ఎప్పుడు జరిగిందో,
ఎలా జరిగిందో తెలీదు గాని ఈ ‘బర్త్ డే పార్టీ’ అనే ఒకానొక ప్రక్రియ భారతీయ సంస్కృతిలో
ఓ మూలస్తంభం అనదగ్గ స్థాయికి ఎదిగిపోయింది.
కేకులు కోసి,
కేకలు వేసి, ముఖాలకి పూసి, ఫోటోలు తీసి… ఇవన్నీ బర్త్ డే పార్టీల్లో ముఖ్యాంశాలు.
కాని ఇవాళే ఓ
కొత్తరకం బర్త్ డే పార్టీల గురించి విన్నా!
బర్త్ డే పార్టీలని
మరింత ఆసక్తికరంగా, తెలివిగా మార్చే ఓ ప్రయత్నం…
కేకు కోసి, తినే
కార్యక్రమం అయ్యాక పిల్లల్ని వినోదపరచడానికి ఓ చిత్రమైన బృందం దిగి వస్తుంది. అంతా
బాగా చదువుకున్న వాళ్లే. వాళ్లు ప్రదర్శించేది ఆట పాటలు కావు – సైన్స్ ప్రయోగాలు. ప్రయోగాలు చూపించి అలా ఎందుకు జరుగుతోందో పిల్లల్ని ఆలోచించి
చెప్పమంటారు. లేదా పిల్లల్నే ప్రయోగం చేసి చూసుకోమంటారు. ఎన్నో ఆసక్తికరమైన సైన్స్
విషయాలు పిల్లలతో పంచుకుంటారు. గంటన్నర, రెండు గంటల పాటు సాగే ఈ సైన్స్ వినోదం బర్త్
డే పార్టీలకి కొత్త వన్నె తెస్తోంది.
ఈ వినూత్నప్రయోగం
చేస్తున్నది Science Utsav అనే కంపెనీ. కంపెనీలో
అంతా కుర్రాళ్లే! సైన్స్ అంటే సై అంటూ ఉత్సాహపడే యువకులే!
వీళ్లు స్కూళ్లకి
కూడా వెళ్లి ఇలాంటి వైజ్ఞానిక కార్యక్రమాలు చేపడతారు. వేసవి లో ఈ తరహా సమ్మర్ క్యాంప్
లు నిర్వహిస్తారు.
ఫ్రాంచైస్ పద్ధతిలో
వీరు తమ కేంద్రాల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో వీళ్లు ఇంకా
అడుగుపెట్టినట్టు లేరు.
వీరి ఫ్రాంచైస్
లు మన రాష్ట్రంలో ముఖ్యంగా చిన్న ఊళ్లలో ప్రవేశిస్తే పిల్లలకి విజ్ఞానదాయకమైన వినోదమే
కాక, స్థానిక గ్రాడ్యుయేట్లకి ఎన్నో ఉద్యోగావకాశాలు కూడా దొరుకుతాయి.
0 comments