
ఆకాశానికి నిచ్చెనలు వెయ్యగలమా?ఆకాశానికి నిచ్చెనలు వెయ్యగలిగితే నిజంగానే గొప్పగా ఉంటుంది.(స్పేస్ ఎలివేటర్ యొక్క ఊహాత్మక చిత్రం)మబ్బు పరుపుల మీద నిద్దరోవచ్చు. భేరుండాలతో భేటీ వేసుకోవచ్చు. చంద్రవంక ఊయలెక్కి ఊగులాడొచ్చు. తారల మధ్య మరో తారగా అవతార మెత్తొచ్చు.ఆకాశానికి నిచ్చెనల మాటేమోగాని ఆకాశంలోకి ఓ పొడవాటి తాటిని నిటారుగా పంపించే ఇంద్రజాల పద్ధతి ఒకటి మన దేశంలో ఒకానొకప్పుడు ఉందని చెప్పుకుంటారు. దాన్ని The great Indian Rope Trick అని పిలుస్తుంటారు....
అసంభవాన్ని అధ్యయనం చెయ్యడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. భౌతిక రసాయన శాస్త్రాల సరిహద్దులు విస్తరించబడ్డాయి. దాంతో అసంభవం అన్న పదానికి కొత్త నిర్వచనాన్ని వెదుక్కోవాల్సి వస్తుంది. సర్ విలియం ఓస్లర్ అన్నట్టు: "ఒక యుగానికి చెందిన మౌలిక భావనలు మరో యుగంలో అసందర్భాలు అయ్యాయి. నిన్నటి మూర్ఖత్వం రేపటి వివేకంగా పరిణమించింది."ఉదాహరణకి విశ్వశాస్త్రవేత్త (cosmologist) స్టెఫెన్ హాకింగ్ ఒక దశలో కాలయానం అసంభవం అని నిరూపించడానికి ప్రయత్నించాడు....

అసంభవాన్ని అధ్యయనం చెయ్యడం ఎలా?విచిత్రం ఏంటంటే అసంభవాలని లోతుగా శోధించడం వల్ల విజ్ఞానం ఎంతగానో విస్తరించింది. "నిరంతర చలన యంత్రం" కోసం కొన్ని శతాబ్దాల పాటు శాస్త్రవేత్తలు శక్తి నిత్యత్వాన్ని అర్థం చేసుకుని, ఉష్ణగతి శాస్త్రం లోని మూడు ధర్మాలని సూత్రీకరించారు. కనుక నిరంతర చలన యంత్రాల కోసం అన్వేషణ విఫలమైనా, దాని వల్ల ఉష్ణగతి శాస్త్రం అనే కొత్త శాస్త్రానికి పునాదులు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఆవిరి యంత్రం పుట్టింది. యంత్రాల యుగం ఆరంభమయ్యింది. ఆధునిక...

ఏది అసంభవం అన్నది సాపేక్షమైన విషయంఒక భౌతిక శాస్త్రవేత్తగా "అసంభవం" అన్న పదం సాపేక్షం అన్న విషయం త్వరలోనే గుర్తించాను. చిన్నప్పుడు స్కూల్లో ఒక రోజు మా క్లాస్ టీచర్ గోడ మీద తగిలించిన భూమి పటాన్ని చూబిస్తూ దక్షిణ అమెరికా తీరరేఖని, ఆఫ్రికా తీర రేఖని జాగ్రత్తగా చూడమంది. ఈ రెండు తీరరేఖలూ ఒకదాంతో ఒకటి ఓ జిగ్సా పజిల్ లోలా సరిగ్గా సరిపోవడం చిత్రంగా లేదూ? అని అడిగింది. బహుశా ఆ రెండు ఖండాలు ఒకప్పుడు ఒకే విశాల అఖండ భూభాగంలో భాగాలేమో? అని కొందరు...

