
నిశ్చలమైన నీటి
ఉపరితలం మీద ఒక రాయి పడేస్తే తరంగం ఎలా ఏర్పడుతుందో కిందటి సారి చూశాం. అలాంటి తరంగాన్ని
నీటి ఉపరితలం వద్ద, పక్క నుండి చూస్తే పడి
లేస్తున్న నీటి ఉపరితలం కనిపిస్తుంది. ఒక ప్రత్యేక తరుణంలో అలాంటి తరంగాన్ని ఫోటో తీస్తే,
అందులో కొన్ని చోట్ల నీటి మట్టం కిందికి, కొన్ని చోట్ల పైకి అలా మిట్టపల్లాలుగా కనిపిస్తుంది.
అలాంటి మిట్టపల్లాల వక్రాన్ని గణితపరంగా వ్యక్తం చేస్తారు.
గ్రహాలని మనం
పరిపూర్ణ గోళాలుగా ఊహించుకుంటాం. అవి నిజంగా...
“అరె! పిల్లాడు,”
ఎగిరి గంతేస్తూ అరిచాను. “మరో మనిషి!”
చూడడానికి ఎవరో
పేద పిల్లాడిలా వున్నాడు. చింకి బట్టలు వేసుకున్నాడు. ముఖం కాస్త దీనంగా వుంది… మాలాగ.
మమ్మల్ని చూసి దొంగలు అనుకున్నాడో ఏమో. కాస్త భయపడుతున్నట్టు వున్నాడు.
అంతలో హన్స్
వేగంగా ముందుకి రెండు అడుగులేసి ఆ పిల్లవాణ్ణి రెక్క పట్టుకుని మావద్దకి లాక్కొచ్చాడు.
మావయ్య ఆ పిల్లవాడితో
అనునయిస్తున్నట్టుగా మాట్లాడుతూ శుద్ధమైన జర్మన్ లో ఇలా అడిగాడు –
“Was
heiszt diesen Berg, mein Knablein? Sage mir geschwind!"
(“ఈ కొండ పేరేంటి నేస్తం? తొందరగా చెప్పు.”)
పిల్లాడు
నోరు...
పాతాళ లోకపు
చీకటి కూపాల్లో ఇంతకాలం కొట్టుమిట్టాడిన మేము ఇలాంటి దృశ్యం చూడడానికి కళ్ళు కాయలు
కాచి వున్నాము.
“ఎక్కడున్నాం
మనం? అసలెక్కడ ఇదంతా?” పరధ్యానంగా గొణుగుతున్నట్టుగా అడిగాను.
హన్స్ కేసి తిరిగి
చూశాను, ఏవంటాడా అని. నిర్లక్ష్యంగా కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు.
మావయ్య మాత్రం
ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని పరిసరాలని చూస్తున్నాడు.
“ఈ పర్వతం పేరు
ఏవైనా కావచ్చు. కాని ఇక్కడ చాలా వేడిగా వుంది. పర్వతంలో విస్ఫోటాలు ఇంకా కొనసాగుతూనే
వున్నాయి. ఇంతా శ్రమ పడి అగ్నిపర్వతం లోంచి బయట పడ్డాక ఏ బెడ్డో నెత్తిన పడి పోవడంలో
అర్థం లేదు. కనుక...

అధ్యాయం 44
మధ్యధరా సముద్రపు
సుమధుర తీరంపై
నాకు మళ్లీ తెలివి
వచ్చేసరికి మా గైడు ఒక చేత్తో నా బెల్టు పట్టుకుని వున్నాడు. మరో చేత్తో మావయ్యని కాస్తున్నాడు.
నాకు తీవ్రమైన గాయాలేం తగల్లేదు గాని చర్మం బాగా చెక్కుకుపోయింది. చుట్టూ చూసుకుంటే
అగ్నిపర్వత బిలానికి కేవలం రెండు గజాల దూరంలో కొండ వాలు మీద పడి వున్నాను. కాస్త పక్కకి
జారి వుంటే మళ్లీ అగ్నిపర్వత బిలంలో పడి నామరూపాల్లేకుండా మాయపైపోయి వుండేవాణ్ణి.
“ఇంతకీ ఎక్కడ
పడ్డాం మనం?” మావయ్య...
“అవును. సందేహమే
లేదు,” మావయ్య అన్నాడు తన కళ్ళద్దాల్లోంచి నన్ను అదో రకంగా చూస్తూ. భూమి ఉపరితలాన్ని
చేరుకోడానికి ఇంతకన్నా అనువైన మార్గమే కనిపించడం లేదు.”
మావయ్య మాటల
గురించి కాసేపు శ్రద్ధగా అలోచించాను. ఆలోచించి చూస్తే ఆయన చెప్పేది నిజమే ననిపిస్తోంది.
విప్లవాత్మకమైన, అవాస్తవికమైన ఉపాయాలు ఆయన బుర్రలో పుట్టడం ఇది మొదటి సారి కాదు. ఎందుకో
మరి ఈ సారి మాత్రం అయన చెప్పేది నిజం అవుతుందని అనిపిస్తొంది. వింటి నుండి బాణంలా అగ్నిపర్వతం
నడి బొడ్డు లోంచ మేము, మా తెప్ప ఆకాశంలోకి వెళ్ళగక్కబడబోతాం అన్నమాట!
కాలం గడుస్తున్న
కొద్ది మా ఆరోహణ...

