపేక్ష సిద్ధాంతం, రెండవది క్వాంటం సిద్దాంతం. ఇవి కాకుండా మూడోది కేయాస్ థియరీ లేదా కల్లోలతా సిద్ధాంతం అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కేయాస్ థియరీ ని ఈ మధ్యన మన కమలహాసన్ గారు తన దశావతారం చిత్రంలో తెలివిగా వాడుకున్నారు. కేయాస్ థియరీ మీద జేమ్స్ గ్లయిక్ ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం తో ఆ సిద్దాంతం గురించి, ఆధునిక విజ్ఞానం మీద దాని ప్రభావం గురించి సామాన్యులకి...

అతగాడు భావుకుడు. కవి తాను అల్లుకున్న అందమైన భావజాలంలో విహరించినట్టు తాను అల్లుకున్న అందమైన ఆకాశ హర్మ్యంలో హాయిగా కొలువు ఉంటాడు. అతడు శాస్త్రవేత్త. శాస్త్రజ్ఞుడు తాను రూపొందించిన సైద్ధాంతిక నిర్మాణం నుండి విశ్వాన్ని దర్శించినట్టు, అతడు తాను పేనుకున్న మేలిమి మస్లిన్ భవంతి నుండి నిశ్చింతగా ప్రపంచాన్ని తిలకిస్తూ ఉంటాడు. కళాకారుడి కుంచే విసురులని మించిపోతాయి అతడు గీసే దారాల దారులు. అతడే అసలు స్పైడర్ మాన్!కీటక ప్రపంచంలో సాలీడుకి ఒక ప్రత్యేక స్థానం...

ఆ మధ్యన ఓ సైన్స్ టీచర్ ని కలుసుకోవటం జరిగింది.ఈయన తిరుపతి దగ్గర ఓ చిన్న ఊళ్ళో, ఓ తెలుగు మీడియం స్కూల్లో సైన్స్ టీచరు. (ఆయన పేరు గాని, ఆ ఊరి పేరు గాని గుర్తుపెట్టుకోని నా నిర్లక్ష్యానికి నన్ను నేనే చెడా మడా తిట్టుకున్నాను!) ఈయన ఆరో క్లాసు పిల్లలకి సైన్సు చెప్తూ ఉంటే "విశ్వం" అన్న అధ్యాయంలో పిల్లలకి కొంత సమస్యగా ఉందని గుర్తించాడు.(www.kagayastudio.com/space/stars/l_01_galaxy.htm)గెలాక్సీ అంటే అసలేమిటి? అందులో సూర్యుడి స్థానం ఏమిటి? సౌరమండలంలో...
postlink