ఈ మధ్యనే "Physics of the impossible" అనే పుస్తకం నా చేతిలో పడింది. రచయిత Michio Kaku పేరుమోసిన String theorist. అంతే కాక ఇతడు సైన్స్ పోపులరైజర్ కూడా. ఈ పుస్తకంలో ముందుమాటలో సైన్స్ తనను చిన్నప్పుడు ఏ కారణాల చేత ఆకర్షించిందీ రాస్తాడు. విజ్ఞానానికి, కాల్పనిక విజ్ఞానానిక మధ్య సంబంధం గురించి చెప్తూ, నేడు కల్పన అనుకున్నది రేపటి విజ్ఞానం కాగలదు అంటాడు. మన శాస్త్రవేత్తల ప్రేమకథల సీరీస్ లో ఇది రెండవది.--భవిష్యత్తులో మనం ఏదో నాటికి గోడల లోంచి నడిచి...

రెండు రోజుల క్రితం చంద్రయాన్ చంద్రుడి మీద నీటిని కనుక్కున్న విషయం గురించి టీవీ9 రిపోర్ట్ చేసింది. యాంకర్ ఎవరో ఆ వృత్తాంతం గురించి చాలా ఆసక్తికరంగా చెప్పింది. భవిష్యత్తులో చందమామ మీద స్థావరాలు ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుంది మొదలైనవి చర్చించారు.టీవీ చానెళ్లలో సైన్స్ రిపోర్టింగ్, ముఖ్యంగా ఇలా నాటకీయంగా, ఉత్సాహంగా సైన్స్ ని రిపోర్ట్ చేసే ఒరవడి ఇటీవలి కాలంలోనే కనిపిస్తున్నట్టుంది. తెలుగులో సైన్స్ రిపోర్టింగ్ యుగం నిస్సందేహంగా మొదలయ్యింది...అయితే...

ప్రఖ్యా సత్యనారాయణ శర్మగారు రాసిన 'గణిత భారతి' పుస్తకంలోనే భాస్కారాచార్యుడి గురించి, ఆయన కుమార్తె లీలావతి గురించి ఓ ఆసక్తికరమైన కథ వుంది. దాన్ని ఇంచుమించు ఉన్నదున్నట్టుగా ఇక్కడ ఇస్తున్నాను.--"ఆ మహా గణితజ్ఞుడు ఓ జలఘటికా యంత్రాన్ని తన గదిలో అమర్చుతున్నాడు. దూరం నుండి తన ఏకైక కుమార్తె ఆసక్తిగా చూస్తోంది. ఆయన గదిలోంచి బయటికి వెళ్లాక ఆ అమ్మాయి లోపలికి వెళ్లింది. అసమాన గణిత, జ్యోతిష శాస్త్రవేత్త అయిన ఆ పండితుడు తన కుమార్తె జాతక చక్రం గురించి...

మనస్తత్వ శాస్త్రం చదివే రోజుల్లోనే మొట్టమొదటి సారిగా మానవ మెదడు పరిచ్ఛేదాలు చేసే అవకాశం దొరికింది. ఆ రోజు నాకు బాగా గుర్తు. మా ఎదురుగా ప్లాస్టిక్ పాత్రల్లో మెదళ్లు ఉంచారు. మేం చొక్కా చేతులు మడుచుకుని, గ్లోవ్స్ వేసుకుని, కంపుకొట్టే విచిత్ర ద్రవం ఉన్న ఆ పాత్రల్లో చేతులు ముంచి మెదడుని పైకి తీశాం. ఒకప్పుడు ఎవరో వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి, ఆలోచనలకి, జీవనసారానికి ఆధారభూతమైన ఆ అవయవాన్ని ఇలా చేతుల్లో పట్టుకుని చూస్తున్నాను. అప్పుడు నాకో ఆలోచన...
సైన్సుకి శాస్త్రవేత్తలకి మధ్య "ప్రేమకథల" గురించి చెప్పుకుందాం అని ముందు అనుకున్నాం. శాస్త్రవేత్తలు మొదట్లో ఆ ప్రేమలో ఎలా పడిందీ తెలుసుకోడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కొక్కరికి సైన్సులో ఒక్కొక్క విషయం నచ్చుతుంది. కథలు శాస్త్రవేత్తల కథలే అయినా, అందులో సైన్సే ఓ కొత్త కోణం నుండి కనిపిస్తుంది.ఆ సీరీస్ లో మొదటి పోస్ట్ లో ’సూసన్ గ్రీన్ ఫీల్డ్’ అనే నాడీశాస్త్రవేత్త గురించి చెప్పుకుందాం.యూ.కె. కి చెందిన ఈమె ’రాయల్ ఇన్స్ టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ కి అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్కిన్సన్స్, ఆల్జ్ హైమర్స్ వంటి నాడీ వ్యాధుల మీద ఈమె పరిశోధనలు...