శబ్దం – భౌతిక
శాస్త్రం పాఠం. ఐసాక్ అసిమోవ్ రచనల ఆధారంగా…
శబ్దం
శబ్దం ఒక తరంగం
అని తరచు వింటుంటాం. అసలు తరంగం అంటే ఏమిటి?
తరంగం అంటే ఏమిటో,
తరంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోడానికి నీటిలోని అలలని నమూనాగా తీసుకోవచ్చు.
నిశ్చలమైన నీటిలో
ఒక చిన్న రాయిని నెమ్మదిగా పడేశాం అనుకోండి.
రాయి పడ్డ చోట
నీరు కాస్త లోపలికి నొక్క బడుతుంది. గాలి లాకా కాక నీటి మీద ఒత్తిడి...

కొత్త పుస్తకాలు
1. జంతు సమాజాలు - అవి మనకి నేర్పే పాఠాలు
2. ఐజాక్ అసిమోవ్ రాసిన 'ఎలా తెలుసుకున్నాం?' సీరీస్ లో 'కాంతివేగం'
ప్రచురణకర్త
http://www.manchipustakam.in...
పై నుండి కిందకి
వదిలేయబడ్డ ట్రాన్స్‍పోర్టర్ పరిభ్రమిస్తున్న పెద్ద పెద్ద వలయాల మధ్య నుండి కిందికి
పడుతూ సూటిగా కింద వున్న సముద్రంలో పడిపోతుంది. అల్లంత దూరంలో కంట్రోల్ రూమ్ నుండి
ఈ తంతంతా చూస్తున్న సిబ్బంది అదిరిపోతారు. కంట్రోల్ రూమ్ లో కలకలం మొదలవుతుంది.
ఇంత ఖర్చుతో
నిర్మించిన యంత్రం విఫలమయ్యింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. బహుశ తార నుండి వచ్చిన
సందేశాన్ని డీకోడ్ చేసే ప్రయత్నంలో పొరబడి వుంటారు. పోనీ ఎల్లీ ప్రాణాలతో సురక్షితంగా ఉంటే చాలు. కంట్రోల్
రూమ్ లోని సిబ్బంది ఆలోచనలు ఈ రకంగా సాగుతుంటాయి.
ఎల్లీని సురక్షితంగా
కంట్రోల్...
అధ్యాయం 43
అగ్నిపర్వతం
మమ్మల్ని విసిరేసింది
అవును. దిక్సూచి
ఇక పని చెయ్యనని మొరాయించింది. పిచ్చి పట్టి నట్టు అటు ఇటు దిక్కులు చూసింది గాని ఏది
ఎటో చెప్పలేకపోయింది.
ప్రస్తుతం చలామణిలో
వున్న భౌగోళిక సిద్ధాంతాల ప్రకారం భూమి మీద ఉండే ఖనిజ సంపద ఇప్పుడూ పూర్తి నిశ్చల స్థితిలో
వుండదు. దాని రసాయనిక కూర్పులో వచ్చే మార్పుల
వల్లనైతేనేమి, అందులోని అపారమైన ద్రవప్రవాహాల వల్లనైతేనేమి, తత్ఫలితంగా పుట్టే
తీవ్రమైన అయస్కాంత క్షేత్రాల వల్లనైతేనేమి ఖనిజ విస్తరణలో రకరకాల మార్పులు వస్తుంటాయి.
పైన జీవించే అమాయక మానవాళికి మాత్రం...