ఊరు చూస్తుంటే నా ప్రేయసి స్మృతులే మనసులో మెదలుతున్నాయి. ఇద్దరం రేవులో కలిసి చేసిన షికార్లే గుర్తుకొస్తున్నాయి. రేవులో సద్దు చేయక నిద్దరోయే ఓడల పక్కగా, మనసుని మచ్చికచేసే పచ్చని పచ్చిక బాటల వెంట, తోటలో దాగి వున్న కోట దిశగా కలిసి వేసిన అడుగులే మదిలో మరి మరి మారుమ్రోగుతున్నాయి.కాని నా ప్రేయసి ఇప్పుడు నాకు అందనంత దూరంలో ఉంది. మళ్లీ ఎప్పుడు చూస్తానో ఆమెని. అసలు ఈ జన్మలో మళ్లీ చూస్తాననే ఆశ లేదు నాకు.ఈ దృశ్యాలేవీ మామయ్య మనసుని కరిగించ లేదన్న సంగతి...

తెలుగులో వైజ్ఞానిక సాహిత్యం చదవడం అలవాటు ఉన్నవారికి డా. మహీధర నళినీమోహన్ పేరు తెలియకుండా ఉండదు.ఆయన రాసిన ’కాలెండర్ కథ’ అనే పుస్తకంలో భారతీయ ఖగోళశాస్త్ర చరిత్ర గురించే కాక భారతీయేతర నాగరికతలకి చెందిన ఖగోళ విజ్ఞానం గురించి, ఈ వివిధ ఖగోళసాంప్రదాయాల మధ్య పోలికల గురించి, తేడాల గురించి అద్భుతంగా వివరించారు.ఆ పుస్తకంలో ’భూమి - బొంగరం’ అనే ఆరవ అధ్యాయంలో భూమి యొక్క "విషువచ్చలనం" గురించి ఓ మహా ఆసక్తికరమైన కథ ఉంది. దాన్ని సంక్షిప్తంగా ఇక్కడ ఇస్తున్నాను.---భూమి...

కాప్రేకర్ సంఖ్య లోని రహస్యంకాప్రేకర్ సంఖ్య ఎలా వస్తుందో చూద్దాం.మొదట మనం తీసుకున్న నాలుగు అంకెల సంఖ్యలోని అంకెలని అవరోహణా క్రమంలో పెడితే అవి a, b, c, d అనుకుందాం. అంటే,9≥ a ≥ b ≥ c ≥ d ≥ 0.ఇప్పుడు,అవరోహణా క్రమంలో ఉన్న సంఖ్య విలువ = 1000a + 100b + 10c + dఆరోహణా క్రమంలో ఉన్న సంఖ్య విలువ = 1000d + 100c + 10b + aరెండిటి మధ్య బేధం =1000a + 100b + 10c + d - (1000d + 100c + 10b + a)= 1000(a-d) + 100(b-c) + 10(c-b) + (d-a)= 999(a-d) + 90(b-c)...

విచిత్రమైన కాప్రేకర్ సంఖ్యలెక్కలు అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఇక 'ఆల్జీబ్రా, గుండె గాభరా' వంటి నానుళ్లు ఉండనే ఉన్నాయి.కాని జీవితాంతంతో సంఖ్యా స్నేహితులతో సరదాగా ఆడుకున్న ఒక భారతీయ గణిత క్రీడాకారుడు ఉన్నాడు. ఆయన పేరు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్.బొంబాయికి 70 మైళ్ల దూరంలో ఉన్న దహన్ వద్ద జనవరి 17, 1895 లో జన్మించాడు కాప్రేకర్. ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి మరణించగా తండ్రే పెంచాడు.చిన్నప్పట్నుంచి ఆ పిల్లవాడికి లెక్కలు అంటే చాలా ఇష్టం ఉండేదట....

సౌర శక్తి కేవలం ఆమ్లెట్లు వేసుకోడానికే కాదు. రోజూ వారి జీవితంలో సౌరశక్తికి ఎన్నో విలువైన ప్రయోజనాలు ఉన్నాయి.సౌరశక్తి వినియోగం 2000 ఏళ్లకి పూర్వమే మనుషులకి తెలుసు. అయితే సౌరశక్తి యొక్క మొట్టమొదటి వినియోగం రోజూ వారీ ప్రయోజనాలకి కాదు. దారుణమైన యుద్ధ ప్రయోజనాలకి సౌరశక్తిని ఎలా వాడాలో ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్త/గణితవేత్త ఆర్కిమిడీస్ ప్రదర్శించి చూబించాడు. క్రీ.పూ. 212 లో రోమన్లు గ్రీకుల మీద దండయాత్ర చేసినప్పుడూ, సిరక్యూస్ నగరం వద్ద సముద్ర...

మనకి పొరుగు గెలాక్సీలలో అతి పెద్దదైన, 2.5 మిలియన్ కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఆండ్రోమెడా గురించి కిందటీ పోస్ట్ లో చూశాం.ఇంకొంచెం దూరం అంటే 3 మిలియన్ కాంతిసంవత్సరాల దూరం వరకు పోతే ఆండ్రోమెడా లాంటి మరో పెద్ద గెలాక్సీ కనిపిస్తుంది. అదే ట్రయాంగులమ్ గెలాక్సీ.యురెనస్ ని కనుక్కున్న విలియమ్ హెర్షెల్ కాలంలో పాలపుంతే విశ్వానికి కేంద్రం అనుకునేవారు. పాలపుంతకి బయట ఏవో కొన్ని చెదురు మొదురు తారలు, తారాధూళి మేఘాలు తప్ప ఉన్నది వట్టి శూన్యమే అనుకునేవారు....
ఈ ప్రయోగంలో టామ్ కళ్లకి గంతలు కట్టబడ్డాయి. ఓ Q-tipని తీసుకుని డా. రామచంద్రన్ టామ్ శరీరాన్ని వివిధ స్థానాల వద్ద తాకుతూ వస్తారు. కేవలం స్పర్శని బట్టి (చూడలేడు కనుక) ఆ తాకింది ఎక్కడో టామ్ చెప్పాలి.ముందు చెక్కిలి తాకి "ఏం అనిపిస్తోంది" అని అడిగారు."మీరు నా బుగ్గని తాకుతున్నారు" అన్నాడు టామ్."ఇంకేవైనా అనిపిస్తోందా?""అదీ... మీకు కొంచెం చిత్రంగా అనిపించొచ్చు. మీరు నా భూతహస్తపు బొటన వేలిని తాకుతున్నట్టు అనిపిస్తోంది."ఈ సారి Q-tipతో టామ్ పై పెదవి ని తాకారు."మీరు నా భూతహస్తపు చూపుడు వేలిని తాకుతున్నారు. అలాగే నా పైపెదవిని కూడా తాకుతున్నారు.""బాగా...

చీకటి మరింత నలుపెక్క సాగింది. చలిగాలుల తాకిడికి నరాలు జివ్వు మంటున్నాయి. దూరంగా తీరం మీద మినుకు మినుకు మంటున్న కాంతులు కూడా నెమ్మదిగా అదృశ్యం అవుతున్నాయి. అనంతమైన చీకట్లోకి కళ్లుపొడుచుకు చూస్తున్న లైట్ హౌస్ కాంతి అలల మీద ఉండుండి వెలుగు బాటలు వేస్తోంది. మా యాత్రలో ఆ దశ గురించి నాకు ఇంకేమీ గుర్తులేదు.(కోపెన్హాగెన్ లో రోసేన్ బర్గ్ ఉద్యానవనం)మర్నాడు ఉదయం ఏడింటికి కోర్సోర్ లో ఆగాం. ఇది జీలాండ్ పశ్చిమతీరం మీద ఒక చిన్న నగరం. అక్కడ ఓడ దిగి మళ్ళీ...