ట్రాన్స్‍పోర్టర్
ని పై నుండి కింద పడేయగానే అందులో ప్రయాణిస్తున్న ఎల్లీకి తానో సొరంగంలో పడిపోయిన అనుభూతి
కలుగుతుంది. ఆ సొరంగంలో తను జర్రున జారుతూ ప్రచండ వేగంతో కదులుతున్నట్టు అనిపిస్తుంది.
మెలికలు తిరుగుతూ అంతరిక్షంలో విస్తరించి వున్న ఆ సొరంగం ఎటు పోతోందో, తనను ఎటు తీసుకుపోతోందో
అర్థం కాదు. తనకు కలుగుతున్న అనుభూతులని తన మౌత్ పీస్ లో చెప్తూ రికార్డ్ చేసుకోడానికి
ప్రయత్నిస్తుంది.
అలా ఎన్ని నిముషాలు,
గంటలు ప్రయాణించిందో తెలియదు. ఉన్నట్టుండి...
“ఫొర్ ట్రేఫిగ్”
అన్నాడు హన్స్ ఉత్సాహంగా డచ్ లో.
“అద్భుతం,” బదులు
ఇచ్చాడు మావయ్య.
ఆ కాస్త పదార్థం
కడుపులో పడ్డాక మళ్లీ ప్రాణం లేచొచ్చింది. అంతవరకు మొద్దు బారిపోయినట్టు ఉన్న మనసులో
ఇప్పుడు ఏవో జ్ఞాపకాలు మెదుల్తున్నాయి. కోనిగ్స్‍స్ట్రాసే లో మా ఇంట్లో నా కోసం కలలుకంటున్న
నా బంగారు గ్రౌబెన్ తీపి గుర్తులు లోనుంచి తన్నుకొస్తున్నాయి. పాపం మార్థా ఎలా వుందో?
నేనిలా చివరి
ఘడియలు లెక్కెట్టుకుంటూ పరధ్యానంగా వుంటే మావయ్య మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు.
మా ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నాడు కాబోలి. మావయ్యలో ఇదే అత్యద్భుతమైన
లక్షణం....
“ఉంది. కాస్తంత
ఉప్పుడు మాంసం వుంది. దాంతో ముగ్గురం సరిపెట్టుకోవాలి.”
ఆ తరువాత ఎవరం
కాసేపు మాట్లాడలేదు. ఓ గంట గడిచింది.
కడుపులో ఆకలి
పేగులు తోడేస్తున్నట్టు వుంది. ఆ మిగిలిన కాస్తంత ఆహారాన్ని ముట్టుకోవడానికి ఎవరికీ మనసు రాలేదు.
మా వేగం క్రమంగా
పెరుగుతోంది. కొన్ని సార్లు గాలి ధాటికి ఊపిరి సలిపేది కాదు. చుట్టూ గాలి వేడెక్కుతున్నట్టు
అనిపిస్తోంది. ఉష్ణోగ్రత 100 ఫారెన్ హీట్ ఉంటుందేమో.
ఇలాంటి పరిణామానికి
కారణం ఏవై వుంటుందో? ఇంత వరకు మాకు కలిగిన అనుభవాల మేరకు డేవీ గారి, మా లీడెన్ బ్రాక్
మావయ్య గారి సిద్ధాంతాలు నిజమని...

ఇంచుమించు ట్రిలియన్
డాలర్ల పై చిలుకు వ్యయంతో నిర్మించబడుతున్న
ట్రాన్స్‍పోర్టర్ ఓ మూఢుడి దుడుకు చేష్ట మూలంగా
కళ్ల ముందే అలా నీళ్లపాలు అవ్వడం చూసి కేప్ చుట్టూ బారులు తీరి వున్న ప్రేక్షక వర్గం
నిర్ఘాంతపోతారు.
ఎన్నో ఎదురుదెబ్బలు
రుచి చూసిన ఎల్లీ కూడా ఆ దెబ్బకి వెంటనే తేరుకోలేకపోతుంది. తను వెళ్లలేకపోయినా ఏదో
విధంగా ప్రాజెక్ట్ విజయవంతమై, ఎవరో ఒకరు ఆ యాత్ర చేసి సుదూర గ్రహ వాసులని సంపర్కించి
రాగలిగితే తనకి అంత కన్నా సంతోషకరమైన...
అధ్యాయం 42
పైపైకి ఇంకా
పైకి … చీకటి గుయ్యారం లోకి
రాత్రి పది అయ్యుంటుంది.
ఒళ్లు హూనం చేసి, బతుకుని అతలాకుతలం చేసిన అనుభవాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం.
వశం తప్పిన ఇంద్రియాలు నెమ్మదిగా వశపడుతున్నాయి. ముందుగా తెప్పరిల్లిన ఇంద్రియం – వినికిడి.
అంతవరకు మా చుట్టూ
మారుమ్రోగిపోయిన ప్రళయ భీకర ఘోష స్థానంలో ఇప్పుడు చిక్కని నిశ్శబ్దం నెలకొంది.
ఆ నిశ్శబ్దంలో
గుసగుసగా మావయ్య మాటలు వినిపించాయి.
“మనం పైకి పోతున్నాం.”
“ఏంటి నువ్వనేది?”
అర్థం కాక అరిచాను.
“అవును. పైకి
పోతున్నాం.”
చేయి చాచి గోడని
తాకబోయాను. వేళ్లు చెక్కుకుపోయి...
postlink