పై విలువని సూచించే పద్యంక్రీ.శ. 950 ప్రాంతానికి చెందిన రెండవ ఆర్యభట్టు గణితంలో, జ్యోతిషంలో ఆరితేరినవాడు. ఖగోళ, గణిత శాస్త్రాల మీద ఇతడు ’మహాఆర్య సిద్ధాంతం’ అనే పుస్తకం రచించాడు. ఇందులో అక్షరాలతో, పద్యాలలో సంఖ్యలని వ్యక్తం చెయ్యడానికి ఇతడు ఓ చక్కని పద్ధతి సూచించాడు. దానికి "కటపయాది" పద్ధతి అని పేరు. ఈ పద్ధతిలో ప్రతీ హల్లుకి ఒక సంఖ్య విలువ ఈ విధంగా ఇవ్వబడుతుంది.క, ట, ప, య = 1 ; ఖ, ఠ, ఫ, ర = 2గ, డ, బ, ల = 3; ఘ, ఢ, భ, వ = 4జ, ణ, మ, శ =...
అధ్యాయం 8అవరోహణకి సన్నాహాలుహాంబర్గ్ శివార్లలో ఉన్న ఓ ప్రాంతం అల్టోనా. కీల్ రైల్వే లో అదో ముఖ్యమైన కూడలి. అక్కడ రైలెక్కితే బెల్ట్స్ చేరుకోవచ్చు. ఇరవై నిముషాలలో హోల్స్టయిన్ లో ఉన్నాం.సరిగ్గా ఆరున్నరకి రైలు స్టేషన్లో ఆగింది. మా మామయ్య గుర్రబ్బండిలో నిండుగా కుక్కి తెచ్చిన పెట్టెలన్నిటిని దింపించి, వాటిని తూచి, వాటి మీద తగ్గ స్టిక్కర్లు అంటించి, రైల్లో ఎక్కించే కార్యక్రమం అరగంట పట్టింది. సరిగ్గా ఏడు గంటలకి మా కంపార్ట్ మెంట్ లో ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఇంజెన్ కూత కూసింది. రైలు బయలుదేరింది.విధి లేక ఈ దిక్కుమాలిన యాత్రలో కూరుకుపోయానా?...

తొలి ప్రయత్నాలు:ఈ పరిశోధనలో డా. రామచంద్రన్ కి పనికొచ్చిన మొట్టమొదటి ఆధారాలు అమెరికాలో నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) కి చెందిన డా. పాన్స్ కోతులతో చేసిన ప్రయోగాల నుండి వచ్చాయి. కోతులలో స్పర్శకి మెదడు ఎలా స్పందిస్తుంది అన్న విషయం మీద ఈయన ఎన్నో ప్రయోగాలు చేశారు. డా. పాన్స్ చేసిన ప్రయోగాల ఫలితాల గురించి చెప్పుకోబోయే ముందు అసలు మెదడు స్పర్శకి ఎలా స్పందిస్తుంది అన్న విషయం గురించి కొన్ని ప్రాథమిక విషయాలు చెప్పుకోవాలి.బాహ్య ప్రపంచం ...
భూత హస్తాల గురించిన వాస్తవ వృత్తాంతాలని పరిశీలిస్తే వాటిని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది.ఈ భూతహస్తాల గురించి పుక్కిటి పురాణాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని కథలలో వాస్తవానికి తగు మోతాదులో ఊహాగానం జోడించడం జరిగిందేమో అనిపిస్తుంది. అలాంటిదే ఓ వృత్తాంతం కొంచెం అవాస్తవికంగా అనిపించినా ఆసక్తికరంగా ఉంటుంది.చెయ్యి తీసేసిన ఓ వ్యక్తికి చాలా మందిలో లాగానే భూహస్తపు అనుభూతి మొదలయ్యింది. కాని చిత్రం ఏంటంటే ఆ భూతహస్తాన్ని ఏదో కొరుకుతున్న, దొలిచేస్తున్న భావన కూడా కలిగేదట. ఆ వ్యక్తి బెంబేలు పడి డాక్టర్ ని సంప్రదించాడట. డాక్టర్ కి ఈ...
మనలో "నేను" అన్న భావనకి ఆధారంగా రెండు అంశాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆంతరంగికం - నా ఆలోచనలు, నా భావనలు, నా తలంపులు, నా కలలు, కల్పనలు మొదలైనవి. ఇక బాహ్యమైన రెండవ అంశమే మన శరీరం. భావాలతో, తలంపులతో కూడుకున్న మన అంతరంగం అనుక్షణం మార్పుకి లోనవుతూ ఉంటుంది. కాని శరీరం అంత వేగంగా మారదు. కచ్చితమైన రూపంతో, ఒక ప్రత్యేకమైన ఎత్తు, పొడవు మొదలైన లక్షణాలతో ఇంచుమించు స్థిరమైన శరీరం ఉందన్న భావనే "దేహభావన". ఈ దేహభావన మన వ్యక్తి యొక్క బాహ్య నిర్వచనం అన్నమాట. మన దేహానికి, అన్య వస్తువులకి మధ్య ఉండే వేర్పాటుని, ఎడాన్ని తెలిపే భావన. ఇలా ఓ స్థిరమైన దేహభావన...

క్రిందటి పోస్ట్ లో మన పాలపుంతకి ఉపగెలాక్సీల సంగతి చూశాం. వాటిలో మెగలానిక్ మేఘాలు నిజంగా ఉపగెలాక్సీలు కావని, దరిదాపుల్లో ఉన్న పొరుగు గెలాక్సీలని కూడా చెప్పుకున్నాం.మనకి దరిదాపుల్లో ఉన్న గెలాక్సీలలో అతి పెద్ద గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ.చార్లెస్ మెసియర్ అనే ఖగోళశాస్త్రవేత్త గోళాకార రాశులకి (globular clusters) పేర్లు పెట్టాడని ముందు చెప్పుకున్నాం. తన పేరు మీదే వాటికి M1, M2,.. ఇలా వరుసగా పేర్లు పెట్టడం జరిగింది. ఆ నామకరణ కార్యక్రమంలోనే...

సౌర పెనం పై ఆమ్లెట్టా?సౌర శక్తి వినియోగంలో ఇండియా పెద్ద పెద్ద పథకాలు వేస్తోందని ఈ మధ్యనే వార్తలు వచ్చాయి.ఆ పథకాలే గనక అమలు అయితే ఏటేటా 434 మిలియన్ టన్నుల CO2 వెలువరింత తగ్గించుకునే స్థాయికి 2050 నాటికి చేరుకుంటామని సమాచారం. దేశంలో సౌరశక్తి వినియోగం పెరిగితే, ఎన్నో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని, అధునాతన సాంకేతిక నైపుణ్యం పల్లెలకి వ్యాపించే అవకాశం ఉంటుందని, పేదరికం పై పోరాటంలో తోడ్పడుతుందని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని ’గ్రీన్ పీస్’ సంస్థ అంటోంది.http://www.greenpeace.org/india/press/releases/india-ambitious-solar-mission-plan-greenpeaceప్రభుత్వం...
ప్రియమైన వాన్ డెర్ హైడ్ గార్కి,జీవితం గురించి నా ఆలోచనల గురించి రాయమన్నారు, నాకేదో పెద్ద తెలిసినట్టు. ఏదో తప్పుజారి ఓ నాలుగు విషయాలు తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు కూడా. నాకూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని మాత్రం తెలుసు.మీ ఉత్తరం చూశాక అనుకున్నాను - "ఈయన ఎవరో చాలా తెలివైన ఆయన" అని. ఎందుకంటే మీ అభిప్రాయాలు కొంచెం నా అభిప్రాయాల లాగానే ఉన్నాయి! ఉదాహరణకి "ఈ జీవితం ఓ చిక్కు సమస్య అని, మహా మహా వాళ్లకే అది అర్థం కాదని," మీరు రాసినప్పుడు, "వాడు ఏ రంగంలోకి దిగినా నాకు ఫరవాలేదు. కాని ఆ రంగంలో వాడు రాణించాలన్నదే నా ఉద్దేశం" అని అన్నప్పుడు...
postlink